Pages

Friday, July 17, 2009

8 pt sum1..part 2

క్షమించాలి ఈ sms బాష వాడినందుకు.. ముంబాయి లో వర్షాల కారణం గా రాయడం కుదరడం (కదలడం) లేదు

మొదటి మైనర్ రాసిన మరుసటి రోజే మార్క్స్ ఇచ్చేసారు ప్రొఫెసర్ లు అందరూ ఒక్క చారి గారు తప్ప...కంపేర్ చేసుకుంటే ఫర్వాలేదు అందరికి ఒకే రేంజ్ లో వచ్చాయి మార్క్స్ ..సెకండ్ మైనర్ వచ్చేస్తోంది చారి గారు మార్క్స్ ఇస్తే క్లాసు టాపర్ ఎవరో డిసైడ్ అయ్యిపోతుంది ...
బద్దకమేమో ఎప్పుడో తర్వాత ఇస్తారు లే అని మేము కూడా పట్టించుకోవడం మానేసాం
ఆశ్చర్యం అద్భుతం గా అన్నీ కలగలిపి నట్టు నాకే క్లాసు ఫస్ట్ వచ్చేసింది ఎటునుండి వచ్చింది అన్నది కాదు ఫస్ట్ వచ్చిందా లేదా అన్నట్టు చారి గారి సబ్జెక్టు లో
నాకు 17.5/20 పరదేశి కి 0.5/20 అప్పుడే ఇంగ్లీష్ మూవీస్ కి అలవాటు పడుతున్నాం కాబట్టి నేర్చుకున్న మాటలన్నీ ఒక్కసారిగా వచ్చేసాయి
అప్పుడే చాలా మంది మార్క్స్ పెంచుకోడానికి చారి దగ్గరకు వెళ్లి సోప్ రాస్తున్నారు వాడు వేసుకున్న సల్వార్ కమీజ్ మీద సరే నేనూ వెళ్దామా అని అనుకుని ఒకసారి నా ఆన్సర్ షీట్లో ఉన్న రాజశేఖర్ సానుబూతులు చూసి ప్రయత్నం విరమించుకున్నా
అయితే నా ఆకలిమంటలు చల్లారలేదు చారి ని ఏదో ఒకటి చేసేయాలి అన్నంత కోపం వచ్చింది నాకైతే ..కాని అంత సీన్ లేదు(అప్పటికే కోర్సు డ్రాప్ చెయ్యడానికి టైం అయ్యి చాలా రోజులు అయ్యింది) అని తెలుసుకొని


కత్తి మీద కోపం కరణ్ జోహార్ మీద చూపించినట్టు
నేను చదివినా చదవకపోయినా కోర్సు తీసుకోమన్న మా సీనియర్ గుర్తు వచ్చాడు ..అయన రూం కి వెళ్లి, చూడండి చారి చేసిన చేట భారతం అని నా ఆన్సర్ పేపర్ చూపించా..అంత బాగా రాసాక నా పేపర్ చూసి మా సీనియర్ కూడా కాసేపు మాట్లాడలేదు .. ఆయన కూడా నా బూతులకు సానుభూతి చూపించి ఓదార్చడానికి తనకు మాటలు రాక కొన్ని హరికృష్ణ పాటలు వాడి భరతనాట్యం ఇంకా బ్రేక్ డ్యాన్సులు గట్రా తన పి.సి లో చూపించి ఆనందపరిచి నా అల్లకల్లోలమైన ఆక్రోశాన్నిఆర్పగలిగాడు కొంతమేరకు

పేపర్స్ ఇచ్చిన రోజు సచిన్ జైన్, అజయ్ యాదవ్ రాలేదు మరుసటి రోజు వాళ్ళవి వాళ్ళు చూసుకున్నారు చారి గారి రూం లో
అందమైన అమ్మాయిలకే మార్క్స్ అంత బాగా ఎలా వస్తాయో అనే అంతుచిక్కని ప్రశ్నకు చివరకు సమాధానం దొరికింది


హాస్టల్ లో బ్యాడ్మింటన్ కోర్ట్ లో రకరకాల డిస్కషన్స్ జరిగేవి ప్రతి రోజు సాయంత్రం
ముఖ్యంగా పరదేశి ఇంగ్లీష్ పలికే విధానం జర్మన్ ఫెంచ్ ఇటాలియన్ ని ఇంగ్లీష్ లో మిక్స్ చేసి మాట్లేడేది ఇలా స్వచమైన ఇంగ్లీష్ ని మాట్లాడితే వర్కౌట్ కాదు అని తెలిసి తెలియని తెంగ్లిష్ లో మాట్లాడి అలా తనకు తిక్క తెప్పించేవాళ్ళం
భారతి స్కూల్ అఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ క్లాసు లో గల పరదేశి గురుండి వాళ్ళు బాగా చెప్పేవారు
దానికోసం స్క్రిప్ట్ తయారుచేసుకుంటున్నా వచ్చే భాగం లో వివరిస్తాను

మార్క్స్ ప్రభావం ఎంతగా వుండేది అంటే ఒక వారం రోజులు నిద్ర లో లేచిన ఎప్పుడూ ఛీ నా బతుకు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకునేవాడిని hangover నుండి బయట పడడానికి లైబ్రరీ లో నైట్ స్టడీస్ మొదలెట్టా, మిగతాది మరో పోస్ట్ లో చెప్తా

అంతవరకు http://www.youtube.com/watch?v=d_Nt5mEZ2r0

18 comments:

మురళి said...

బాగుంది.. మీరు ఏక్తా కపూర్ అభిమానా?

Aditya Maddula said...

Karan Johar Concept bavundi...

Shashank said...

హరే రామా హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

గురు ఇందులో నాకర్థం కానిది రెండు విషయాలు -
1. బొంబాయి లొ వర్షాలు పడితే నీ టప కి లింక్ ఏంటి అని? ఎంచక్క ఇంట్లో కూర్చొని రాయచ్చు కదా? అహ.. రాయచ్చు కదా?
2. నీకు క్లాస్ ఫస్ట్ వచ్చినా ఏడుపెందుకు అని? చారి ఇవ్వని మార్కుల వళ్ళ అది పోయిందా? మనం ఫస్టా కాదా అని కూడా పట్టించుకుంటామా? (పాస్ అయితే చాలు టైప్ అనుకున్నానే.. పొరబడ్డానా? )

..nagarjuna.. said...

పరదేశికి 0.5 నుండి 18 వేస్తే సాను‘బూతు’లు పెట్టు బాస్‌...ఊకెనే ఎందుకు ఫీలవుతున్నావ్‌....లైట్ దీస్కో.

హరే కృష్ణ said...

మురళి గారు ధన్యవాదములు
ఏక్తా జీ ది మా ఏరియా నే

హరే కృష్ణ said...

ఆదిత్య :) ఇంత బిజీ లో కూడా విజిట్ చేసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్స్
తొందరగా పూర్తిచేసేయ్ మరి

హరే కృష్ణ said...

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

ఎటునుండి వచ్చినా ఫస్ట్ అని అన్నాను అది మీరు గమనించలేదు అనుకుంటా అవి నాకు వచ్చిన మార్క్స్ కాదు కోసేసిన మార్క్స్ అందుకే బాధ :(..

ఆఫీసు లో బ్లాగులు రాసే నాలాంటి వాళ్ళ కోసం వర్షం అడ్డం వచ్చింది
ఈ మధ్య మెట్రో లో వెళ్ళడం కష్టం అయ్యింది ఆఫీసు కి సెలవులు వాళ్ళు కొన్ని ఇస్తే నేను కొన్ని పెట్టా

పాస్ అయితే చాలు అనుకున్నా కాని చారి గారు
చైనీస్ సినిమా చూపించారు

హరే కృష్ణ said...

నాగార్జున గారు అత్మానందానికి విచ్చేసిన మీకు థాంక్స్
కీప్ విజిటింగ్
ధన్యవాదాలు

Karthika said...

idea ichav post rayali annav em ayyindi mari?whers tht post oyee?

avunu aa youtube link post chadivinanduku bonus aa?heheh :)baane ne undi oye idea gudd.

vikky2vikram said...

katti meeda kopam karan johar meeda choopinchadam.. baagundi

ప్రభాకర్ said...

మీ డిపార్టుమెంటు లో చారి గారు మాత్రమే గొప్పోరు... మా డిపార్టుమెంటు లో అధ్యాపకులు అందరు గోప్పోరే.... ఒక్కో మాస్టారు గారిది ఒక్కో స్పెషాలిటి .....ఎలాగైతేనేం మన అనుభూతులు (manaanuboothulu) అందరికి పంచిపెడుతున్నావ్ .. వాక్య నిర్మాణం అద్భుతంగా ఉంది..Keep writing..

హరే కృష్ణ said...

karthika,antha manchi idea ni intha simple ga raasesthe ela cheppu
nuvvu demand cheyyadam too much :(
raasthale.. thanks oyye:)

హరే కృష్ణ said...

vikky.. thank you
flemingsm lanti idea lu asalu raavadam ledu
thanks :)

హరే కృష్ణ said...

ప్రభాకర్
మీ గైడ్ ఇంకా సింగ్ ఇస్ కింగ్ గురించి రాసేస్తా !
ఖబడ్దార్ ..
నీ అమూల్యమైన కామెంట్ రాసినందుకు చాలా థాంక్స్ ! :)

మరువం ఉష said...

అయ్యోరామా, మాకు జూనియర్ అయ్యుంటే ఆ డాన్సులేవో మీతోనే చేయించేవారం ;) ఒకరివి ఒకరు చూసుకుని సరదా పడేవారు. ఇంతకీ "అందమైన అమ్మాయిలకే మార్క్స్ అంత బాగా ఎలా వస్తాయో అనే అంతుచిక్కని ప్రశ్నకు చివరకు సమాధానం దొరికింది" ఏమిటో ఆ సమాధానం, నన్ను చూసి ధుమ ధుమ లాడిన వారికి copy and paste చేసి పంపేస్తా... ;) ;)

పరిమళం said...

బావున్నాయ్ మీ కాలేజీ కబుర్లు ! టైటిల్ అలా ఎందుకు పెట్టారో నాకు సరిగా అర్ధం కాలేదు .

హరే కృష్ణ said...

ఉష గారు థాంక్స్ ..బతికిపోయాను మీ జూనియర్ కానందుకు
మౌనమే నా సమాధానం కాపీ పేస్ట్ చేసుకోండి :)

హరే కృష్ణ said...

పరిమళం గారు
థాంక్స్ ..టైటిల్ అంటే చేతన్ భగత్ నుండి ఇన్స్పిరేషన్