Pages

Sunday, June 17, 2012

ఫెరారీ కి సవారీ..







$%$&$9
సినిమా అంటే ఏంటి అసలు ?

శర్మాన్ జోషీ
తనకు తండ్రి గా బోమన్ ఇరానీ 
తన కొడుకు గా చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ ఈ సినిమాలో నటించారు

అసలు దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడు
తన అబ్బాయిని స్కూల్ లో దించడానికి వెళ్తూ  
ట్రాఫిక్ పోలీస్ లేని ఒక జంక్షన్ లో పొరపాటున క్రాస్ అవుతాడు హీరో
అది వాళ్ళ నాన్నకు పిల్లాడు Kayo (మాస్టర్.రిత్విక్)  చెబుతాడు.


దగ్గరలో ఉన్న ట్రాఫిక్ యూనిట్ దగ్గరకు వెళ్ళి మరీ ఫైన్ కడతాడు హీరో !
ఇదేం నిజాయితీ రా బాబూ అని అనుకుంటుండగా
ఇరవై నిముషాలు అయ్యాక
సినిమా అవుట్ లైన్ అర్ధం అయ్యింది..

హీరో వాళ్ళ అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు.
వాడికి క్రికెటే లోకం
శర్మాన్ జోషీ కి వాళ్ళ అబ్బాయే లోకం.
చూసినోడు  పిచ్చిమాలోకం ?  

(నేను జండూ బామ్ లేక పోలో తింటూ నన్ను నేను తిట్టుకోడం మొదలెట్టాను)

లార్డ్స్ లో ఆడే అరుదైన అవకాశం హీరో కొడుకు కి వస్తుంది.
దానికి కనీసం లక్షా యాభై వేలు అవసరం అవుతాయి
శర్మాన్ జోషీ RTO ఆఫీస్ లో హెడ్ క్లెర్క్ గా సామాన్య జీతం తో సాధారణ జీవితం గడుపుతుంటాడు.

ఈ లోపు ఒక రాజకీయ నాయకుడు కొడుకు తన పెళ్ళికి ఫెరారీ షో పీస్ గా కావాలని వెడ్డింగ్ ప్లానర్ ని పట్టుపడతాడు.
ఫెరారీ అద్దెకు దొరికినా ఎంత డబ్బు ఇవ్వడానికైనా సిద్ధం గా ఉంటాడు..


ఆ  వెడ్డింగ్ ప్లానర్ RTO ఆఫీస్ కి వచ్చి ముంబై లో ఎన్ని ఫెరారీ లు ఉన్నాయో కనుక్కుంటుంది
శర్మాన్ జోషీ ఫెరారీ స్పెసిఫికేషన్స్ డిటైల్స్ అన్నీ చెబుతాడు..
ప్రస్తుతానికి సచిన్ టెండూల్కర్ దగ్గరే ముంబై లో ఉంది అని చెబుతాడు

(నేను:పిచ్చ నా %^$$*&,సౌత్ ముంబై లో ఎల్లో,బ్లాక్,రెడ్ కలర్లో
ఉన్న ఫెరారీ లు ఉన్న మూడు అడ్రస్ లు నాకే తెలుసు
RTO ఆఫీస్ లో ఉండి కూడా ముంబై లో ఎన్ని ఫెరారీ లు ఉన్నాయో తెలియదా..ఉఫ్ఫ్ఫ్ అని నాకు చిరాకోచ్చేసింది)

హీరో తండ్రి బోమన్ ఇరానీ,
ఇతను youngest బెస్ట్ రంజీ క్రికెటర్..
తన బెస్ట్ ఫ్రెండ్ మరియు ప్రస్తుత క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ చేసిన మోసానికి బలయ్యి క్రికెట్ మీద ద్వేషం పెంచుకుంటాడు
కనీసం ఇంట్లో క్రికెట్ పెట్టమని మనమడు అడిగినా అవతలకు ఫో అంటాడు..



ఆ వెడ్డింగ్ ప్లానర్ శర్మాన్ జోషీ తో చెబుతుంది
ఎలాగోలా సచిన్ ని కన్విన్స్ చేసి నాలుగు గంటల్లో మళ్ళీ బండి తీసుకోచేస్తా అని సచిన్ ఇంటికి వెళ్తాడు హీరో
కొన్ని అనివార్య పరిస్థితుల్లో హీరో ని కార్ క్లీన్ చేసేవాడు అనుకొని ఫెరారీ కీస్ తన చేతికి వచ్చేస్తాయి

ఏదైతేనేం ఫెరారీ తీసుకోచేస్తాడు
కాసేపయ్యాక వెడ్డింగ్  ప్లానర్ 1 .5 లక్ష తనకి ఇచేస్తాడు
కారు లో డబ్బులు పెట్టి సచిన్ ఇంటికి తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు.

పోలీస్ లు అందరూ వచ్చేయడం తో ఎలాగోలా బయటకి వచ్చేస్తాడు
లోపల ఉన్న డబ్బు మాత్రం తీసుకు రావడం కుదరదు.

(నేను:డబ్బులు తీసుకోచ్చేస్తే గంటలో సినిమా అయిపోద్ది..ఇంక ప్రేక్షకుడికి మిగిలేదేంటి మిగతా డబ్బులకి న్యాయం చేయడానికి పాప్ కార్న్ మల్టిప్లెక్స్ వాడు ఫ్రీ గా స్పాన్సర్ చేస్తాడా)  


ఏదైతేనేం
తండ్రి కి కొడుకు మీద ఉన్న టాలెంట్ ని నిరూపించడానికి
ఆ  రాత్రి వాళ్ళ కాంపౌండ్ లో క్రికెట్ ఆడిస్తాడు
బోమన్ ఇరానీ బౌలింగ్ చేస్తాడు.
రంజీ లో తను మేటి స్పిన్నర్

అప్పుడు బోమన్ ఇరానీ కి కూడా తన మనమడు మీద బోలెడు నమ్మకం కలుగుతుంది.
వెంటనే తనని మోసం చేసిన ఆ  మాజీ ఫ్రెండ్ కమ్ బోర్డ్ ప్రసిడెంట్ పరేష్ రావల్ ని 38 ఏళ్ల తర్వాత కలుస్తాడు..

నా మనమడు ఇలా క్రికెట్ ఆడతాడు
నువ్వు సెలెక్ట్ చెయ్యాల్సిన పని లేదు వాడే అవుతాడు ఒక ఫ్రెండ్ గా నాకు 1.5 లక్ష ఇవ్వగలవా అని
పరేష్ రావాల్ ఫోన్ వచ్చింది అని అక్కడ నుండి జంప్ అయ్యాక

మళ్ళీ కష్టాలు పడి ఎలాగైతేనేం శర్మాన్ జోషీ ఆ ట్రాఫిక్ బండి ఎక్కించిన ఫెరారీ లో ఉన్న డబ్బు తీసుకుంటాడు

పిల్లాడి సెలెక్షన్ అయిపోతుంది డబ్బు కూడా వచ్చేస్తుంది
పొలిటీషియన్ కొడుకు ఈ సారి బలవంతంగా ఫెరారీ ని మళ్ళీ దొంగలిస్తాడు
అక్కడ జరిగిన గొడవలో
బోమన్ ఇరానీ గేట్ తగులుకొని తీవ్ర గాయం తో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు

పిల్లాడి ఆచూకి తప్పిపోతుంది..! 

కాసేపటికి హీరో
పొలిటీషియన్ కొడుకు ని బెదిరిస్తాడు పిల్లాడిని ఎక్కడ దాచావ్ అని గన్ తీసి పక్కన షూట్ చేస్తాడు

సముద్రం వైపు వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోడానికి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసరికి
మీడియా అంతా
శర్మాన్ జోషీ ముందు కెమెరాలు పెట్టి మీ పిల్లడు ఆత్మ హత్య చేసుకున్నాడా ? మీకేమనిపిస్తోంది అని చిరాకు తెప్పిస్తారు

క్లైమాక్స్

పరేష్ రావల్,బోమన్ ఇరానీ వీల్లిదరూ కెవ్వ్ కేక అని అందరికీ తెలుసు  శర్మాన్ జోషీ is an underrated actor అని మాత్రం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంగీరించాల్సిన విషయం.

తనకు తన బిడ్డ మీద ఉన్న ప్రేమను హృద్యంగా చెప్పాక.. తన డబ్బులు వెడ్డింగ్ ప్లానర్ కి ఇచ్చేస్తాడు.ఇంతలో తప్పి పోయాడనుకున్న Kayo వాళ్ళ కోచ్ తో పాటు పెళ్లి లొకేషన్ కి వచ్చి అప్పుడు అయిదు నిముషాలు పిల్లాడు డైలాగ్స్ చెబుతాడు...తండ్రి కి కాన్ఫిడెన్స్ ఇస్తాడు


 
మీడియా దయవల్ల పబ్లిసిటీ వస్తుంది దగ్గర ఉన్న సొసైటీ వాళ్ళు అంతా పిల్లాడికి కావాల్సిన డబ్బులు ఆ  మరుసటి రోజు ప్రొద్దున్న
శర్మాన్ జోషీ చేతిలో పెడతారు
పిల్లాడు లార్డ్స్ లో సిక్స్ లు ఫోర్లు చితక్కోట్టేయడం తో సినిమా ఒక లైన్ కాకుండా ముగుస్తుంది


ఆ  లైన్
Thank you Sachin,for inspiring many of Kayos
Including My Son Agni



ఈ సినిమాకి నాకు బాగా నచ్చింది
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్

fathers day నాడు ఈ సినిమా చూడడం కాకుండా తండ్రి/బిడ్డ మీద ఉన్న ప్రేమ ని చూపించడం లో సఫలమయ్యాడు దర్శకుడు.
 


క్లైమాక్స్ చూసాక    





(నా కళ్ళల్లో నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి..వార్నీ ఏంటి ఇది రాతి హృదయానికి కన్నీళ్ళా
ఔర ఔరా..నాగవల్లి వెంకటేష్ అఘోరా..అని కళ్ళు తుడుచుకోవడానికి కర్చీఫ్ తీశాను ప్రక్కన అసలే అమ్మాయి కూర్చుంది
సిగ్గులేకుండా ఈ ఏడుపు ఏంటి అని నేను తుడుచుకొని తను కూడా ఏడిస్తే తుడుద్దామని కర్చీఫ్ ని నా మెడ ను రెండో వైపు తిప్పాను ఒకేసారి ..ఆ అమ్మాయి రాజశేఖర్ సిస్టర్ క్యారెక్టర్ లా భోరున బిందెలు బిందెలు కన్నీళ్ళు కార్చేస్తోంది..బాబోయ్ నా దగ్గర డోర్ మేట్,కాని టర్కీ టవల్ కాని లేదు అని ఇంకోవైపు తిరిగాను సామూహిక కన్నీళ్ళ సభలా అందరూ ఏడుస్తున్నారు)

గుండె రాతిదైనా కన్నీళ్ళు కామనే కదా అని గుండె మీద చెయ్యి వేసుకొని నోట్లో మిగిలిన పోలో వేసుకున్నాను.


24 comments:

Unknown said...

చివరికి ఎడవటమే హైలైట్ అనమాట ;)
పంచ్ లు బానే పడ్డాయి :))

బులుసు సుబ్రహ్మణ్యం said...

కొడుకు మీద ఉన్న ప్రేమను చూపించడానికి క్రికెట్ ను ఇంతగా హింసించాలా?

నేను పొలోమని పోలో వేసుకొని జండుబాం కూడా రాసుకున్నాను.

SHANKAR.S said...

ఆ పక్కన కూర్చున్న అమ్మాయ్ ఎవరు? కౌనూ? అయితే కన్ఫర్మే అన్నమాట :)

కొత్తావకాయ said...

థాంక్ యూ! ప్రోమో లు చూసి మోసపోదామని ఆల్మోస్ట్ అనుకున్నాను. రక్షించారు. :)

శశి కళ said...

గుండె రాతిదైనా కన్నీళ్ళు కామనే కదా అని గుండె మీద చెయ్యి వేసుకొని నోట్లో మిగిలిన పోలో వేసుకున్నాను.
హ..హ.. ఈ సారి మేము కూడా పోలోలు వేసుకున్టాము బాబు ))

హరే కృష్ణ said...

శేఖర్ :))
హా చివరి పదిహేను నిముషాలు ఏడుపే ఏడుపే!:))
థాంక్స్ :))

హరే కృష్ణ said...

గురూజీ కరెక్ట్ గా చెప్పారు
లోన్ కూడా ఇవ్వరు గవర్నమెంట్ ఏమ్ప్లాయీ కి అనే ఒక గొప్ప కంక్లూసన్ ఇచ్చారు :)
>>>నేను పొలోమని పోలో వేసుకొని జండుబాం కూడా రాసుకున్నాను.
కెవ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్ వ్వ్..
ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

శంకర్ గారు LOL
ఒక వైపు తిరిగితే ఒక్క అమ్మాయే కనిపించింది
మరో వైపు తిరిగితే మొత్తం థియేటర్ కనిపించింది :P
థాంక్స్ :))

హరే కృష్ణ said...

కొత్తావకాయ గారు
సెకండ్ హాఫ్ లో పేస్ క్లైమాక్స్ ఈ రెండూ మాత్రమే నాకు చాలా నచ్చాయ్ :)
దబాండ్,రౌడీ రాథోర్ లాంటి బాలీవుడ్ ఫార్ములా సినిమాలకంటే ఇలాంటి సినిమాలు అయిదు రెట్లు బెటర్ అని నా అభిప్రాయం :)
చాలా వరకు లాజిక్ లేదు సినిమా లో ముఖ్యం గా మొదటి హాఫ్
బ్లాగుకి స్వాగతం & థాంక్యూ :)

హరే కృష్ణ said...

శశి గారు :))
తప్పకుండా మర్చిపోవద్దు :)
థాంక్స్ :)

జలతారు వెన్నెల said...

Thank God! You saved us from watching this movie. మొత్తానికి మళ్ళీ భలే నవ్వించారు.

వాత్సల్య said...

నాకే నచ్చలేదనుకున్నా సినిమా..నాకు తోడు దొరికారు. అమీర్ ఖాన్ ఈ సినిమా 3 ఈడియట్స్ అంత హిట్టవ్వాలి అని ఆకాంక్షిస్తే పొలో మని వెళ్ళి చూసాము :)

అంత ఏడుపొచ్చే సీనేంటబ్బా క్లైమాక్సులో? నాది రాతి హ్రుదయం కాదు కదా

కృష్ణప్రియ said...

కాంబినేషన్ చూసి బాగుంటుందని నేను ఇంకా చూద్దామనుకున్నా.రక్షించారు.

mmd said...

this story looks similar to Dhoni. are they based on same original story?

thanks

మధురవాణి said...

నేను చాలా వెనకబడిపోతున్నట్టున్నా.. ఈ సినిమా పేరైనా వినలేదు ఇప్పటిదాకా.. :(
నువ్వు చెప్పిందంతా విన్నాక నాకెందుకో ఆ చివరి లైన్ కోసం సినిమా చూడొచ్చేమో అనిపిస్తోంది.. ;)

<< ఒక వైపు తిరిగితే ఒక్క అమ్మాయే కనిపించింది
మరో వైపు తిరిగితే మొత్తం థియేటర్ కనిపించింది :P
LOL :D :D :D :D

హరే కృష్ణ said...

జలతారు వెన్నెల గారు :))
నేను మల్టీ ప్లెక్స్ కి వెళ్ళడం వల్ల కొంత మంచి జరిగింది :D

నేను సేవ్ చేయుటకే ఉన్నాను :))
థాంక్యూ :)

హరే కృష్ణ said...

రిషి గారు
3 idiots డైరెక్టర్ వేరు కదండీ! అక్కడే తేడా కొట్టేసింది
ఏడుపు వచ్చింది అందుకు కాదండీ పవర్ ఫైల్యూర్ వచ్చి వేసిన సీన్లే రెండు సార్లు రిపీట్ చేసాడు :)
థాంక్యూ :)

హరే కృష్ణ said...

కృష్ణప్రియ గారు
స్పోర్ట్స్ oriented మూవీ,పెర్ఫార్మన్స్ బావున్నా లోపల కంటెంట్ లేదు
థాంక్యూ :)

హరే కృష్ణ said...

భాస్కర్ గారు
ధోనీ సినిమా నేను చూడలేదు,మీరు చెప్పినట్టు పోలికలు ఉండొచ్చు అనే అనుకుంటున్నాను
థాంక్స్! :)

హరే కృష్ణ said...

మధుర సచిన్ ఫేన్స్ చూసేయోచ్చు గుండె మీద చెయ్యి వేసుకొని,
సినిమా చూసే ముందు పోలో పేకట్ ఒకటి రడీ గా పెట్టుకోవడం మరచిపోవద్దు :P
P for Polo :)))
థాంక్యూ :)

మంచు said...

చ..
నిన్న అక్కడవరకూ వెళ్ళి పక్కనున్న మడగాస్కర్-3 చూసాను. సచిన్ టచ్ ఉందని నిన్న తెలియాల్సింది.. ఇదే చూద్దును.

హరే కృష్ణ said...

మంచు గారు థాంక్స్!
సచిన్ గురించి అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు
సచిన్ ఫాన్స్ కు నచ్చేస్తుంది ఈ సినిమా :)

phaneendra said...

hilarious writeup

హరే కృష్ణ said...

ఫణీంద్ర గారు థాంక్యూ :)