Pages

Wednesday, June 13, 2012

బ్లొందనాలు..




ఆఫీస్ నుండి మధ్యాహ్నమే రూమ్ కి వచ్చేసి
హాల్ లో కూర్చొని చిరు జల్లులను ఆస్వాదిస్తూ చిట్టి చేగోడీలు తింటూ

టీ వీ ఆన్ చేసా
నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అని రజనీ డైలాగ్
బ్లాక్ బస్టర్ మూవీ బాషా రేపు రాత్రి ఎనిమిది గంటలకు మీ జెమిని మూవీస్ లో అని జిడ్డు గొంతేసుకొని ఒకడు అరుస్తునాడు.

సరే  ఆంధ్రా వార్తలు చూసి చాలా రోజులయింది అని జేజమ్మ టీవీ పెట్టాను
వంద శాతం ఫలితాలతో ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రగామి సంస్థ
అని ad వస్తోంది
హ్మ్మ్ ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలేంటి చైతన్యా నారాయణా అని నిట్టూరుస్తూ

మా టీ.వీ పెట్టా 
ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకే సారి పంపించు
ఒక్కొక్కడినీ ఎంచుకొని మరీ పంపించు షేర్ ఖాన్

ఈ సారి ఈ టీ వి చానెల్ కు మార్చా
గుమ్మడి: ఆయురారోగ్యాలు అష్టై
శ్వర్యాలతో వందేళ్ళు వర్ధిల్లు బాబూ!

^$%&%*&% అన్ని చానెల్లో ఈ వంద కి రెండొందల ఆఫర్ ఏంటి అనుకొని
ఫేస్ బుక్ గూగుల్ ప్లస్ లో బోర్ కొట్టిన వాడికి బ్లాగే దిక్కు అని 
బ్లాగ్ స్పాట్ లో సైన్ ఇన్ అయ్యాను.

డేష్ బోర్డ్ లో పోస్ట్స్ చూస్తే 99 ఉన్నాయి..





రావు రమేష్ వాచకం నన్ను ఆవహించుకుంది.. 
 
మండే ఎండాకాలం లో సైతం ముంబై లో వర్షం కురుస్తుంది..
నీ వందో పోస్ట్ రాతను నీ కంటే ముందు నీ వీడియోకాన్ టీవీ ముందే పసిగెడుతుంది
నీకు తెలియకుండానే నీ బ్లాగ్ లో ఇద్దరు ఫాలోవర్లు పెరుగుతారు
ప్రపంచమంతా దేభ్యపు మొహం వేసుకోనేలా బాలయ్య తమిళ్ మాట్లాడుతాడు.
గంగా భవానీ ని ఓదార్చడానికి ఆ  సైతాన్ తరలి వచ్చి తనతో నృత్యం చేయిస్తాడు. (2.52 నుండి 3.35 వరకు)



వంద పోస్టులు అనే మైలు రాయి లో నేను ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది

మా ఫ్రెండ్ విక్కీ,ఆదిత్య అప్పటి వరకు బ్లాగ్ అంటే కేవలం నా అనుభవాలను నాకు తెలిసిన మిత్రులకు మాత్రమే తెలియచేయడం అనుకున్నా
తర్వాత మా ఫ్రెండ్ నరేష్ ఈ ఎగ్రిగేటర్ ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు..కలిపాక తెలిసింది
ఏ రేంజ్ లో బ్లాగ్ ని ఆస్వాదించవచ్చో అని..

అలా మొదలైన నా బ్లాగు ప్రయాణం ఇంతమంది ఆప్తులను సంపాదించుకునేలా చేసింది..

ముందుగా చెప్పాల్సింది రాజ్ కుమార్
రోజూ ఎక్కడో మాట్లాడుకుంటున్నా నా బ్లాగేమిటో తనకు తెలియదు తన గురించి అలాంటిది ఏమిటో ఈ బ్లాగు బంధాలు కెవ్వ్
మిత్రులు ఆప్తులవుతారు,ఆప్తులు జప్తు చేయని కుటుంబ సభ్యులవుతారు ప్రాస లో రా
సేసా.. 

వేణూ శ్రీకాంత్ గారు
ఈయన నా బ్లాగ్ లో మొదటి కామెంట్ పెట్టారా...
నాకు ఖలేజా సినిమా గుర్తుకొస్తుంది
ఆయన మొదటి కామెంట్ నీకు మైల్ లో కనిపిస్తుంది
ఆ  కామెంట్ వల్ల నీ పోస్ట్ సూపర్ హిట్ అవుతుంది
.
శివ గారు,
తను కామెంట్ పెట్టగానే 
బ్లాగు భుజాలు విరుచుకుంటుంది సిద్దా...(ఓం నమశ్శివాయ)

మా హర్ష కామెంట్ చేసినప్పుడల్లా
బ్లాగు బొమ్మాలీ అని కాకుండా సోనాలీ అని బుస కొట్టినట్టు విరుచుకుపడుతుంది

ఇందు,
కెవ్వ్ మన్నప్పుడు మహేష్ బాబు సైతం గబ్బర్ సింగ్ అని కేక పెట్టి ఏగ్రిగేటర్ లు కెవ్వ్ మనేలా హోరు మంటుంది.

చాతకం గారు 
ఆయన కామెంట్ చూడాలంటే నీ డేష్ బోర్డ్ ఆర్తిగా తెరవాలా

బులుసు గారు
ఎవరి కామెంట్ కూడలి లో చూస్తే నీ పోస్ట్ కి హిట్ల అభిషేకం చేస్తుందో
ఉలి తో ఇలియానా ను చెక్కినట్టు సంపూర్ణం గా వ్యాఖ్య ఉంటుందో..

రసజ్ఞ గారు
ఎవరి పేరు గూగుల్ ట్రాన్స్లేషన్ లో టైప్ చెయ్యడానికి తలకిందులు అయ్యి లేఖిని దిక్కు అవుతుందో

బంతి గారు 
ఎవరు వన్ లైనర్ వేస్తే కామెంట్ల ప్రవాహం పొంగుతుందో

జలతారు వెన్నెల గారు   
ఎవరు కామెంట్ పెడితే నీ బ్లాగు పై బొట్టు తిలకం లాంటి బిందీ లు పడి నీ బ్లాగుకి శుభం కలుగుతుందో 

థాంక్స్ చెప్పడానికి చాలా మంది ఉన్నా అందరికోసం నా దగ్గర డైలాగులు కరువయ్యాయి 

దూకుడు DVD ఎక్కువసార్లు చూసేసరికి నా వంతుగా  నేను ఈ మధ్య నేర్చుకున్న నాలుగు బ్లాగు పలుకులు..



రేయ్..! వేరే  వాళ్ళ బ్లాగు ని దూరం నుండి చూడాలనిపించింది అనుకో చూస్కో..

నీ ఆత్రం అక్కు పక్షులు తిని
తెలుగు బ్లాగర్ల సమావేశానికి వెళ్ళి ఫోటో దిగాలనిపించింది అనుకో... కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదు ట్రై చెయ్యొచ్చు
సరే చనువు వచ్చింది కదా అని తెలుగు బ్లాగర్ తో ఆడుకోవాలనిపిస్తే మాత్రం తనతో కలసి ఫేస్ బుక్ లో ఫార్మ్ విల్లే ఆడుకో .


నేనూ నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్..
ఆ బ్లాగు ద్రోహి ని నాకు అప్పగించు,నిన్నూ నీ బ్లాగుని కామెంట్లతో వదిలేస్తా
వెన్ను చూపని వ్యాఖ్యలను బన్ను చూపని వంటల బ్లాగులను ఎన్నుకొని మరీ పంపించు
ఒక్కొక్కడ్నీ కాదు షేర్ ఖాన్ వంద కామెంట్లు  ఒకేసారి పెట్టమను ...(మోడరేషన్ నా చేతిలో ఉంది కి కి కి )




బ్లాగర్ అయ్యి
ఉండి ఈ పనులేంటి
అగ్గ్రిగేటర్ లు మేమున్నాం కదా ఏక్షన్ తీసుకుంటాం కదా.

కల్తీ బ్లాగు అని కంప్లైంట్ చేసిన బ్లాగర్ ని అదే బ్లాగర్ మరో కల్తీ కధను బలవంతంతో చదివిస్తే  

నో లోలీస్
ఎవడో రాసిన క్షుర కధనాన్ని చదివి మూడు వందల మంది తలలు నొప్పితో బాధ పడుతుంటే  
నో లోలీస్
తెలుగు బాట కి వెళ్ళిన పాపానికి ఎవడో రాసిన కధ ప్రింట్ అవుట్ ని రోడ్ మీద చదివి బాటా చెప్పుతో కొట్టుకుంటే
నో లోలీస్

అప్పుడు జరిగిన అరచాకాలు రాయలేని బ్లాగు ఆఫ్ట్రాల్ ఒక ప్లస్సర్ ని కుమ్మేస్తుంటే రాస్తుందే..ఏం ? 
వాళ్ళది కూడా మీలానే పాపులర్ బ్లాగు... మీకు తెలియనదా
పెద్ద బ్లాగా.. పాపులర్ బ్లాగా.. నా లానా..
వద్దూ..బ్లాగు పోస్టుల గురించి మాట్లాడొద్దు అడ్మిన్
బ్లాగంటే నాదీ...నెలకో పోస్ట్ రాయాలన్నా నేనే..
వారానికి రెండు పోస్టులు రాయాలన్నా నేనే!
వాళ్ళెంత బ్లడీ కిడ్స్.. పిల్ల బ్లాగులు

నో మోర్ అర్గ్యుమెంట్స్ అడ్మిన్ గారు
మీ దగ్గర రాయడానికి ఏమీ లేదు
బ్లాగిటీ గా బ్లర్ గా చెబుతున్నా
కనబడిన బ్లాగుని కామెంట్ల తో నింపేయడమే
నో లోలీస్ (LOL 's ) 
బ్లాగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బిర్యానీ బీడ్స్
బట్ నాట్ మై బ్లడీ డాష్ బోర్డ్!



బ్లాగు వల్ల కామెంట్లు రాలాయి
కామెంట్ల వల్ల ఉరకలేసే ఉత్సాహం వచ్చాయ్
వాటి వల్ల నీ నిద్ర విలపడింది

నీ బ్లాగు బొంగరం 
నీ కామెంట్లు క్రూరం
నీ కరాచీ కరుచుడు అరాచకం
నీవే నీ బ్లాగుకి ఈ టీవీ సుమన శాసనం
సెల్ఫ్ కంట్రోలే న వినాశనం అని తెలియచేసిన మిత్రులందరికీ  







శ్రావ్య, నేస్తం గారు,సునీత గారు,తృష్ణ గారు,కృష్ణ ప్రియ గారు,వేణు శ్రీకాంత్,,చైతన్య,చిలమకూరు విజయ మోహన్ గారు ,భాస్కర్ అన్నయ్య,మధుర,వాణి, శ్రీనివాస్ పప్పు గారు, భరద్వాజ్ గారు,భారతీయుడు గారు, నెమలికన్నుమురళీ గారు ,పరిమళం గారు,పద్మార్పిత,నాగ ప్రసాద్,కుమార్ గారు,శంకర్ గారు

శశాంక్,నిషి గంధ,సురేష్ పెద్ద రాజు గారు,అమేజింగ్ అమ్మ శశి  తన్నేరు గారు,సుజాత గారు,మరువం ఉష గారు,వినీల గారు,స్నిగ్ధ గారు,వనజవనమాలి గారు,జ్యోతిర్మయి గారు,మోహన రాగం పద్మ గారు,పద్మ ఉండవల్లి గారు,చాణక్య,అపర్ణ,సిరిసిరి మువ్వ గారు,వరూధిని గారు,శ్రీ రామ చంద్ర మూర్తి గారు,

ప్రభాకర్,శ్రావణ్,రవి,విక్కీ,శేఖర్,చంద్రశేఖర్,గిరీష్,సంతోష్,నైమిష్,కార్తీక్,రెహ్మాన్
నాగార్జున,అనుష్క,నాగ చైతన్య,ఫణీంద్ర,ఇంద్ర,రాజా చంద్ర,రాజేంద్ర,నా బ్లాగేంద్ర అయిన మా రాఘవేంద్ర ఆదరించి ఈ బ్లాగు ప్రయాణాన్నినడిపించి లేస్ చిప్స్ పేకట్ లా గాలి లోతేలియాడడానికి దోహద పడిన మిత్రులందరికీ  కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను :)





56 comments:

ఫోటాన్ said...

శతాధిక పోస్ట్ బ్లాగర్ గా ఎదిగినందుకు అభినందనలు... అతి త్వరలోనే నువ్వు సహస్రాధిక పోస్ట్ బ్లాగర్ అవ్వాలని, మరిన్ని మంచి మంచి పోస్ట్ లు రావాలని, ఆ రాఘవేందర్ రావు, బి,ఏ దీవెనలు నీకు ఎప్పుడూ వుండాలని యాన్ద్రాయిడ్ దేవుణ్ణి ప్రర్తిస్తున్నా... :))

ఇందు said...

Wowwwwwwwwwwww! Congrats for the 100th post :)

సూపర్ రాసావ్ ఏండీ!!

నీకు నువ్వే పోటి. లేరెవ్వరు నీకు సరిసాటి [రాస్కోరా సాంబా! ;) ]

నువ్విలానే అందరినీ నవ్విస్తూ.... నీ కామెంట్ బాక్స్ లాగే నీ పోస్ట్లు హిట్టు..సూపర్ హిట్టు అవ్వాలని కోరుకుంటూ....
శతాధిక బ్లాగర్ల క్లబ్బులో చేరిన నీకు శుభాభినందనలు :)

ఇట్లు... నీ డిట్రాయిట్ అక్క ;)

చాతకం said...

Congratulations & best wishes.

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్వు కేక యాండీ :-))))
సెంచరీ కొట్టినందుకు అభినందనలు... సచిన్ లా వంద వందలు చేసేయాలని కోరుకుంటున్నాను :)
పోస్టు డైలాగ్సూ ఇరగ కుమ్మావ్ :-))) సూపర్..

రసజ్ఞ said...

బాబోయ్ ఏంటీ డవిలాగులు? ఎక్కడనుండీ వస్తాయండీ బాబు?సూపరంతే!వంద టపాలు దిగ్విజయంగా వ్రాసినందుకు శుభాకాంక్షలు! ఇలానే మరెన్నో వ్రాయాలని, మరెంతో మంది అభిమానాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హమ్మయ్యా మెచ్చుకోవడం, విషెస్ చెప్పడం అయిపోయింది కాబట్టి..... "రసజ్ఞ గారు ఎవరి పేరు గూగుల్ ట్రాన్స్లేషన్ లో టైప్ చెయ్యడానికి తలకిందులు అయ్యి లేఖిని దిక్కు అవుతుందో" ఏంటిది? ఆహా ఏంటీ అంటా ;)నా పేరు అంత కష్టంగా ఉన్నా వ్రాయక తప్పదు. ఇదే మీకు శిక్ష :)

sunita said...

కంగ్రాట్స్!ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ గోదారి పై రాదారి పడవలా మీ బ్లాగ్ ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటూ (ప్రాస బాగుందని అన్నమాట:)))....ఇంకో వెయ్యి పోస్టులకోసం ఎదురు చూస్తూ ....ఇంగ్లీషు సినిమాలూ ...వకా వకాలూ....ఎట్సెట్రా...

జ్యోతిర్మయి said...

అభినందనలు హరే కృష్ణ గారూ..

జలతారు వెన్నెల said...

జిడ్డు గొంతు అంటే ఎలా ఉంటుంది?
చైతన్యా , నారయణా అంటే coaching centers అని అర్ధం చేసుకున్నాను, right or wrong?
మీది Videocon TV? Sony Tv మీ దగ్గర లేదా?
మీ బ్లాగ్ లో పెరిగిన ఇద్దరు followers లో నేను ఒక దాన్ని కాదు కదా?
నా కామెంట్ వల్ల శుభం కలుగుతుందన్నారు. ఎన్ని hours etc gym లో spend చెయ్యాలో ఇప్పుడు పెరిగిన extra pounds తగ్గడానికి..నా weight రెపటికల్లా ఈ కామెంట్ చదవక ముందు లా normal గా అవ్వలేదనుకో, get ready I will sue you for sure :))
మీ బ్లొందనాలు టపా అదిరింది.Hilarious! And అసలు ఇంత creative గా ఎలా నవ్విస్తారండి? Now getting serious : Congratulations! Keep writing!

మధురవాణి said...

అసలు టైటిలే కెవ్వుగా... :))))
శత టపోత్సవ శుభాకాంక్షలు. మన దేవుడిని ఆదర్శంగా తీసుకుని వంద వందలు చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. Congratulations and keep rocking! :D

వనజ తాతినేని/VanajaTatineni said...

బ్లాగు వీరుడు వీర బాదుడు .. సూపర్.
ఏ దిక్కు లేని వారికి బ్లాగ్ ఒక్కటే దిక్కు .. అనుకుని మరిన్ని వందలు పోస్ట్లు వ్రాసేయండి. మా నిద్రని త్యాగం చేసి మరీ చదివి పెడతాం. లేట్ గా లేటెస్ట్ గా కాస్త జ్ఞానం,బాటలో పడతాం ..

రాజ్ కుమార్ said...

వావ్.. వంద పోస్టులా..?? నీ అరాచకపు అ"జెండా" లో ఇదో రంగు మాత్రమే.. నీ కసి ప్రేలాపన ని వెయ్యిపోస్టుల వరకూ ప్రేల్చాలని కోరుకుంటున్నా..

లిస్ట్ నాతో మొదలవ్వటం చూసీ, ఏమిటో ఈ బ్లాగాను బంధాలు అనుకున్యా.. ;) ;) థాంక్యూ..

సింహా డైలాగు ఆక్రందనలు...


రసజ్ఞ గారు
ఎవరి పేరు గూగుల్ ట్రాన్స్లేషన్ లో టైప్ చెయ్యడానికి తలకిందులు అయ్యి లేఖిని దిక్కు అవుతుందో
>>>> exactly... ;) ;)

స్నిగ్ధ said...

గురువు గారు..శత టపోత్సవ శుభాకాంక్షలు...

ఆ డవిలాగులు ఏంటండీ...అరుపులు...:)

త్వరలోనే వెయ్యి పోస్టులు రాసెయ్యాలని ....
Congratulations!!!!

శశి కళ said...

శత టపోత్స్చావ శుభాకాంక్షలు.ఇలాగే ఎన్నో మైలు
రాళ్ళు దాటుకొని అందర్నీ నవ్విస్తూ ఉండాలి.
టపా బాగుంది.మమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు థాంక్యు.మీ గురువు గారిని ఆదర్శంగా తీసుకోండి

Sravya V said...

Congrats ! Wishing you see you soon in 200 Club :)

భాస్కర్ కె said...

శత టపోత్సవ శుభాకాంక్షలు.
త్వరలోనే వెయ్యి పోస్టులు రాసెయ్యాలని ....
Congratulations!!!!
keep writing.
rendu follower nene.

నిషిగంధ said...

ఈ టపా చూస్తూనే అర్జెంటుగా మీ చిరు పాట 'ఎంత ఎదిగిపోయావయ్యా పాడాలనిపిస్తోంది!' :))
అసలు ఎప్పుడు బ్లాగు మొదలుపెట్టారు.. ఎంత చిటికెలో వంద పోస్టులు రాసేశారు!

టపా ఎప్పట్లానే నవ్వులు కురిపించింది.. హృదయపూర్వక అభినందనలు :-)

బులుసు సుబ్రహ్మణ్యం said...

మా ఒడలు కదలి మెదలి
మా ప్రేవులు మెలిపడి మెలిపడి
మా నోరు విచ్చుకొని విచ్చుకొని
మా పళ్ళు బయట పడి పడి
నవ్వుతాం నవ్వుతాం నవ్వుతాం

వంద టపాల బ్లాగు ధీరుడికి సహస్రాభినందనలు. మరెన్నో శతకాల తో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.

వంద కేవ్వులు మరో వంద కేకలు.

శివరంజని said...

ఉదయం నుండి బాగా హెవీ వర్క్ ఉండడంతో కాస్తా చిరాకుగా గా ఉంది అని అలా ఆన్లైన్ కి వచ్చేసరికి అండీ గారు వంద పోస్ట్ ల సంబరాలు అని వచ్చాను కదా ... ముందు టైటిల్ చూసే పగలబడి నవ్వేసా వందనలాకి బ్లా ని కలపారా ??? మీ క్రియేటివిటీకి జోహార్లు ... నవ్వి నవ్వి నా చిరాకు అంతా ఎప్పుడో ఎగిరిపోయింది .. ఇంకా నవ్వుతూనే ఉన్నాను అనుకోండి .....

శివరంజని said...

మీరు వంద పోస్టుల పూర్తీ చేసిన సందర్భంగా వంద అభినందనలు :))))) ఇలాగే వందల కొద్ది పోస్ట్ లు రాస్తూ ........ వందల కొద్ది కామెంట్స్ తో ......వందల కొద్ది ఫాలోవర్స్ తో .........వందల కొద్ది అభిమానులు , స్నేహితులుతో వంద కాలాలా పాటు మీ బ్లాగు వంద వోల్టుల బల్బులాగా వెలుగుతూ వందలమందిని నవ్వించాలని కోరుకుంటున్నా :))))))

హరే కృష్ణ said...

>>సహస్రాధిక
హర్ష థాంక్ యూ :)))
రాఘవేంద్ర రావు తో కత్రినా హీరోయిన్ గా మంచి ఫలభరితమైన సినిమా రావాలని కోరుకుంటున్నా :))
జై బి.ఏ :)))

హరే కృష్ణ said...

ఇందు :)))
థాంక్స్ థాంక్స్ :)
కింగ్ సినిమా లో రికార్డ్ చెయ్ రికార్డ్ చెయ్ అని అన్నట్టు
మా సాంబా రికార్డ్ చేసాడు :)

అభినందనలకు ధన్యవాదాలు :)
మీ
ముంబై తమ్ముడు :))

హరే కృష్ణ said...

చాతకం గారు ఎలా ఉన్నారు ?
ఎడారిలో ఎండమావి లా అగుపించింది మీ కామెంట్ చాలా రోజుల తర్వాత..
thank you very much :)

హరే కృష్ణ said...

వేణూ గారు,ఖలేజా లో త్రివిక్రమ్ చెప్పినట్టు అంతా జరుగుతూనే ఉంది
బాలయ్య అంటే ఎవరికైనా ఆ ఉత్సాహం పొంగుకొస్తుంది :))
థాంక్యూ :)))

హరే కృష్ణ said...

రసజ్ఞ గారు :)))
అంతా ఆ రాఘవేంద్రుని ఆట మన డీ.సీ.బీ.ఏ ఇదే ఫల సత్యం
లేఖిని కి పాపులారిటీ పెరుగుతోంది అంటే మీ లాంటి వాళ్ళ మహత్యమే :)
వాళ్ళే మీకు థాంక్స్ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా :))
అభినందనలకు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

>>>గోదారి పై రాదారి పడవలా మీ బ్లాగ్ ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటూ
కెవ్వ్వ్ సునీత గారు :))))
చాలా బావుంది :)
మీ ఆశీస్సులకు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

జ్యోతిర్మయి గారు థాంక్యూ వెరీ మచ్ :))

జలతారు వెన్నెల గారు
ఎస్ చైతన్యా నారాయణా కోచింగ్ సెంటర్స్ కరెక్టే :)
జిడ్డు గొంతు అంటే ఒక పోస్ట్ అవుతుంది కాబట్టి తొందర్లోనే రాస్తానని మనవి చేస్తున్నా :)
ప్రాస కోసం సోనీ ని వీడియో కాన్ ని చేయక తప్పలేదు :)
ఈ రిప్లయ్ వచ్చేసరికి మీరు భోజనం చేయలేదనే అనుకుంటున్నాను కాబట్టి మీరు బరువు బాధ్యత తగ్గిపోయింది అని ఆ యెహోవా జీసస్ డిసైడ్ చేసేసాడు :))
ఈ టపా వచ్చే వారం వెయ్యాల్సింది..ప్రజల ప్రోత్సాహానికి ముగ్దుడనై నిన్ననే వేసేశాను :)
మీ ప్రోత్సాహానికి,అభినందనలకి ధన్యవాదాలు!

హరే కృష్ణ said...

మధుర :)))
అవును ఆ సచిన్ లాంటి మహానుభావులు ఈ భూమి మీద ఉండబట్టే వంద అనే పదానికి ఇంత విలువ
సచిన్ కే ఫౌజ్ \m/
థాంక్యూ :))

హరే కృష్ణ said...

వనజ వనమాలి గారు
థాంక్యూ :))
>>బ్లాగు వీరుడు వీర బాదుడు ..
కెవ్వ్
జై తాడి గడప,పోరంకి,పెనమలూరు :))))))
ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

రాజ్ :)))
వెయ్యి పోస్టులా :D
ఆ సినిమా నేను థియేటర్లో చూసాను ఆ కోపం అంతా ఇలా బయటకు వచ్చేసింది అంతే
హ హ్హ ఎస్ :)))
థాంక్యూ అగైన్ :)

హరే కృష్ణ said...

స్నిగ్ధ గారు,
నమస్తే..ధన్యవాదాలు
ఆ రచ్చ సినిమా ట్రైలర్ లో అరుపులు మెరుపులు అని తెగ విసిగించేస్తున్నాడు అండీ
సరే మనం అరవలేమా అని ట్రై చేసాను :)
అభినందనలకు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

శశి గారు
థాంక్యూ వెరీ మచ్ :))
తప్పకుండా గురూజీ కోసం బాటా పడతాను :))

హరే కృష్ణ said...

శ్రావ్య,
కెవ్వ్ ఆ రెండు వందలు అనే పదం జన జీవితం లో పోయిజన్ అయి కూర్చుంది
తప్పకుండా ప్రయత్నిస్తాను
ఈ బ్లాగు ప్రయాణం లో మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు since its inception :)
థాంక్స్ :)

హరే కృష్ణ said...

భాస్కర్ గారు కెవ్వ్
మీరే ఆ మూడో ఫాలోవర్ :)
థాంక్యూ వెరీ మచ్ :)

హరే కృష్ణ said...

నిషి గంధ,
మీ సహాయినికి సూచనలకు బోలెడు ధన్యవాదాలు
మీకు డైలాగ్ ఇవ్వనందుకు బాధతో
చెయ్యి తిరిగిన రచయిత్రి కి పిల్లలం మేము ఇవ్వడం ఏంటి అని అర్ధం చేస్కోవాలి :P
బోలెడు ధన్యవాదాలు :))

హరే కృష్ణ said...

గురూజీ
మా ఒడలు కదలి మెదలి
మా ప్రేవులు మెలిపడి మెలిపడి
మా నోరు విచ్చుకొని విచ్చుకొని

అంత్య ప్రాసలు అదిరాయి అంతే :)))
మీ అశీస్సులకు వేల ధన్యవాదాలతో
మీ శిష్యుడు హరే :)

హరే కృష్ణ said...

>>వందల కొద్ది అభిమానులు , స్నేహితులుతో వంద కాలాలా పాటు మీ బ్లాగు వంద వోల్టుల బల్బులాగా వెలుగుతూ వందలమందిని నవ్వించాలని కోరుకుంటున్నా :))))))
కెవ్వ్ రంజని గారు
ఈ కామెంట్ సూపర్ డూపర్ అంతే
సాంబా రాస్కోవాలి ఇది కూడా
థాంక్యూ వెరీ మచ్ :))

తృష్ణ said...

కొంచెం లేట్ గా అభినందనలు..:)

నిరంతరమూ వసంతములే.... said...

మీ బ్లాగు ప్రయాణంలో వంద టపాలా రాయిని దాటినందుకు అభినందనలు ఆండి గారు! శతటపాల బ్లాగుధీరుడుగా వర్ధిల్లుతూ, ఇలాగే నవ్విస్తూ సహస్ర టపాల రాయిని కూడా దాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..:)
Best wishes,
Suresh Peddaraju

నేస్తం said...

వందో పోస్ట్ వేసావా..ఇప్పుడే చూసా...అభినందనలు హరే... నాకంటే నువ్వే బెటేర్ ..అప్పుడెప్పుడో మొదలుపెట్టాను..అరవై రాసేసరికి ఆగిపోయా :))..నెక్స్ట్ ఇయర్ కి రెండొదలో పోస్ట్ కి ఇలాగే కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నా

నైమిష్ said...

congratulations for the successful completion of century :)good post :)

చైతన్య said...

మీ పోస్ట్ లో మొదటి ఫోటో... చివరి ఫోటో నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయండి.... కేక...

శ్రీనివాస్ పప్పు said...

ఎప్పటిలాగే కొంచం ఆలశ్యంగా చూసాను పోస్ట్.శతక్కారుడి శతాభినందనలు.ఇలాటి శతకాలు ఇంకెన్నో మరెన్నో అవ్వాలని తద్వారా మా ఆయుస్షు పెంచాలని కోరుకుంటూ మరొక్కసారి రాఘవేంద్రరావ్ బి.ఏ అభినందనలతో.

Ravitheja said...

Diloges keka
Final photo keko keka

..nagarjuna.. said...

బాఘా నవ్వేసుకొని వెళ్ళిపోదామనుకున్నా. ఆఖర్లో కామెంట్ పెట్టకపోతే కత్తితో పొడుస్తా అని అతి వినమ్ర్ కే సాథ్ నువ్వు అడిగిన పద్దతి నచ్చి కామెంటాల్సొస్తుంది. శతక్కొట్టుడు శతకాభినందనలు :)

BTW, ఆ బ్లొందనాలు టైటిల్ ఏవిటి నాయనా. తిడుతున్నావు అనుకోవాలా, మెచ్చుకుంటున్నావ్ అనుకోవాలా ?

Naresh said...

బ్లాగుంది మిత్రమా :)
కంగ్రాట్స్ నీ నవ్వుల శతకానికి..
ఇంకా మరిన్ని నవ్వుల 'కిరణాల్ని' వెదజల్లాలని కోరుకుంటూ..
లవ్యూ రాజా(పోసాని స్టైల్లో) :D

హరే కృష్ణ said...

తృష్ణక్కా థాంక్యూ :))

హరే కృష్ణ said...

సురేష్ గారు :))
>> శతటపాల బ్లాగుధీరుడుగా వర్ధిల్లుతూ, ఇలాగే నవ్విస్తూ సహస్ర టపాల రాయిని కూడా దాటాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..:)
:)))))))
థాంక్యూ వెరీ మచ్ :)

హరే కృష్ణ said...

రెహ్మాన్ థాంక్స్ :))

హరే కృష్ణ said...

అక్కా :))
థాంక్యూ! మూడేళ్ళ ప్రయాణం లో ఈ వంద సంఖ్యకు చేరుకుంది..యూ ట్యూబ్ వాడి దయవల్ల ఇరవై పోస్టులు బోర్ కొట్టినప్పుడు వేయడం తో ఈ వంద సాధ్యమయింది :))
మీ దీవెనలే మాకు రక్ష :)
థాంక్యూ థాంక్యూ :))

హరే కృష్ణ said...

నైమిష్ గారు
థాంక్యూ వెరీ మచ్ :)))


చైతన్య గారు బ్లాగ్ కి స్వాగతం :)
పిక్స్ రెండూ నచ్చినందుకు ధన్యవాదాలు :))

హరే కృష్ణ said...

శ్రీనివాస్ పప్పు గారు :))
అమృత మధనం చేసి మంచి పోస్ట్ లు రాయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా :)
మీ ఆశీస్సులకు ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

రవి తేజ గారు
మీ కామెంట్లకు రీ షేర్లకు బోలెడు థాంక్స్ చెప్పుకోవాలి :)
థాంక్యూ వెరీ మచ్ :))

హరే కృష్ణ said...

నాగార్జున :))
హ హ్హ ఇంత బాగా కామెంట్ రాస్తావు కాబట్టే నీకు అనుష్కా ని అంకితం చేసేసా :P
>>శతక్కొట్టుడు శతకాభినందనలు :)
అంతా వ.బ్లా.స ఫలితాలు వికీ డోనార్ లా ఇప్పుడు బయటకు వస్తున్నాయ్ :)))

బ్లాగు బాషలో బ్లాష్టాంగ ప్రమాణాలు అనే ఉద్దేశ్యం తోనే రాసాను :))
థాంక్యూ :))

హరే కృష్ణ said...

నరేష్ :)))
కెవ్వ్!
నువ్వు లేకపోతే ఈ బ్లాగ్ పాపులారిటీ లేదు..దీనికంతటికీ కారణం నువ్వే
రాజ శేఖర్ మాస్టార్ లా :))
థాంక్యూ వెరీ మచ్ :))

Vineela said...

లేస్ చిప్స్ పేకట్ లా గాలిలో తేలియాడాము మీ శతక పోస్టు చదివి. congrats on your century :)

హరే కృష్ణ said...

వినీల గారు
నా నెట్ మొరాయించడం తో రిప్లై లేట్ గా ఇస్తున్నా!
థాంక్యూ వెరీ మచ్ :)