Pages

Wednesday, February 29, 2012

మేరా బ్రేవరీ on 29th February..













చిన్నప్పుడు లెక్కల డొక్కలు చించి చీల్చి ఛెండాడేస్తున్న రోజుల్లో 
exam ముందు రోజు నా ప్రిపరేషన్ కి ఆపరేషన్ జరిగి అది కూడా విఫలమవడం తో టెక్స్ట్ బుక్ నుండి నోట్స్ కి షిఫ్ట్ చేసి ICU లో అడ్మిట్ చేసాక..వన్ నైట్ స్టాండ్ చేసి మరుసటి రోజు కాస్త పౌడర్ మొహం మీద ఎక్కువ వేసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లాను.


నిద్ర మత్తులో బ్లాగులు రాయడం అనే కాన్సెప్ట్ తెలియని రోజులు కావడంతో 

పేపర్ చూసి
హే..బాగా వచ్చింది
exam paper
చిటికలో సాల్వ్ చేసేయొచ్చు..
కమాన్... గంటంటే గంటలో రాసేసి ఇంటికి వెళ్లిపోవాలి సరిగా నిద్ర కూడా లేదాయే నిన్న రాత్రి అని
 
ఆన్సర్ షీట్ మీద పెన్ పెట్టాను..మళ్ళీ రెండింటికల్లా యో యో అని స్కూల్ కి వచ్చేయెచ్చు అనుకొని 
చక చకా చకా నాలుగు స్టెప్స్ వేసాను.. పెన్ కదలడం లేదు
రీఫిల్ తీశాను
పైకి కిందకి షేక్ చేసి మళ్ళీ పెన్ లో పెట్టి పరీక్ష రాయడం మొదలు పెట్టాను..
LHS వైపు ఉన్న పై స్టెప్ రాసాను...అయి
పోయింది రీఫిల్ లో ఇంకు కాదు బ్రెయిన్ సెల్ల్స్ లో పెరిగిపోయిన జంకు అని నిర్ధారించుకున్నాక,



గంట సేపు ఇలా అదే ప్రశ్నలో సతమతమవుతూ పెన్ ను రీఫిల్ ను ఎత్తి దించి
మరో గంటలో మిగిలిన ప్రశ్నలను శోధించి సాధించి ఒక analysis కి వచ్చి
ఓహో...
ఇప్పుడు యాభై కి నలభై అయిదు మార్కులు వస్తాయి అన్నమాట అనుకొని వెంటనే
ఆదిత్య 369 ఎక్కేసాను  .

రెండు రోజులు తర్వాత
మా వీధిలో
మా ఇంటి లోపల హాల్ లో
హేంగర్ కి వేలాడుతున్న
లెదర్ బెల్ట్
క్లాస్ టాపర్ అదీ ఫేవరేట్ సబ్జక్ట్ మాథ్స్ లో

అయిదు మార్కులు తగ్గినందుకు మా ఇంటి ప్రాంగణం లో పది రౌండ్ల దెబ్బలు ఇరవై చీవాట్లు
ఆ తర్వాత రోజు స్కూల్లో నలభై మంది ముందు పోయే పరువు.


(ఆదిత్య 369 లో బాటరీ+మా పరీక్ష ముగించడానికి సమయం) low లోనికి వచ్చేసాక లెక్క లు చూసుకొని లేచి మిగిలిన టైం లో 
ఆలోచించి.. ఆలోచించి.. పరీక్ష హాల్ నుండి బయటకి వచ్చేసాను.


వెంటనే లంచ్ చేసేసి 
మధ్యాహ్నం క్లాస్ లకు అటెండ్ అయ్యాను 


సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది
హెడ్ మాస్టర్ రూం లో
నేను,మా క్లాస్ టీచర్ ఇద్దరం హెడ్ మాస్టర్ ముందు నిల్చున్నాం


మా హెడ్ మాస్టర్ ఐన్ స్టీన్ పుస్తకం చదివిన మానవుని వలె ,రక్షకుడు సినిమాలో నాగార్జున లా
రోమాలు నిక్కబొడుచుకొని మమ్మల్నే కోపం గా చూస్తున్నాడు.
హెడ్ మాస్టర్ మా సార్ తో: ఏమిటి మీరు చెప్పే విధానం... ఒక్కరు కూడా exam సరిగ్గా రాయడం లేదు కనీసం ఎవరేం చేస్తున్నారో కూడా చూడడం లేదు
హరే నువ్వు బాగానే ఉన్నావ్ కదా నీకేం అయింది
నేను:ఏమీ లేదు సార్
హెడ్:నిజం చెప్పు ప్రొద్దున్నరాసిన నీ answer పేపర్ ఎక్కడ ఉంది,అసలు వెళ్ళేటప్పుడు ఇచ్చావా లేదా?
నేను:ఇచ్చాను సార్.. అలా అన్నానే కాని దాచేసిన పేపర్ వీళ్ళకు దొరికి పోయిందా అని టెన్షన్ తో నాకు చెమటలు పట్టేస్తున్నాయ్..

వెంటనే హెడ్ మాస్టర్ CID సీరియల్ లో ACP ప్రద్యుమన్ లా ఒక చూపు మా సార్ వైపు చూసాక చెమటలు పట్టడం తన వంతైంది ఈ సారికి.


అసలే పిల్లల అరాచకాలపై నరకాసురుడైన మా సార్ వెంటనే... సరే స్పాట్ ఫిక్సింగ్  చేయడానికి మొహమ్మద్ అమీర్ ఎలానో లేడు ఇప్పుడే స్పాట్ evaluation చేస్తాను అని 
మా హెడ్ మాస్టర్ సాక్షిగా క్లాస్ లో అందరి ముందు నన్ను క్లాస్ బోర్డ్ పై సాల్వ్ చెయ్యమన్నారు.
మా సార్
నాతో: అసలు.. నీ పేపర్ మిస్ అవడం ఏంటి? అని మళ్ళీ అదే ప్రశ్న

బాబోయ్ ఇప్పుడు నా బాగ్ వీళ్ళు వెతికారంటే.. నా బ్రతుకు
బాలయ్య తో సినిమా చేసి నిర్మా సబ్బు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని  నిస్సహాయతా స్థితి లో ఉన్న నిర్మాత పరిస్థితి అని ముందే ఊహించి
ఇప్పుడు మొదలు పెట్టేయమంటారా సార్ అని వెంటనే అడిగేసాను.

మొత్తం బోర్డ్ మీదే చెయ్యమంటారా మళ్ళీ పేపర్ ఇవ్వరా అని ఒక సారి దీనం గా చూసేసరికి
 

మా సార్: ఏం చేస్తావో తెలియదు.. ఎలా చేస్తావో తెలియదు.. 
నీ ఇష్టం వెనుక నుండి ముందుకు అయినా ముందు నుండి వెనుకకు అయినా నువ్వు ప్రాబ్లం సాల్వ్ చెయ్యొచ్చు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా నీ నెక్స్ట్ బర్త్డే కి పెద్ద కేక్ నాకే ఇవ్వాలి  అని ఒక సినిమా డైలాగ్ వేసాక 


నేను చివరి నుండి సాల్వ్ చేస్తూ చేస్తూ
ఆ తొమ్మిది లెక్కలను చావగొట్టి సాధించాక 45 మార్కులు మా సార్ వేసేసారు తన బుక్ లో
మిగిలినది పేపర్ లో మిగిలిన ఒకే ఒక్క మొదటి లెక్క 
చాక్ పీస్ తీసుకొని బర బరా పరుగులు తీయిస్తూ 


నాలుగు స్టెప్స్ వేసాక
ముందు లెక్కలను సాల్వ్ చేసిన కాన్ఫిడెన్స్ వల్లనేమో
వెంటనే నేను 


మామా ట్యూన్ వచ్చేసింది అన్నట్టు షార్ప్ గా కేచ్ చేసినట్టు ఎక్కడ నుండి వచ్చిందో ఠపీ ఠపీ మని మిగతా స్టెప్స్ వచ్చేసాయి... 
నా బుర్ర లో ఆ అకస్మాతుగా జరిగిన ఆ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంటుందా అని నేనే అచ్చెరువునొందాను.   

నే డస్టర్ తో బోర్డ్ చెరిపేసి మా సార్ కి ఇచ్చాక దుమ్ము దులుపుదామని చేత్తో మా మాస్టర్ ఆ డస్టర్ ని కొడుతుంటే, మిగతా స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టేసారు.. మా హెడ్ మాస్టర్ తో సహా..





వందకి రెండొందలు అంటే ఏంటో తెలియని వయసులో కూడా
యాభై కి యాభై మార్కులు తెచ్చుకొని  అందరి మన్ననలు అందుకున్న ఆ సంఘటన తో


ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనే రోజు నాకు The Shawshank Redemption సినిమాలా చాలా బాగా గుర్తుండిపోయింది.






Monday, February 13, 2012

విన్నపాలు పెరుగు మజ్జిగ తినవలె రాఘవేంద్రా..!

ఒక వేగు రాయుటకు సమయం ఆసన్నమయినది అని ఆకాష టాబ్లెటన్న ఘోష కు నాలో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉలిక్కిపడి లేచాడు.      

రంభ ఊర్వశి మేనక లకు బ్రేక్ ఇచ్చిన 
కే.ఏ.పాల్ రాఘవేంద్ర రావు
ని పకడ్నా ముష్కిల్ నహీ హై.. బికనీర్ నమ్కీన్ హై!




రాఘవేంద్ర రావు 
ఈ పేరు వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

మీరు ఎన్నో కళా ఖండాలు సృష్టించారు.
పక్షవాతం వచ్చి కదలలేని రాజ్ శేఖర్ చేతికో నెమలీక ఇచ్చి నృత్యం నేర్పించారు.
Attention,Stand at ease పొజిషన్ లో ఉండటం తప్ప  ఇంకేం చెయ్యలేని జగపతిబాబు కి సైతం చామంతులు బంతులు ఇచ్చి గెంతులేయించావ్.
మూడు తరాల హీరోలతో పని చేసిన ఘనతను సొంతం చేసుకుంటే మాత్రం అని ఎన్ని బిడియాలు పోతున్నావు..
దొంగ మొహం గా నీ వల్ల మూడు తరాల, ఆ ఫాబ్ ఫోర్ హీరోలు రెండు తరాల హీరోయిన్లను మూకుమ్మడిగా ఆడుకుంటున్నారు కదరా..

ఆ పాట ఏంటి ఆ శృతి ఏమిటి..
ఎం చేస్తావో తెలియదు కానీ పాటల్లో
 శృతి ని పండు ని మాత్రం కలిపేస్తావ్ అందుకే పోకిరి అంత పెద్ద హిట్ అయ్యింది
ససలు గగలు
దదలు నినులు
ససలు  పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు
చాలు చాలు చాలు చాలురరేయ్..
                                             

తొంభై బిందెలు  కొని   ఐదేసి బిందులు ఒక దానిపై ఇంకోటి పెట్టి పద్దెనిమిది వరుసలను రెండు పార్ట్స్ గా చేసి
ఎల్లువోచ్చి గోదారమ్మా  
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో...
ఆగడాల పిల్లోడమ్మా సోగ్గాడా

ఆహా నీ బిందె ల క్రియేటివిటీని బూందీ మిక్సర్ లో కప్పెట్ట.

                                         

రవళి కి ఎవడో ప్రొడ్యూసర్  పెరడు లో ఉన్న జామపళ్ళు.. శ్రియకి నేరేడు పళ్ళు 
రంభ కి బత్తాయి పళ్ళు
రమ్య కృష్ణ కి రోజా సెల్వమణి పువ్వులు
అరేయ్ రాఘవేంద్రా..బయటకు వెళ్లి కిలో ఆపిల్ పళ్ళు కొందామంటే వంద రూపాయిలు  పైనే ఉన్నాయ్ రా
 వాలంటైన్స్ డే కి పూల బోకే లు కూడా కాస్ట్లీ అయిపోయాయంటే అదంతా నీ చలవే
దీనంతటికీ కారణం నువ్వే నువ్వే నువ్వే..

పేదలు పండించిన పళ్లన్నీ నీ షూటింగ్ లకు ఎత్తుకేల్లిపోతే మేము ఏం తిని బతకాలి ?
గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ కనిపెట్టిన గెడ్డం గండరా
గిట్టుబాటు ధర కల్పించు రైతులకు ఇక నైనా ముందర.

                                                   

తెలుగు సినిమా ని కామర్షలైజ్ద్ చేసి  ఐన్ స్టీన్  expression ఒకటి ఇచ్చి  దర్శక  ఇంద్రు డి మొహం వేసుకొని  ఐరావతం స్టీమ్ తో వంట వండినట్టు సినిమా ని వండేస్తే సెగలు వచ్చేది ఎవరికీ..


కలర్ ఫుల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ అని గారాలు పోయి కలరాను నిరోధించినంత రేంజ్ లో క్రెడిట్ కొట్టేస్తున్న నీకు

ఇందు మూలంగా చివరగా నేను అభ్యర్ధించేది ఏమిటంటే
నేరేడు,బంగినపల్లి,జామ,నారింజ,చెర్రీస్,క్రాన్బెర్రీస్,బత్తాయి,బొప్పాయి పండించే రైతులు అందరికీ న్యాయం చేసావు
పనస కాయలు ఏం పాపం చేసాయి అని ప్రశ్నిస్తున్నా అద్యక్షా!!!

Wednesday, February 8, 2012

రెండాట్స్..


 


జోరుగా కుండ పోతగా భోరున విలపిస్తున్నాడు వినోద్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర.

పక్కనే ఉన్న నేను నా ఫ్రెండ్స్ ఎంత ఓదారుస్తున్నా జగన్ వస్తే కానీ మంకుపట్టడం మానని చిన్న పిల్లాడిలా గాల్లో ఎగురుతూ  కెవ్వులు పెడుతున్నాడు
కొద్దిసేపటికి బోరు కొట్టేసి స్విచ్ ఆఫ్ చేసిన బోర్ లా స్లో మోషన్ లో  విలపించడం తగ్గించుకుంటూ వస్తున్నాడు.
ఎదురుగా చూస్తే మా క్లాస్మేట్స్ ఇద్దరు అమ్మాయిలు అటునుండి వస్తున్నారు


వారి దొంగ మొహమా అని వాడి వైపు తిరిగేసరికి
వాళ్ళిద్దరూ వెళ్ళగానే సెరెలాక్ టైం కి అందని బిడ్డలా బావురుమంటూ మమ్మల్ని బెంబేలిస్తున్నాడు 
ఏదో కోల్పోయినట్టు ఏమైంది రా అంటే చెప్పడూ..


                                              
           
                                                                
15 గంటల ముందు
----------------------------


అదే కాలేజ్ గేట్ ముందు సాయింత్రం క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్ళకుండా 
తోలి ప్రేమ రిలీజ్ ఇచ్చాడని ఫస్ట్ షో కి వెళ్తే టికెట్స్ దొరకక చివరి ఆటకు ఎలా అయితేనేం బ్లాక్ లో దొరికేసాయి.

ఇంట్లో parents అంతా కాలేజీలకు వచ్చి చూస్తారని తెలిసి టికెట్స్ దొరికిన వెంటనే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి తినేసి మళ్ళీ కాలేజ్ కి నైట్ చదువుకోడానికి అని చెప్పి బాగ్ లు వేసుకొని థియేటర్ కి వచ్చేసాం.

వినోద్ మాత్రం మా ఇంట్లో తినేసి నాతోపాటు కాలేజ్ కి వస్తున్నట్టు వచ్చి సినిమా అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు.



 10 గంటల ముందు
------------------------------------------------


రాత్రి ఇంటికి వెళ్ళిన వినోద్ గాడి ఇంట్లో కళ్ళల్లో కొవ్వొత్తులు కర్పూరాలు వేసుకొని చూస్తున్నారు
వాళ్ళ నాన్న చుట్ట వెలిగించి ఇంకో చేత్తో బెల్ట్ పట్టుకొని
ఎక్కడికి వెళ్ళావురా నిజం చెప్పు ? ఇంత లేట్ ఏమిటి
ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసి అక్కడే చదువుకొని వస్తున్నా నాన్నా

వినోద్ వాళ్ళ నాన్న మా ఇంటికి అర్ధ రాత్రి కాల్ చేస్తే నేను ముందే రిసీవర్ పక్కన పెట్టేయడం తో పలకలేదు.  
ఇంతకీ ఎవరింటికి వెళ్ళావ్ చెప్పు ?
హరే వాళ్ళ ఇంటినుండి అలా రమేష్ వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చున్నాం
రమేష్ వాళ్ళింటి కి ఫోన్ కలిపితే
హలో,రమేష్ ఉన్నాడా
లేదండీ కాలేజ్ కి వెళ్ళాడు.





తర్వాత కాలేజ్ రిసెప్షన్ కి ఫోన్ చేస్తే
నైట్ టైం లో వచ్చే చదువుకోవడానికి వచ్చే అది కొద్ది మంది స్టూడెంట్స్ లో ఎవరో ఒకరు పిక్అప్ చేయడం మాకు అలవాటు కావడంతో
నేను వినోద్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నా
మా అబ్బాయి..... అనే లోపు
సతి లేని  సహాయ హుటా హుటి హతిహేతువైన హరీష్ రిసీవర్ లాక్కొని
డాడీ చెప్పండి,ప్రస్తుతం చదువుకుంటున్నా..
కాస్త నిద్రవస్తోంది గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్! 


అలా ఆ రెండాట్స్ రాత్రి కాస్తా రెండు పెర్మనెంట్ మార్కర్ తో రాసిన డాట్స్ అయిన ధారల్లా లా ఆ నెలంతా అతుక్కుపోయాయి.

ఈ మధ్య ఎవరో ఒక జోక్ షేర్ చేస్తే నేను కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈ సంఘటన గుర్తు చేసుకోవడం జరిగింది.