exam ముందు రోజు నా ప్రిపరేషన్ కి ఆపరేషన్ జరిగి అది కూడా విఫలమవడం తో టెక్స్ట్ బుక్ నుండి నోట్స్ కి షిఫ్ట్ చేసి ICU లో అడ్మిట్ చేసాక..వన్ నైట్ స్టాండ్ చేసి మరుసటి రోజు కాస్త పౌడర్ మొహం మీద ఎక్కువ వేసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లాను.
నిద్ర మత్తులో బ్లాగులు రాయడం అనే కాన్సెప్ట్ తెలియని రోజులు కావడంతో
పేపర్ చూసి
హే..బాగా వచ్చింది exam paper
చిటికలో సాల్వ్ చేసేయొచ్చు..
కమాన్... గంటంటే గంటలో రాసేసి ఇంటికి వెళ్లిపోవాలి సరిగా నిద్ర కూడా లేదాయే నిన్న రాత్రి అని
హే..బాగా వచ్చింది exam paper
చిటికలో సాల్వ్ చేసేయొచ్చు..
కమాన్... గంటంటే గంటలో రాసేసి ఇంటికి వెళ్లిపోవాలి సరిగా నిద్ర కూడా లేదాయే నిన్న రాత్రి అని
ఆన్సర్ షీట్ మీద పెన్ పెట్టాను..మళ్ళీ రెండింటికల్లా యో యో అని స్కూల్ కి వచ్చేయెచ్చు అనుకొని
చక చకా చకా నాలుగు స్టెప్స్ వేసాను.. పెన్ కదలడం లేదు
రీఫిల్ తీశాను
పైకి కిందకి షేక్ చేసి మళ్ళీ పెన్ లో పెట్టి పరీక్ష రాయడం మొదలు పెట్టాను.. చక చకా చకా నాలుగు స్టెప్స్ వేసాను.. పెన్ కదలడం లేదు
రీఫిల్ తీశాను
LHS వైపు ఉన్న పై స్టెప్ రాసాను...అయిపోయింది రీఫిల్ లో ఇంకు కాదు బ్రెయిన్ సెల్ల్స్ లో పెరిగిపోయిన జంకు అని నిర్ధారించుకున్నాక,
గంట సేపు ఇలా అదే ప్రశ్నలో సతమతమవుతూ పెన్ ను రీఫిల్ ను ఎత్తి దించి
మరో గంటలో మిగిలిన ప్రశ్నలను శోధించి సాధించి ఒక analysis కి వచ్చి
ఇప్పుడు యాభై కి నలభై అయిదు మార్కులు వస్తాయి అన్నమాట అనుకొని వెంటనే ఆదిత్య 369 ఎక్కేసాను .
రెండు రోజులు తర్వాత
మా వీధిలో
మా ఇంటి లోపల హాల్ లో
హేంగర్ కి వేలాడుతున్న లెదర్ బెల్ట్
క్లాస్ టాపర్ అదీ ఫేవరేట్ సబ్జక్ట్ మాథ్స్ లో
అయిదు మార్కులు తగ్గినందుకు మా ఇంటి ప్రాంగణం లో పది రౌండ్ల దెబ్బలు ఇరవై చీవాట్లు
ఆ తర్వాత రోజు స్కూల్లో నలభై మంది ముందు పోయే పరువు.
ఆ తర్వాత రోజు స్కూల్లో నలభై మంది ముందు పోయే పరువు.
(ఆదిత్య 369 లో బాటరీ+మా పరీక్ష ముగించడానికి సమయం) low లోనికి వచ్చేసాక లెక్క లు చూసుకొని లేచి మిగిలిన టైం లో
ఆలోచించి.. ఆలోచించి.. పరీక్ష హాల్ నుండి బయటకి వచ్చేసాను.
వెంటనే లంచ్ చేసేసి
సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది
హెడ్ మాస్టర్ రూం లో
నేను,మా క్లాస్ టీచర్ ఇద్దరం హెడ్ మాస్టర్ ముందు నిల్చున్నాం
రోమాలు నిక్కబొడుచుకొని మమ్మల్నే కోపం గా చూస్తున్నాడు.
హెడ్ మాస్టర్ మా సార్ తో: ఏమిటి మీరు చెప్పే విధానం... ఒక్కరు కూడా exam సరిగ్గా రాయడం లేదు కనీసం ఎవరేం చేస్తున్నారో కూడా చూడడం లేదు
హరే నువ్వు బాగానే ఉన్నావ్ కదా నీకేం అయింది
నేను:ఏమీ లేదు సార్
హెడ్:నిజం చెప్పు ప్రొద్దున్నరాసిన నీ answer పేపర్ ఎక్కడ ఉంది,అసలు వెళ్ళేటప్పుడు ఇచ్చావా లేదా?
నేను:ఇచ్చాను సార్.. అలా అన్నానే కాని దాచేసిన పేపర్ వీళ్ళకు దొరికి పోయిందా అని టెన్షన్ తో నాకు చెమటలు పట్టేస్తున్నాయ్..నేను:ఏమీ లేదు సార్
హెడ్:నిజం చెప్పు ప్రొద్దున్నరాసిన నీ answer పేపర్ ఎక్కడ ఉంది,అసలు వెళ్ళేటప్పుడు ఇచ్చావా లేదా?
వెంటనే హెడ్ మాస్టర్ CID సీరియల్ లో ACP ప్రద్యుమన్ లా ఒక చూపు మా సార్ వైపు చూసాక చెమటలు పట్టడం తన వంతైంది ఈ సారికి.
మా హెడ్ మాస్టర్ సాక్షిగా క్లాస్ లో అందరి ముందు నన్ను క్లాస్ బోర్డ్ పై సాల్వ్ చెయ్యమన్నారు.
మా సార్ నాతో: అసలు.. నీ పేపర్ మిస్ అవడం ఏంటి? అని మళ్ళీ అదే ప్రశ్నబాబోయ్ ఇప్పుడు నా బాగ్ వీళ్ళు వెతికారంటే.. నా బ్రతుకు బాలయ్య తో సినిమా చేసి నిర్మా సబ్బు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని నిస్సహాయతా స్థితి లో ఉన్న నిర్మాత పరిస్థితి అని ముందే ఊహించి
ఇప్పుడు మొదలు పెట్టేయమంటారా సార్ అని వెంటనే అడిగేసాను.
మొత్తం బోర్డ్ మీదే చెయ్యమంటారా మళ్ళీ పేపర్ ఇవ్వరా అని ఒక సారి దీనం గా చూసేసరికి
మా సార్: ఏం చేస్తావో తెలియదు.. ఎలా చేస్తావో తెలియదు..
నీ ఇష్టం వెనుక నుండి ముందుకు అయినా ముందు నుండి వెనుకకు అయినా నువ్వు ప్రాబ్లం సాల్వ్ చెయ్యొచ్చు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా నీ నెక్స్ట్ బర్త్డే కి పెద్ద కేక్ నాకే ఇవ్వాలి అని ఒక సినిమా డైలాగ్ వేసాక
నేను చివరి నుండి సాల్వ్ చేస్తూ చేస్తూ
ఆ తొమ్మిది లెక్కలను చావగొట్టి సాధించాక 45 మార్కులు మా సార్ వేసేసారు తన బుక్ లో
మిగిలినది పేపర్ లో మిగిలిన ఒకే ఒక్క మొదటి లెక్క
నాలుగు స్టెప్స్ వేసాక
ముందు లెక్కలను సాల్వ్ చేసిన కాన్ఫిడెన్స్ వల్లనేమో
వెంటనే నేను
మామా ట్యూన్ వచ్చేసింది అన్నట్టు షార్ప్ గా కేచ్ చేసినట్టు ఎక్కడ నుండి వచ్చిందో ఠపీ ఠపీ మని మిగతా స్టెప్స్ వచ్చేసాయి...
నా బుర్ర లో ఆ అకస్మాతుగా జరిగిన ఆ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంటుందా అని నేనే అచ్చెరువునొందాను.
వందకి రెండొందలు అంటే ఏంటో తెలియని వయసులో కూడా
యాభై కి యాభై మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు అందుకున్న ఆ సంఘటన తో
ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనే రోజు నాకు The Shawshank Redemption సినిమాలా చాలా బాగా గుర్తుండిపోయింది.
11 comments:
రీఫిల్ తీశాను
పైకి కిందకి షేక్ చేసి మళ్ళీ పెన్ లో పెట్టి మొదలు పెట్టాను
అయిపోయింది రీఫిల్ లో ఇంకు కాదు బ్రెయిన్ సెల్ల్స్ లో పెరిగిపోయిన జంకు అని నిర్ధారించుకున్నాక
కిం.ప.దొ.న.
The Shawshank Redemption సినిమా ని ప్రతి రోజు తలచుకుంటావ్, లెక్కల పేపర్ ని నాలుగు సంవత్సరాలకోసారి మాత్రమే గుర్తు చెసుకుంటావ్...
సో, ఈ పోలికకి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం... :))
నవ్వులే నవ్వులు... ఫోటోలు కేక, బాగా మ్యాచ్ అయ్యాయి... :))
** "ఐన్ స్టీన్ పుస్తకం చదివిన మానవుని వలె ,రక్షకుడు సినిమాలో నాగార్జున లా రోమాలు నిక్కబొడుచుకొని..."
pic superrrrr......
** "నిర్మా సబ్బు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని నిస్సహాయతా స్థితి లో ఉన్న నిర్మాత.. " rofl :)
ఇలా కోట్ చేయాలంటే పోస్ట్ అంతా కాపీ-పేస్ట్ చేయాలి...
:) :)
అసలు పోస్టే రచ్చ అని కామెంట్ పెట్టడానికి వస్తే ఇక్కడ ఈ డవిలాగులు అరాచకం.
'తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68'
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కిం.ప.దొ.న. :D :D :D
LOL :)))))))))))))
రెండో ఫోటో నీ చిన్నప్పటి ఫోటోనా.. :)
గురువు గారు...:):):)
ACP ప్రద్యుమ్న ఫొటో...సూపరసలు...
డవిలాగులు ఏవి పెట్టాలో తెలియక ఆలోచిస్తున్నాను...కేకసలు....
మధుర గారన్నట్లు, రెండో ఫోటో మీదేనా???:)
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి. >>>>>>>> ఆ కామెంట్ బాక్ష్ దగ్గర ఉంది ఏమిటి హరే గారు , దిమాండ్ ? రిక్వెస్ట్ ? వార్నింగ్ ? కెవ్వ్ అస్సలు నేను తెగ నవ్వేసుకుంటున్నాను లే ... బాబోయ్ నేను మాత్రం ఎప్పుడూ పోస్ట్ చదివేసీ వెళ్ళిపోలేదు ఏ బాల్గ్ లోనూ ...కామెంట్ పెట్టే తీరుతాను ..ఇప్పుడు కూడా పెట్టేసాను నేను గుడ్ కదా :)
పోస్ట్ మాత్రం చాలా బాగారు . ... హహ ఆ CID సీరియల్ లో ACP ప్రద్యుమ్న భలే చూస్తాడు ...అతని చూపు చూస్తుంటే అతనే మెయిన్ విలన్ లా కనిపిస్తాడు కదూ
శ్రీ :)))
థాంక్యూ!
హర్ష :))
వివరణ ఇవ్వడానికి ఒక పోస్ట్ పడుతుంది.. రాస్తాను :)
థాంక్స్ :)
చాణక్య :))
ధబడ్ ధబడ్ ధన్యవాదాలు :)
మధుర :))
ఎవరో మహానుభావుడు గూగుల్ లో దొరికాడు
జాన్ మేయర్ చిన్నపటి ఫోటో అని వివరములలో ఉంది. :)
థాంక్స్ :)
స్నిగ్ధ గారు ధన్యోస్మి :)
ప్రద్యుమ్నా మజాకా వీడి ఎక్స్ప్రెషన్స్ కోసం ఆ CID చూసేయోచ్చు బోలెడు కామెడీ :)
శివరంజని గారు థాంక్యూ :))
ప్రద్యుమ్న చూపు ముందు చూపు అనుకుంటున్నా :))
కామెంట్ బాక్స్ నచ్చినందుకు మళ్ళీ థాంక్యూ :)
కేక....ఆ ఫుటోలు...ఆ కధనం...ఆ స్టొరీ
హ...హ...)) అసలు జ్వరం వచ్చి తగ్గితే ఇన్ని పోస్ట్ లు వేస్తామా?అంటే బుర్ర షార్ప్ అయిపోతుందా?
Post a Comment