ఈ మధ్యనే ఆఫీస్ నుండి రూమ్ కి ట్రైన్ లో వెళ్తుంటే ఇనుప ఊచ చిన్నది చొక్కాకి తగిలి హాండ్స్ దగ్గర చిరిగిపోయింది.
కొత్త చొక్కా కొనుక్కుందామని షో రూమ్ వైపు వెళ్ళాను
చలికాలం లో బట్టల షాపు వాడు వేసిన AC కి నాకు చిరాకొచ్చి ఒక సూక్తి నా నోట్లో నుండి వచ్చింది
"చిరిగినా చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో" అని
వెంటనే బుక్ స్టోర్ వైపు పరుగులు తీశాను
అలా ముంబై ఫేమస్ అయిన బుక్స్ దొరికే ఏరియా లోకి ప్రవేశించాను
న్యూ అరైవల్స్ చూపించు అని అడిగితే ఇష్టమొచ్చిన నవల్స్ అన్నీ చూపించాడు
ఇది బావుంటుంది సార్ ఇది చూడండి సార్ థ్రిల్లర్,బెస్ట్ సెల్లర్ అని ప్రాసలతో పిచ్చెక్కించాక
ఒక అరగంట గడిచాక నాకొద్దు నాకేమీ నచ్చలేదు అని చెప్పినా ఏంటి కొనకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ అరగంట నా శ్రమ వృధా అని తిరిగి గొడవ పెట్టుకున్నాడు
నాకు ఇష్టంలేదు ఆల్రడీ చదివేసినవే ఉన్నాయి అని చెప్పినా వాడు వినిపించుకోవడం లేదు
కొను కొను అని మరో పది నిమిషాలు అరిచాడు
నా సహనం లిమిట్ క్రాస్ అయ్యి పిచ్చి పీక్స్ కి shift అయిపోయింది
వీడెవడురా బాబు డిస్ట్రిబ్యూటర్ లు దొరకని ఢమరుకం ప్రొడ్యూసర్ లా నా వెంట పడుతున్నాడు ఏం చెయ్యనురా దేవుడా అని రెండు నిమషాలు ఆలోచించాను
అదే టైం లో తెలుగు బ్లాగులు పోస్ట్ కి ఎవరో మహనీయుడు నా పాలిట దేవుడు లా కామెంట్ పెట్టారు.
తెలుగు బ్లాగులు ముంబై బ్లాగర్లు అని మెదడు లో ఒక ఫ్లాష్ మెరిసింది,ఆ ఫ్లాష్ లైట్ నేరుగా
వెను వెంటనే
నేను:I'm searching for the one which my friend had recommended
షాప్ కీపర్:ఏంటా నవల్ ?
నేను: మా గూరూజీ రాఘవేంద్ర రావు కొత్త హీరోయిన్ ది అంటే బాగుండదని
Wind rains of Moon Light (తెలుగు లొ తర్జుమా చేసుకొనుము)
షాప్ కీపర్:ఆథర్ ఎవరు
నేను:రాబిన్ శర్మ
షాప్ కీపర్:అది లేదండీ సారీ, వేరే ఏదైనా తీసుకోవచ్చుకదా
మళ్ళీ నేను ఆలోచనలో పడ్డా
కొద్ది క్షణాల్లో
I need "The Guava tree in our backyard" అని అనేసరికి వాడు రెండు వరుస బాలయ్య సినిమాలు చూసిన ప్రేక్షకుడిలా నీరసించిపోయి లేదు సార్ అని జాలిగా అన్నాడు
వాడి మైండ్ బ్లాక్ అయిపోవడం తో
నాకు వచ్చేవారానికి ఈ రెండు పుస్తకాలు కావాలి
ఎందుకంటే ఖచ్చితంగా ఈ నెలాఖరకు వాటిని చదివితే కాని నిద్ర పట్టదు
అని చెప్పేసి జంప్ అయిపోయాను అక్కడ నుండి రాఘవేంద్ర రావు కి మనసు లోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ!