Pages

Monday, October 25, 2010

రాయుడు బాబాయ్ MMTS

ప్రదేశం:పేటెంట్ పురం ,కృష్ణా జిల్లా

అవి అధర్మం Johnson's baby lotion రాసుకున్న పాదాలపై నడుస్తున్న రోజులు.ప్రజలందరిలో ఏదో భయం,న్యాయం జరగలేదనే బాధ కళ్ళలో కనిపిస్తోంది.సడెన్ గా ప్రజల కళ్ళు నారింజ రంగులోనికి రావడం జరుగుతోంది..ఏదో శాపం మొదలయ్యింది అని ప్రజలంతా నమ్మడం మొదలెట్టారు.ఎవరూ తిట్టకుండా కొట్టకుండానే ఏడుపులు వచ్చేస్తున్నాయి,పిల్లలు పెద్దా తేడా తెలియకుండా అదే పరిస్థితి


మరో రెండు రోజులకి కళ్ళు  ఎర్రగా మొదలవ్వడం మొదలయ్యాయి. ఆ  మరుసటి రోజు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి. భోరున వర్షం,గ్రామం లో ఒక ఇంటి ముందు ముందు పెద్ద పిడుగు పడింది.ఆ ఇంటి ఎదురుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ...నా అని ఒక పిల్లాడి ఏడుపు వినిపించింది సీన్ కాపీ పేస్ట్ చేస్తే..

 వెంటనే ప్రజల కళ్ళలో ఎరుపు తగ్గడం మొదలయ్యింది. పడిన రోజే ఆ ఇంటి ముందు మరో పిడుగు పుట్టింది అని ప్రజలంతా డిసైడ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.

 గ్రామ సర్పంచ్: మీ అబ్బాయి మామూలు మనిషి కాదు కారణ జన్ముడు వీడికి పేరు గ్రామ పెద్దలే నిర్ణయించాలి
 పిల్లాడి  తల్లి తండ్రులు:అబ్బా ఛా! రుజువు ఏంటి.

సర్పంచ్:చూసావా! అందరి కళ్ళు ఎలా ఎర్రగా అయ్యాయో మళ్ళీ పుట్టగానే ఎలా మామూలుగా మారాయో  ఇది ఖచ్చితంగా మీ  అబ్బాయి పుట్టిన వేళా విశేషమే
 పిల్లాడి పేరెంట్స్:కండ్ల కలక కి కారణ జన్ముడు కి తేడా తెలియని %&#@$@
 సర్పంచ్:అధిక ప్రసంగం వద్దు ఇది ముమ్మాటికి మా గ్రామ బాగుకోసం పుట్టిన బిడ్డ వీడు వీడి బాధ్యత గ్రామానిదే అని తీర్పు చెప్పి


 అని వాళ్ళ అమ్మా నాన్న మా అబ్బాయికి ఆ  పేరు వద్దు అని ఎంత వారిస్తున్నా ప్రజలు పిడుగు రాయుడు గా నామకరణం చేసారు.

 పేరు పెట్టిన మరుసటి రోజునే అందరి కళ్ళు మామూలు రంగులోనికి వచ్చేసాయి. రాయుడు కి రెండే రెండు రోజుల్లో ఫేమ్ ని సంపాదించిపెట్టాయి 

 రాయుడు ఊరిలో iit foundation బడి లేక పోవడం తో అయిదోతరగతి వరకు చదువు లేక సంధ్యను మాత్రమే గర్ల్ ఫ్రెండ్ గా సంపాదించుకున్నాడు.
రాయుడు లోని విలక్షణమైన నాయకుడిని గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు గ్రామస్థులకు.

ఒక రోజు పాము ముంగిస దెబ్బలాడుకుంటున్నాయి ఎవరు గెలుస్తారో తెలియక గ్రామస్తులంతా వాటి చుట్టూ చేరారు.పోటీ మంచి రసవత్తరం గా సాగుతోంది గ్రామ పెద్దలంతా ఎవరు గెలుస్తారు అని పందేలు కాస్తున్నారు.సరిగ్గా అప్పుడే రాయుడు ని సంధ్య గిల్లింది పట్టించుకోలేదు రాయుడు.ఇంకా గట్టిగా గిల్లింది ఈ సారి సంధ్య.అయ్యా...! మగిస అని గట్టిగా అరిచాడు రాయుడు. ఆ అరుపుకి  పాము బెదిరింది.ముంగిస పాముపై తిరగబడింది.రాయుడి సుడితిరిగింది.

ప్రజలంతా పోటీ వైపు చూడకుండా  రాయుడి వైపు చూడడం మొదలెట్టారు.

గ్రామ సర్పంచ్:చూసారా.. నేను ఆరోజే చెప్పాను వీడు కారణ జన్ముడని, మాటలు కొద్ది కొద్దిగా తెలిసినా కూడా అంతిమ విజేత ముంగిస అని పలకడం తెలియక మగిస అని చెప్పాడు,వీడు కారణ జన్ముడు..వీడే కారణ జన్ముడు..నా వారసుడు..కాబోయే సర్పంచ్ కూడా వీడే అని నాకు ఘాట్టి నమ్మకం..   ఊ..ఊ
ప్రజలు:అవును ముమ్మాటికీ  కారణ జన్ముడే

రాయుడి తల్లి తండ్రులు:అంతే అంటారా..

సర్పంచ్:రెండు సార్లు చెప్పినా నా మాట మారదు, మాట మీద నిచ్చెనేసుకొని నిలబడే మనిషిని నేను అని మీకు తెలియదా
spectator:మా వెదురు తోటలు అన్నీ మాయమవుతున్నాయి ..నిచ్చెన కి కలప దొంగతనం నువ్వేనా చేస్తోంది..
సర్పంచ్:ఎవరది..నరికేస్తా!
spectator: పో పోవోయ్.. అవును సరిగ్గా చెప్పావు..నరకడమే ..నువ్వు చేస్తోంది అదే అని మాకు తెలుసులేవోయ్!..ఇంతకీ కలపని నరుకుతోంది పగలా.. రాత్రా ?

సర్పంచ్: ఎదురుగా మాట్లాడే  ధైర్యం లేక ఎవడ్రా అది కారు కూతలు కూస్తోంది
spectator:కారు కూతలు కాదు బేయ్! కలప కూతలు
సర్పంచ్:మీతో మాట్లాడడం నా మూర్ఖత్వం
spectator:మీ మూర్ఖత్వానికి మా మంగిడీలు
 సర్పంచ్: ఎయ్య్ ఎవడ్రా..అని అరుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు

రాయుడిని కీర్తిస్తూ ప్రజలు కూడా తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు
ఈ సంఘటన అయిన వెంటనే  రాయుడు ఇంటిదగ్గర సీన్ కానరీ..

పేరెంట్స్:అరే!..నువ్వు ఆ  టైం లో ముంగిస అని ఎందుకు అంత గట్టిగా అరిచావ్
రాయుడు:నాకు జరిగినదే నీకు జరిగితే నువ్వూ అలానే అరిచేవాడివి.అయినా నేను మగిస అని కదా అన్నాను
పేరెంట్స్:మగిస ఆంటే ?
రాయుడు:మళ్ళీ గిల్లింది సంధ్య అని
పేరెంట్స్:హతవిధీ!..ఈ సర్పంచ్ సింగనమల రమేష్ కంటే పిచ్చోడు లాగా ఉన్నాడు

అలా అయిదేళ్ళు గడిచాయి. రాయుడు స్కూల్ కి వెళ్ళడం మొదలెట్టాడు సర్పంచ్ తన కార్యాలయం స్కూల్ కి షిఫ్ట్ చేసాడు

స్కూల్ లో 9 to 5 వరకు ఆ తర్వాత గ్రామ పంచాయితీ లో విచ్చలవిడిగా రచ్చ చేస్తున్న రాయుడు జీవితం లో అనుకోని U-టర్న్ వచ్చిపడింది.
రాయుడు మూడో తరగతి చదువుతున్నప్పటి సంఘటన
ఊర్లో ఉన్న single theatre కి వచ్చిన పెదరాయుడు సినిమా  పిడుగు రాయుడు పరువు తీసింది.
సినిమా క్లైమాక్స్ లో ఇంగ్లీష్ లో  ఫిష్ వాటర్  డైలోగ్ అనర్గళం గా మోహన్ బాబు చెప్పగలిగి ఉన్నప్పుడు మన రాయుడు కూడా ఇంతకంటే ఆదరగోట్టాలి అని పదే పదే  గ్రామస్థులు ఫెవికాల్  వేసుకు కూర్చున్నారు '

గ్రామస్థులంతా ముక్త కంఠంతో క్లైమాక్స్ లో పెద్ద మోహన్ బాబు సౌందర్య కి చెప్పే డయిలాగ్ నిజజీవితం లో రాయుడు తో చెప్పించాలని ఆ  రోజు ఇద్దరి భార్యా భర్తల కి విష బీజం install చేసి బీటా వెర్షన్ ని మరుసటి రోజు పంచాయితీ  లో ప్రవేశపెట్టారు

స్థలం:గ్రామ పంచాయితీ పక్కన పాఠశాల

సర్పంచ్ తీర్పుతో సినిమా లో రాయుడి  తీర్పు కంపేర్ చెయ్యడానికి స్కూల్ కి ప్రజలంతా పెందలాడే  పరుగులెట్టారు
అందరూ కార్రియెర్  కార్రియెర్ లు గెంజి వేసుకొని  స్కూల్ ముందు చేరారు

   
సర్పంచ్: సభకు నమస్కారం! సమస్య ఏంటి
spectator:ఈ ఊరికి నువ్వే పెద్ద సమస్య కదా
సర్పంచ్:ఏయ్ ఏయ్..మాటలు జాగ్రత్తగా రానీ..విషయం ఏంటో చెప్పండి
ప్రజలు:ఏమి లేదు.. పెదరాయుడు సినిమా చూసాక ఈ భార్యా భర్తలు విడిపోయారు ఆ  సినిమా లో చూపించినట్టుగా భర్త కి భార్య మీద అనుమానం వచ్చింది.చివర్లో మోహన్ బాబు ఇంగ్లీష్ లో సర్ది చెబుతాడు అది వీళ్ళకి అర్ధం కాలేదు సినిమాలో సౌందర్య మోహన్ బాబు కలిసారు నిజజీవితం లో వీళ్ళు విడిపోయారు దీనికి మీరే పరిష్కారం చూడాలి

సర్పంచ్:ఏం చెయ్యాలబ్బా..నాకేం చెయ్యాలో తోచడం లేదు
spectator :ఆ విడిపోయిన అమ్మాయి ని నువ్వు పెళ్లి చేసుకో..చాలా సింపుల్ అవును చాలా సింపుల్ అని మరో ఇద్దరు spectators కూడా ప్రాస కలిపారు
సర్పంచ్ సిగ్గుపడుతుండగానే చీపురు కట్ట తో ఎవరో కొట్టినట్టనిపించింది చూస్తే  సర్పంచ్ సహధర్మ చారిణి కూడా excitement ఆపుకోలేక డైలోగ్ వినడానికి వచ్చి సర్పంచ్ కి సర్ప కాటు వేసింది.సర్పంచ్ దెబ్బలు మాయమయ్యేవరకు పంచాయితీ ని తన successor  రాయుడు రెండు రోజులు వాయిదా వేసాడు
   
తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది
సర్పంచ్:ఇప్పుడు ఆ  ఇంగ్లీష్ డైలోగ్ అర్ధం చెబితే మీరు ఇద్దరూ కలిసే ఉంటారు కదా
spectator:DDLJ సినిమా అంతా చూసి అమ్రిష్ పురి కి కాజోల్ ఏం అవుతుందో అడిగాడంట..నీలాంటోడే
సర్పంచ్:నాకు హిందీ రాదు మరి
spectator:అన్నా నువ్వు ఫుల్ form లో ఉన్నావ్..ఈ రోజు నీ తీర్పు మన గ్రామ చరిత్ర లో లిఖించ దగ్గ రోజు లా ఉండి నువ్వు తగ్గొద్దు.. కుమ్మేసేయ్ అని రెచ్చగోట్టేసరికి..
సర్పంచ్:మన గ్రామ చరిత్ర లో ఎన్నడూలేని విధంగా గ్రామర్ దోషాలు లేనట్టువంటి నోటితో తీర్పు సెలవిస్తున్నాను కాచుకోండి..
spectator:రెండు రోజులు ఇంట్లో కూర్చొని నువ్వు చేసిన పని అదా

తీర్పుకి సమయం ఆసన్నమయ్యింది జనసందోహం లో శబ్దం నెమ్మదిగా తగ్గుతోంది గెంజ్ డ్రాప్ సైలెన్స్ గా ఆ  వాతావరణం తయారయ్యింది

సర్పంచ్:ఇది ఒక ముఖ్యమైన తీర్పు.అయితే రాయుడి భవిష్యత్తు ని  దృష్టిలో పెట్టుకొని దీన్ని మన పిడుగు రాయుడు కి ఈ తీర్పు చెప్పవలసింది గా గ్రామ పెద్దగా సెలవిస్తున్నా!
రాయుడు:నేను చెప్పవలసింది అని ఏంటి ? చెప్పవలసింది కాదు నీకు బలిసింది అది నాకు తెలిసింది

సర్పంచ్:నిజాన్ని గ్రహించావు.. సంతోషం.. తగువు ఆపి తీర్పు చెప్పి నీ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చెయ్యు
రాయుడు:వార్నీ..నా భవిష్యత్తు కోసం ఈ భార్యా భర్తల భవిష్యత్తు నాశనం చెయ్యాలా..
సంధ్య:(చీపురు కట్ట పట్టుకొని) ఉరేయ్ రాయుడు నాకు తెలియకుండా ఈ ఉజ్వల ఎవర్రా,నరికేస్తా %^&^&^&
spectator:సంధ్య, చీపురు కట్టతో నరికేయడం ఏంటి చీప్ గా!..డైలోగ్ మార్చు బాలేదు
సంధ్య:నా డైలోగ్ లో ఎటువంటి మార్పూ ఉండదు మైల్డ్ స్టీల్ బార్స్ తో తయారుచేసైనా సైనా లెక్కన ఒక్క స్మాష్ కొట్టి  అయినా నా మాట నిలబెట్టుకుంటా

రాయుడు:relationship between wife and husband should be like fish and water,not like fish and fisherman
ప్రజలు:వహ్వా వహ్వా..విజిల్స్ కేకలు జై రాయుడు,రాయుడి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని ప్రజలు హోరున నినాదాలు చేస్తున్నారు,ఇంకో వైపు ఉజ్వల ఎవరో తెలియక సంధ్య ఆర్తనాదాలు చేస్తోంది
సర్పంచ్:సబాష్ రాయుడా!.. పంచ,పంచ్ లేనివాడు సర్పంచ్ కాదని నిరూపించావ్.

spectator:ఊ ఊ.. నువ్వు కేకంతే.. సరే డైలాగ్ కి అర్ధం చెప్పు వీళ్ళిద్దరూ కలిసిపోతారు..
రాయుడు:రిలేషన్ షిప్ అనేది చాలా ముఖ్యమైనది.అది షిప్ కి నీరు కి ఉన్నంత రక్త సంభందం ఉంది.
ప్రజలు:బిగ్గరగా చప్పట్లు, రాయుడి ఒక మహనీయుడు కాబోతున్న క్షణం రాబోతున్న సమయం లో
సర్పంచ్:(మధ్యలో అందుకొని)మన గ్రామ బాష లో చెప్పాలంటే రిలేషన్ అనేది రేషన్ కార్డ్ లాంటిది భార్యా భర్తలకి ఒకటే కార్డ్ ఉండాలి కాని బోగస్ కార్డులను వాడితే మోసపోయేది మనమే.

ప్రజలు:మరి ఫిష్ చేప అని కూడా ఉంది దాని అర్ధం ఏంటి?
సర్పంచ్:బోగస్ కార్డులు వాడితే వాళ్ళ బతుకు చేపల వాసన వచ్చి,జీవితం నీరు లేని చేపలా ఎండగట్టుకు పోతుంది.
ప్రజలు:కాసేపటికి ఆ  ప్రదేశం అంతా కర కర 'థూ' ల ధ్వనులతో మారుమోగిపోయింది.

ఇటువంటి తీర్పు చెప్పి మన గ్రామ పరువును బ్రష్టు పట్టిస్తున్న వీడిని తిట్టి వదిలకూడదు చెప్పు తీసుకొని కొట్టాలి అని ఊర్లో ఉన్న చెప్పుల షో రూమ్ వాడు లేచి అరవడం తో జనాలు చెప్పులకు పని కల్పించారు.

ఈ గ్రా'మయ' సభలో గ్రాము పరువు కూడా మిగల్చకుండా చేసిన గ్రామస్తుల కు తగిన సమాధానం చెప్పాలని సర్పంచ్ బాగ్ సర్దుకొని బస్టాండ్ కి బయలుదేరాడు.

రాయుడు పరుగులేట్టుకుంటూ బస్టాండ్ చేరాడు.ఆయాసం తో  వచ్చి సర్పంచ్ ఉన్న బస్ లోకి వెళ్ళాడు
రాయుడు:సర్పంచ్ గారు..ఆగండి!
సర్పంచ్:రా రాయుడా..రా! వెళ్ళే ముందు నీతో మాట్లాడాలి..వెళ్ళిపోతున్న కదా..ఇప్పుడు నీకేం అనిపిస్తోంది
రాయుడు:అలిసిపోయి వచ్చాను సర్పంచ్ గారు..బాగా దాహం వేస్తోంది..వీలయితే ఒక మినెరల్ వాటర్ బాటిల్ కి డబ్బులివ్వండి

సర్పంచ్: కండక్టర్ గారూ ఇంకా ఎంత సేపు లో ఈ బస్ బయలుదేరుతుంది
బస్ కండక్టర్:మరో పది నిమిషాలు
సర్పంచ్: రాయుడా..ఇలా రా! వెళ్ళే ముందు నా పక్కన కూర్చో కాసేపు

రాయుడు:మహాభాగ్యం సర్పంచ్ గారు..ఇంత పెద్ద బ్యాగ్ వేసుకోచ్చారు ఎన్ని రోజులు లో తిరిగి వచ్చేందుకు
సర్పంచ్:పద్నాలుగు సంవత్సరాలు

రాయుడు:మేము ఏం అయిపోవాలి..అన్ని సంవత్సరాలు మీరు వెళ్ళిపోతే అంటూ గ్లిజరిన్ లేక గెంజన్నం తో పాటు మిగిలన పచ్చి మిర్చి ని కళ్ళ దగ్గర  రాసుకుని రోదిస్తున్న రాయుడి ని చూసి .
సర్పంచ్:ఆపు నీ అధిక ప్రేలాపన..వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు, మళ్ళీ నీ 24 వ ఏట ఈ ఊర్లో అడుగు పెట్టు.
అని చెప్పి  బస్ డోర్ లాక్ చేసి సర్పంచ్ బస్ దిగి వెంటనే

Attention everybody నేనొస్తున్నా, be ready నేనే మహారాజు.. నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి.పరిష్కారం చెప్పేస్తా ఫస్టు. తీర్పు కి  పట్టిస్తా నే బ్రష్టు.  అని డాన్సు చేస్తున్నాడు సర్పంచ్. ఇదంతా బస్సు అద్దం లో చూస్తున్న రాయుడు


రగులుతోంది ప్రతీకార పగ..బుస్స్ బుస్స్..
సర్పంచ్ గాడి ఆధిపత్యపు సెగ
చెప్పేస్తాలే.. ఏ ఏ.. నే తీర్పు చెప్పేస్తాలే ..

పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.రాయుడి భాగ్యనగర వాసం ముగిసింది.అప్పటికే  తను సంజీవయ్య పార్క్ MMTS లో ఉద్యోగం సంపాదించి విజయ గర్వం తో అంతకంటే ఎక్కువ తీర్పు చెప్పడానికి ఉత్సుకతతో ఊరికి చేరాడు

బస్సు దిగిన వెంటనే

whats happening here
there is no cleanliness..you have to visit Sanjeevayya park once in your life to know how to keep the things proper.అని ఇంగ్లీష్ లో అనర్గళం గా మాట్లాడేసరికి ప్రజలంతా నోళ్ళు వేల్లబెట్టుకొని


రాయుడా రాయుడా ఒక్క సారి ఆ  ఫిష్ డైలాగ్ చెప్పు అని ముక్త కంఠంతో అరిచేసరికి
రాయుడు: the difference between fish and fisherman is man.fish adds beauty to the park and with out water it wont survive. fishing is injurious to mind. fishing is not allowed in our Sanjeevayya park. it will be green as usual lika a beautiful visual.

చాలా బావుంది. దీని అర్ధం ఏమిటి ?
సంధ్య: usual,visual అని అంటున్నావు  ఏంటి అంటే దీనర్ధం ఉజ్వల హైదరాబాద్ లో ఉందనే కదా  ? వా..ఆ  ఆ  ఆ..  నాకు ద్రోహం జరిగిపోతోంది కాపాడండి

ఇవేమీ పట్టించుకోకుండా రాయుడు తన ఇంటివైపు నడవడం మొదలెట్టాడు.రాయుడు అప్పుడే ఇంట్లో అడుగు పెడుతుండగానే ఈ ఇంటిలో అడుగు పెట్టొద్దు అని గట్టిగా రాయుడి పేరెంట్స్ తిట్టేసరికి ఒక ఉద్విగ్న భరితమైన వాతావరణం చోటు చేసుకుంది
రాయుడు:ఏం అయ్యింది నన్ను ఎందుకు మీరు లోపలకి రావడం రానివ్వడం లేదు..నేనేమైనా తప్పు చేసానని భావిస్తున్నారా
పేరెంట్స్:ఏం చెప్పమంటావు రాయుడా..ఎన్నడూ లేదు మన ఇంట్లో నిన్న రాత్రి నుండి సర్పాలు సంచరిస్తున్నాయి
రాయుడు:ఎందుకలా..

సర్పంచ్:నువ్వు వచ్చావని పశు పక్షాదులు పరవశించి పోతున్నాయి అనుకుంటా
spectator:ఏయ్!..సర్పంచ్ సర్పం పశువు ఎట్లా అవుతుంది? సర్పంచ్ గా నువ్వు వేస్ట్
ప్రజలు:అవును వేస్ట్ వేస్ట్ వేస్ట్..రాయుడే మన ఊరికి నిజమైన సర్పంచ్
సర్పంచ్:నేనొప్పుకోను..ఈ ఊరికి lifetime సర్పంచ్ ని నేనే ఇందులో ఏ మార్పు లేదు  సరే మీ ఇంటిలో ఉన్న మూడు పాములను వెళ్ళ గొడితే నేను సర్పంచ్ గా తప్పుకుంటా
ప్రజలు:ఇది అన్యాయం

రాయుడు వెంటనే తన laptop తీసుకొని ఇంకా డేటా కార్డ్ తీసి యూట్యూబ్ కి connect చేసాడు.సర్పంచ్ సూటిపోటు మాటలను రాయుడు పై సంధిస్తున్నాడు
laptop ఎందుకు తీసావ్ రాయుడా నేను నవ్వలేక చస్తున్నా నీ అయోమయం ని చూసి.. పాముని చంపాలంటే కావాల్సింది కర్ర హ హ హ..అని బిగ్గరగా నవ్వడం మొదలెట్టాడు

రాయుడు వెంటనే మొగలిపూలు images డౌన్లోడ్ చేసి డెస్క్టాపు వాల్ పేపర్ గా పెట్టి
ఇంటికి బయలు దేరేముందు స్ప్రే అయిపోవడం తో పార్క్ కి కొట్టాల్సిన ఎరువుల పిచికారీ ని నింపుకొని axe బాటిల్స్ తో దిగడంతో  .రాయుడు స్ప్రే కొట్టేసరికి పాములన్నీ స్క్రీన్ దగ్గర కి చేరాయి.వెంటనే youtube లో  హిస్స్ trailerచూపించడం తో మూడు పాములు keyboard కి  బుర్ర బాదేసుకొని అక్కడిక్కడే మృతి చెందాయి.
రాయుడు సర్పంచ్ తో: పాముని చంపాలంటే కావాల్సింది కర్ర కాదు బుర్ర

సర్పంచ్:ఇది అన్యాయం,జీవ హింస మహాపాపం,సర్పంచ్ ని నేనే!.. కావాలంటే నీకు సబ్ సర్పంచ్ పదవిస్తా తీసుకో
రాయుడు:అసలు మా ఇంట్లో మూడు పాములున్నాయి అని ఎలా తెలుసు నీకు!.. అని సర్పంచ్ ని దోషి గా నిరూపించాక
రాయుడు లోని పరిణితి ని చూసి ఆ  గ్రామం పులకించిపోయింది ..సర్పంచ్ కి సలసలాకాగిపోయింది.

పాత సర్పంచ్ ని ఏకి పారేసి కొత్త సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాయుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.న్యూస్ చానెల్స్ కూడా గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్ళిపోవడం రాయుడు ఇమేజ్ ప్రపంచ వ్యాప్తం గా పాపులర్ అవ్వడం తో అందరి సమస్యలను పరిష్కరించడానికి  ఫోన్ లైన్  తో పాటు ఈ-మెయిల్ కూడా వినియోగించుకోవాల్సింది గా ప్రజలకు విజ్ఞప్తి చేసాడు.

రచ్చ బండ ని రచ్చ రచ్చ చెయ్యడానికి విచ్చేస్తున్న రాయుడు లాంటి ఆయిల్ ప్రింట్ పోస్టర్స్ తో ఆ  ప్రాంగణం అంతా కళకళ లాడించారు రాయుడి అభిమానులు .

మొదట తను గ్రామ సమస్యని పరిష్కరించడానికి పూనుకొని ఆశీనుడై సీన్ లో సీరియస్ గా involve అయ్యాడు
రాయుడు:చెప్పండి సమస్య
గ్రామ బంట్రోతు:సభకి నమస్కారం i my self భైరవ, బంట్రోత్ and assistant to సర్పంచ్
 విషయం ఏంటంటే అనే లోపు ఫోన్ మోగింది.
సర్ నేను డైరెక్టర్ UV.కెరటం ని మాట్లాడుతున్నాను సార్
రాయుడు:నమస్కారం, మీరు తమిళ్ లో సినిమా తీసి దాన్నే మలయాళం తెలుగు లో తీసే దర్శకులు కదూ

మీరు టాలీవుడ్ లో ఒక్క హీరో కే పరిమతమవ్వడానికి కారణం
దర్శకుడు:అదేం లేదు,ఇక్కడైతే ఒకే స్టొరీ ని రెండు సార్లు మార్చి మార్చి చెప్పేస్తే కొనే హీరో ఉన్నంత వరకు నా కెరియర్ dhl కొరియర్ అంత సేఫ్ గా ఉంటుంది.

మా హీరో జీవితారాజ్ నటించబోయే అరిటాకులు అనే  సినిమా కి స్క్రిప్ట్ రడీ చేసుకున్నాం సార్.
గ్రామ సభల్లో కూడా మీ ప్రమోషన్ ఆపరా..ఎంత తీసుకున్నారు సర్పంచ్ గారు ఈ చిత్ర unit దగ్గర నుండి
సర్పంచ్:నాకేం తెలీదు

ఈ సినిమా లో మా హీరో జీవితారాజ్ చాలా చలాకీ యువకుడు
ఆ  చలాకీ తనం తట్టుకోలేక హీరోయిన్ నేనాజాస్మిన్ పడిపోతుంది తర్వాత తెలిసేది ఏంటంటే తను  హీరో కి చెల్లి అవుతుంది అని. సెకండ్ హాఫ్ లో సర్పమణి  కూడా జీవితారాజ్ ని లవ్ చెయ్యడం మొదలెడుతుంది క్లైమాక్స్ ముందు వాళ్ళ అన్నయ్య అని తెలుసు కుంటుంది.క్లైమాక్స్ ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు మీరే తీర్పు చెప్పి మా సినిమాను ఆదుకోండి.


సర్పంచ్ రాయుడు:సినిమాలో మీ ఇష్టం వచ్చ్సినట్టు ఆడుకోవడం ఇప్పుడు నా దగ్గర కి వచ్చి ఆదుకోమనడం ..బేష్
సరే solution వినండి
వీరి ముగ్గురిని సంజీవయ్య పార్క్ కి తీసుకొని చిత్రీకరించండి.పార్క్ కి ఆదాయం లేక ఖజానా ఖాళీ అయ్యింది.మా సర్పంచ్ తో డీల్ కుదుర్చుకొని కొన్ని అరిటాకుల సెట్టింగ్ వేసి  ఆ అరిటి చెట్టు వెనుక పాములు దాచిపెట్టి క్లైమాక్స్ లో   మీ హీరో ని చంపేయండి.ఆ  సినిమా  ఖచ్చితం గా  ఫ్యామిలీ audience ఆదరిస్తారు.అరిటాకు నుండి పాము వచ్చ్చి పోదిచేయడం వాళ్ళ మీ సినిమాకు టైటిల్ కూడా justify అవుతుంది.ఇదే ఈ రాయుడి తీర్పు

డైరెక్టర్ సర్పంచ్ కి పారితోషకం ప్రకటించాడు.ప్రజలకు రాయుడు పార్టీ ని ప్రకటించి పండగ చేసుకోమన్నాడు.

ఇంకొకసారి ఒక అమ్మాయి దగ్గర నుండి రాయుడు కి ఫోన్ వచ్చ్సింది
రాయుడు గారు నేను చాలా కష్టాల్లో ఉన్నాను మీరే నా సమస్య ను పరిష్కరించాలి
రాయుడు:లీగలా ,క్రిమినలా,ఈగలా,క్రిములా..ఏ కోవలోనికి వస్తుందో తెలుసుకోవచ్చా

అమ్మాయి:సార్, నాకు చాలా abusing ఫోన్ కాల్స్ ఇంకా భరించలేని SMS లు పంపిస్తున్నారు కొంతమంది.నాకు చాలా irritating గా ఉంది.ఇప్పుడు నేనేం చెయ్యాలి 
రాయుడు:ఓస్ ఇంతేనా..! నా బాధ ఎవడితో చెప్పుకోమంటావు.తీర్పు కోసం ఫోన్ నెంబర్ ఇస్తే తీర్పు కోసం నా తాట తీస్తున్నారు. వాడెవడో ప్రవాసాంధ్రులు అంట నాకు రాత్రి అయితే వాళ్లకు పగలవుతుందినాకు నిద్ర లేకుండా పగులుతుంది.దీనికంటే irritation ఆ  నీది.

అమ్మాయి:నాకు అదంతా తెలియదు.నాకు న్యాయం కావాలి
బంట్రోతు:వెల 75 రూపాయిలు..షాలిమార్ వీడియో ద్వారా విడుదల బషీర్ బాగ్,హైదరాబాద్
సర్పంచ్:సర్పంచ్ నువ్వా నేనా!..నోరుముయ్య్
అమ్మాయ్!  నువ్వు వెంటనే చెయ్యాల్సింది laughter challenge లాంటి ప్రోగ్రామ్స్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ  మెసేజ్ లను ఫార్వార్డ్ చెయ్యు. అక్కడ ఇలాంటి మెసేజ్ లకు బాగా డిమాండ్ ఉంది .నీకు పేరు తో డబ్బు కూడా వస్తుంది.ఇకనుండి నీకు మెసేజ్ లు వచ్చేటప్పుడు నువ్వే అంటావు.. ప్లీజ్! ఇంకా పంపండి ప్లీజ్ అని ..

మళ్ళీ దద్దరిల్లింది చప్పట్లతో..

ఆ  రోజు గ్రామ సభ ముగుస్తోంది అనే సమయం లో ఫోన్ మోగింది..
ఒక చిన్న అమ్మాయి గొంతుతో
రాయుడు  అంకుల్..రేపు మాకు exam ఉంది నా బుక్స్ అన్నీ దారిలో పారేసుకున్నాను.రేపు నేను ఫెయిల్ అవుతాను తప్పకుండా..తలచుకుంటేనే నాకు ఏడుపు వస్తోంది.. ఇప్పుడు ఏం చెయ్యాలి..వా ఆఆ ..
సర్పంచ్:ఎదవద్దు..రాయుడు ఉండగా నీకేల భయం.. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా మరి
బాలిక:ఉన్నాయి అంకుల్

సర్పంచ్:వెంటనే బుక్ సెంటర్ కి వెళ్ళు,
బాలిక:నేను ఇప్పుడు బుక్ సెంటర్ నుండే మాట్లాడుతున్నాను.షాప్ లో ఉన్న వాడు బుక్స్ ఇవ్వనంటున్నాడుపుస్తకాలు.స్టాక్ లేదు అని చెబుతున్నాడు
సర్పంచ్:సరే లౌడ్ speaker ఆన్ చెయ్యు , ఏమయ్యా!.. మీ దగ్గర స్టాక్ లేదా?

షాప్ ఓనర్:లేదు సర్, ఎనిమిదో తరగతి పుస్తకాలు అన్నీ అయిపోయాయి ప్రస్తుతం ఒకటి నుండి అయిదవతరగతి వరకు మాత్రమే పుస్తకాలు ఉన్నాయి
సర్పంచ్:అమ్మాయ్! నువ్వు ఎనిమిదో తరగతా
బాలిక:అవును అంకుల్,రేపు 8th maths ఎక్జాం ఉంది.
సర్పంచ్: ఏ షాప్ ఓనర్, ఆ  అమ్మాయికి  రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు ఇవ్వవయ్యా .problem solved . all the best

-----------------------------------------------------------------------------------------

హెయ్ నే పేటెంట్ పురం పిడుగమ్మో.. నా దిల్ కి ధడకన్ సంధ్యమ్మో ||2||
గ్లోబల్ లీడర్ నేనమ్మో .. అరె సర్పంచ్ కి నేనంటే హడలమ్మో..

తీర్పు లు కోసం వచ్చారంటే తాటే తీస్తనమ్మో..ఓయ్‌ చేపలు పట్టే చిన్నమ్మో..
ఫిషర్ డైలోగ్ విన్నాక ఉన్నావంటే నిన్ను కింగ్ ఫిషేర్ ఎక్కిస్తానమ్మో..

ఏయ్ సంజీవయ్యా పార్కమ్మో ..రాయుడు బాబాయ్ MMTS
పార్కర్ పెన్ లా షార్పమ్మో..రాయుడు బాబాయ్ MMTS

ఏయ్ సంజీవయ్యా పార్కమ్మో..నే పార్కర్ పెన్ లా షార్పమ్మో
సర్పం గాని సర్పంచ్ గాని చర్చ కొస్తే చాలు రచ్చ రచ్చమ్మో.. (కోరలు&కోరస్):నీపేరేందబ్బాయా

రా...రా...రా...రా...రాయుడు బాబాయ్..రాయుడు బాబాయ్
రాయుడు బాబాయ్..రాయుడు బాబాయ్ MMTS ...రాయుడు బాబాయ్ MMTS ||3||

శిశువు  పుట్టగానే అమ్మా అని పిలుస్తుంది.రాయుడు పుట్టగానే ఆనా..ఆనా.. అని అరిచాడు తీర్పు చెప్పే లక్షణాలువాడికి పుట్టుకతోనే వచ్చింది  అని నిర్ధారించుకున్నాక  ఆ  గ్రామం రాయుడి తీర్పులతో  మూడు చర్చలతో  ఆరు రచ్చ లతో సుభిక్షంగా వర్ధిల్లింది.
Mal & Cobb కధలలో  రాయుడు బాబాయ్  MMTS అనే అంకము సమాప్తం.

342 comments:

«Oldest   ‹Older   201 – 342 of 342
మనసు పలికే said...

Congrats Krishna..:)

Anonymous said...

@singamala ramesh gaaru

4 pichollu kada..

pavan, mahesh, guna sekhar, surya

---
taara.

నేను said...

!@#$%#$%$%^&^&(&**&($@$!!@#$@#

(నిరసన అన్నమాట)

నేను said...

@Taara,

marchipoyinatlunnaaru, kadhallo hero common, vilans maarutuntaaru.

హరే కృష్ణ said...

నేస్తం అక్కా
అంతా భగవంతుని దయ, మీ ఆశీర్వాదం.
నా పోస్ట్ కి సార్ధకత చేకూరింది మీ కామెంట్ వచ్చాక
ఇక్కడ ఎవరో నన్ను కొట్టడానికి వచ్చేస్తున్నారు..తర్వాత చెబుతానేం :)

హరే కృష్ణ said...

రెండు రోజుల్లో..రెండొందల కామెంట్లు..కేకో కేక
నాకు మాటలు రావడం లేదు..కీ బోర్డు మీద చేతులు పనిచేయడం లేదు
మరి రాయుడి ని మించిపోయి మరీ రచ్చ చేస్తే ఇంక సౌండ్ ఎలా ఉంటుంది.. :)
కుమ్మేసారంతే :))

రెండు వందల చేసిన ఈ సందర్భం గా నాకు రొంబ సంతోషముగా ఉంది..మీ అందరికీ అపర్ణ ఇవ్వబోయే బాకీ పార్టీ ని రెండు సగాలుగా పంచి మరీ రెండు పార్టీలు ఇస్తానని మనవి చేసుకుంటున్నాను

నేను said...

అంటే నువ్వు కూడా పార్టీ మెయిల్ లో అంపుతావా?

హరే కృష్ణ said...

అపర్ణ నువ్వు రెండు వందలు చేసినందుకు ప్రత్యేక ఆభినందనలు
ఈ సందర్భంగా ఇంకో పార్టీ బాకీ ఉన్నావనిని మనవి చేస్తున్నాను..
ఈ పార్టీ కి సాయి ప్రవీణ్ ని నాయకత్వం వహించవలిసిందిగా అభ్యర్ధిస్తున్నాను..కలెక్షన్ నాగార్జున చూసుకుంటా అని ఒక సారి చెప్పాడు ..
మొగలి పువ్వుల సువాసన సమక్షం లో పార్టీ జరగబోతుందని విజ్ఞప్తి చేస్తున్నాం..ఇరవై రూపాయిలు మాత్రమే ఒక పువ్వు..డెడ్ చీప్ అని వేగుల ద్వారా సమాచారం తెలిసింది
బద్రి గారు స్విస్స్ నుండి మొన్న మొదటి కామెంట్ కొట్టిన సందర్భంగా పార్టీ కి Swiss దేశపు ప్రఖ్యాతి గాంచిన రేసిపే లు తీసుకొస్తారు

వేణూరాం,బద్రి,నేను ఫొటోస్ తీసుకొని ఫోటో బ్లాగ్ లో upload చేసి మరో century కొట్టుకుంటాం :)

హరే కృష్ణ said...

బద్రి పార్టీ తాజ్ బంజారా లో..
తార గారి సమక్షం లో వివరాలకు మనసు పలికే పాత టపాలు తిరగెయ్యాలి

నేను said...

పార్టీ కి Swiss దేశపు ప్రఖ్యాతి గాంచిన రేసిపే లు తీసుకొస్తారు //
తప్పకుండా తీసుకొస్తా. మీ కోసం ఆ మాత్రం చెయ్యలేనా ?
(స్వగతం : హమ్మయ్య, ఇన్నాళ్ళు ఈ ఫుడ్ కి నేనే బలయ్యాను ఇప్పుడు ఇంకొంత మందిని బలి చెయ్యొచ్చు)

హరే కృష్ణ said...

బద్రి మనం ద్రవపదార్దాల ను మాత్రమే పార్టీలో తీసుకొని
ఈ రేసిపే లు వీళ్ళకు ఇచ్చేద్దాం డీల్ ఓకే నా :)

నేను said...

గట్లెట్లయితది. మాటంటే మాటే.
నేను జింజర్ గార్లిక్ రవియోలి తేవాలే నువ్వు తినాలే.
అప్పుడు నీ మొహమ్ నే చూడాలే. ఊహహహ..

హరే కృష్ణ said...

అలా యితే నా దగ్గర బేసి బెల బాత్ అనే భయంకరమైన వంటకం ఉంది..భాష్ప వాయువు ప్రయోగిస్తే గాని మామూలు మనుషులవ్వరు

రాజ్ కుమార్ said...

అలా యితే నా దగ్గర బేసి బెల బాత్ అనే భయంకరమైన వంటకం ఉంది..భాష్ప వాయువు ప్రయోగిస్తే గాని మామూలు మనుషులవ్వరు
kevvvvvvvvvv

రాజ్ కుమార్ said...

Congrats aparna...Daggarundi 200 kottinchav..:)

నేను said...

వేణు,
నిన్నేదో చిన్న చిన్నవి వద్దు ఏకంగా 200 కొడతా అన్నావు. ఇప్పుడు తీరిగ్గా వచ్చి కంగ్రాట్స్ చెప్తున్నావా ?

..nagarjuna.. said...

ఉష్షో ఉష్షో ఉష్షో......అప్పుడే ఐపోయాయా....200స్కోరు అప్పుడే దాటిందా...ఇలాంటి పెద్ద పెద్ద పనులకి నాలంటి పెద్దవాళ్లను పిలవాలనే ఆలోచనకూడా లేదే మీకు...అస్సలు భయంలేకుండా పోయింది. సరే ఆ పార్టికేదో వస్తారుగా...వచ్చేప్పుడు తలా ఓ వెయ్యి రూపాయలు ఎంట్రి ఫీజుకింద నాకు సమర్పించుకోండి (బంగారు మామిడిపళ్ల కోసం వాతల లాగ). hard cash ఇచ్చినా online transfer చేసినా ok... :)

శరత్ కాలమ్ said...

ఇంత పొడవు టపాలు ఎలా వ్రాస్తారండీ బాబూ. ఒక క్వార్టర్ మాత్రం లాగించాను. అప్పటివరకయితే బావుంది.

మంచు said...

>>>ఇంత పొడవు టపాలు ఎలా వ్రాస్తారండీ బాబూ. >>>
శరత్ గారు.. మీరు ఇంతపెద్దవి రాయొచ్చు.... మీరు రోజుకి రాసే నాలుగు పొస్ట్లు కలిపి ఒకే పొస్ట్ గా వెయ్యండి..ఇంతకన్నా పెద్దది అవుతుంది :P

మనసు పలికే said...

ఇక్కడ నాకు పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా లేకపోయినా గానీ, బద్రి గారిని క్షమార్పణ అడగాల్సిన అవసరం మాత్రం ఉంది.. లేకపోతే ఇలాగే నిరసన కంటిన్యూ చేస్తారు..:( బద్రి గారు, నా శాయశక్తులా నేను ట్రై చేశానండీ, 200 చెయ్యకుండా ఉండాటానికి.. కానీ ఆ భగవంతుడే నా చేత దగ్గరుండి గుఱ్ఱం పరుగులు(L shape లో) తీయించాడు..:)

మనసు పలికే said...

కృష్ణ, బద్రి గారు, ఏంటి ఆ రెసిపీల విషయంలో మీరు ఏదేదో కుమ్మకై మిగిలిన వారి ప్రాణాలతో చెలగాటాలాడబోతున్నట్లు తెలుస్తుంది.. అయ్.. ఎంత ధైర్యం.. ;)

వేణురాం.. ధన్యవాదాలు..:) ఏదో అలా కుదిరేసింది, ఆ భగవంతుడి దయ వల్ల..:))

నాగార్జున, నువ్వు నన్ను కాదుగా అనేది..? అంటే అక్కడెక్కడో (నీ బ్లాగులో), నువ్వు నాకే సపోర్ట్ అని చెప్పినట్లు గుర్తు.. ;)

శ్రీనివాస్ పప్పు said...

ఏంటి ఆ పోస్టేంటి ఈ కామెంట్లేంటి నాకేమర్ధం కావట్లేదబ్బాయా హరిక్రిష్ణా.రెండు కలిపి చదివేటప్పటికి నా జీవితంలో మిగిలిన కాలం అయిపోయేట్టుందయ్యా(కానీ నవ్వుతూనే అయిపోద్దిలే).

"హిలేరియస్" ఈ ఒక్క పదమే నాకు ఇంగ్లీష్ లో ఈ పోస్ట్ బాగుందని చెప్పడానికి తెలిసున్నది.తెలుగులో బావుందని చెప్పడానికి నేనేమీ శింగనమల రమేష్ ని కాదు కదా మరి అదీ సంగతి.

హరే కృష్ణ said...

మంచు గారు,శరత్ గారు ధన్యవాదాలు :)
శ్రీనివాస్ పప్పు గారు అంతా మీ అభిమానం
పోస్ట్ కంటే కామెంట్స్ బాగా ఎంజాయ్ చేసాను నేను కూడా:)

హరే కృష్ణ said...

తార గారు,బద్రి,అపర్ణ ,నాగార్జున,వేణూరాం,3g,సాయి ప్రవీణ్,శివరంజని ప్రియ మిత్రులందరికీ ప్రత్యేక,పబ్లిక్ మరియు ప్రైవేటు ధన్యవాదాలు :))

ప్రియ ఎవరో నాకు తెలీదు..మళ్ళీ అడగొద్దు..సరేనా!

నేను said...

అపర్ణ, నేను మిమ్మల్ని శమించేశాలెండి.
కాకపోతే నేను తీసుకొచ్చిన స్విస్ ఫుడ్ మాత్రం మీకే ముందు పెడతా :P

క్రిష్ణా, నీకు తెలియడం లేదు నేను చెప్పేది బిసిబేళా బాత్ కి మామ్మ లెక్క. దాని దెబ్బకి కేంటీన్‌లో తింటే కంపెనీ వాడు రి-ఇంబర్స్ చేస్తాడు అని తెలిసినా మొదటి రోజు సాయంత్రమే అన్నం వండుకోవడం మొదలుపెట్టా.

మనసు పలికే said...

కృష్ణ..హహ్హహ్హా.. నీ పబ్లిక్, ప్రైవేట్ మరియు ప్రత్యేక ధన్యవాదాలకి నా ప్రతి ధన్యవాదాలు..( మూడు రకాలుగానూ..)

బద్రి గారు.. అలా అయితే నేను పారిపోతానోచ్.:)

karthik said...

ఏంటీ టపాలు, ఏమిటీ కామెంట్లు? ప్రపీససకు పోటిగా నిలబడాలని ప్రయత్నిస్తున్నారా?? :D
రికార్డులు చేసినా మేమే, అవి తిరగరాయాలన్నా మేమే. :P
మా కామెంట్స్ రికార్డ్ 1160.. అది కూడా ఆ రోజు మా ఆక్టివ్ మెంబర్స్ లో కొందరు సరిగా పాల్గొనలేదు.. ఏ బ్లాగులో ఐనా ఎవరైనా అది బీట్ చెయ్యడానికి ట్రై చెయ్యొచ్చు.. బస్తీ మే సవాల్!

గుణశేఖర్ said...

నాకేవీ ధన్యవాదాలు??

దర్శకరత్న said...

ఇక్కడ ఎవరో కర్రెద్దు మొహం అంటే ఏమిటో అడిగారు .. వారి కోసం..

http://www.google.co.in/imgres?imgurl=http://www.telugu9x.com/admin/uploads/gunashekarp51275497683.jpg&imgrefurl=http://www.telugu9x.com/enews.php%3Fsid%3D474%26pid%3D44%26start%3D420&usg=__jXJhDQdXW5AyrWXP-oHtaWQII4o=&h=354&w=300&sz=56&hl=en&start=201&sig2=ztb-SVUU96uTdYoZ3XUcOQ&zoom=1&tbnid=0XarGwCi9MiPBM:&tbnh=162&tbnw=169&ei=APDLTIz-GoSovQO8oMgZ&prev=/images%3Fq%3Ddirector%2Bguna%2Bsekhar%26hl%3Den%26biw%3D1360%26bih%3D667%26gbv%3D2%26tbs%3Disch:10,6358&itbs=1&iact=hc&vpx=323&vpy=174&dur=2868&hovh=244&hovw=207&tx=98&ty=86&oei=hO_LTLKRLoGkuAOdxN3HDw&esq=12&page=12&ndsp=18&ved=1t:429,r:13,s:201&biw=1360&bih=667

Sai Praveen said...

హరే కృష్ణ,
నీ అభ్యర్ధనను ఆనంద పూర్వకంగా అంగీకరించడమైనది. పార్టీ కి నేను నాయకత్వం వహించెదను.
అపర్ణ,
నువ్వు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసెయ్యి. మిగతా తతంగం నేను చూసుకుంటాను :)

3g said...

పార్టీనా... ఎవరిస్తున్నారు, ఎప్పుడిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు. ఎవరొస్తున్నారు, ఎపుడొస్తున్నారు, ఎలావస్తున్నారు. హోస్టెవరు, ఘోస్టెవరు, గెస్టెవరు.

మనసుపలికేగారెక్కడున్నా వచ్చి పై వివరాలు క్లారిఫై చెయ్యాల్సిందిగా కోరుతున్నాం.

రాజ్ కుమార్ said...

3G ఇక్కడ కామెంట్ పెట్టిన వాళ్ళందరూ ఆహ్వానితులే ..

రాజ్ కుమార్ said...

సాయి... ఇంతకీ పార్టీ ఎక్కడ??

Anonymous said...

ఏం పార్టీ?? టీ పార్టీ నా? తిండి పార్టీ నా?? మందు పార్టీ నా???

బాలకృష్ణ said...

తెలుగుదేశం పార్టీ..

రవిబాబు said...

ఇక్కడ ఎవరో నా సినిమా గురించి మాట్లాడుతున్నారు... దొంగలు పడ్డ ఆరు నెలలకి పోలీసు లొచ్చారన్నట్టు .. ఇప్పుడెందుకు ఆ పార్టీ గురించి??

మనసు పలికే said...

ఇక్కడ ఎవరో మనసు పలికే గారిని తలుచుకుంటున్నాను.. మనసు పలికే గారు ఇక్కడ లేరు. బద్రి గారి వ్యాఖ్య చూసి పరారీలో ఉన్నారు.. ఎవరికైనా వివరాలు కావాలంటే భద్రాచలం వెళ్లి తెలుసుకోగలరు..:))))
>>కాకపోతే నేను తీసుకొచ్చిన స్విస్ ఫుడ్ మాత్రం మీకే ముందు పెడతా :P

chandu said...

కార్తిక్ గారు.. ప్ర.ఫై.స.స నా??అదేం పేరు?? :) 1160.కామెంట్లా?? నేను నమ్మను.. లింక్ అమ్పండి ఓ లుక్కేస్తాను..

పకోడీ said...

పోస్ట్ చాలా బాగుంది హరేకృష్ణ గారు

బ్లాగుపాటి శ్రీను. said...

అసలేమిటీ గోలా? సైలెన్స్ ... స్టార్ట్ కెమేరా.. నా వీపు గోకరా.. ACTION...

..nagarjuna.. said...

కామెంటెట్టిన ప్రతొక్కళ్లకి పార్టి ఇస్తే ఇక ఇచ్చేవాళ్ల గతి జమ్మలమడుగు జాతరే.... :)

అయినా అపర్ణ నేను నిన్ను అన్నానని యేల అనుకొంటివి..చడీచప్పుడు లేకుండా 200 చేసి అందులో నా పాత్ర లేకుండాపోయింది అని నేను అవేదన పడితేను....


>>ప్రపీససకు పోటిగా నిలబడాలని ప్రయత్నిస్తున్నారా?? :D<<
ఎంతమాట ఎంతమాట కార్తిక్‌ భాయ్..., మావేవో రీమిక్స్ సినిమాలు పారెడి పాటలు. ఒరిజినల్ సినిమాకొచ్చేన్ని కలెక్షన్లు వస్తాయా అసలు..

మంచు said...

ఎవరిస్తున్నారు, ఎప్పుడిస్తున్నారు, ఎక్కడిస్తున్నారు. ఎవరొస్తున్నారు, ఎపుడొస్తున్నారు, ఎలావస్తున్నారు. హోస్టెవరు, ఘోస్టెవరు, గెస్టెవరు.
ఏం పార్టీ?? టీ పార్టీ నా? తిండి పార్టీ నా?? మందు పార్టీ నా???
---------------------------------
ఎదయినా నన్ను పిలవడం మర్చిపొవద్దు ....

3g said...

>>ఇక్కడ ఎవరో మనసు పలికే గారిని తలుచుకుంటున్నాను.. మనసు పలికే గారు ఇక్కడ లేరు. బద్రి గారి వ్యాఖ్య చూసి పరారీలో ఉన్నారు.. ఎవరికైనా వివరాలు కావాలంటే భద్రాచలం వెళ్లి తెలుసుకోగలరు..:))))

అయితే పార్టీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కోసం భద్రాచలంలో పెట్టారన్నమాట.

మనసు పలికే said...

అయ్యయ్యో.. అసలు నేనెవరో చెప్పడం మరిచాను కదూ.. కెమెరా మాన్ వెంకట్‌తో TV9 స్వప్న...:)

3g said...

వెరీ గుడ్ అయితే పార్టీ అంతా tv9 లో లైవ్ కవరేజ్ అన్నమాట.

రాజ్ కుమార్ said...

భద్రాచలం లొ బంపర్ పార్టీ. :)

ఓంకార్ said...

అర్రే .. హర్రేక్ర్రిశహ్న్న్నా .. ఎంత్త బగ్గా ర్రాసావ్వో తెలుస్సా...? అస్సలు..అస్సల్కి సూప్పేర్ ... సుందర్రం మాస్టర్ ... చెప్పండీ ... హర్రే ఎంత్త బగ్గా ర్రాస్సాడో..

సుందరం మాస్టర్ said...

కేక...కేఏఏఎక.... కేఏఏఏఎఆఅకా...

రాజ్ కుమార్ said...

250 naade..

హరే కృష్ణ said...

చూసారు కదండీ నేను రాసింది.. మీకు నచ్చినట్లయితే.. HARE KRISHNA అని టైపు చేసి స్పేస్ ఇచ్చి &#$&# ani raasli మీ ఇష్టమొచ్చిన నంబర్ కి పంపించండి.. plz vote for me.

karthik said...

చూసారు కదండీ నేను రాసింది.. మీకు నచ్చినట్లయితే.. HARE KRISHNA అని టైపు చేసి స్పేస్ ఇచ్చి &#$&# ani raasli మీ ఇష్టమొచ్చిన నంబర్ కి పంపించండి.. plz vote for me.

kevv boss ROFL

karthik said...

రాజ్ కుమార్ 300 నేనే కొడతాను.. ప్రపీసస పవర్ ఏమిటో బ్లాగర్లకు మరోసారి చూపించాలి..

karthik said...

వేణురాం,
ఉన్నావా??

రాజ్ కుమార్ said...

kaadu..kaddu.. adi kalalo maata...
300 naadi... wait & see...

karthik said...

అసలు పార్టీ ఎవరు ఎవరికి ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు?
ఇందులో ఎవరి హస్తం ఉంది? ఎవరి పాదం ఉంది? ఇంకెవరి తోకైనా ఉందా??

నాకు తెలియాలి తెలియాలి.. తెలిసి తీరాలి..

సిద్దార్ద్ . said...

కృష్ణ గారు.. నా బావ సినిమా కూడా బాల్చి తన్నేసింది.. ఇదేమిటో ౩ హిందీ సినిమాలు కాపి కొట్టినా కలిసి రాలేదు... రాయుడు స్టొరీ నాకివ్వరూ..!

karthik said...

ఇంతకూ పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? ఖరగ్పూర్ నుంచీ మన నాగ్ వస్తున్నాడా?? అసలే అక్కడ చలి ఎక్కువ ఈ కారణం తో ఐనా కొంచెం రిలాక్స్ అవుతాడు కనుక అతన్ని తప్పక పిలవాలి..

బర్నాల్ బ్రహ్మ నాయుడు said...

ఎవరిచ్చినా... ఎక్కడిచ్చినా.. టైం మీరు చెప్పినా సరే.. నన్ను చ్ప్పమన్నా సరే... ప్లేసు మీరు చెప్పినా.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడన్నా.సరే..ఎక్కడన్నా సరే...
ఒక్కడినే వస్తా... పీపాలకి పీపాలు తాగేస్తా.

karthik said...

విషయం ఏమిటంటే, పార్టీ ఎవరిచ్చినా పార్టీకి సంబంధించిన పెద్దరికం మాత్రం నాదే.. అందువల్ల నేనే అతిథుల లిస్ట్ తాయారుచేసుకోవాలి..
కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేదేమిటంటే మీరంతా ఈ పార్టీకి వచ్చి మన యూనియన్ గొప్పతనాన్ని చాటాలి..

రాజ్ కుమార్ said...

నాగార్జునా... రావయ్య...రా.. చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో..

బింద్ర said...

తాగడం మొదలెట్టాక ఆగటం ఉండదు...

లీడర్ said...

పార్టీ లొ లక్ష బీర్ల వ్రతాన్ని లక్షణం గా పూర్తి చెయ్యాలి.. then i am ready to die..

karthik said...

padi nimishalalo malli vasta

మాలోకం said...

అసలేమి జరుగుతోంది ఇక్కడా.? అసలు ఈ పోస్ట్ కి ఈ కామెంట్ల కి సంబంధం ఉందా??

రవి ప్రకాష్ TV999 said...

ఆత్మ కి ఆనందం కలగాలంటే ఏమి చెయ్యాలి? అసలు ఆత్మ కి పరమాత్మ కి గల సంబంధం ఏమిటి?
వివరాలు బ్రేక్ తర్వాత చూడండి..

రాజ్ కుమార్ said...

కార్తీక్ గారు ..
ఇందులో ఎవరి హస్తం ఉంది? ఎవరి పాదం ఉంది? ఇంకెవరి తోకైనా ఉందా?
సూపర్

రాజ్ కుమార్ said...

"ఎంతమాట ఎంతమాట కార్తిక్‌ భాయ్..., మావేవో రీమిక్స్ సినిమాలు పారెడి పాటలు. ఒరిజినల్ సినిమాకొచ్చేన్ని కలెక్షన్లు వస్తాయా అసలు"

naagarjuna.. ! nuv harekrishna ni avamaanistunnav...:) :)

..nagarjuna.. said...

ఎవరిక్కడ సెంచరిలను తన్నుకుపోతానన్నది....సెంచరీలు చేయాలన్నా మేమే (వబ్లాస) సెంచరీలు తిరగరాయాలన్నా మేమే....

రాజ్ కుమార్ said...

బద్రి.. 250 నాదే.. చూసారా...!

..nagarjuna.. said...

బాబు ఇప్పుడు కార్తిక్‌గారి సంఘాన్ని ఏమన్నా అంటే మనల్ని ప్రమాదవనంలో పడేసి ఆడేసుకుంటారు....అంత సినిమా అవసరమా మనకు....

రాజ్ కుమార్ said...

అదీ.... నాగార్జునా....తగ్గొద్దు.. రుచి చూపించాలి మన వబ్లాస దెబ్బ..

..nagarjuna.. said...

ఏసెయ్..కామెంట్ల స్పీడు పెరుగుతొంది...,అగ్రిగేటర్లు బీ రెడి... we are flooding you...

జవాబుదారుడు said...

ఇంకెక్కడా కార్తిక్ గారి సంఘం...??? ఏమీ లేదక్కడా..!

..nagarjuna.. said...

మాలోకం గారు ఏదో అన్నారు...పోస్టుకు, కామెంట్లకు సంబంధం ఉందా అని. ఎందుకు లేదు సార్...ఇవన్నీ సినిమా హిట్ అయ్యాక చెసుకునే సంబరాలైతేను....

మాలోకం said...

ite ok..

రాజ్ కుమార్ said...

మాలోకం = మాయదారి లోకం?? :)

..nagarjuna.. said...

అది సరే కరెక్టుగా 300ల టైముకు దర్శకరత్నలు, గోపాల్‌బాబులు, తేజలు, హీరోలు మిస్సింగ్ అయ్యారేమిటి...ఇందులో ఎవరిదన్నా హస్తం ఉన్నదా....:P

karthik said...

సంఘం ఉందా లేదా అన్నది కాదన్నయ్యా ముఖ్యం.. కామెంట్ పడిందా లేదా అన్నది ముఖ్యం..

..nagarjuna.. said...

కొత్తగా మాయదారి లోకం ఎవరు...??

పేద రాయుడు said...

ఎవరు నా డైలాగ్ ని నా పర్మిస్సన్ లేకుండా ఇక్కడ పెట్టింది? అరిస్తే..కరుస్తా... కరిస్తే చరుస్తా.. చరిస్తే ..ఏడుస్తా..

karthik said...

>>అది సరే కరెక్టుగా 300ల టైముకు దర్శకరత్నలు, గోపాల్‌బాబులు, తేజలు, హీరోలు మిస్సింగ్ అయ్యారేమిటి...ఇందులో ఎవరిదన్నా హస్తం ఉన్నదా?

అవును దీనికి నిరసనగా దర్సకరత్న గారు నిరాహార దీక్ష చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం..

..nagarjuna.. said...

అదీ ఇప్పుడు ఆట రసవత్తరంగా ఉంది.... రెండు సంఘాల మధ్య head on....ముచ్చటగా మూడో సంఘం నుండి ఎవరైనా వస్తారా....

గుణశేఖర్. said...

అవునవును.. దర్శక రత్న గారు నిరాహార దీక్ష చెయ్యాలి... కాస్తా పొట్ట అయినా తగ్గుద్ది..

karthik said...

పెద్దరాయుడు గారూ, మీ డయలాగ్ ఇది "అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నా ఇద్దరు కొడుకులను పెట్టి సినిమా తీస్తా"

..nagarjuna.. said...

అన్నయ్య డైలాగుని కాపి చేస్తే Fish-water కాండిడేటు వచ్చాడేంటి...చూడండి పేదరాయుడు గారు....మాకు తెలిసింది రాయుడు మాత్రమే...మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాం

బి. గోపాల్ said...

కృష్ణగారు.. నాకే సమాధానం చెప్పలేదు ఇప్పటి దాక? మీరు ఏదో ఒకటి చెప్తే... నేను బుల్డోజర్స్ ని, రోడ్ రోల్లర్స్ ని అద్దెకి తెప్పిస్తా...

..nagarjuna.. said...

గుణశేఖరుడు వచ్చారు....కొత్త సెట్ ఏమైనా కావాలాండి..

karthik said...

నిరాహార దీక్ష తో తగ్గే పొట్టకాదు బాబూ అది.. గత నాలుగు దశాబ్దాలు తెలుగు పరిశ్రమ పోషించిన పొట్ట అది..

..nagarjuna.. said...

అయినా...య్యెవ్ హరే ఎక్కడున్నావయ్యా...హోమ్ గ్రౌండ్‌లో మూడో సెంచరీకూడా మిస్ చేసుకుంటావా...?

ఏ .ఎం రత్నం.. said...

కొడుకులని పెట్టి తీస్తావా? నన్ను చూసి బుద్ది రాలేదా నీకు?? ఎంతైనా లేజేబ్రిటి వి కదా.. తీసినా తీస్తావ్..

karthik said...

అయ్యా బీ.గోపాల్ గారూ,
మీరు ముందు ఒక కోడికి మనుషులను చంపడం ఎలా? అనే ట్రైనింగ్ మొదలు పెట్టండి.. బుల్ డోజర్లు, రోడ్ రోలర్లు తర్వాత ఆలోచిద్దాం..

..nagarjuna.. said...

పొట్టదేముంది...ఈ మధ్యన కష్టపడి ఫైట్లుకూడా చేస్తున్నారు....కరిగిపోతుందిలే (no offense intended)

గుణశేఖర్ said...

అవును... సముద్రం సెట్ వేద్దాం అనుకుంటున్నా... vijag లొ అయితే మనకి సింపుల్ కదా.. ఏమంటారు??

రాజ్ కుమార్ said...

counter starts...

రాజ్ కుమార్ said...

296

karthik said...

అబ్బే, కృష్ణ వచ్చేలా లేడు.. నేను సెంచరీ వదిలే మూడ్ లో అసలు లేను.. సీటు సితకోశలాయో..

రాజ్ కుమార్ said...

297

రాజ్ కుమార్ said...

299

రాజ్ కుమార్ said...

300 naade

..nagarjuna.. said...

సముద్రం సెట్.....

కెవ్......
ఆల్రెడి truman show అనే సినిమాలో వేసారు...వెరైటిగా ఆలోచించండి సార్..

karthik said...

300?

..nagarjuna.. said...

పాయే...మూడొందలుకూడా పాయే....

రాజ్ కుమార్ said...

హరే కృష్ణ... అందుకో నా శుభాకాంక్షలు.. ఈ త్రిశతకం నాగార్జున కి , కార్తీక్ గారికి అంకితం..

karthik said...

ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ముంచిందిరా దేవుడో దేవుడా..

..nagarjuna.. said...

సారి కార్తిక్‌గారు....చివరకు వబ్లాసనే గెలిచింది...:)

congrats Venu and Hare

..nagarjuna.. said...

going for snacks.....you guys carry on...

గుణశేఖర్. said...

వాడు ఎక్కడో వేసుంటాడు... కానీ సముద్రం పక్కన వెయ్యటం వెరైటీ ..

karthik said...

ఇక నుంచీ మునుపు నన్నేన్నో కామెంట్ యుద్ధాలలో గెలిపించిన మొజిల్లానే వడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి కామ్రెడ్స్, అందరూ మొజిల్లా వడి మీ కామెంట్ యుద్ధాలలో గెలిచి మాకు పార్టీలివ్వండి..

తదుపరి కార్యక్రమం, వేణూరాం పార్టీ విశేషాలు.

karthik said...

వేణురాం పార్టీ ఎక్కడ ఇస్తున్నావ్.. నాగార్జున వచ్చేలోపు మనం పార్టీ చేసుకుందాం..

రాజ్ కుమార్ said...

ఏం కావాలి మీకు? మోహన్ బాబు స్కూల్ లొ సీట్ కావాలా? దర్శకరత్న దగ్గర పని చేసే అవకాసం కావాలా? సీమ సింహం సినిమా సీడీ లు కావాలా?

karthik said...

>>ఏం కావాలి మీకు? మోహన్ బాబు స్కూల్ లొ సీట్ కావాలా? దర్శకరత్న దగ్గర పని చేసే అవకాసం కావాలా? సీమ సింహం సినిమా సీడీ లు కావాలా?

ఇంకానయం ఒక్కమగాడు సినిమాలో నటించే అవకాశం అనలేదు..

రాజ్ కుమార్ said...

రిలీస్ అయిపోయిన సినిమా లొ నటించడం కుదరని పని కదా..!
ఒక్కమగాడు2 గాని రిలీజ్ అవుతుందా కొంపదీసి?? :) :)

karthik said...

>>ఒక్కమగాడు2 గాని రిలీజ్ అవుతుందా కొంపదీసి??


ఒక్కమగాడికి చావు లేదు.. వస్తానని మాటిచ్చాక తప్పకుండా వస్తాడు..

karthik said...

ఒక్కమగాడు2 కు నిర్మాత ఎవరైతే బాగుంటుంది? సాధారణంగా అందరూ హీరో ఎవరుండాలి అనుకుంటారు.. కానీ ఇక్క పరిస్థితి వేరు కదా..

రాజ్ కుమార్ said...

కళానిధిమారన్ అయితే బాగుంటుంది.. డైరెక్టర్ మాత్రం వై.V .స్. చోదరి నే . హీరో ఎవరో చెప్పక్కర్ లేదు కదా..
ఈ సారి ఒక్కమగాడి age 150 సం" అయినా సరే చైనా కత్తితో ట్రాన్స్ఫార్మర్ ని ఇరగ్గొట్టి , కరెంట్ తీగలు నోట్లో పెట్టుకొని..ఆ తర్వాత..ఆ తర్వాత...నేను చెప్పలేను బాబు.. :(

గవర్రాజు said...

ఫ్లాష్..ఫ్లాష్.. చిత్రం మూవీస్ పతాకం పై తేజ దైరేక్సన్ లొ ౩ ఇడియట్ సినిమా ___ బాబు త్రిపాత్రాభినయం లొ :)

మనసు పలికే said...

baaboy.. entidi..? :((
Congrats Hare. :)))

karthik said...

ఈ సారి ఒక్కమగాడి age 150 సం" అయినా సరే చైనా కత్తితో ట్రాన్స్ఫార్మర్ ని ఇరగ్గొట్టి , కరెంట్ తీగలు నోట్లో పెట్టుకొని.. మూసి నదిలో ఈత కొడుతూ పాకిస్తాన్ తీవ్రవాడులకు గ్రాంధిక తెలుగులో క్లాస్ పికుతాడు..

karthik said...

ఇది ఓపనింగ్ సీన్.. తర్వాత హీరోయిన్ తో పాటలు వగైరా మామూలే.. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉందాలో చూడు..

రాజ్ కుమార్ said...

ఇంటర్నెల్ సీన్ :
హీరోయిన్ ని కోరమంగలా లొ కిడ్నాప్ చేస్తారు... ఒక్కమగాడు దీపావళి సామాన్లు కొనడానికి హోస్సూర్ వెళతాడు.. విష్యం తెలుసుకొని.. తారాజువ్వలు, రాకెట్లు వీపుకి కట్టుకొని... చుట్ట తో అంటించు కొని..... మేడ మీద నుండి అడ్డం గా దూకేసి.... గాల్లో ఎగురు కుంటూ... వచ్చేసి... లక్ష్మిబాంబుల తో దాడి చేసి.. పాము బిల్లల పొగ లొ హీరొయిన్ ని తప్పిస్తాడు..
ఇదీ కాన్సెప్ట్ .. ఇంకా డెవలప్ చెయ్యాల్సి ఉంది

karthik said...

అలా హీరోయిన్ ని తప్పించి తను మాత్రం డ్రైనేజ్ కాలువలో పడి గతాన్ని మరిచిపోతాడు.. గతాన్నీ మర్చిపోకపోతే అది ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అవుతుంది చెప్పు?? బ్యాంగ్ ఉండటం చాలా ముఖ్యం..

Sai Praveen said...

వామ్మో, వార్నాయనో హియర్ వాట్ హాపెనింగూ ??
హరే కృష్ణ..... కొట్టావుగా ధమాకా :)
congrats buddy!!
వేణురాం.... నీ డైలాగులు మాత్రం సూపర్ :)

రాజ్ కుమార్ said...

ha..ha.. tnQ..sai..

నేను said...

Hare & Venu, Congratulations.

వేణు, కేక. చెప్పి మరీ 250, 300 కొట్టావ్.

ఒక్కమగాడు2 సూపర్.

(మా అన్న పేరుని ఒక్కసారి కూడా వాడని(కామెంట్స్ లో కూడా) పోస్ట్ కి ఇన్ని కామెంట్స్ రావడం జీర్ణించుకోవడం కష్టంగా వుంది)

3g said...

Congrats Venuram & Hare, సిన్మా సివరికొచ్చాకా సెప్పండి ఓ లుక్కేసికుంటాం.

రాజ్ కుమార్ said...

thnQ badri... :) :)

@3g.. ThnQ.
ee story meelantollu raaste (teeste ) 100 kaadu 200% nyaayam chestaru.. :) :)

మనసు పలికే said...

వేణురాం.. భలే భలే సీన్లు చెప్తున్నావులే..:) కంటిన్యుయేషన్ ఎక్కడా..;)

మనసు పలికే said...

హరే.. నీకు, నీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)

రాజ్ కుమార్ said...

దీపావళి శుభాకాంక్షలు..

మనసు పలికే said...

ఏంటో ఆ చూసే వాళ్లెటెళ్లారో.. తీసే వాళ్లెటెళ్లారో.. ఇలా మమ్మల్ని సినిమా మధ్యలో వదిలేసి స్క్రీన్ మూసేసి వెళ్లడం ఏమన్నా బాగుందా అంట..

గుణశేఖర్ said...

హరే కృష్ణ గారికి నా తరుపున దీపావళి శుభాకాంక్షలు..

TV9 said...

ఫ్లాష్..ఫ్లాష్... గుణ శేఖర్ చేతుల్లోకి వెళ్ళిన ఒక్కమగాడు2 ప్రాజెక్ట్... ప్రతిష్టాత్మకం గా వైజయంతి మూవీస్ నిర్మాణం లొ...

మనసు పలికే said...

ఆహా.. ఓహో.. వీనుల విందుగా ఉంది ఈరోజు TV9 news..:)

మనసు పలికే said...

ఇక్కడ ఎంతో ఆత్రంతో ఎదురు చూసే బ్లాగర్లందరికీ ప్రివ్యూ షో టికెట్స్ ఇప్పిస్తున్నారు కదూ గుణశేఖర్ గారూ..:)

రాజ్ కుమార్ said...

బాబోయి ... ఇంకా స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు..అప్పుడే షూటింగ్ మొదలెట్టేసారా గుణశేఖర్ గారూ ?

గుణశేఖర్ said...

స్క్రిప్ట్ ముఖ్యం కాదు... సెట్ ముఖ్యం..

మనసు పలికే said...

మరి హీరోయిన్ సంగతేమిటి..?

మనసు పలికే said...

గుణ శేఖర్ గారు, ముందుగా అనుకున్నట్లుగా ఇక్కడ NH5 సెట్ ఉంది కదా..

గుణశేఖర్ said...

నేను ముందే చెప్పాను ..సినిమా అంతా NH5 మీద జరుగుద్దని...! మళ్లీ ఆ డౌట్ ఎందుకొచ్చింది మీకు?

kiran said...

hahahhhahah..super post.. :)..enjoyed it...magisa...ujwala....2 4th class text books...superr.. :)...

శివరంజని said...

ఆహా నేను ఆచ్చి వెళ్ళొచ్చేసరికి ఇన్ని కామెంట్ లా ??????? అందుకోండి నా అభినంధనలు

పరిమళం said...

అయ్ బాబోయ్ ...కామెంట్ల తుఫాన్ వచ్చినట్టుంది :) :)

«Oldest ‹Older   201 – 342 of 342   Newer› Newest»