Pages

Monday, June 8, 2009

ఎవరో రావాలి..

             శనివారం ఒక పోస్ట్ రాస్తుండగా  తరువాయి  భాగం వచ్చేవారం రాద్దాం అని room కి వెళ్ళా.. అయితే  సండే  నా పాలిట శాపం గా తయారయ్యింది పొద్దున్న ఆరింటికే లేచి ఇంటికి వెళడానికి  రిజర్వేషన్ కౌంటర్ కి వెళ్ళా,నా ముందు నిల్చొన్న  కేరళ వాడి కక్కుర్తి  కారణంగా కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో టికెట్ దొరకలేదు తత్కాల్ అయ్యేసరికి 15 నిమషాలు కూడా నిలవలేదు..కేరళ వాడు 8 మంది పేర్లు రాసి 4 సీట్లు conform  అయ్యాక కూడా మిగతా   నలుగురికి  కాలేదు   అని కౌంటర్లో వున్నవాడిని విసిగు తెప్పించి అమూల్యమైన సమయాన్ని వృధా చేసాడు చివరికి కాన్సిల్ చేసి మాకు సినిమా చూపించాడు .. ..

           ఈ సంఘటనతో విసుగెత్తి రూం కి వచ్చా  సరే డోర్ తెరుద్దాం అని  కీ పెట్టకుండానే నేను కేక పెట్టా..చూసేసరికి బ్రౌన్ కలర్ పాము నేను ఒకడ్ని దాని ఎదురుగా ఉన్నా అని కూడా పట్టించుకోకుండా మమైత్ ఖాన్  లా  డాన్స్ చేస్తోంది నా ఎదురుగా ..మరీ మాట్రిక్స్ సినిమా అంత క్లోజ్ గా చూసేసరికి భయమేసి  మరుక్షణం  పరుగెత్తడం స్టార్ట్ చేశా ..గార్డ్ సాబ్ మేరా  ఘర్ మే సాప్ ఆయా..మారో ఉస్కో ..అనగానే  వాడు వణికిపోతూ ఆజ్ సండే హై..సండే కే దిన్ మే  మై సాప్ నహీ మారుంగా.. అన్నాడు..సరే వేరే గార్డు ని కూడా అడిగా చంపు రా దానిని అని వాడు కూడా నేను పాముల్ని చంపడం మానేసా లక్ష రూపాయిలు ఇచ్చినా కూడా   నేను చంప అన్నాడు.."నా అభిమతం కాదు అని చెప్పిన చిరు డైలాగ్ గుర్తొచ్చింది"..  ఛీ నా బతుకు అని  వెంటనే గార్డు దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకొని రూం కి వెళ్ళా ఇంతసేపు ఏమి వుంటుంది లే అనే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాక కూడా దాని  క్యాబరీ డాన్స్ ఆపలేదు ..ముందుగా రాయి అస్త్రాన్ని ప్రయోగించా వెంటనే  డాన్స్ ఆపి పక్కనే వున్నా పొదల్లో కి పరుగెత్తింది కర్ర తో కొట్టేసరికి పొడుగు ఎక్కువ అయ్యేసరికి మధలో తగిలింది దానికి దెబ్బ ..కదలడం కష్టం అయ్యేసరికి దాని తలను  వ్రక్కలు చేశా వెంటనే ..మా సొసైటీ బయట పారేద్దాం అని తీసుకు వెళ్తుండగా మార్నింగ్ వాక్ నుండి అప్పుడే వస్తున్న అంకుల్స్ చూసి దాని మీద డిస్కషన్  ఆది  నల్ల త్రాచా తెల్ల త్రాచా అని..ఒక ముసలాయన మాత్రం భయం తో వెంటనే  ఇంట్లోకి వెళ్ళాడు ..నేను మాత్రం మా సొసైటీ డస్ట్ బిన్ లో పడేద్దాం అనుకుంటుండగా biodegradable,recyclable అని రెండు కనిపించేసరికి గార్డు కి బుద్ధి చెప్పడానికి recyclable లో వేసా.. సాయంత్రం రూం కి వస్తుండగా గార్డు ఆప్యాయం గా పలకరించడం గమనించా.. షాక్ నుండి తేరుకోవడానికి ఆఫీసు కి దగ్గర్లో రూం తీసుకోవడానికి వేట మొదలెట్టా నిన్ననే...

  


frustration లో వుండేసరికి  పాముప్రాణాలు  తీయక  తప్పలేదు..నన్ను క్షమించు దేవుడా!!


16 comments:

vikky2vikram said...

title ki post ki co-relation naaku ardham kaavatledu

హరే కృష్ణ said...

@Vikky
mana pani maname chesukovali anna vishayam chaala late ga telusukunna

రాధిక said...

ammo enta pedda paamoa...

భావన said...

ఏమిటి అంత పాము ని మీరే చంపేరా?

హరే కృష్ణ said...

@రాధిక
పాము నార్మల్ లెంగ్త్ ..మొబైల్ లో తీసేసరికి అలానే వచ్చింది :)

హరే కృష్ణ said...

@భావన
భయపడుతూ random గానే కొట్టాను ..లక్కీ గా తలమీద తగిలేసరికి తగ్గలేదు తరువాత :)

vikky2vikram said...

yudham lo gelavadam ante hsatruvu ni champaam kaadu , odinchadam... anna philosophy ni meeru marichaaru

హరే కృష్ణ said...

@Vikky
correct ga cheppav vikram..night yuddham cheyadaaniki vasthe manam emi cheyyalem ane tondarlo champesaa..:) :)

Aditya Maddula said...

బహు బావుంది రా అబ్బాయ్.. పాముని చంపడమే కాక మృత దేహము యొక్క వర్ణ చిత్రాన్ని కూడా పెట్టినావు.. బాలకృష్ణ అన్న మాట గుర్తొచ్చింది.. నేనన్నది బావున్నది, మీరన్నది బహు బావున్నది.. అని..

హరే కృష్ణ said...

హ హ హ్హ ..వర్ణ చిత్రం నా మొబైల్ తో తీసా.. ధన్యవాదాలు ఆదిత్య :)

మురళి said...

శవాన్ని చూస్తే 'త్రాచు' అనిపించడం లేదండి.. ఈ టపాని అమల అక్కినేని కి మెయిల్ చేయనా? :-)

సుజాత వేల్పూరి said...

అంత పెద్ద పామును మీరొక్కరే చంపారా? నార్మల్ లెంగ్త్ ఏమీ కాదు, చూస్తుంటే తెలీట్లా పెద్దదే! అమ్మో, పానిక్ కండిషన్ లో కూడా సరైన నిర్ణయమే తీసుకుని చంపేశారు. తప్పించుకుని ఉంటే ఇంకెంత టెన్షన్ పడేవాళ్ళో, అదెక్కడ వచ్చి రాత్రికి పక్కలో పడుకుంటుందో అని!

హరే కృష్ణ said...

@మురళి
మీరు కరెక్ట్ మురళి గారు.. త్రాచు అయితే కాదు.మెయిల్ చెయ్యండి.. అక్కినేని అమల మెయిల్ id ఉందా మీ దగ్గర? చెప్పలేదేం.. అనుష్క తో మాట్లాడాలని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా :)

హరే కృష్ణ said...

సుజాత గారు
అవునండీ! నేను మొన్న ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఇంకా పెద్ద పాము ని చూసాను దానితో కంపేర్ చేస్తే ఇది నార్మల్ సైజ్..సరైన నిర్ణయం తీసుకున్నాను వేరే ఏరియా లో రూంలోకి షిఫ్టు కి సిద్ధం చేసాం..టెన్షన్ తగ్గకపోవడం తో వేరే పోస్ట్ రాసా!

Ravi Gadepalli said...

nee ee tapaa choostunte vijayawada loni mee inti owner tapaa gurtochindi.....

హరే కృష్ణ said...

Ravi,నాకు కూడా మా ఓనరు గుర్తొచ్చాడు రాస్తోన్నంత సేపూ!