Pages

Friday, October 16, 2009

పో..పో ..


అది 1609 సంవత్సరం

ఒక గంభీరమైన గొంతుతో

టు టెన్ జా ట్వంటీ

త్రీ టెన్ జా థర్టీ అని చదువుతున్న షేర్ ఖాన్

భైరవా.. ఇప్పుడు నువ్వు చనిపోవచ్చు కాని నువ్వు ఎక్కాలు ఒప్పజెప్పడానికి మళ్ళీ పుడతావ్ రా ! (సమీర్ రెడ్డి పక్కన వుంటాడు సీన్ లో)

అని చెప్పి ఒక శ్రీ సీతారామా& కో. రాజమండ్రి. ఎక్కాల పుస్తకాన్ని చితి మీద పెట్టి నిప్పంటిస్తాడు షేర్ ఖాన్

వెంటనే టైటిల్ పడింది పోతేపోరా

ప్రస్తుతం 2009

హీరో హర్ష కష్టపడి గెలుచుకున్న పేకాట డబ్బులను మమైత్ ఖాన్ దొంగిలించుకుపోవడం తో సీన్ మొదలవుతుంది పేక యార్డ్(కేసినో ) లో ఒక సాంగ్ వేసుకుంటాడు

హీరోయిన్ బస్టాండ్ లో ఆటో కోసం ఎదురుచూస్తూ వుంటది (???)

తర్వాత యాజ్ ఇట్ ఈజ్

రాయఘడ్ (ఒరిస్సా బోర్డర్ లో వుంటుంది )లో వున్న ఘోరా దగ్గరకు హెలికాప్టర్ లో విలన్ వెళ్తాడు,నిన్న రాత్రి హీరోయిన్ ని చూస్తుంటే వెంటనే ఎవడో నన్ను చంపేస్తున్న ఫీలింగ్ వచ్చింది అని అంటాడు

అప్పుడు ఘోరా దాన్నే ఫుల్ స్టాప్ ప్రేరణ అంటాడు . అని చెప్పి ఫుల్ స్టాప్ ప్రేరణ ఇప్పటది కాదు ఎన్నో సంత్సరాలనుండి వుంది అని అంటాడు ఇదుగో మన రాయఘడ్ చరిత్ర అని ఒక పుస్తకాన్ని చూపిస్తాడు

ఇదుగో 400 సంవత్సరాల రాయఘడ్ చరిత్ర ఇదుగో ఇదే నీ మరదలు గులివింద అని తన ఫోటో చూపించి

తన కోసం పడిచచ్చిపోయే తన బావ వైన రాయఘడ్ సైనికాధ్యక్షుడు నువ్వు శని బీర్ జల్లావి

ఇదుగో నీ గులివింద ఎంతగానో ప్రేమించే వీరుడు శూరుడు అయిన ఎక్కాల భైరవ (సగం మొహం మాత్రమే వుంటుంది )

వాడూ నీలాగే తనను దక్కించుకోవడానికి జన్మ లో కూడా పుట్టాడు

విలన్ పళ్ళు కొరుకుతూ ఎక్కాల భైరవ

ఘోరా చెప్పు నా గులివింద ను ఎలా దక్కిన్చుకోనేది వాడు ఎలా ఉంటాడు వాడిని ఎలా గుర్తుపట్టడం వాడిని చంపేస్తా అనగానే వాడిని చంపడం అంత సులువు కాదురా అని ఘోరా చెప్తాడు

శని బీర్ కే ఎదురు నిలిచేవాడా హ్హ అని అనగానే

ఘోరా :నువ్వేమైనా రన్ బీర్ అనుకుంటున్నావా గులివింద ను ఎగరేసుకు పోవడానికి

శని బీర్ జల్లా:వాడెవడు మధ్యలో

ఘోరా: కింగ్ ఫిషర్ బీర్ కి స్పోన్సర్

సరే వాడిని ఎలా గుర్తుపట్టాలో చెప్పు

నేను చెప్పనవసరం లేదు మీ కలయికని మీ కంటే ముందే ప్రకృతి పసిగడుతుంది కాకులు కావ్ కావ్ అనకుండా కెవ్వు కెవ్వు అని అంటాయి

కోళ్ళు పందికోక్కో అని శబ్దాలు చేస్తాయి మేకలు కేక కేక అని ఆర్తనాదాలు చేస్తాయి కుక్కలు కుయ్యో మొర్రో అని భూమికి బొక్కలు పడేటట్టు బుర్రలు బాదేసుకుంటాయి

విలన్:అంతేనా ఇంకా ఏమైనా ఉంటాయా

ఘోరా:వాడు ఎదురైనప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఎక్కాలు చదివేస్తున్టావ్

విలన్ : ఎందుకు అలా

ఘోరా: లాజిక్ అడిగితే @@## మీద తంతా, టైం అప్ , గెట్ అవుట్ ఆప్ మై గుహ


హీరోయిన్ తో రెండు డ్యూయెట్ లు వేసుకొని పండగ చేసుకుంటున్న హీరో ఫ్రెండ్ తో టీ తాగడానికి హోటల్ కి వస్తాడు తర్వాత వెంటనే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది

అంతే ఒక సారి అలా కీరవాణి మ్యూజిక్ వుహించేసుకోండి బ్యాక్ గ్రౌండ్ లో

అప్పుడే హీరోయిన్ని హీరో గుర్తు పట్టేసిన వెంటనే గోల్కొండ లోకి కెమెరా షిఫ్ట్ అయ్యింది


కాటుబెల్లపు కొమ్మా కొమ్మా

పాములా చూడోద్దమ్మా


పచ్చిపూలా రెమ్మా రెమ్మా

నాలుకే గీయోద్దనకమ్మా

స్నానమే చేయ్యోద్దంటే.. గోళిలే ఆడోద్దంటే.. ఏమవుతానమ్మా..


గేద పైన చెయ్యేస్తే..కాలుతో తన్నిందే..అసలు పేడ నువ్వని పంపిందే..

నువ్వు రాకు నా వెంటాయే.. పేడ చుట్టూ పెంటంట..అంటుకుంటే వళ్ళంతా మంటేనంట..


మీ చెల్లి పైన చెయ్యేస్తే..తిట్టి నన్ను నెట్టిందే..మెరుపు తీగ నువ్వని పంపిందే..

నా చెల్లి వెంట నేనంట..నా వెంట నువ్వంట..నే మీ తమ్ముడితో తిరిగితే తప్పంటా..!!


పేడ ఎత్తేటందుకు పుట్టానే బొమ్మా

నువ్వు కాదంటే నే అవుతా దద్దమ్మా ..


అనే ఒక మాంచి రొమాంటిక్ సాంగ్ తర్వాత


హీరోయిన్ తండ్రి యుగళగీతాన్ని కళ్లారా చూసి పాట అయిపోయాక ఎందుకు ఆపేసారు అందుకే నీకు నా బిడ్డ ని ఇవ్వను అనేసరికి ఒక్కటి పీకుతాడు హీరో

తర్వాత 'మామూ'లే

హీరోయిన్ ని విలన్ హైదరాబాద్ నుండి ఒరిస్సా లో గల రాయఘడ్ కి తీసుకువేల్దామని లాగుకుపోతుండగా హీరోయిన్ మింగలేక కక్కలేక కుక్కల కోళ్ళ అరుపులు వింటూ కూర్చుంది హెలికాప్టర్ లో (విలన్ ఎక్కాలు చదువుతూ కోపం గా ఒక చూపు చూస్తాడు )

హీరో తన ప్రయత్నాలు తను చేసుకుంటూ వుంటాడు హీరోయిన్ ని ఆపడానికి అంతలోనే ఒరిస్సా కి కొంచెం దూరం లో వున్న శ్రీకాకుళం లో పడిపోవడం తో ఫ్లాష్ బ్యాక్ వెంటనే గుర్తొస్తుంది

ఇటుపక్క ఒక పేద్ద మంట అటుపక్క పెద్ద పెద్ద అరుపులతో నక్కల జంట

మళ్లీ స్టార్ట్ చేశాడ్రా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ..ఏం చేస్తాం అందుకే ఇంటర్వెల్...


మొత్తానికి వచ్చేసాం హాలీవుడ్ ప్రపంచం లోకి

రాయఘడ్ కదా కొంచెం ఏంటి బాగా వీక్ టెక్నాలజీ లో నార్నియా సినిమా లో వాహనం నుండి inspire అయ్యినట్టు, పందులతో మన హీరో బళ్ళు కట్టించుకుంటారు

వీరాధి వీరుడు రాయఘడ్ వీరుడు sata,westren digital ధృవ వంశ వీరుడు ఎక్కాల భైరవ

seagate వంశ వీరుడు మరియు రాయఘడ్ రాజ్య సైన్యాధ్యక్షుడు శని బీర్ జల్లా


ఎక్కాల భైరవ రాగానే గ్లాడియేటర్ స్టేజి లో వుండే ఆడియెన్స్ 400 సంవత్సరాల క్రితం అనే సంగతి మర్చిపోయి బ్రేక్ డాన్స్ లు మూన్ వాక్ లు తెగ చేస్తూంటారు, వెంటనే విలన్ బండి తియ్ రా అనగానే, ఉండన్నా పందులకి ఇంకా మేత కాలే.. రెడీ అవుతున్నాయి అంటాడు తన అనుచరుడు

యువరాణి గులివింద తండ్రి అయిన అరవింద (ns: పాత్రను ప్రముఖ నటుడు శరబత్ బాబు పోషించడమైనది) రాగానే ప్రజలు బ్రేక్ డాన్స్ లు ఆపేసి విజిల్స్ వేయడం మొదలెట్టాక


హీరోయిన్ ఆపిల్ కోసం విలన్ వచ్చి దాన్ని హీరో తినేసి తర్వాత హీరోయిన్ తిన్నాక విలన్ అవమానం తో తల ఎక్కడ పెట్టాలో తెలియక పరాక్రమం వుంటే ఇక్కడ కాదురా రేపు పందుల రేసింగ్ లో చూసుకుందాం అని ఒక చూపు చూసి వెళ్ళాక పట్టపగలే అష్ట గ్రహ కూటమి మొదలయ్యింది దాన్ని చూసి నిచ్చేస్టుడు అయిన రాజు అరవింద స్వాముల వారు ఇలా అంటున్నారు

రాజు:మహా మంత్రీ! ఆకాశం లో ఏందీ చుక్కలు నాకు సమజ్ కాలే దాని అర్ధం ఏంది?

మంత్రి: అవి చుక్కలు కాదు రాజా, మన రాజ్యానికి పడే బొక్కలు మహా రాజా

రాజు:ఓహ్ సింబాలిజామా

మంత్రి :అవును మహారాజా షేర్ ఖాన్ మన రాజ్యం మీద కు దండెత్తి వస్తున్నాడు

రాజు:ఎవరతను.. దలాల్ స్ట్రీట్ లో వుంటాడు వాడేనా!!

మంత్రి:మహారాజా వాడు కాదు మీ ఆవిడను ఎత్తుకుపోయిన డోర్ మాన్ కొడుకు

వాళ్ళ నాన్న లాగే షేర్ ఖాన్ కి పని లేదా దాదాపు దేశం అంతా అక్రమించేసాడు ఒరిస్సా లో మారుమూల ప్రాంతాలను కూడా వదలడా ఇక్కడేమి వున్నాయి అని

కొండలు జలపాతాలు తప్ప

సరే వాడు ఎలాగో వస్తున్నాడు కదా వాడిని ఎదిరించడమా.. మనకంత సీన్ లేదు ఈలోపు మన పందుల పోటీలు ప్రారంభించండి ఆనందిచెదము..
శని బీర్ జల్లా సభలో ఓపెన్ ఆడిటోరియం లో డయాస్ మీద వున్న మిత్రవింద వొళ్ళో వున్న ఎక్కాల పుస్తకాన్ని తీసే సరికి అందరి మొహాల్లోకి ఒక క్లోజ్ అప్

రాణి గారి ఎక్కాల పుస్తకాన్నే కాపాడలేని వాళ్ళం ఇక రాజ్యాన్ని ఏం కాపాడగలం'అనేసరికి సరే ఎవరితే గుర్రం కి వేలాడదీసిన పుస్తకాన్ని తీసుకొస్తారో వాళ్ళకే నా రాజ్యం తో పాటు నా కుమార్తె గులివింద (1+1) ..

కొంచెం బెన్ హర్
తర్వాత విలన్ కి రాజ్య బహిష్కరణ చేసిన వెంటనే..

షేర్ ఖాన్ solatire ఆడుకుంటూ తన అనుచరులతో దండెత్తి వస్తున్నాడు రాయఘడ్ మీదకు
యువరాణి గులివింద ను దోషం పోవడానికి ద్వీపం మీద కు తీసుకు వెళ్తే తను మాత్రం ఎక్కాలు చదువుతూ భైరవ బొమ్మ గీస్తుంది
దమ్ముంటే భూటాన్ ఫౌజ్ కి ఒప్పజేప్పరా నీ ఎక్కాలు అని తన దగ్గర వున్న ఎక్కాల పుస్తకాన్ని విసురుతాడు షేర్ఖాన్

ఇప్పుడు ముందు వినిపినించిన మొదటి సీన్ మనకు కనిపిస్తుంది సమీర్ రెడ్డి విజిల్స్ తో సహా
hero ఎక్కాలనీ ఒప్పజేప్పేసాక.. నాకు దక్కనది ఎవరికీ దక్క కూడదు అని బీర్ జల్లా మధ్య లో వున్న పేపర్ ను తీసి కిందకి పారేస్తాడు రాణి వెంటనే తను ఎంతగానో ఇష్టపడే పుస్తకం లో పేజీల కోసం హీరోయిన్ దూకేస్తే హీరోయిన్ కోసం హీరో దూకేస్తాడు

వెస్ట్రన్ డిజిటల్,sata హార్డ్ డిస్క్ వంశ స్తులతో solatire ఆడటం ప్రమాదకరం అని నువ్వు చెప్తే నమ్మలేదు ఇప్పుడు తెలిసొచ్చింది అని చితి కి నిప్పంటిస్తాడు షేర్ ఖాన్

సశేషం..


మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు..

గమనిక:ఇది కేవలం సరదా కోసం చేసిన ప్రయత్నమే అన్యదా భావించకండి.. చదివి, నవ్వొస్తే నవ్వుకోండి. లేకుంటే మర్చిపోండి.. ఎవరినీ నొప్పించే వ్యాఖ్యలు మాత్రం చేయకండి

53 comments:

పరిమళం said...

ఎవరికైనా పొట్ట చెక్కలైపోతే ఆపాపం మీదే .....
నేను కాబట్టి తట్టుకొని నిలబడ్డా ఆపాట చదివి :)
*మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు .

Bhãskar Rãmarãju said...

కిన్దపడి గిలగిలా కొట్టుకునవ్వుతుంటే కళ్ళెమట నీళ్ళుకారతా ఉంటే మామేనేజరు, అట్టా ఏడవమాక శురోరమేగా ఇంటికిబో అని అదోలా మొకంబెట్టుకు సెప్తుంటె, అసెపో ఇది ఏదుపుకాదు, నవ్వలేక సత్తాఉంటే అన్జెప్పి అతి కట్టంమీన నవ్వాపుకుని, కళ్ళల్లో నీళ్ళెట్టుకుని ఈ కామెంటు రాత్తన్నా సోదరా. ఇట్టా ఇబ్బందిపెట్టటం ఏమన్నా న్యాయవా అని అడుగుతా ఉన్నా అద్దెచ్చా!!!
>>మీ చెల్లి పైన చెయ్యేస్తే..తిట్టి నన్ను నెట్టిందే..మెరుపు తీగ నువ్వని పంపిందే..

నా చెల్లి వెంట నేనంట..నా వెంట నువ్వంట..నే మీ తమ్ముడితో తిరిగితే తప్పంటా..!!
కేక....

దీపావళి శుభాకాంక్షలు .

తృష్ణ said...

కెవ్వ్వ్వ్వ్వ్......మాటల్ రాట్లా...సూపర్....
ఈ దీపావళి ధమాకా టపాకు అత్యధిక వ్యాఖ్యల్ ప్రాప్తిరస్తూ........!!

Anonymous said...

ha ha..I cant stop laughing

-manohar

మరువం ఉష said...

హరేకృష్ణా, ఇంత పగబట్టారా నా మీద?;) నా పిల్లలకి నన్ను కాకుండా చేద్దామనే? ఉదయం నుండీ ఒకటే పని. కాస్త కుదురుగా కూర్చుని పళ్లెంలో కాస్త పులిహోర పెట్టుకుని కూర్చున్నానోలేదో మీ టపా ఎదురుగా, నవ్వలేక పొట్ట పట్టుకోలేక, అద్దంలో నా మొఖం చూసుకుని మళ్ళీ నవ్వుకుని, అచ్చంగా పండుకోతిలా అయ్యాను. నవ్వితే కందే రకం నేను. వూపిరి ఆడక అర్జంట్ గా ఎమర్జన్సీ కి పొయ్యేంత పనయింది.

పండుగ కాంతుల కన్నా ఈ నవ్వుల కాంతులే బాగున్నాయి. A Job Well Done. ;)

Anonymous said...

kevvu keka..

Ramesh said...

ఏం రాసారండీ !..నవ్వలేక చచ్చాను

హరే కృష్ణ said...

పరిమళం గారు థేంక్సండి.. పాపమా.. ఇది అన్యాయం ! చాలా రోజులు అయ్యింది కదండీ ! మా కంపెనీ వాడి మీద కోపం అంతా పోస్ట్ మీద చూపించా

హరే కృష్ణ said...

భాస్కర్ గారు ఇంతకంటే ఏం కావాలి..నాకు కళ్ళారా చూపించారు మీ ఆఫీస్ లో మీ యాతన ..ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

తృష్ణ గారు చాలా థాంక్స్.. మీరు రాసిన కెవ్వు..
నాకు వినిపించింది..ధన్యవాదాలు
వ్యాఖ్యలు అంటారా లైట్.. దీపావళి శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

నిన్న పోస్ట్ రాసాక illinois ట్రాఫిక్ ఫీడ్ లోకి రావేట్లేదిమిటా అనుకున్నా..కరెక్ట్ టైం కి వచ్చేసారు

ఉష గారు..చిన్న పోస్ట్ రాస్తే ఇంకొంచెం రాయొచ్చు గా అంటారు..సరే కదా అని పెద్దగ రాస్తే పగపెట్టారు అని అంటారు .ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ..JK :):)

**పండుగ కాంతుల కన్నా ఈ నవ్వుల కాంతులే బాగున్నాయి,..Really
థాంక్ యూ..

హరే కృష్ణ said...

మనోహర్ గారు నా బ్లాగ్ కి స్వాగతం..ధన్యవాదాలు
keep visiting

హరే కృష్ణ said...

రమేష్ అంతా నీ అభిమానం ..చాలా థాంక్స్

హరే కృష్ణ said...

అనానిమస్ గారు ధన్యవాదాలు

vikky2vikram said...

peda ethenduke puttane gumma.......

keko keka.... chaala baaga rasaavu paata,
post chaala baagundi, shatatrula vamsam veerudu ekkalu nerchukovadam.... baagundi

nenu chaala rojulu aindi kada, post raddamu anukuntunna, kaani ee post choosaka bhayam vesthundi, nenu entha aalochinchina ee range lo raayalenu

vikky2vikram said...

I cant praise u enough for this, excellent,
and Happy Diwali :)

Aditya Maddula said...

katubellam keka sir

హరే కృష్ణ said...

విక్కీ ...చాలా థాంక్స్ అంతా ఫేం adlabs వాడి దయ వాడులేకపోతే ముంబై లో ఆ సినిమా చూసేవాడిని కాదు
అదేంటి పోస్ట్ లు రాయడం ఆపేస్తున్నావ్..తొందరగా రాసేయ్..మేమున్నాం కదా! :)
ఓపికగా చదివి కామెంటి నచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు..
happy diwali

హరే కృష్ణ said...

ఆదిత్య నీ సపోర్ట్ ఎప్పుడూ నాకు వుంటుంది మామూ..
కాటుబెల్లమా..అంతా చిన్నప్పుడు జ్ఞాపకాలు
చాలా థాంక్స్

ప్రభాకర్ said...

మొత్తానికి నీ నిజమైన స్టైల్ చూపించావు ... నీ స్టైల్ నీదే మామ.. ఇరగ దీశావు ....నీ అభిమానుల లిస్టు లో నేను కూడా ఉన్నందుకు నాకు చాల ఆనందంగా ఉంది ....

సుజాత వేల్పూరి said...

హరే కృష్ణ గారు,మీరు సినిమాల్లో పాటలు రాయకపోతే నా మనోభావాలు గాయపడేలా ఉన్నాయి. ఒరిజినల్ పాటకంటే ఈ కాటు బెల్లపు కొమ్మా పాటే బావుంది.

మిగతా కథ ఎప్పుడు? ఎప్పుడు?

హరే కృష్ణ said...

Prabhakar, Thanks a Lot

అంతా నీ అభిమానం ప్రభాకర్ ..కొంచెం టైం దొరికింది చాలా రొజులకు

హరే కృష్ణ said...

సుజాత గారు చాలా రోజుల తర్వాత స్వాగతం..మనో భావాలూ చిత్ర భావాలూ మనకెందుకండి..నాకు అంత సాహసం లేదు..పాట నచ్చినందుకు ధన్యవాదాలు.. sorry అండీ మిగతా కధ రాయకూడదు అనిపిస్తొంది ఇప్పటికే చాలా ఎక్కువ అయ్యింది

Karthika said...

hehe konchem biiiiiiiiiiiiiig ayina ne post bagundi oye.aa song abbo asalu cinema lo kuda antha navvaledu nenu.

gud gud late ga ayina latest song tho vachavu heheh nice yar.baaga pogidaa kadaa ninnu em chestham apudu apudu tappadu mari em chestham.

హరే కృష్ణ said...

hmm..Karthika em chestam aa movie ni BIG Cinemas lo choosa anduke peddadi ayyindi konchem..ika meedata fame lo choosi raasthanule..
is it..chaala thanks oye! :)

thanks for reading&commenting with patience.. and for praising too :)

నేస్తం said...

హరే క్రిష్ణ గారు అమ్మో భలే పోస్ట్ మిస్ అయ్యేదాన్ని..మావారు ఇండియా వెళ్ళారు ఆఫీస్ వర్క్ పైన .. అంచేత ఆ హడావుడిలో ఈ మద్య కూడలి లో పై పై పోస్ట్లు చదివేస్తున్నా..సరిగా చూడలేదు ..మీ పోస్ట్ లో పాట మాత్రం సూపర్ అండి కళ్ళలో నీళ్ళు వచ్హ్చాయి అంతగా నవ్వాను

హరే కృష్ణ said...

నేస్తం గారు థాంక్సో థాంక్స్..కన్నీళ్ళా.. బాధ వచ్చినా అనందం వచ్చినా కన్నీళ్ళే అంటారు :)
రాసే విధానం లో మీ narration మాకు inspiration..
thanks a Lot అండీ..ఈ సారి ఒరిజినల్ సాంగ్ వింటున్నపుడు నా పాట ని గుర్తుకు తెచ్చుకోండి..అదే మాకు పదికామెంట్లు

మురళి said...

మూడు నాలుగు రోజుల పండుగ విరామం తర్వాత బ్లాగుల్లో చదివిన మొదటి టపా... చాలా చాలా చాలా బాగుంది.. పేరడీ పని పెట్టుకున్నారు.. కత్తి మీద సాము చేయగలరా? అని డౌట్ పడుతూ చదువుతున్నా.. పాట దగ్గరికి రాగానే అర్ధమయ్యింది డిస్టింక్షన్ తెచ్చుకున్నారని.. దీపావళికి ఎక్స్ టెన్షన్ లా ఉంది మీ టపా...

Naresh said...

గేద పైన చెయ్యేస్తే..కాలుతో తన్నిందే..అసలు పేడ నువ్వని పంపిందే..
Hilarious buddy..

vikky2vikram said...

harekrishna garu! meeku ee paatiki telisi untundi, maa company lo blog lu tapa annni block aiyaayi ani, meeru post lu raasthe tappa naaku vere enertainment ledu, daya chesi frequency penchandi

cartheek said...

patimalam gaaru cheppinattu aa pottachekkalaina vyakthui ni nene nandi ......

intha comedy aa navva leka chacha nene kadu intillapaadi navvaleka poyaru....


www.tholiadugu.blogspot.com

Shashank said...

హరే కృష్ణ కరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

రచ్చ కుమ్మావ్ పో. అసలు నీ పాట ని పెట్టాల్సింది మూవీ లో. మా ఫ్రెండ్ ఒకడు నాకు మేల్ చేసాడు అరేయ్ ఇలాంటి "రొమాంటిక్" పాట ఈ మధ్య కాలం లో రాలేదు కద రా అని.. (నీది కాదు ఒరిజినల్ గురించి చెప్తున్నా).. అందులో వాడికి నచ్చిన వాక్యం "నీ చితిలో తోడై నేనుంటానమ్మా" అట.. నువ్వేమంటావ్ రా అన్నాడు.. నే చెప్పా.. అరేయ్.. నాకెందుకో వాడు ఆ పిల్ల పై పెట్రోల్ పోసి తగలెడతా అని అన్నట్టు ఉంది రా అని. ^%$^%!@^* అని టిట్టాడు. ఇప్పుడు నీ పాట పంపా వాడికి..

పేడ ఎత్తేటందుకు పుట్టానే బొమ్మా - చింపావ్. ROFL

హరే కృష్ణ said...

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

నాకెందుకో వాడు ఆ పిల్ల పై పెట్రోల్ పోసి తగలెడతా అని అన్నట్టు ఉంది..హ హ్హ.. భలేగా చెప్పావ్

శశాంక్ నీకు నచ్చింది అంటే పొస్ట్ బాగానే వచ్చినట్టే..
రచ్చ అనగానే చాలా హ్యాపి అనిపించింది..
మీ ఫ్రెండ్ రెప్లై ఎలా ఉంటుందో నేనూ వెయిట్ చేస్తున్నా

Thank you so much Shashank

హరే కృష్ణ said...

మురళి గారు
నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు
డిస్టింక్షన్. .. ఎక్స్ టెన్షన్ !! భలే భలే ..
thank you

హరే కృష్ణ said...

నరేష్ thank you..pune లో ఓపెన్ చేసి వుంది ఎవరు అని అనుకున్నా
పాటకి ఎడిటింగ్ చెయ్యడం మర్చిపోయా ..ఇప్పుడు చేసా!

హరే కృష్ణ said...

విక్కీ.. నాకు బ్లాగ్ లు మాత్రమె ఓపెన్ అవ్వవు నీకు బ్లాగ్ తప్ప వేరే సైట్ ఓపెన్ అవదు..కంపెనీ మెయిల్ id కి ఎక్సెల్ షీట్స్ transfer చేద్దాం :)

హరే కృష్ణ said...

తొలి అడుగు.. బావుంది మీ బ్లాగ్
నా బ్లాగ్ ని ఇంటిల్లపాది చూస్తున్నారా ? అయితే జాగ్రత గా వుండాలి వచ్చే పోస్ట్ లు రాసేటప్పుడు

Karthika said...

thnx oye.

abbo manchi compliments vachayyi ga song ki gud gud.keep rocking hari.

tc
bye yaar.

హరే కృష్ణ said...

Thank you :) :)

tc

Ravi Gadepalli said...

ఆలస్యంగా చదివినందుకు బాధపడుతున్నాను....ఇన్నాళ్ళు చదవలేదే అని .....
రాజమౌళి కి మగధీర ఎలాగో...నీ బ్లాగ్ కి ఈ పోస్ట్ అంట పెద్ద హిట్ అనుకుంటా...దేన్ని విజయనగరంలో బాన్ చెయ్యలేరు కూడా
నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళవు కా రాయడంలో
మగధీరలో 100 మందిని చంపినట్టు ఇందులో ఎక్కాలు అప్పచేప్పించాల్సింది...

Anyway...superb post....

హరే కృష్ణ said...

హ హ్హ ఇలా ఎక్కువ టైం తీసుకొవడం వల్లనే బాగా వచ్చింది అనుకుంటా
మనం నొయిడా లో స్పైస్ కి వెల్లినాక తెలుగు సినిమా ని మల్టి ప్లక్స్ లో మొదటసారి చూసా కోలుకోలెని దెబ్బ తేరుకొవడానికి సంవత్సరం పట్టింది
బ్యాన్ కూడా చెయ్యలేరు హ హ్హ ..కరెక్టే

Thank you Ravi..

హరే కృష్ణ said...

సింహాద్రి లాంటి మాస్ కధలు రాద్దామనుకుంటే తొక్కేసారు బ్లాగుల్లో.. అందుకే మగధీర

హను said...

nice one sir

హరే కృష్ణ said...

hanu గారు
thanks a lot

Karthika said...

hi oye ela unnav
enti new post rayaledaa inkaa

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

మురళి said...

లాప్టాప్ వారైనందుకు అభినందనలు హరే కృష్ణ గారూ..ఇప్పుడైనా మీరు కొంచం తరచుగా రాస్తుండాలి మరి..

శ్రీనివాస్ పప్పు said...

మురళి పోస్టులో ఈ లాప్‌టాప్ కామెంటు చూడగానే డౌటొచ్చింది ఈ హరికృష్ణ నువ్వేనేమో అని.నా అంచనా తప్పుకాలేదు తమ్ముడూ.
పోస్ట్ అద్దిరింది చాలా చాలా ఆలశ్యంగా చూస్తున్నా నీ బ్లాగ్.ఆలశ్యం అమృతం విషమన్నారు కానీ అమృతాన్ని అమృతంగానే పొందాను ఆలశ్యమయినా.గుడ్ వర్క్...కీప్ రాకింగ్.

హరే కృష్ణ said...

మురళి గారు..
thank you :)

హరే కృష్ణ said...

శ్రీనివాస్ గారు
నా బ్లాగుకు స్వాగతం…….
అమృతాన్ని అమృతంగానే పొందాను touch చేసారు
thank you so much :)

రాజ్ కుమార్ said...

కాకులు కావ్ కావ్ అనకుండా కెవ్వు కెవ్వు అని అంటాయి

కోళ్ళు పందికోక్కో అని శబ్దాలు చేస్తాయి మేకలు కేక కేక అని ఆర్తనాదాలు చేస్తాయి కుక్కలు కుయ్యో మొర్రో అని భూమికి బొక్కలు పడేటట్టు బుర్రలు బాదేసుకుంటాయి

baaboi..... prastutaniki ikkadi varake chadivanu... navvapukovadam naa valla kaavatledu.. adaragottaru...

Rajkumar

మనసు పలికే said...

కృష్ణ.. ఇక నవ్వు ఆపుకోడం నా వల్ల కావట్లేదు. గుర్తొచ్చి గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. ఇంట్లో ఉంటే కింద పడిపోయి నవ్వేసుకునే దాన్నేమో. ఆఫీసులో ఉన్నాను కదా వీలవ్వడం లేదు. కళ్లల్లో నీళ్లు వచ్చేసాయి.. బాబోయ్..

kiran said...

ఆఫీసు లో మీ బ్లాగ్ ఓపెన్ చేసి అడ్డంగా బుక్ అయ్యాను.. :)
చచ్చాను నవ్వ లేక..!!
నేను ఇది వరకు చదవని పోస్ట్ లు ఇప్పుడు చదివేస్తున్ననోచ్..!!
ఆ పేరడీ ఎలా రాస్తారు?? :) మీరు..ఆది super ..!! :)