Pages

Wednesday, February 8, 2012

రెండాట్స్..


 


జోరుగా కుండ పోతగా భోరున విలపిస్తున్నాడు వినోద్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర.

పక్కనే ఉన్న నేను నా ఫ్రెండ్స్ ఎంత ఓదారుస్తున్నా జగన్ వస్తే కానీ మంకుపట్టడం మానని చిన్న పిల్లాడిలా గాల్లో ఎగురుతూ  కెవ్వులు పెడుతున్నాడు
కొద్దిసేపటికి బోరు కొట్టేసి స్విచ్ ఆఫ్ చేసిన బోర్ లా స్లో మోషన్ లో  విలపించడం తగ్గించుకుంటూ వస్తున్నాడు.
ఎదురుగా చూస్తే మా క్లాస్మేట్స్ ఇద్దరు అమ్మాయిలు అటునుండి వస్తున్నారు


వారి దొంగ మొహమా అని వాడి వైపు తిరిగేసరికి
వాళ్ళిద్దరూ వెళ్ళగానే సెరెలాక్ టైం కి అందని బిడ్డలా బావురుమంటూ మమ్మల్ని బెంబేలిస్తున్నాడు 
ఏదో కోల్పోయినట్టు ఏమైంది రా అంటే చెప్పడూ..


                                              
           
                                                                
15 గంటల ముందు
----------------------------


అదే కాలేజ్ గేట్ ముందు సాయింత్రం క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్ళకుండా 
తోలి ప్రేమ రిలీజ్ ఇచ్చాడని ఫస్ట్ షో కి వెళ్తే టికెట్స్ దొరకక చివరి ఆటకు ఎలా అయితేనేం బ్లాక్ లో దొరికేసాయి.

ఇంట్లో parents అంతా కాలేజీలకు వచ్చి చూస్తారని తెలిసి టికెట్స్ దొరికిన వెంటనే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి తినేసి మళ్ళీ కాలేజ్ కి నైట్ చదువుకోడానికి అని చెప్పి బాగ్ లు వేసుకొని థియేటర్ కి వచ్చేసాం.

వినోద్ మాత్రం మా ఇంట్లో తినేసి నాతోపాటు కాలేజ్ కి వస్తున్నట్టు వచ్చి సినిమా అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు.



 10 గంటల ముందు
------------------------------------------------


రాత్రి ఇంటికి వెళ్ళిన వినోద్ గాడి ఇంట్లో కళ్ళల్లో కొవ్వొత్తులు కర్పూరాలు వేసుకొని చూస్తున్నారు
వాళ్ళ నాన్న చుట్ట వెలిగించి ఇంకో చేత్తో బెల్ట్ పట్టుకొని
ఎక్కడికి వెళ్ళావురా నిజం చెప్పు ? ఇంత లేట్ ఏమిటి
ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసి అక్కడే చదువుకొని వస్తున్నా నాన్నా

వినోద్ వాళ్ళ నాన్న మా ఇంటికి అర్ధ రాత్రి కాల్ చేస్తే నేను ముందే రిసీవర్ పక్కన పెట్టేయడం తో పలకలేదు.  
ఇంతకీ ఎవరింటికి వెళ్ళావ్ చెప్పు ?
హరే వాళ్ళ ఇంటినుండి అలా రమేష్ వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చున్నాం
రమేష్ వాళ్ళింటి కి ఫోన్ కలిపితే
హలో,రమేష్ ఉన్నాడా
లేదండీ కాలేజ్ కి వెళ్ళాడు.





తర్వాత కాలేజ్ రిసెప్షన్ కి ఫోన్ చేస్తే
నైట్ టైం లో వచ్చే చదువుకోవడానికి వచ్చే అది కొద్ది మంది స్టూడెంట్స్ లో ఎవరో ఒకరు పిక్అప్ చేయడం మాకు అలవాటు కావడంతో
నేను వినోద్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నా
మా అబ్బాయి..... అనే లోపు
సతి లేని  సహాయ హుటా హుటి హతిహేతువైన హరీష్ రిసీవర్ లాక్కొని
డాడీ చెప్పండి,ప్రస్తుతం చదువుకుంటున్నా..
కాస్త నిద్రవస్తోంది గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్! 


అలా ఆ రెండాట్స్ రాత్రి కాస్తా రెండు పెర్మనెంట్ మార్కర్ తో రాసిన డాట్స్ అయిన ధారల్లా లా ఆ నెలంతా అతుక్కుపోయాయి.

ఈ మధ్య ఎవరో ఒక జోక్ షేర్ చేస్తే నేను కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈ సంఘటన గుర్తు చేసుకోవడం జరిగింది.

21 comments:

Raj said...

hahhaha.. మరి మీ నాన్నారు ఎప్పుడు beltకి పని చెప్పలేదా?? :P

Sravya V said...

హ హ దీనికా మూలమైన జోక్ నాకు తెలుసును . ఇంతకీ ఆ రెండాట్స్ అంటె సెకండ్ షో అనా ?

కృష్ణప్రియ said...

:) climax మొదట అర్థం కాలేదు. రెండో సారి చదివాక.. సూపర్!

రాజ్ కుమార్ said...

తొలిప్రేమ స్క్రీన్ షాట్స్ బాగున్నాయ్. ;)
రెండాట్స్ అంటే సెకండ్ షో నా?

Anonymous said...

:))
**సతి లేని సహాయ హుటా హుటి హతిహేతువైన
అర్థం ఏంటో వివరింపుడి ;)

వేణూశ్రీకాంత్ said...

హహహహ :-))))

karthik said...

>>జోరుగా కుండ పోతగా భోరున విలపిస్తున్నాడు వినోద్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర.
>>పక్కనే ఉన్న నేను నా ఫ్రెండ్స్ ఎంత ఓదారుస్తున్నా జగన్ వస్తే కానీ మంకుపట్టడం మానని
>>ఇంట్లో కళ్ళల్లో కొవ్వొత్తులు కర్పూరాలు వేసుకొని చూస్తున్నారు
కెవ్వో కెవ్వు..

SJ said...

super

హరే కృష్ణ said...

రాజ్ :)))
నా బ్లాగ్ లో మొదటి కామెంట్ కు బోలెడు థాంక్స్!
కర్పూరాల సీన్ అయితే రిపీట్ అయ్యింది కానీ
బెల్ట్ తీసేంతలా ఎప్పుడూ దొరికిపోలేదు :)

శ్రావ్య :))
అవును నాకు చదివిన వెంటనే చిన్నపుడు చేసిన ఘన కార్యాలను కనెక్ట్ చేసుకున్నాము.
అవును సెకండ్ షో నే :)
థాంక్స్ :)

హరే కృష్ణ said...

కృష్ణ ప్రియ గారు :))
థాంక్యూ వెరీ మచ్!

రాజ్, అవునూ
థాంక్స్!

హరే కృష్ణ said...

బిట్టు :))
సతి లేని =బుర్ర తినడానికి భార్య లేని
సహాయ హుటా హుటి= సహాయం కోసం హుటా హుటిన తరలి వచ్చే
హతి= హైలీ గా అతి చేసి
హేతువైన= రాహువు తమ్ముడు హేతువు అయిన
మా హరీష్ అని అర్ధము
ఇప్పుడు ఎన్ని మార్కులు వేసేదారు వేయుడి!
థాంక్స్!

హరే కృష్ణ said...

వేణూ గారు
థాంక్యూ థాంక్యూ !

కార్తీక్ :))
చాలా థాంక్స్ :)

సాయి గారు థాంక్యూ :)

Anonymous said...

బాబోయ్.... మీరు ఖచ్చితంగా ఐ.ఐ.టి. లో టాప్ చేసి వుంటారు...అవునా..?? :P ;)

హరే కృష్ణ said...

రాహువు తమ్ముడు కేతువు అనుకొనేరు
రాహువు కేతువు బావ బావ మరిదిలు
రాహువు తమ్ముడు హేతువు వాళ్ళ కేతువు చెల్లి అయిన కొలవరి ని వివాహమాడాడు. :P

హరే కృష్ణ said...

అవునా తర్వాత ఆ ప్రశ్నార్ధకం ఏల
అవును అవును అవును మూడు సార్లు :)

Anonymous said...

మీ సృజనాత్మకతకి నా _/\_ _/\_

హరే కృష్ణ said...

\,,/(^_^)\,,/

చాణక్య said...

సూపరు.. అదేదో సతిలేని మతిలేని అర్థం భలే చెప్పారండి. మొదట నాక్కూడా అర్థం కాలేదు గానీ కామెంట్ చదివినా అర్థమయ్యింది. పోస్ట్ గురించి మీ స్టైల్లో చెప్పాలంటే.. \,,/

శశి కళ said...

abbo....rendaats ante second ahownaa...inka rendu cinimalu anukunna...nenu anukuntoone unna...tamariki ilanti flash back undakapote....baagundadani...)))

హరే కృష్ణ said...

చాణక్య :)))
థాంక్యూ \m/ \m/

శశి గారు
బాగుండదని మీరు గట్లా డిసైడ్ చేసినారా :))
హి హి! థాంక్యూ :)

ఫోటాన్ said...

హి హి హి,,, :))
లేట్ గా చదివా... హాయిగా నవ్వుకున్నా... కేక పదాలు... సూపర్ పోస్ట్... :)))