శేఖర్ కమ్ముల
ఈ ఒక్క పేరు చాలు కంప్యూటర్ లో భద్రపరచుకొని ఫీల్ గుడ్ సినిమా కావలసినప్పుడల్లా చూడడానికి
కొత్తవాళ్ళు అయినా శేఖర్ చక్కగా చేయించుకున్నాడు
సినిమాటోగ్రఫీ సినిమా అంతా బావుంది.
మొదటి అరగంట చాలా అద్భుతంగా ఉంది ఫుల్ entertainment తో
తర్వాత అద్భుతం లెవెల్స్ కొంచెం కొంచెం గా కొద్దిగా తగ్గుతూ సినిమా చివరికి ఫీల్ గుడ్ గా ఉంది.
సురేష్ పెద్దరాజు గారి భూమి కోసం కధ ఛాయలు అక్కడక్కడా కనిపించాయి
కనెక్టివిటీ కొంచెం తగ్గినా చివర్లో ఫుల్ ఎమోషన్ సీన్లతో నింపేశాడు దర్శకుడు
హ్యాపీ డేస్ ని మాతృదేవోభవ ని మిక్సీ లో వేసిన జ్యూస్ అని మీకు ఎవరైనా చెప్పినా
జ్యూస్ తీయగానే ఉంటుంది అది శేఖర్ కమ్ముల ఫాక్టరీ లో తయారయిన ప్రోడక్ట్ కదా అని చెప్పేయండి
పంచదార లాంటి ముగ్గురు హీరోయిన్ల వలనైతేనేం సినిమా బావుంది.
సినిమా అయితే నాకు నచ్చింది