శుక్రవారం
ఆఫీస్ లో సిస్టం ఆన్ చేసి outlook లో inbox insight చూస్తే
థూ! ^$^&%&%*&%
వాడు పొతే వీడు,వీడు పొతే వాడు వాడుపోతే ఇంకొకడు అని ఆఫీస్ లో పని చెబితే
హ్మ్మ్! ఏం చేస్తాం,వాళ్ళు చెప్పింది అంతా చేస్తాం.
సాయంత్రం అవుతోంది పిచ్చి పీక్ కి వెళ్ళిపోయింది
ఎలాగైతేనేం పని ముగించేసి బాస్ కి మైల్ పెట్టాక
మా వాడు చాకిరీ చేయించుకున్నాక నాతో ఇలానే చెప్పాడు
ఈలోపు రివ్యూ లు పొంగి పొర్లుతున్నాయి కామెంట్లకి లైకుల ప్రవాహం లో సేదతీరకుండా తీరాన్ని కొడుతున్నాయ్!
సరే ఓపెన్ చెయ్ వెబ్ సైట్..
టికట్ బుక్ చెయ్ ఆన్ సైట్.
తెలుగు ప్రేక్షకులు అని చెప్పి
Robert Downey Jr. వేసిన Iron Man డ్రెస్ ఎర్ర ఈగ కి వేసేస్తారా
షెర్లాక్ హోమ్స్ ని ఏలూరు లాకులు గా తెనుగీకరించినా నాకెందుకో నచ్చలేదు హై..
ఏలూరు లాకులు విజయవాడ లో ఉన్నా మాకు అనవసరం
లేకపోతే మా గురూజీ ఊరుని విచ్చలవిడిగా వాడేసుకుంటారా..హన్నా!
రసజ్ఞ గారు ఈ ఘోరం చూసారా,అహా చూసారా ?
మీకు కావాలంటే సమంతాని తరవాత చూపిస్తాను ముందొక ద.హా కొట్టండి!
సినిమా చూసొచ్చి మా ఫ్రెండ్ మహానంద హేల
తన చెప్పుడు మాటలు విని సినిమా చూసాక నేను చెప్పు తీసుకోకుండా తాగిన కోలా
అయ్యా,_____య్యా నీ జీవ ప్రేమ ని జూలో కప్పెట్ట
ఎంత ఈగ ని జూమ్ చేస్తే మాత్రం అంత బాగా నచ్చిందా
నీకు అయిదు సార్లే ఏడుపు వచ్చింది
నాకు సినిమా చూసినప్పుడు చూసాక కూడా ఏడుపే ఏ ఏ...
నాని ఒక్కసారి కూడా టచ్ చేయడు హీరోయిన్ని
మొత్తం కెమిస్ట్రీ ఫిజిక్స్ అంతా విలన్ మరియు హీరోయిన్ మధ్యే జరుగుతాయి..
మనకు మాత్రం హైడ్రాలిక్స్ అవసరం అవుతాయి
ప్రయోగం బాగుంది అభినందించాలి visual ట్రీట్,బ్రిటానియా బోర్బాన్ etc..etc..నాకు మాటలు రావడం లేదు
త్రివిక్రమ్ రావయ్యా తొందరగా రా
నీ డైలాగులు మాకు చాలు
నీ సినిమా లేక మేము పడుతున్నాం ఆపసోపాలు
ఈ దీక్షా తాప్సీ కాలం లో కూడా నీకేల కోపతాపాలు
రణబీర్ పెప్సీ తీసుకొని నీ ఫ్లేవర్ లో ఇవ్వు చాలు
కాదంటావా..
రాఘవేంద్రా,రావయ్యా ఒక ఫ్రూట్ సలాడ్ ఇచ్చి పోవయ్యా!
బాటమ్ లైన్:బాటమ్ లో లైన్ ఉండదు టాప్ లో ట్రైన్ ఉండదు.
నేనూ బుక్ మై షో లో టికెట్ తీశాను మరోసారి అడ్డంగా బుక్ అయ్యాను