Pages

Sunday, June 17, 2012

ఫెరారీ కి సవారీ..







$%$&$9
సినిమా అంటే ఏంటి అసలు ?

శర్మాన్ జోషీ
తనకు తండ్రి గా బోమన్ ఇరానీ 
తన కొడుకు గా చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ ఈ సినిమాలో నటించారు

అసలు దర్శకుడు ఏం చెప్పదలచుకున్నాడు
తన అబ్బాయిని స్కూల్ లో దించడానికి వెళ్తూ  
ట్రాఫిక్ పోలీస్ లేని ఒక జంక్షన్ లో పొరపాటున క్రాస్ అవుతాడు హీరో
అది వాళ్ళ నాన్నకు పిల్లాడు Kayo (మాస్టర్.రిత్విక్)  చెబుతాడు.


దగ్గరలో ఉన్న ట్రాఫిక్ యూనిట్ దగ్గరకు వెళ్ళి మరీ ఫైన్ కడతాడు హీరో !
ఇదేం నిజాయితీ రా బాబూ అని అనుకుంటుండగా
ఇరవై నిముషాలు అయ్యాక
సినిమా అవుట్ లైన్ అర్ధం అయ్యింది..

హీరో వాళ్ళ అబ్బాయి క్రికెట్ బాగా ఆడతాడు.
వాడికి క్రికెటే లోకం
శర్మాన్ జోషీ కి వాళ్ళ అబ్బాయే లోకం.
చూసినోడు  పిచ్చిమాలోకం ?  

(నేను జండూ బామ్ లేక పోలో తింటూ నన్ను నేను తిట్టుకోడం మొదలెట్టాను)

లార్డ్స్ లో ఆడే అరుదైన అవకాశం హీరో కొడుకు కి వస్తుంది.
దానికి కనీసం లక్షా యాభై వేలు అవసరం అవుతాయి
శర్మాన్ జోషీ RTO ఆఫీస్ లో హెడ్ క్లెర్క్ గా సామాన్య జీతం తో సాధారణ జీవితం గడుపుతుంటాడు.

ఈ లోపు ఒక రాజకీయ నాయకుడు కొడుకు తన పెళ్ళికి ఫెరారీ షో పీస్ గా కావాలని వెడ్డింగ్ ప్లానర్ ని పట్టుపడతాడు.
ఫెరారీ అద్దెకు దొరికినా ఎంత డబ్బు ఇవ్వడానికైనా సిద్ధం గా ఉంటాడు..


ఆ  వెడ్డింగ్ ప్లానర్ RTO ఆఫీస్ కి వచ్చి ముంబై లో ఎన్ని ఫెరారీ లు ఉన్నాయో కనుక్కుంటుంది
శర్మాన్ జోషీ ఫెరారీ స్పెసిఫికేషన్స్ డిటైల్స్ అన్నీ చెబుతాడు..
ప్రస్తుతానికి సచిన్ టెండూల్కర్ దగ్గరే ముంబై లో ఉంది అని చెబుతాడు

(నేను:పిచ్చ నా %^$$*&,సౌత్ ముంబై లో ఎల్లో,బ్లాక్,రెడ్ కలర్లో
ఉన్న ఫెరారీ లు ఉన్న మూడు అడ్రస్ లు నాకే తెలుసు
RTO ఆఫీస్ లో ఉండి కూడా ముంబై లో ఎన్ని ఫెరారీ లు ఉన్నాయో తెలియదా..ఉఫ్ఫ్ఫ్ అని నాకు చిరాకోచ్చేసింది)

హీరో తండ్రి బోమన్ ఇరానీ,
ఇతను youngest బెస్ట్ రంజీ క్రికెటర్..
తన బెస్ట్ ఫ్రెండ్ మరియు ప్రస్తుత క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ చేసిన మోసానికి బలయ్యి క్రికెట్ మీద ద్వేషం పెంచుకుంటాడు
కనీసం ఇంట్లో క్రికెట్ పెట్టమని మనమడు అడిగినా అవతలకు ఫో అంటాడు..



ఆ వెడ్డింగ్ ప్లానర్ శర్మాన్ జోషీ తో చెబుతుంది
ఎలాగోలా సచిన్ ని కన్విన్స్ చేసి నాలుగు గంటల్లో మళ్ళీ బండి తీసుకోచేస్తా అని సచిన్ ఇంటికి వెళ్తాడు హీరో
కొన్ని అనివార్య పరిస్థితుల్లో హీరో ని కార్ క్లీన్ చేసేవాడు అనుకొని ఫెరారీ కీస్ తన చేతికి వచ్చేస్తాయి

ఏదైతేనేం ఫెరారీ తీసుకోచేస్తాడు
కాసేపయ్యాక వెడ్డింగ్  ప్లానర్ 1 .5 లక్ష తనకి ఇచేస్తాడు
కారు లో డబ్బులు పెట్టి సచిన్ ఇంటికి తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు.

పోలీస్ లు అందరూ వచ్చేయడం తో ఎలాగోలా బయటకి వచ్చేస్తాడు
లోపల ఉన్న డబ్బు మాత్రం తీసుకు రావడం కుదరదు.

(నేను:డబ్బులు తీసుకోచ్చేస్తే గంటలో సినిమా అయిపోద్ది..ఇంక ప్రేక్షకుడికి మిగిలేదేంటి మిగతా డబ్బులకి న్యాయం చేయడానికి పాప్ కార్న్ మల్టిప్లెక్స్ వాడు ఫ్రీ గా స్పాన్సర్ చేస్తాడా)  


ఏదైతేనేం
తండ్రి కి కొడుకు మీద ఉన్న టాలెంట్ ని నిరూపించడానికి
ఆ  రాత్రి వాళ్ళ కాంపౌండ్ లో క్రికెట్ ఆడిస్తాడు
బోమన్ ఇరానీ బౌలింగ్ చేస్తాడు.
రంజీ లో తను మేటి స్పిన్నర్

అప్పుడు బోమన్ ఇరానీ కి కూడా తన మనమడు మీద బోలెడు నమ్మకం కలుగుతుంది.
వెంటనే తనని మోసం చేసిన ఆ  మాజీ ఫ్రెండ్ కమ్ బోర్డ్ ప్రసిడెంట్ పరేష్ రావల్ ని 38 ఏళ్ల తర్వాత కలుస్తాడు..

నా మనమడు ఇలా క్రికెట్ ఆడతాడు
నువ్వు సెలెక్ట్ చెయ్యాల్సిన పని లేదు వాడే అవుతాడు ఒక ఫ్రెండ్ గా నాకు 1.5 లక్ష ఇవ్వగలవా అని
పరేష్ రావాల్ ఫోన్ వచ్చింది అని అక్కడ నుండి జంప్ అయ్యాక

మళ్ళీ కష్టాలు పడి ఎలాగైతేనేం శర్మాన్ జోషీ ఆ ట్రాఫిక్ బండి ఎక్కించిన ఫెరారీ లో ఉన్న డబ్బు తీసుకుంటాడు

పిల్లాడి సెలెక్షన్ అయిపోతుంది డబ్బు కూడా వచ్చేస్తుంది
పొలిటీషియన్ కొడుకు ఈ సారి బలవంతంగా ఫెరారీ ని మళ్ళీ దొంగలిస్తాడు
అక్కడ జరిగిన గొడవలో
బోమన్ ఇరానీ గేట్ తగులుకొని తీవ్ర గాయం తో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతాడు

పిల్లాడి ఆచూకి తప్పిపోతుంది..! 

కాసేపటికి హీరో
పొలిటీషియన్ కొడుకు ని బెదిరిస్తాడు పిల్లాడిని ఎక్కడ దాచావ్ అని గన్ తీసి పక్కన షూట్ చేస్తాడు

సముద్రం వైపు వెళ్ళాడు ఆత్మహత్య చేసుకోడానికి వెళ్ళి ఉంటాడు అని చెప్పేసరికి
మీడియా అంతా
శర్మాన్ జోషీ ముందు కెమెరాలు పెట్టి మీ పిల్లడు ఆత్మ హత్య చేసుకున్నాడా ? మీకేమనిపిస్తోంది అని చిరాకు తెప్పిస్తారు

క్లైమాక్స్

పరేష్ రావల్,బోమన్ ఇరానీ వీల్లిదరూ కెవ్వ్ కేక అని అందరికీ తెలుసు  శర్మాన్ జోషీ is an underrated actor అని మాత్రం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంగీరించాల్సిన విషయం.

తనకు తన బిడ్డ మీద ఉన్న ప్రేమను హృద్యంగా చెప్పాక.. తన డబ్బులు వెడ్డింగ్ ప్లానర్ కి ఇచ్చేస్తాడు.ఇంతలో తప్పి పోయాడనుకున్న Kayo వాళ్ళ కోచ్ తో పాటు పెళ్లి లొకేషన్ కి వచ్చి అప్పుడు అయిదు నిముషాలు పిల్లాడు డైలాగ్స్ చెబుతాడు...తండ్రి కి కాన్ఫిడెన్స్ ఇస్తాడు


 
మీడియా దయవల్ల పబ్లిసిటీ వస్తుంది దగ్గర ఉన్న సొసైటీ వాళ్ళు అంతా పిల్లాడికి కావాల్సిన డబ్బులు ఆ  మరుసటి రోజు ప్రొద్దున్న
శర్మాన్ జోషీ చేతిలో పెడతారు
పిల్లాడు లార్డ్స్ లో సిక్స్ లు ఫోర్లు చితక్కోట్టేయడం తో సినిమా ఒక లైన్ కాకుండా ముగుస్తుంది


ఆ  లైన్
Thank you Sachin,for inspiring many of Kayos
Including My Son Agni



ఈ సినిమాకి నాకు బాగా నచ్చింది
ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్

fathers day నాడు ఈ సినిమా చూడడం కాకుండా తండ్రి/బిడ్డ మీద ఉన్న ప్రేమ ని చూపించడం లో సఫలమయ్యాడు దర్శకుడు.
 


క్లైమాక్స్ చూసాక    





(నా కళ్ళల్లో నీళ్ళు నాకు తెలియకుండానే వచ్చేసాయి..వార్నీ ఏంటి ఇది రాతి హృదయానికి కన్నీళ్ళా
ఔర ఔరా..నాగవల్లి వెంకటేష్ అఘోరా..అని కళ్ళు తుడుచుకోవడానికి కర్చీఫ్ తీశాను ప్రక్కన అసలే అమ్మాయి కూర్చుంది
సిగ్గులేకుండా ఈ ఏడుపు ఏంటి అని నేను తుడుచుకొని తను కూడా ఏడిస్తే తుడుద్దామని కర్చీఫ్ ని నా మెడ ను రెండో వైపు తిప్పాను ఒకేసారి ..ఆ అమ్మాయి రాజశేఖర్ సిస్టర్ క్యారెక్టర్ లా భోరున బిందెలు బిందెలు కన్నీళ్ళు కార్చేస్తోంది..బాబోయ్ నా దగ్గర డోర్ మేట్,కాని టర్కీ టవల్ కాని లేదు అని ఇంకోవైపు తిరిగాను సామూహిక కన్నీళ్ళ సభలా అందరూ ఏడుస్తున్నారు)

గుండె రాతిదైనా కన్నీళ్ళు కామనే కదా అని గుండె మీద చెయ్యి వేసుకొని నోట్లో మిగిలిన పోలో వేసుకున్నాను.


Wednesday, June 13, 2012

బ్లొందనాలు..




ఆఫీస్ నుండి మధ్యాహ్నమే రూమ్ కి వచ్చేసి
హాల్ లో కూర్చొని చిరు జల్లులను ఆస్వాదిస్తూ చిట్టి చేగోడీలు తింటూ

టీ వీ ఆన్ చేసా
నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అని రజనీ డైలాగ్
బ్లాక్ బస్టర్ మూవీ బాషా రేపు రాత్రి ఎనిమిది గంటలకు మీ జెమిని మూవీస్ లో అని జిడ్డు గొంతేసుకొని ఒకడు అరుస్తునాడు.

సరే  ఆంధ్రా వార్తలు చూసి చాలా రోజులయింది అని జేజమ్మ టీవీ పెట్టాను
వంద శాతం ఫలితాలతో ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రగామి సంస్థ
అని ad వస్తోంది
హ్మ్మ్ ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలేంటి చైతన్యా నారాయణా అని నిట్టూరుస్తూ

మా టీ.వీ పెట్టా 
ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకే సారి పంపించు
ఒక్కొక్కడినీ ఎంచుకొని మరీ పంపించు షేర్ ఖాన్

ఈ సారి ఈ టీ వి చానెల్ కు మార్చా
గుమ్మడి: ఆయురారోగ్యాలు అష్టై
శ్వర్యాలతో వందేళ్ళు వర్ధిల్లు బాబూ!

^$%&%*&% అన్ని చానెల్లో ఈ వంద కి రెండొందల ఆఫర్ ఏంటి అనుకొని
ఫేస్ బుక్ గూగుల్ ప్లస్ లో బోర్ కొట్టిన వాడికి బ్లాగే దిక్కు అని 
బ్లాగ్ స్పాట్ లో సైన్ ఇన్ అయ్యాను.

డేష్ బోర్డ్ లో పోస్ట్స్ చూస్తే 99 ఉన్నాయి..





రావు రమేష్ వాచకం నన్ను ఆవహించుకుంది.. 
 
మండే ఎండాకాలం లో సైతం ముంబై లో వర్షం కురుస్తుంది..
నీ వందో పోస్ట్ రాతను నీ కంటే ముందు నీ వీడియోకాన్ టీవీ ముందే పసిగెడుతుంది
నీకు తెలియకుండానే నీ బ్లాగ్ లో ఇద్దరు ఫాలోవర్లు పెరుగుతారు
ప్రపంచమంతా దేభ్యపు మొహం వేసుకోనేలా బాలయ్య తమిళ్ మాట్లాడుతాడు.
గంగా భవానీ ని ఓదార్చడానికి ఆ  సైతాన్ తరలి వచ్చి తనతో నృత్యం చేయిస్తాడు. (2.52 నుండి 3.35 వరకు)



వంద పోస్టులు అనే మైలు రాయి లో నేను ముందుగా థాంక్స్ చెప్పుకోవాల్సింది

మా ఫ్రెండ్ విక్కీ,ఆదిత్య అప్పటి వరకు బ్లాగ్ అంటే కేవలం నా అనుభవాలను నాకు తెలిసిన మిత్రులకు మాత్రమే తెలియచేయడం అనుకున్నా
తర్వాత మా ఫ్రెండ్ నరేష్ ఈ ఎగ్రిగేటర్ ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు..కలిపాక తెలిసింది
ఏ రేంజ్ లో బ్లాగ్ ని ఆస్వాదించవచ్చో అని..

అలా మొదలైన నా బ్లాగు ప్రయాణం ఇంతమంది ఆప్తులను సంపాదించుకునేలా చేసింది..

ముందుగా చెప్పాల్సింది రాజ్ కుమార్
రోజూ ఎక్కడో మాట్లాడుకుంటున్నా నా బ్లాగేమిటో తనకు తెలియదు తన గురించి అలాంటిది ఏమిటో ఈ బ్లాగు బంధాలు కెవ్వ్
మిత్రులు ఆప్తులవుతారు,ఆప్తులు జప్తు చేయని కుటుంబ సభ్యులవుతారు ప్రాస లో రా
సేసా.. 

వేణూ శ్రీకాంత్ గారు
ఈయన నా బ్లాగ్ లో మొదటి కామెంట్ పెట్టారా...
నాకు ఖలేజా సినిమా గుర్తుకొస్తుంది
ఆయన మొదటి కామెంట్ నీకు మైల్ లో కనిపిస్తుంది
ఆ  కామెంట్ వల్ల నీ పోస్ట్ సూపర్ హిట్ అవుతుంది
.
శివ గారు,
తను కామెంట్ పెట్టగానే 
బ్లాగు భుజాలు విరుచుకుంటుంది సిద్దా...(ఓం నమశ్శివాయ)

మా హర్ష కామెంట్ చేసినప్పుడల్లా
బ్లాగు బొమ్మాలీ అని కాకుండా సోనాలీ అని బుస కొట్టినట్టు విరుచుకుపడుతుంది

ఇందు,
కెవ్వ్ మన్నప్పుడు మహేష్ బాబు సైతం గబ్బర్ సింగ్ అని కేక పెట్టి ఏగ్రిగేటర్ లు కెవ్వ్ మనేలా హోరు మంటుంది.

చాతకం గారు 
ఆయన కామెంట్ చూడాలంటే నీ డేష్ బోర్డ్ ఆర్తిగా తెరవాలా

బులుసు గారు
ఎవరి కామెంట్ కూడలి లో చూస్తే నీ పోస్ట్ కి హిట్ల అభిషేకం చేస్తుందో
ఉలి తో ఇలియానా ను చెక్కినట్టు సంపూర్ణం గా వ్యాఖ్య ఉంటుందో..

రసజ్ఞ గారు
ఎవరి పేరు గూగుల్ ట్రాన్స్లేషన్ లో టైప్ చెయ్యడానికి తలకిందులు అయ్యి లేఖిని దిక్కు అవుతుందో

బంతి గారు 
ఎవరు వన్ లైనర్ వేస్తే కామెంట్ల ప్రవాహం పొంగుతుందో

జలతారు వెన్నెల గారు   
ఎవరు కామెంట్ పెడితే నీ బ్లాగు పై బొట్టు తిలకం లాంటి బిందీ లు పడి నీ బ్లాగుకి శుభం కలుగుతుందో 

థాంక్స్ చెప్పడానికి చాలా మంది ఉన్నా అందరికోసం నా దగ్గర డైలాగులు కరువయ్యాయి 

దూకుడు DVD ఎక్కువసార్లు చూసేసరికి నా వంతుగా  నేను ఈ మధ్య నేర్చుకున్న నాలుగు బ్లాగు పలుకులు..



రేయ్..! వేరే  వాళ్ళ బ్లాగు ని దూరం నుండి చూడాలనిపించింది అనుకో చూస్కో..

నీ ఆత్రం అక్కు పక్షులు తిని
తెలుగు బ్లాగర్ల సమావేశానికి వెళ్ళి ఫోటో దిగాలనిపించింది అనుకో... కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదు ట్రై చెయ్యొచ్చు
సరే చనువు వచ్చింది కదా అని తెలుగు బ్లాగర్ తో ఆడుకోవాలనిపిస్తే మాత్రం తనతో కలసి ఫేస్ బుక్ లో ఫార్మ్ విల్లే ఆడుకో .


నేనూ నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్..
ఆ బ్లాగు ద్రోహి ని నాకు అప్పగించు,నిన్నూ నీ బ్లాగుని కామెంట్లతో వదిలేస్తా
వెన్ను చూపని వ్యాఖ్యలను బన్ను చూపని వంటల బ్లాగులను ఎన్నుకొని మరీ పంపించు
ఒక్కొక్కడ్నీ కాదు షేర్ ఖాన్ వంద కామెంట్లు  ఒకేసారి పెట్టమను ...(మోడరేషన్ నా చేతిలో ఉంది కి కి కి )




బ్లాగర్ అయ్యి
ఉండి ఈ పనులేంటి
అగ్గ్రిగేటర్ లు మేమున్నాం కదా ఏక్షన్ తీసుకుంటాం కదా.

కల్తీ బ్లాగు అని కంప్లైంట్ చేసిన బ్లాగర్ ని అదే బ్లాగర్ మరో కల్తీ కధను బలవంతంతో చదివిస్తే  

నో లోలీస్
ఎవడో రాసిన క్షుర కధనాన్ని చదివి మూడు వందల మంది తలలు నొప్పితో బాధ పడుతుంటే  
నో లోలీస్
తెలుగు బాట కి వెళ్ళిన పాపానికి ఎవడో రాసిన కధ ప్రింట్ అవుట్ ని రోడ్ మీద చదివి బాటా చెప్పుతో కొట్టుకుంటే
నో లోలీస్

అప్పుడు జరిగిన అరచాకాలు రాయలేని బ్లాగు ఆఫ్ట్రాల్ ఒక ప్లస్సర్ ని కుమ్మేస్తుంటే రాస్తుందే..ఏం ? 
వాళ్ళది కూడా మీలానే పాపులర్ బ్లాగు... మీకు తెలియనదా
పెద్ద బ్లాగా.. పాపులర్ బ్లాగా.. నా లానా..
వద్దూ..బ్లాగు పోస్టుల గురించి మాట్లాడొద్దు అడ్మిన్
బ్లాగంటే నాదీ...నెలకో పోస్ట్ రాయాలన్నా నేనే..
వారానికి రెండు పోస్టులు రాయాలన్నా నేనే!
వాళ్ళెంత బ్లడీ కిడ్స్.. పిల్ల బ్లాగులు

నో మోర్ అర్గ్యుమెంట్స్ అడ్మిన్ గారు
మీ దగ్గర రాయడానికి ఏమీ లేదు
బ్లాగిటీ గా బ్లర్ గా చెబుతున్నా
కనబడిన బ్లాగుని కామెంట్ల తో నింపేయడమే
నో లోలీస్ (LOL 's ) 
బ్లాగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బిర్యానీ బీడ్స్
బట్ నాట్ మై బ్లడీ డాష్ బోర్డ్!



బ్లాగు వల్ల కామెంట్లు రాలాయి
కామెంట్ల వల్ల ఉరకలేసే ఉత్సాహం వచ్చాయ్
వాటి వల్ల నీ నిద్ర విలపడింది

నీ బ్లాగు బొంగరం 
నీ కామెంట్లు క్రూరం
నీ కరాచీ కరుచుడు అరాచకం
నీవే నీ బ్లాగుకి ఈ టీవీ సుమన శాసనం
సెల్ఫ్ కంట్రోలే న వినాశనం అని తెలియచేసిన మిత్రులందరికీ  







శ్రావ్య, నేస్తం గారు,సునీత గారు,తృష్ణ గారు,కృష్ణ ప్రియ గారు,వేణు శ్రీకాంత్,,చైతన్య,చిలమకూరు విజయ మోహన్ గారు ,భాస్కర్ అన్నయ్య,మధుర,వాణి, శ్రీనివాస్ పప్పు గారు, భరద్వాజ్ గారు,భారతీయుడు గారు, నెమలికన్నుమురళీ గారు ,పరిమళం గారు,పద్మార్పిత,నాగ ప్రసాద్,కుమార్ గారు,శంకర్ గారు

శశాంక్,నిషి గంధ,సురేష్ పెద్ద రాజు గారు,అమేజింగ్ అమ్మ శశి  తన్నేరు గారు,సుజాత గారు,మరువం ఉష గారు,వినీల గారు,స్నిగ్ధ గారు,వనజవనమాలి గారు,జ్యోతిర్మయి గారు,మోహన రాగం పద్మ గారు,పద్మ ఉండవల్లి గారు,చాణక్య,అపర్ణ,సిరిసిరి మువ్వ గారు,వరూధిని గారు,శ్రీ రామ చంద్ర మూర్తి గారు,

ప్రభాకర్,శ్రావణ్,రవి,విక్కీ,శేఖర్,చంద్రశేఖర్,గిరీష్,సంతోష్,నైమిష్,కార్తీక్,రెహ్మాన్
నాగార్జున,అనుష్క,నాగ చైతన్య,ఫణీంద్ర,ఇంద్ర,రాజా చంద్ర,రాజేంద్ర,నా బ్లాగేంద్ర అయిన మా రాఘవేంద్ర ఆదరించి ఈ బ్లాగు ప్రయాణాన్నినడిపించి లేస్ చిప్స్ పేకట్ లా గాలి లోతేలియాడడానికి దోహద పడిన మిత్రులందరికీ  కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను :)





Wednesday, June 6, 2012

అరువెక్స్ప్రెషన్!

మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పని మీద మా పెదనాన్న వాళ్ళు ఉండే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది..

బస్ దిగి కొద్ది దూరం నడవగానే రోడ్ పక్కనే ఉన్న పచ్చని చేలల్లో మా బందువలబ్బాయ్ కనిపించాడు..


నేను:పరీక్షలు ఎలా రాశావ్ ఆశిష్
ఆశిష్:లైట్ అన్నాయ్,చదివి పొడిచేది ఏమి లేదు మా పొలం ఉంది.. పండగ చేసుకుంటా
నేను:అలా అని ఇప్పుడే చదువు ఆపేస్తావా ?

ఆశిష్:నామ్ కే వాస్తే బీ ఎస్సీ నో, బీ ఏ నో, కానించి అప్పుడు పూర్తి స్థాయిలో మా పని చేసుకుంటా
నేను:నా మాట విని సైన్సు గ్రూప్ తీసుకొని బీ ఎస్సీ వైపు వెళ్ళరా
అయినా బీ ఏ లు చదివి బాగుపడునోడి పేరు కూడా నీకు తెలియదు ప్రస్తుతానికి ఎందుకు ఆర్ట్స్ అంటావు ప్రతిసారీ..

ఆశిష్:అన్నయ్యా ,ఎంత దూరం వెళ్ళినా నీ ఊరుని నీ బ్లాగుని మర్చిపోకు అని పెద్దలు ఊరికే అనలేదు
నీ బ్లాగు కి Raw Material మరియు కామెంట్ల వరదను సృష్టించిన అరివీర ఫలాంకరుడు అయిన రాఘ వేంద్ర రావు చదివినది ఏ గ్రూపు..




నాకు ఎక్కడో కాలి వెంటనే...
ఏమంటివి! ఏమంటివి!.. ఇది బీ.ఎస్సీ బీ.ఏ ల  పరీక్షయే కానీ ఫల పుష్పముల పరీక్ష కాదే??? కాదూ కాకులు గెద్దలను కనకూడదు.. నువ్వు డర్టీ పిక్చర్ చూడకూడదూ... నీ అధిక ప్రేలాపన ఆపకుండా నా కసి ప్రేలాపన వినకుండా .. ఇది ఫల పరీక్షయే అందువా? నీ ఫెవేరేట్ డైరెక్టర్ హరీష్ శంకర్  సమయానికి ఫ్రూట్స్ లేక రిచా గంగోపాధ్యాయ్ మీద వేసిన  గోలీకాయ ఎట్టిది ? ముద్దుగుమ్మ తో మట్టి లాంటి డైరీమిల్క్ తినిపించితిడికదయ్యా..





ఈ లోపు ఆశిష్ వాళ్ళ నాన్న మా దగ్గరకు వచ్చేసారు..

బాబూ..ఎలా ఉన్నావ్, ఎప్పుడు రావడం, ఉద్యోగం ఎలా ఉంది అని నిష్కల్మమైన పిలుపులతో తను మాట్లాడడం కొనసాగిస్తుండగా



నేను:బాబూ అని పిలవద్దండి, కాస్త సిగ్గుగా ఉంది..ఇరవై ఆరు కూడా నిండలేదు,థర్టీ ఇయర్స్ఇండస్ట్రీ కి అర్హుడిని కూడా కాను ప్రస్తుతానికి..
ఆశిష్: అన్నయ్య లాప్టాప్ కొనుకున్నాడు నాన్నా..సూపర్ గా ఉంది గత సారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను.
 
నేను: బాబాయ్, ఊళ్ళో ఏమైనా మీరు ఈ మధ్యన  తోటలు కొన్నారా..పళ్ళు పళ్ళు అని తెగ పలవరిస్తున్నాడు ఇందాకట నుండీ మన ఆశిష్ ? 
మా బాబాయ్:లేదు బాబూ, ఎందుకు అడుగుతున్నావ్...
(ఈ లోపు ఆశిష్ నా వైపు కోపం గా చూడడం మొదలెట్టాడు )
నేను:ఏం లేదులే బాబాయ్ ముంబై లో ఒక మామిడి పండు నలభై రూపాయలు పెడితే కానీ రావడం లేదు మన వైపు లాభసాటి గా ఉంటుందా అని అంతే అని చెప్పేసరికి

బాబాయ్:అయినా మన ఆంధ్రా లో పళ్ళ రైతులకు గిరాకీ ఎక్కడ బాబూ అని చెప్పేసరికి
రాఘవేంద్ర రావు బ్రతికున్నంత వరకూ తెలుగు రైతులకు,UPA ఉన్నంత వరకు సామాన్య ప్రజలకు న్యాయం జరగదు ఇది నగ్మా సత్యం అని నా మనసులో అనుకున్నా!


అది సరే...అబ్బాయి ని ఇంటర్ లో ఎక్కడ చేర్పిస్తున్నారు అని అడిగాను
ఏం చెప్పమంటావ్ బాబూ,సెలవులు కాబట్టి ప్రొద్దున్న  పొలం కి వచ్చి  నాకు సాయం గా ఉంటున్నాడు
తిరిగి ఇంటికి వెళ్ళాక  ఆ  కంప్యూటర్ వదలడు రాత్రి 



ఆ డిష్ టీ.వీ వచ్చాక వీడు చదవడం మానేసాడు
ఆ  అమీర్ ఖాన్ ఏమో ఇస్కో లగా డాలా తో లైఫ్ జింగాలాలా అని చెప్పాడు
వీడి ఎడ్యుకేషన్ లైఫ్.. మార్ డాలా..మార్ డాలా అని గబ్బర్ సింగ్ స్టైల్ లో చెప్పాడు మా బాబాయ్ 

ఆశిష్ వెంటనే నాన్నా మీరు నన్ను తిట్టకండి నేను రెండే గంటలు ఆన్ లైన్ లో ఉంటాను.. అన్న అయితే ఏకంగా నాలుగు గంటలు ఆన్లైన్ లో ఉంటాడు తెలుసా ?
నేను:దీనర్ధం ఏంట్రా.. నేను నాలుగు గంటలు ఉంటానని నీకెలా తెలుసు ?
నిజం చెప్పు ఎన్ని గంటలు కంప్యూటర్ చూస్తున్నావో అని  దబాయించేసి  మా ఊరు బస్సు ఎక్కేసా  :)

బస్ డ్రైవర్ రాఘ వేంద్ర రావు గెడ్డం వేసుకొని హార్న్ కొడుతున్నాడు..
విండో దగ్గర కూర్చున్న నాకు ఎవడో మజ్జిగ బాబూ మజ్జిగ అని అరిచాడు నాకు అవసరం లేదు అని ముందు కెళ్ళి కూర్చుందాం అనుకున్నా కానీ...పరిస్థితి ఇలా ఉంది



ఇంతలో
నేరేడు,ద్రాక్ష,జీడి మామిడి పళ్ళు అని బయట నుండి ఇద్దరు అమ్మేవాళ్ళు ప్రక్కన వాళ్ళిద్దరూ కరుచుకుంటూ నా చెవుల్లో అరుస్తున్నారు.
ఏమైతేనేం బస్సు కదిలింది హమ్మయ్య  అనుకొని కళ్ళు మూసాను
కండక్టర్ కళ్ళు తెరిచాడు.. 
బస్ లో రేడియో ఆన్ చేసాడు..బాక్ గ్రౌండ్ లో 
మా పెరడు కిసాన్ జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే సాంగ్ ప్లే అవుతోంది!