Pages

Monday, February 28, 2011

A Few Good Men..


స్థలం: Microelectronics and VLSI ప్రొఫెసర్ పాండురంగారావు మాష్టారు ఇల్లు
సమయం : రాత్రి 10.45

ఏంటండీ ఎంత కష్టపడి థీసిస్ లు గైడ్ చేస్తే మాత్రం ఇంక  రాత్రి పగలు తేడా లేకుండా ఇట్లా డిపార్ట్మెంట్ కి అంకితం అయిపోతే  మీ ఆరోగ్యం ఏం కాను.  తిండి కూడా  పట్టించుకోకుండా ఏమిటిది అని పాండు గారి సతీమణి సునంద అడుగుతోంది

ఏం చెప్పమంటావ్ నందూ,ఆ ముఖర్జీ చాలామంది ని గైడ్ చేసేసి బోలెడు పేరు తెచ్చేసుకుంటున్నాడు.. ఇల్లు పెళ్ళాం అని కూర్చుంటే నేను associate ప్రొఫ్ ని ఎప్పుడు అయ్యేది అని అసహనంగా కోపం లో వచ్చిన తన బాధని వెల్లగక్కుతున్నారు పాండు.

ఇక పాండురంగారావు కాంపిటేటర్ ముఖర్జీ ఇతను బహుముఖ రచ్చయో!  ఇతను కాంపస్ లో  చేరిన అతి కొద్ది కాలంలోనే అందరి అభిమానం తో పాటు డిపార్టుమెంటు లో బోలెడు పేరు సంపాదించుకున్నాడు..పాండు హార్డ్ వర్కర్..ముఖర్జీ కంటే మంచి పేరు తెచ్చుకోవడానికి మరింత కసితో  కష్టించి పనిచేస్తున్నాడు.

మరుసటి రోజు డిపార్ట్మెంట్ లో రాత్రి పదిగంటల టైం లో  ముఖర్జీ రూమ్ లో లైట్ ఆన్ చేసి ఉండటం గమనించిన పాండు,ముఖర్జీ ఈ టైం లో ఏం చేస్తున్నాడా అని తన రూమ్ కి కాస్త దగ్గరగా వెళ్ళాడు.
 ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముఖర్జీ కి ఎదురుగా నిల్చొని ఉన్నారు అదే రూమ్ లో..వాళ్ళిద్దరికీ  ఏదో కౌన్సిలింగ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది..డోర్ కాస్త తెరిచి వుండటం తో బయటకు మాటలు వినిపిస్తున్నాయి..ఆ  మాటలు విన్న పాండు వెంటనే
ఇంటికి  చక చకా వెళ్ళి ..ఇంట్లో వాళ్ళ తో కాసేపు అందరితో మీటింగ్ పెట్టాడు.

-----------------------------------------------------------------------------------------------

 ఆ  మరుసటి రోజు ముఖర్జీ దగ్గర పని చేస్తున్న స్టూడెంట్ సంతోష్ ని పిలిచి
పాండు:నువ్వు ఏ హాల్ లో ఉంటావ్
సంతోష్:అది సినిమా ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది
పాండు:సాటి తెలుగు వాడివని ఏమి అనడం లేదు,అయినా నిన్న అంత రాత్రి టైం లో నువ్వు ఆ  అమ్మాయి  ఏం మాట్లాడుతున్నారు మీ గైడ్ తో
సంతోష్ చెమటలు కక్కుకుంటూ వాళ్ళ హాస్టల్ వైపు పరిగెత్తాడు

------------------------------------------------------------------------------------------

తమ హాస్టల్ కి వెళ్ళాక దారిలో ఒక నెంబర్ కి ఫోన్ చేసి తొందరగా హాస్టల్ కి వచ్చేయ్ అని చెప్పి కట్ చేసాక
అప్పటికే షివర్ లో ఉన్న సంతోష్  షవర్ కెళ్ళి రూమ్ కి వచ్చాక రెండు మిస్ కాల్స్ ఒక మెసేజ్ ఉన్నాయి,చూసుకుంటే సంధ్య నుండి మెసేజ్
Waiting in guest room of your hostel.అని ఉంది

గెస్ట్ రూమ్ నుండి కాస్త దూరం లో ఉన్న ఆడిటోరియం వైపు గా ఇద్దరూ నడుస్తున్నారు

సంధ్య:ఏమయ్యింది సంతోష్,ఇంత కంగారుపడుతూ పిలిచావ్
సంతోష్:మన ప్లాన్ తెలిసి పోయింది అనుకుంటా పాండు సార్ కి
సంధ్య:ఏం మాట్లాడుతున్నావ్.ఇది బయటకు తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా
సంతోష్:అవును.నిన్న రాత్రి ముఖర్జీ సర్ రూమ్ లో మనం మాట్లాడుకుంటున్న విషయం వినేసాడు అనుకుంటా
సంధ్య:అవునా! అయ్యయ్యో ఇప్పడు మన భవిష్యత్తు ఏం కాను
సంతోష్:ఈరోజు మనం పాండు సర్  వాళ్ళ ఇంటికి అయినా వెళ్దాం లేకపోతే మన ముఖర్జీ సర్ దగ్గర ఈ విషయం చెబుదాం
--------------------------------------------------------------------------------------------

టైం రాత్రి తొమ్మిది అవుతోంది
డిన్నర్ చేసి  సంధ్య,సంతోష్ పాండు మాస్టారి ఇంటికి వెళ్లారు
థీసిస్ టైం కదా మాస్టారు ఇంకా ఇంటికి రాలేదు మరో అర్ధ గంటలో వస్తారు అనుకుంటా ఇక్కడే కూర్చోండి అని పాండు గారి భార్య సునంద చెప్పడం తో వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొన్నారు.కాస్త చినుకులు పడేలా అనిపించడంతో మీరు ఇక్కడే కూర్చోండి మేడ మీద బట్టలు ఆరబెట్టాను ఇప్పుడే వస్తా అని వెళ్లారు సునంద.
మేడ మీద నుండి కిందకి వచ్చాక సంతోష్ సంధ్య మేము వచ్చి చాలా టైం అయ్యింది..మా థీసిస్ చేసుకోవాలి మేము ఇంక రేపు కలుస్తాం.అని చెప్పి వెళ్ళిపోయాక
ఎప్పటిలానే పాండు గారు పదిన్నర కు ఆరోజు కూడా ఇంటికి వచ్చారు
--------------------------------------------------------------------------------------------

మరుసటి రోజు ప్రొద్దున్న పాండు గారి నాన్న నారాయణ రావు  గారు ఎంతకీ లేవడం లేదు ..ఊపిరి తీసుకోలేకపోతున్నట్టు గా గమనించి,సునంద&పాండు ఇద్దరూ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు
సంపూర్ణ ఆరోగ్యం తో  ఉండే నాన్నఇలా emergency లోనికి వెళ్ళడం అనేది అసాధ్యం.
అసలు ఏమై ఉంటుందా  అని ఆలోచిస్తుంటే 

అప్పుడు సునంద చెప్పింది రాత్రి మీ స్టూడెంట్స్ అంట సంతోష్ సంధ్య ఇద్దరు మిమ్మల్ని కలవడానికి అని వచ్చారు అని చెప్పడం తో వెంటనే పాండు ఇద్దరినీ పోలీసులకి పట్టిద్దాం.వాళ్ళే ఏదో చేసి ఉంటారు మొన్న నేను డిపార్టుమెంటు కి వెళ్ళినప్పుడు కూడా నారాయణ నారాయణ అని రెండుసార్లు ముఖర్జీ అనడం నేను చూసాను.ఖచ్చితంగా వాళ్ళే చేసుంటారు ఈ ఘోరం అని చెప్పి ముఖర్జీ తో పాటు సంతోష్ సంధ్య ను  పోలీసులకి అప్పగించాక
ఈ విషయం తెలిసి హఠాశుడయిన ముఖర్జీ స్నేహితుడు లాయర్ శశి భూషణ్ కోర్ట్ లోనికి వెళ్ళాడు.

లాయర్ హరి ప్రసాద్ పాండు తరపున వాదిస్తున్నాడు.
శశి భూషణ్:యువర్ ఆనర్, నా స్నేహితుడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఎంతో గౌరవ వృత్తి  లో ఉన్న తను ఇటువంటి పని చేయడు

హరి ప్రసాద్:జడ్జి గారు ముఖర్జీ అసలు విషయం ఏంటంటే పాండుకి వచ్చే పేరు ని తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసాడు.
దీనికి సాక్ష్యం ఆ  ముందు రోజు రాత్రి జరిగిన సంభాషనే నిదర్శనం .

శశి భూషణ్:ప్రూఫ్ లు ఉన్నాయా.
హరిప్రసాద్:అవును ఉన్నాయి.ఆ  పాండు రికార్డ్ చేసిన ఆడియో క్లిప్ ఇదిగో అని ఆన్ చేసాడు
సంతోష్,సంధ్య తల్లి తండ్రుల గుండె వేగం పెరుగుతోంది
.
Nokia C3-01తీసి స్పీకర్ ఆన్ చేసాడు 
మీకేమీ భయం లేదు మీ పని మీరు ధైర్యంగా  చేయండి నా అండదండలు మీకెప్పుడూ ఉంటాయ్. మిమ్మల్ని సేఫ్ గా చూసుకునే బాధ్యత నాది go ahead.. అంతా నారాయణ నారాయణ
అని అదే క్లిప్ ని బర బరా ప్లే  చేసాక

హరిప్రసాద్: వీళ్ళు చెప్పింది కరెక్టే నా,
పాండు:అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు.వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదు నేను జరిపిస్తా అని మాట ఇచ్చా..అంతే!
హరిప్రసాద్:సరే వాళ్ళ తల్లి తండ్రులనే అడుగుదాం.వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటున్నారో  లేదో 
అవును వాళ్ళు మాకు విషయం చెప్పారు కాని మాకు ఇలా పోలీసులు కేసులు అంతే ఇంక వీళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని అసలు ఊహించలేదు

 శశి భూషణ్:అయితే ఇప్పుడు ముద్దాయిలు కాకపోతే మీరు వీళ్ళ  పెళ్లి చేయడానికి మీకేమి అభ్యంతరం లేదు కదా. 
పేరెంట్స్:పెళ్లి చేసి జైలు లో ఏం చేస్తారు. గుడ్డి కంటే మెల్ల నయం ఏదోకటి ముందు ఈ గండం నుండి గట్టెక్కాలి అదే మాకు ముఖ్యం
జడ్జి:అసలు ఏం జరుగుతోందిక్కడ
హరిప్రసాద్:నాకు తెలియాలి,తెలియాలి
పనిమనిషి:నాకు తెలుసు

పాండు ఇంట్లో పనిమనిషి ని నారాయణ రావు తన చేదస్తం తో తెగ విసిగించేవాడు. విసిగిపోయి ఆ  రోజు పొద్దున్నఆరోజు మార్నింగ్ కాఫీ లో  ఎక్కువ నిద్రమాత్రలు  కలిపేశాను.ఇలా అవుతుందని అనుకోలేదు.
జడ్జి:నిజమేనా ?
పని మనిషి:అవును నిజం నిజం నిజం.
హరి ప్రసాద్:its a lie
జడ్జి పనిమనిషి మస్తానమ్మ కి శిక్ష విధించి కధ ని  కోర్ట్ రూమ్ బయటికి తీసుకొచ్చాడు  

కోర్ట్ బయట 
పాండు ముఖర్జీ తో: మిమ్మల్ని నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను 
Sir,i 'm extremely sorry

సంతోష్,సంధ్య ముఖర్జీ తో Sir,we are extremely thankful 


Tuesday, February 15, 2011

Inception PDFined

Inception  అంటే .. మొదలు ..అది ఒక ఆలోచన అయినా కావచ్చు .. కల అయినా కావచ్చు .. మన లైఫ్ లో జరిగే ఏదైనా ఇన్సిడెంట్ అయినా కావచ్చు ..
అలాంటి చక్కని అయిడియా ని ఒక కధగా మలిచి రూపొందించిన చిత్రమే  Inception ...
అలాంటి ఒక complicated  కధని ఒక ప్రాజెక్ట్ లాగ తీసుకుని అందులో ప్రతి సన్నివేశాన్ని విశదీకరించి రాసినదే ఈ పుస్తకం ..
కలలకి అంతఃచేతనకి మద్య ఉన్న తేడా తెలిస్తే Inception బాగా అర్ధం అవుతుంది
ఆ విధంగా .. ఒక వ్యాపారవేత్త కుమారుని మనసులో ఒక ఆలోచన నాటడానికి  కధా నాయకుని సహాయం కోరతాడు ఒక వ్యక్తి ..
ఈ క్రమంలో కధా నాయకుడు ... Architect సహాయంతో పధకం రూపొందించి ... ఒక టీం ఫార్మ్ చేసి కదా ఎలా నడిపిస్తాడు అన్నది ఈ పుస్తకం లో వివరించబడి ఉన్నది .

మొత్తం 4 లెవెల్స్ లో ఉన్న కలల్లో .. టీం మొత్తం ఏ విధంగా తామనుకున్న లక్ష్యాన్ని ఆ  యువకుని మనసులో ఆలోచనని ఎలా నాటారో అర్ధం అవుతుంది

In one sentence it can be perfectly described as
Incept a thought  into subconscious a first part or stage of subsequent events ..Explained here

you can download here to know how the dream is fulfilled!

ఈ సిరీస్ లో PDF అనే ఆలోచన ని తీసుకొని ఎంతో కష్టపడి ఈ-బుక్ రూపొందించిన &
రూపొందించడానికి కారణమైన శ్రావ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు .

I wholeheartedly thank each one of the enthusiasts of inception.

Wednesday, February 2, 2011

డ్రాకులా.. C.Tech


ఎన్నో సంవత్సరాలు చీకట్లో  లో గడుపుతున్న నక్కలు ఒక్కసారిగా ఊల పెట్టే ముందు ఉండే  ప్రశాంతత ఆవహించి ఉంది ఆ  చోటంతా..   కొన్ని నిమిషాలు అయింది ఆ  నక్కలకు చాలా సమీపం లోఅప్పుడే టైడ్ డిటర్జెంట్ ఫిలిప్స్ ట్యూబ్ లైట్ వాళ్ళు ప్రవేశ పెట్టిన ధగ ధగలతో  తెల్ల బట్టలతో ఒక వ్యక్తి నడుస్తుండడం కనిపించింది  స్మశాన సరిహద్దులంతా వ్యాపించేలా ఆ  వెలుతురు ప్రకాశిస్తోంది..వీటన్నిటిని ఒకపక్క గమనిస్తున్న కాద్రా..నిద్ర లే నిద్ర లే అని రెచ్చగొడుతూ మంట లో  జీలకర్ర ఎలకలు సారీ ఏలకులు వేసి ఆ  సువాసన ని అఘ్ర్రానిస్తూ అఘోరిస్తున్నాడు. అకస్మాత్తుగా గమ్మత్తైన మత్తులో ఆ  వాతావరణం లో ఉన్న కాద్రా జపిస్తున్న మంత్రాలన్నీ  చేధిస్తూ  ఆ వ్యక్తి తన వైపు గా మరింత ముందుకు రావడం తో..కాద్రా గుండె గబా గబా గుబేల్ మంటూ గోలేడుతుంది.

ఎన్నో ఏళ్లుగా నువ్వు సాధించాలనుకున్న సమయం ఆసన్నమయింది అని రీ సౌండ్ ఆ  చుట్టూ పక్కల ప్రతిధ్వనిస్తోంది. నీ మంత్రోపాసనం తో ఈ స్మసానాన్ని మన్ను మసానం తో నింపేసే అనిఈ సారి  ఒక వ్యక్తి అరుపు మరింత గట్టిగా వినిపించింది.  ఈ చిరు చినుకులకు తోడు గాలి కూడా మరొకసారి గిలిగింతలు పెట్టింది ..చాలా హాయిగా ప్రశాంత మైన వాతావరణం కమ్ముకుంటుంది అనగా ఎక్కడ నుండో  ఒక నక్క ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా! ఇలా నా కళ్లు నిన్నే చూస్తుండాలా ..చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మదే స్మశానం లోన సర్ఫింగ్ చేస్తుందిలా.. అని ఊల పెడుతోంది. ఈ గాలి జోరుకి తోడు నక్క ఊల కాద్రా ను మరింత అసహనానికి గురయ్యేలా చేయడం తో కోపోద్రేకుడు అయిన కాద్రా..  నా మంత్రాలను చేధిస్తూ నువ్వు తట్టుకోవడం సాధ్యం కాదు అని ఇంకా గట్టిగా అరుస్తూ తన పిడికిలి బిగించి మంటలో మరింత గడ్డిని వేయసాగాడు..

చినుకులు పెరిగి కాస్త పెద్ద వానగా మారేటట్టుగా అనిపించడం తో ఆ శబ్దాల హోరు నెమ్మదించింది.అయినా కూడా పరుచూరి బ్రదర్స్ ని వదలని బాలకృష్ణ లా కాద్రా తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారిగా ధూమ్ కెన్నడీ బుష్ అని గట్టిగా అరిచి తన సంచి లోనుండి బయటకు తీసి  వేసాడు గన్ పౌడర్ ..గాలి ఉధృత పెరిగిపోవడం తో తన మొహం పై మరింత మంట పైకి వస్తోంది.ఇవన్నీ చాలదన్నట్టు చెమట ఇంకోవైపు చంపేస్తోంది ఇటువంటి విపత్కర పరిస్తితి ని ఎదుర్కుంటున్న కాద్రాని మిగతా దెయ్యాలు సూటిపోటు అరుపులతో నక్కలు కెవ్వు కేక లతో పిచ్చేక్కిస్తున్నాయ్..

ఈ హేళన ని సహించలేని కాద్రా  ఈసారి తన సంచిలోనుంచి ఒక ఎముక తీసాడు.చెమట వల్ల వచ్చిన itching sensation ప్రాలదోలడానికి ఉపయోగించాక తిండి వస్తువులతో పాటు ఆ  ఎముక ని కూడా పెట్టేయడం వల్ల వాలిన దోమలను చూసుకోకుండా  దద్దుర్లు వచ్చి వికటించడం తో ఇకలాభం లేదని Boroplus  పౌడర్ తీసుకొని జల్లడం మొదలెట్టాక  టాల్కం లో ఉన్న hydrated magnesium silicate బోన్  లో ఉన్న కాల్చియం తో మిక్స్ అయ్యి కాల్షియం ఎమినో బొందాక్సైడ్ ఏర్పడి వర్షపు నీటిలో వరదలా పారి స్మశానాన్ని అల్ల కల్లోలం చేసి నగర కాలుష్యం ని తట్టుకోలేక తన బట్టలను నల్లగా తయారు చేసుకున్న దయ్యాన్ని సైతం నురుగ లో ముంచి పడేసింది.ఇంతలో ఒక వాన్ వచ్చి కాద్రా ముందు ఆగింది
 
ఎదురుగా ప్రాజెక్ట్ కన్సల్టెంట్ కాద్రాతో  ఈ నురుగేంటి ఈ బుడగలేంటి.. నువ్వు ఎంచుకున్న ప్లేస్ ఏంటి ,వర్క్ allot చేసే ముందు  ఏమైంది ఈ శ్రద్ధ నీ వర్క్ షెడ్యూల్ బార్ చార్ట్ లు హిస్టో గ్రామ్ లు వేసి నానా హంగామా చేసి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నావ్ కదా  ..ఇప్పుడు డెడ్ లైన్ అయిపోయింది

కాద్రా:i did everything i can but you know due to natural calamities..

కన్సల్టెంట్:సోది ఆపి,అయిదు ముక్కల్లో చెప్పు ఫైనల్ output ఏంటో
కాద్రా:నిండు చందురుడు ఒకవైపు నక్కలు ఒకవైపు
కన్సల్టెంట్:oh,that's great..thank you and you are out!

నక్కల ఆరెంజ్ కి.. కాద్రా రివెంజ్ ఇంకా ఉంది :)