ప్రదేశం:పేటెంట్ పురం ,కృష్ణా జిల్లా
అవి అధర్మం Johnson's baby lotion రాసుకున్న పాదాలపై నడుస్తున్న రోజులు.ప్రజలందరిలో ఏదో భయం,న్యాయం జరగలేదనే బాధ కళ్ళలో కనిపిస్తోంది.సడెన్ గా ప్రజల కళ్ళు నారింజ రంగులోనికి రావడం జరుగుతోంది..ఏదో శాపం మొదలయ్యింది అని ప్రజలంతా నమ్మడం మొదలెట్టారు.ఎవరూ తిట్టకుండా కొట్టకుండానే ఏడుపులు వచ్చేస్తున్నాయి,పిల్లలు పెద్దా తేడా తెలియకుండా అదే పరిస్థితి
మరో రెండు రోజులకి కళ్ళు ఎర్రగా మొదలవ్వడం మొదలయ్యాయి. ఆ మరుసటి రోజు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్నాయి. భోరున వర్షం,గ్రామం లో ఒక ఇంటి ముందు ముందు పెద్ద పిడుగు పడింది.ఆ ఇంటి ఎదురుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ...నా అని ఒక పిల్లాడి ఏడుపు వినిపించింది సీన్ కాపీ పేస్ట్ చేస్తే..
వెంటనే ప్రజల కళ్ళలో ఎరుపు తగ్గడం మొదలయ్యింది. పడిన రోజే ఆ ఇంటి ముందు మరో పిడుగు పుట్టింది అని ప్రజలంతా డిసైడ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.
గ్రామ సర్పంచ్: మీ అబ్బాయి మామూలు మనిషి కాదు కారణ జన్ముడు వీడికి పేరు గ్రామ పెద్దలే నిర్ణయించాలి
పిల్లాడి తల్లి తండ్రులు:అబ్బా ఛా! రుజువు ఏంటి.
సర్పంచ్:చూసావా! అందరి కళ్ళు ఎలా ఎర్రగా అయ్యాయో మళ్ళీ పుట్టగానే ఎలా మామూలుగా మారాయో ఇది ఖచ్చితంగా మీ అబ్బాయి పుట్టిన వేళా విశేషమే
పిల్లాడి పేరెంట్స్:కండ్ల కలక కి కారణ జన్ముడు కి తేడా తెలియని %&#@$@
సర్పంచ్:అధిక ప్రసంగం వద్దు ఇది ముమ్మాటికి మా గ్రామ బాగుకోసం పుట్టిన బిడ్డ వీడు వీడి బాధ్యత గ్రామానిదే అని తీర్పు చెప్పి
అని వాళ్ళ అమ్మా నాన్న మా అబ్బాయికి ఆ పేరు వద్దు అని ఎంత వారిస్తున్నా ప్రజలు పిడుగు రాయుడు గా నామకరణం చేసారు.
పేరు పెట్టిన మరుసటి రోజునే అందరి కళ్ళు మామూలు రంగులోనికి వచ్చేసాయి. రాయుడు కి రెండే రెండు రోజుల్లో ఫేమ్ ని సంపాదించిపెట్టాయి
రాయుడు ఊరిలో iit foundation బడి లేక పోవడం తో అయిదోతరగతి వరకు చదువు లేక సంధ్యను మాత్రమే గర్ల్ ఫ్రెండ్ గా సంపాదించుకున్నాడు.
రాయుడు లోని విలక్షణమైన నాయకుడిని గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు గ్రామస్థులకు.
ఒక రోజు పాము ముంగిస దెబ్బలాడుకుంటున్నాయి ఎవరు గెలుస్తారో తెలియక గ్రామస్తులంతా వాటి చుట్టూ చేరారు.పోటీ మంచి రసవత్తరం గా సాగుతోంది గ్రామ పెద్దలంతా ఎవరు గెలుస్తారు అని పందేలు కాస్తున్నారు.సరిగ్గా అప్పుడే రాయుడు ని సంధ్య గిల్లింది పట్టించుకోలేదు రాయుడు.ఇంకా గట్టిగా గిల్లింది ఈ సారి సంధ్య.అయ్యా...! మగిస అని గట్టిగా అరిచాడు రాయుడు. ఆ అరుపుకి పాము బెదిరింది.ముంగిస పాముపై తిరగబడింది.రాయుడి సుడితిరిగింది.
ప్రజలంతా పోటీ వైపు చూడకుండా రాయుడి వైపు చూడడం మొదలెట్టారు.
గ్రామ సర్పంచ్:చూసారా.. నేను ఆరోజే చెప్పాను వీడు కారణ జన్ముడని, మాటలు కొద్ది కొద్దిగా తెలిసినా కూడా అంతిమ విజేత ముంగిస అని పలకడం తెలియక మగిస అని చెప్పాడు,వీడు కారణ జన్ముడు..వీడే కారణ జన్ముడు..నా వారసుడు..కాబోయే సర్పంచ్ కూడా వీడే అని నాకు ఘాట్టి నమ్మకం.. ఊ..ఊ
ప్రజలు:అవును ముమ్మాటికీ కారణ జన్ముడే
రాయుడి తల్లి తండ్రులు:అంతే అంటారా..
సర్పంచ్:రెండు సార్లు చెప్పినా నా మాట మారదు, మాట మీద నిచ్చెనేసుకొని నిలబడే మనిషిని నేను అని మీకు తెలియదా
spectator:మా వెదురు తోటలు అన్నీ మాయమవుతున్నాయి ..నిచ్చెన కి కలప దొంగతనం నువ్వేనా చేస్తోంది..
సర్పంచ్:ఎవరది..నరికేస్తా!
spectator: పో పోవోయ్.. అవును సరిగ్గా చెప్పావు..నరకడమే ..నువ్వు చేస్తోంది అదే అని మాకు తెలుసులేవోయ్!..ఇంతకీ కలపని నరుకుతోంది పగలా.. రాత్రా ?
సర్పంచ్: ఎదురుగా మాట్లాడే ధైర్యం లేక ఎవడ్రా అది కారు కూతలు కూస్తోంది
spectator:కారు కూతలు కాదు బేయ్! కలప కూతలు
సర్పంచ్:మీతో మాట్లాడడం నా మూర్ఖత్వం
spectator:మీ మూర్ఖత్వానికి మా మంగిడీలు
సర్పంచ్: ఎయ్య్ ఎవడ్రా..అని అరుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు
రాయుడిని కీర్తిస్తూ ప్రజలు కూడా తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు
ఈ సంఘటన అయిన వెంటనే రాయుడు ఇంటిదగ్గర సీన్ కానరీ..
పేరెంట్స్:అరే!..నువ్వు ఆ టైం లో ముంగిస అని ఎందుకు అంత గట్టిగా అరిచావ్
రాయుడు:నాకు జరిగినదే నీకు జరిగితే నువ్వూ అలానే అరిచేవాడివి.అయినా నేను మగిస అని కదా అన్నాను
పేరెంట్స్:మగిస ఆంటే ?
రాయుడు:మళ్ళీ గిల్లింది సంధ్య అని
పేరెంట్స్:హతవిధీ!..ఈ సర్పంచ్ సింగనమల రమేష్ కంటే పిచ్చోడు లాగా ఉన్నాడు
అలా అయిదేళ్ళు గడిచాయి. రాయుడు స్కూల్ కి వెళ్ళడం మొదలెట్టాడు సర్పంచ్ తన కార్యాలయం స్కూల్ కి షిఫ్ట్ చేసాడు
స్కూల్ లో 9 to 5 వరకు ఆ తర్వాత గ్రామ పంచాయితీ లో విచ్చలవిడిగా రచ్చ చేస్తున్న రాయుడు జీవితం లో అనుకోని U-టర్న్ వచ్చిపడింది.
రాయుడు మూడో తరగతి చదువుతున్నప్పటి సంఘటన
ఊర్లో ఉన్న single theatre కి వచ్చిన పెదరాయుడు సినిమా పిడుగు రాయుడు పరువు తీసింది.
సినిమా క్లైమాక్స్ లో ఇంగ్లీష్ లో ఫిష్ వాటర్ డైలోగ్ అనర్గళం గా మోహన్ బాబు చెప్పగలిగి ఉన్నప్పుడు మన రాయుడు కూడా ఇంతకంటే ఆదరగోట్టాలి అని పదే పదే గ్రామస్థులు ఫెవికాల్ వేసుకు కూర్చున్నారు '
గ్రామస్థులంతా ముక్త కంఠంతో క్లైమాక్స్ లో పెద్ద మోహన్ బాబు సౌందర్య కి చెప్పే డయిలాగ్ నిజజీవితం లో రాయుడు తో చెప్పించాలని ఆ రోజు ఇద్దరి భార్యా భర్తల కి విష బీజం install చేసి బీటా వెర్షన్ ని మరుసటి రోజు పంచాయితీ లో ప్రవేశపెట్టారు
స్థలం:గ్రామ పంచాయితీ పక్కన పాఠశాల
సర్పంచ్ తీర్పుతో సినిమా లో రాయుడి తీర్పు కంపేర్ చెయ్యడానికి స్కూల్ కి ప్రజలంతా పెందలాడే పరుగులెట్టారు
అందరూ కార్రియెర్ కార్రియెర్ లు గెంజి వేసుకొని స్కూల్ ముందు చేరారు
సర్పంచ్: సభకు నమస్కారం! సమస్య ఏంటి
spectator:ఈ ఊరికి నువ్వే పెద్ద సమస్య కదా
సర్పంచ్:ఏయ్ ఏయ్..మాటలు జాగ్రత్తగా రానీ..విషయం ఏంటో చెప్పండి
ప్రజలు:ఏమి లేదు.. పెదరాయుడు సినిమా చూసాక ఈ భార్యా భర్తలు విడిపోయారు ఆ సినిమా లో చూపించినట్టుగా భర్త కి భార్య మీద అనుమానం వచ్చింది.చివర్లో మోహన్ బాబు ఇంగ్లీష్ లో సర్ది చెబుతాడు అది వీళ్ళకి అర్ధం కాలేదు సినిమాలో సౌందర్య మోహన్ బాబు కలిసారు నిజజీవితం లో వీళ్ళు విడిపోయారు దీనికి మీరే పరిష్కారం చూడాలి
సర్పంచ్:ఏం చెయ్యాలబ్బా..నాకేం చెయ్యాలో తోచడం లేదు
spectator :ఆ విడిపోయిన అమ్మాయి ని నువ్వు పెళ్లి చేసుకో..చాలా సింపుల్ అవును చాలా సింపుల్ అని మరో ఇద్దరు spectators కూడా ప్రాస కలిపారు
సర్పంచ్ సిగ్గుపడుతుండగానే చీపురు కట్ట తో ఎవరో కొట్టినట్టనిపించింది చూస్తే సర్పంచ్ సహధర్మ చారిణి కూడా excitement ఆపుకోలేక డైలోగ్ వినడానికి వచ్చి సర్పంచ్ కి సర్ప కాటు వేసింది.సర్పంచ్ దెబ్బలు మాయమయ్యేవరకు పంచాయితీ ని తన successor రాయుడు రెండు రోజులు వాయిదా వేసాడు
తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది
సర్పంచ్:ఇప్పుడు ఆ ఇంగ్లీష్ డైలోగ్ అర్ధం చెబితే మీరు ఇద్దరూ కలిసే ఉంటారు కదా
spectator:DDLJ సినిమా అంతా చూసి అమ్రిష్ పురి కి కాజోల్ ఏం అవుతుందో అడిగాడంట..నీలాంటోడే
సర్పంచ్:నాకు హిందీ రాదు మరి
spectator:అన్నా నువ్వు ఫుల్ form లో ఉన్నావ్..ఈ రోజు నీ తీర్పు మన గ్రామ చరిత్ర లో లిఖించ దగ్గ రోజు లా ఉండి నువ్వు తగ్గొద్దు.. కుమ్మేసేయ్ అని రెచ్చగోట్టేసరికి..
సర్పంచ్:మన గ్రామ చరిత్ర లో ఎన్నడూలేని విధంగా గ్రామర్ దోషాలు లేనట్టువంటి నోటితో తీర్పు సెలవిస్తున్నాను కాచుకోండి..
spectator:రెండు రోజులు ఇంట్లో కూర్చొని నువ్వు చేసిన పని అదా
తీర్పుకి సమయం ఆసన్నమయ్యింది జనసందోహం లో శబ్దం నెమ్మదిగా తగ్గుతోంది గెంజ్ డ్రాప్ సైలెన్స్ గా ఆ వాతావరణం తయారయ్యింది
సర్పంచ్:ఇది ఒక ముఖ్యమైన తీర్పు.అయితే రాయుడి భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మన పిడుగు రాయుడు కి ఈ తీర్పు చెప్పవలసింది గా గ్రామ పెద్దగా సెలవిస్తున్నా!
రాయుడు:నేను చెప్పవలసింది అని ఏంటి ? చెప్పవలసింది కాదు నీకు బలిసింది అది నాకు తెలిసింది
సర్పంచ్:నిజాన్ని గ్రహించావు.. సంతోషం.. తగువు ఆపి తీర్పు చెప్పి నీ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చెయ్యు
రాయుడు:వార్నీ..నా భవిష్యత్తు కోసం ఈ భార్యా భర్తల భవిష్యత్తు నాశనం చెయ్యాలా..
సంధ్య:(చీపురు కట్ట పట్టుకొని) ఉరేయ్ రాయుడు నాకు తెలియకుండా ఈ ఉజ్వల ఎవర్రా,నరికేస్తా %^&^&^&
spectator:సంధ్య, చీపురు కట్టతో నరికేయడం ఏంటి చీప్ గా!..డైలోగ్ మార్చు బాలేదు
సంధ్య:నా డైలోగ్ లో ఎటువంటి మార్పూ ఉండదు మైల్డ్ స్టీల్ బార్స్ తో తయారుచేసైనా సైనా లెక్కన ఒక్క స్మాష్ కొట్టి అయినా నా మాట నిలబెట్టుకుంటా
రాయుడు:relationship between wife and husband should be like fish and water,not like fish and fisherman
ప్రజలు:వహ్వా వహ్వా..విజిల్స్ కేకలు జై రాయుడు,రాయుడి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని ప్రజలు హోరున నినాదాలు చేస్తున్నారు,ఇంకో వైపు ఉజ్వల ఎవరో తెలియక సంధ్య ఆర్తనాదాలు చేస్తోంది
సర్పంచ్:సబాష్ రాయుడా!.. పంచ,పంచ్ లేనివాడు సర్పంచ్ కాదని నిరూపించావ్.
spectator:ఊ ఊ.. నువ్వు కేకంతే.. సరే డైలాగ్ కి అర్ధం చెప్పు వీళ్ళిద్దరూ కలిసిపోతారు..
రాయుడు:రిలేషన్ షిప్ అనేది చాలా ముఖ్యమైనది.అది షిప్ కి నీరు కి ఉన్నంత రక్త సంభందం ఉంది.
ప్రజలు:బిగ్గరగా చప్పట్లు, రాయుడి ఒక మహనీయుడు కాబోతున్న క్షణం రాబోతున్న సమయం లో
సర్పంచ్:(మధ్యలో అందుకొని)మన గ్రామ బాష లో చెప్పాలంటే రిలేషన్ అనేది రేషన్ కార్డ్ లాంటిది భార్యా భర్తలకి ఒకటే కార్డ్ ఉండాలి కాని బోగస్ కార్డులను వాడితే మోసపోయేది మనమే.
ప్రజలు:మరి ఫిష్ చేప అని కూడా ఉంది దాని అర్ధం ఏంటి?
సర్పంచ్:బోగస్ కార్డులు వాడితే వాళ్ళ బతుకు చేపల వాసన వచ్చి,జీవితం నీరు లేని చేపలా ఎండగట్టుకు పోతుంది.
ప్రజలు:కాసేపటికి ఆ ప్రదేశం అంతా కర కర 'థూ' ల ధ్వనులతో మారుమోగిపోయింది.
ఇటువంటి తీర్పు చెప్పి మన గ్రామ పరువును బ్రష్టు పట్టిస్తున్న వీడిని తిట్టి వదిలకూడదు చెప్పు తీసుకొని కొట్టాలి అని ఊర్లో ఉన్న చెప్పుల షో రూమ్ వాడు లేచి అరవడం తో జనాలు చెప్పులకు పని కల్పించారు.
ఈ గ్రా'మయ' సభలో గ్రాము పరువు కూడా మిగల్చకుండా చేసిన గ్రామస్తుల కు తగిన సమాధానం చెప్పాలని సర్పంచ్ బాగ్ సర్దుకొని బస్టాండ్ కి బయలుదేరాడు.
రాయుడు పరుగులేట్టుకుంటూ బస్టాండ్ చేరాడు.ఆయాసం తో వచ్చి సర్పంచ్ ఉన్న బస్ లోకి వెళ్ళాడు
రాయుడు:సర్పంచ్ గారు..ఆగండి!
సర్పంచ్:రా రాయుడా..రా! వెళ్ళే ముందు నీతో మాట్లాడాలి..వెళ్ళిపోతున్న కదా..ఇప్పుడు నీకేం అనిపిస్తోంది
రాయుడు:అలిసిపోయి వచ్చాను సర్పంచ్ గారు..బాగా దాహం వేస్తోంది..వీలయితే ఒక మినెరల్ వాటర్ బాటిల్ కి డబ్బులివ్వండి
సర్పంచ్: కండక్టర్ గారూ ఇంకా ఎంత సేపు లో ఈ బస్ బయలుదేరుతుంది
బస్ కండక్టర్:మరో పది నిమిషాలు
సర్పంచ్: రాయుడా..ఇలా రా! వెళ్ళే ముందు నా పక్కన కూర్చో కాసేపు
రాయుడు:మహాభాగ్యం సర్పంచ్ గారు..ఇంత పెద్ద బ్యాగ్ వేసుకోచ్చారు ఎన్ని రోజులు లో తిరిగి వచ్చేందుకు
సర్పంచ్:పద్నాలుగు సంవత్సరాలు
రాయుడు:మేము ఏం అయిపోవాలి..అన్ని సంవత్సరాలు మీరు వెళ్ళిపోతే అంటూ గ్లిజరిన్ లేక గెంజన్నం తో పాటు మిగిలన పచ్చి మిర్చి ని కళ్ళ దగ్గర రాసుకుని రోదిస్తున్న రాయుడి ని చూసి .
సర్పంచ్:ఆపు నీ అధిక ప్రేలాపన..వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు, మళ్ళీ నీ 24 వ ఏట ఈ ఊర్లో అడుగు పెట్టు.
అని చెప్పి బస్ డోర్ లాక్ చేసి సర్పంచ్ బస్ దిగి వెంటనే
Attention everybody నేనొస్తున్నా, be ready నేనే మహారాజు.. నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి.పరిష్కారం చెప్పేస్తా ఫస్టు. తీర్పు కి పట్టిస్తా నే బ్రష్టు. అని డాన్సు చేస్తున్నాడు సర్పంచ్. ఇదంతా బస్సు అద్దం లో చూస్తున్న రాయుడు
రగులుతోంది ప్రతీకార పగ..బుస్స్ బుస్స్..
సర్పంచ్ గాడి ఆధిపత్యపు సెగ
చెప్పేస్తాలే.. ఏ ఏ.. నే తీర్పు చెప్పేస్తాలే ..
పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.రాయుడి భాగ్యనగర వాసం ముగిసింది.అప్పటికే తను సంజీవయ్య పార్క్ MMTS లో ఉద్యోగం సంపాదించి విజయ గర్వం తో అంతకంటే ఎక్కువ తీర్పు చెప్పడానికి ఉత్సుకతతో ఊరికి చేరాడు
బస్సు దిగిన వెంటనే
whats happening here
there is no cleanliness..you have to visit Sanjeevayya park once in your life to know how to keep the things proper.అని ఇంగ్లీష్ లో అనర్గళం గా మాట్లాడేసరికి ప్రజలంతా నోళ్ళు వేల్లబెట్టుకొని
రాయుడా రాయుడా ఒక్క సారి ఆ ఫిష్ డైలాగ్ చెప్పు అని ముక్త కంఠంతో అరిచేసరికి
రాయుడు: the difference between fish and fisherman is man.fish adds beauty to the park and with out water it wont survive. fishing is injurious to mind. fishing is not allowed in our Sanjeevayya park. it will be green as usual lika a beautiful visual.
చాలా బావుంది. దీని అర్ధం ఏమిటి ?
సంధ్య: usual,visual అని అంటున్నావు ఏంటి అంటే దీనర్ధం ఉజ్వల హైదరాబాద్ లో ఉందనే కదా ? వా..ఆ ఆ ఆ.. నాకు ద్రోహం జరిగిపోతోంది కాపాడండి
ఇవేమీ పట్టించుకోకుండా రాయుడు తన ఇంటివైపు నడవడం మొదలెట్టాడు.రాయుడు అప్పుడే ఇంట్లో అడుగు పెడుతుండగానే ఈ ఇంటిలో అడుగు పెట్టొద్దు అని గట్టిగా రాయుడి పేరెంట్స్ తిట్టేసరికి ఒక ఉద్విగ్న భరితమైన వాతావరణం చోటు చేసుకుంది
రాయుడు:ఏం అయ్యింది నన్ను ఎందుకు మీరు లోపలకి రావడం రానివ్వడం లేదు..నేనేమైనా తప్పు చేసానని భావిస్తున్నారా
పేరెంట్స్:ఏం చెప్పమంటావు రాయుడా..ఎన్నడూ లేదు మన ఇంట్లో నిన్న రాత్రి నుండి సర్పాలు సంచరిస్తున్నాయి
రాయుడు:ఎందుకలా..
సర్పంచ్:నువ్వు వచ్చావని పశు పక్షాదులు పరవశించి పోతున్నాయి అనుకుంటా
spectator:ఏయ్!..సర్పంచ్ సర్పం పశువు ఎట్లా అవుతుంది? సర్పంచ్ గా నువ్వు వేస్ట్
ప్రజలు:అవును వేస్ట్ వేస్ట్ వేస్ట్..రాయుడే మన ఊరికి నిజమైన సర్పంచ్
సర్పంచ్:నేనొప్పుకోను..ఈ ఊరికి lifetime సర్పంచ్ ని నేనే ఇందులో ఏ మార్పు లేదు సరే మీ ఇంటిలో ఉన్న మూడు పాములను వెళ్ళ గొడితే నేను సర్పంచ్ గా తప్పుకుంటా
ప్రజలు:ఇది అన్యాయం
రాయుడు వెంటనే తన laptop తీసుకొని ఇంకా డేటా కార్డ్ తీసి యూట్యూబ్ కి connect చేసాడు.సర్పంచ్ సూటిపోటు మాటలను రాయుడు పై సంధిస్తున్నాడు
laptop ఎందుకు తీసావ్ రాయుడా నేను నవ్వలేక చస్తున్నా నీ అయోమయం ని చూసి.. పాముని చంపాలంటే కావాల్సింది కర్ర హ హ హ..అని బిగ్గరగా నవ్వడం మొదలెట్టాడు
రాయుడు వెంటనే మొగలిపూలు images డౌన్లోడ్ చేసి డెస్క్టాపు వాల్ పేపర్ గా పెట్టి
ఇంటికి బయలు దేరేముందు స్ప్రే అయిపోవడం తో పార్క్ కి కొట్టాల్సిన ఎరువుల పిచికారీ ని నింపుకొని axe బాటిల్స్ తో దిగడంతో .రాయుడు స్ప్రే కొట్టేసరికి పాములన్నీ స్క్రీన్ దగ్గర కి చేరాయి.వెంటనే youtube లో హిస్స్ trailerచూపించడం తో మూడు పాములు keyboard కి బుర్ర బాదేసుకొని అక్కడిక్కడే మృతి చెందాయి.
రాయుడు సర్పంచ్ తో: పాముని చంపాలంటే కావాల్సింది కర్ర కాదు బుర్ర
సర్పంచ్:ఇది అన్యాయం,జీవ హింస మహాపాపం,సర్పంచ్ ని నేనే!.. కావాలంటే నీకు సబ్ సర్పంచ్ పదవిస్తా తీసుకో
రాయుడు:అసలు మా ఇంట్లో మూడు పాములున్నాయి అని ఎలా తెలుసు నీకు!.. అని సర్పంచ్ ని దోషి గా నిరూపించాక
రాయుడు లోని పరిణితి ని చూసి ఆ గ్రామం పులకించిపోయింది ..సర్పంచ్ కి సలసలాకాగిపోయింది.
పాత సర్పంచ్ ని ఏకి పారేసి కొత్త సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రాయుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.న్యూస్ చానెల్స్ కూడా గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్ళిపోవడం రాయుడు ఇమేజ్ ప్రపంచ వ్యాప్తం గా పాపులర్ అవ్వడం తో అందరి సమస్యలను పరిష్కరించడానికి ఫోన్ లైన్ తో పాటు ఈ-మెయిల్ కూడా వినియోగించుకోవాల్సింది గా ప్రజలకు విజ్ఞప్తి చేసాడు.
రచ్చ బండ ని రచ్చ రచ్చ చెయ్యడానికి విచ్చేస్తున్న రాయుడు లాంటి ఆయిల్ ప్రింట్ పోస్టర్స్ తో ఆ ప్రాంగణం అంతా కళకళ లాడించారు రాయుడి అభిమానులు .
మొదట తను గ్రామ సమస్యని పరిష్కరించడానికి పూనుకొని ఆశీనుడై సీన్ లో సీరియస్ గా involve అయ్యాడు
రాయుడు:చెప్పండి సమస్య
గ్రామ బంట్రోతు:సభకి నమస్కారం i my self భైరవ, బంట్రోత్ and assistant to సర్పంచ్
విషయం ఏంటంటే అనే లోపు ఫోన్ మోగింది.
సర్ నేను డైరెక్టర్ UV.కెరటం ని మాట్లాడుతున్నాను సార్
రాయుడు:నమస్కారం, మీరు తమిళ్ లో సినిమా తీసి దాన్నే మలయాళం తెలుగు లో తీసే దర్శకులు కదూ
మీరు టాలీవుడ్ లో ఒక్క హీరో కే పరిమతమవ్వడానికి కారణం
దర్శకుడు:అదేం లేదు,ఇక్కడైతే ఒకే స్టొరీ ని రెండు సార్లు మార్చి మార్చి చెప్పేస్తే కొనే హీరో ఉన్నంత వరకు నా కెరియర్ dhl కొరియర్ అంత సేఫ్ గా ఉంటుంది.
మా హీరో జీవితారాజ్ నటించబోయే అరిటాకులు అనే సినిమా కి స్క్రిప్ట్ రడీ చేసుకున్నాం సార్.
గ్రామ సభల్లో కూడా మీ ప్రమోషన్ ఆపరా..ఎంత తీసుకున్నారు సర్పంచ్ గారు ఈ చిత్ర unit దగ్గర నుండి
సర్పంచ్:నాకేం తెలీదు
ఈ సినిమా లో మా హీరో జీవితారాజ్ చాలా చలాకీ యువకుడు
ఆ చలాకీ తనం తట్టుకోలేక హీరోయిన్ నేనాజాస్మిన్ పడిపోతుంది తర్వాత తెలిసేది ఏంటంటే తను హీరో కి చెల్లి అవుతుంది అని. సెకండ్ హాఫ్ లో సర్పమణి కూడా జీవితారాజ్ ని లవ్ చెయ్యడం మొదలెడుతుంది క్లైమాక్స్ ముందు వాళ్ళ అన్నయ్య అని తెలుసు కుంటుంది.క్లైమాక్స్ ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు మీరే తీర్పు చెప్పి మా సినిమాను ఆదుకోండి.
సర్పంచ్ రాయుడు:సినిమాలో మీ ఇష్టం వచ్చ్సినట్టు ఆడుకోవడం ఇప్పుడు నా దగ్గర కి వచ్చి ఆదుకోమనడం ..బేష్
సరే solution వినండి
వీరి ముగ్గురిని సంజీవయ్య పార్క్ కి తీసుకొని చిత్రీకరించండి.పార్క్ కి ఆదాయం లేక ఖజానా ఖాళీ అయ్యింది.మా సర్పంచ్ తో డీల్ కుదుర్చుకొని కొన్ని అరిటాకుల సెట్టింగ్ వేసి ఆ అరిటి చెట్టు వెనుక పాములు దాచిపెట్టి క్లైమాక్స్ లో మీ హీరో ని చంపేయండి.ఆ సినిమా ఖచ్చితం గా ఫ్యామిలీ audience ఆదరిస్తారు.అరిటాకు నుండి పాము వచ్చ్చి పోదిచేయడం వాళ్ళ మీ సినిమాకు టైటిల్ కూడా justify అవుతుంది.ఇదే ఈ రాయుడి తీర్పు
డైరెక్టర్ సర్పంచ్ కి పారితోషకం ప్రకటించాడు.ప్రజలకు రాయుడు పార్టీ ని ప్రకటించి పండగ చేసుకోమన్నాడు.
ఇంకొకసారి ఒక అమ్మాయి దగ్గర నుండి రాయుడు కి ఫోన్ వచ్చ్సింది
రాయుడు గారు నేను చాలా కష్టాల్లో ఉన్నాను మీరే నా సమస్య ను పరిష్కరించాలి
రాయుడు:లీగలా ,క్రిమినలా,ఈగలా,క్రిములా..ఏ కోవలోనికి వస్తుందో తెలుసుకోవచ్చా
అమ్మాయి:సార్, నాకు చాలా abusing ఫోన్ కాల్స్ ఇంకా భరించలేని SMS లు పంపిస్తున్నారు కొంతమంది.నాకు చాలా irritating గా ఉంది.ఇప్పుడు నేనేం చెయ్యాలి
రాయుడు:ఓస్ ఇంతేనా..! నా బాధ ఎవడితో చెప్పుకోమంటావు.తీర్పు కోసం ఫోన్ నెంబర్ ఇస్తే తీర్పు కోసం నా తాట తీస్తున్నారు. వాడెవడో ప్రవాసాంధ్రులు అంట నాకు రాత్రి అయితే వాళ్లకు పగలవుతుందినాకు నిద్ర లేకుండా పగులుతుంది.దీనికంటే irritation ఆ నీది.
అమ్మాయి:నాకు అదంతా తెలియదు.నాకు న్యాయం కావాలి
బంట్రోతు:వెల 75 రూపాయిలు..షాలిమార్ వీడియో ద్వారా విడుదల బషీర్ బాగ్,హైదరాబాద్
సర్పంచ్:సర్పంచ్ నువ్వా నేనా!..నోరుముయ్య్
అమ్మాయ్! నువ్వు వెంటనే చెయ్యాల్సింది laughter challenge లాంటి ప్రోగ్రామ్స్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ మెసేజ్ లను ఫార్వార్డ్ చెయ్యు. అక్కడ ఇలాంటి మెసేజ్ లకు బాగా డిమాండ్ ఉంది .నీకు పేరు తో డబ్బు కూడా వస్తుంది.ఇకనుండి నీకు మెసేజ్ లు వచ్చేటప్పుడు నువ్వే అంటావు.. ప్లీజ్! ఇంకా పంపండి ప్లీజ్ అని ..
మళ్ళీ దద్దరిల్లింది చప్పట్లతో..
ఆ రోజు గ్రామ సభ ముగుస్తోంది అనే సమయం లో ఫోన్ మోగింది..
ఒక చిన్న అమ్మాయి గొంతుతో
రాయుడు అంకుల్..రేపు మాకు exam ఉంది నా బుక్స్ అన్నీ దారిలో పారేసుకున్నాను.రేపు నేను ఫెయిల్ అవుతాను తప్పకుండా..తలచుకుంటేనే నాకు ఏడుపు వస్తోంది.. ఇప్పుడు ఏం చెయ్యాలి..వా ఆఆ ..
సర్పంచ్:ఎదవద్దు..రాయుడు ఉండగా నీకేల భయం.. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా మరి
బాలిక:ఉన్నాయి అంకుల్
సర్పంచ్:వెంటనే బుక్ సెంటర్ కి వెళ్ళు,
బాలిక:నేను ఇప్పుడు బుక్ సెంటర్ నుండే మాట్లాడుతున్నాను.షాప్ లో ఉన్న వాడు బుక్స్ ఇవ్వనంటున్నాడుపుస్తకాలు.స్టాక్ లేదు అని చెబుతున్నాడు
సర్పంచ్:సరే లౌడ్ speaker ఆన్ చెయ్యు , ఏమయ్యా!.. మీ దగ్గర స్టాక్ లేదా?
షాప్ ఓనర్:లేదు సర్, ఎనిమిదో తరగతి పుస్తకాలు అన్నీ అయిపోయాయి ప్రస్తుతం ఒకటి నుండి అయిదవతరగతి వరకు మాత్రమే పుస్తకాలు ఉన్నాయి
సర్పంచ్:అమ్మాయ్! నువ్వు ఎనిమిదో తరగతా
బాలిక:అవును అంకుల్,రేపు 8th maths ఎక్జాం ఉంది.
సర్పంచ్: ఏ షాప్ ఓనర్, ఆ అమ్మాయికి రెండు నాలుగోతరగతి లెక్కల పుస్తకాలు ఇవ్వవయ్యా .problem solved . all the best
-----------------------------------------------------------------------------------------
హెయ్ నే పేటెంట్ పురం పిడుగమ్మో.. నా దిల్ కి ధడకన్ సంధ్యమ్మో ||2||
గ్లోబల్ లీడర్ నేనమ్మో .. అరె సర్పంచ్ కి నేనంటే హడలమ్మో..
తీర్పు లు కోసం వచ్చారంటే తాటే తీస్తనమ్మో..ఓయ్ చేపలు పట్టే చిన్నమ్మో..
ఫిషర్ డైలోగ్ విన్నాక ఉన్నావంటే నిన్ను కింగ్ ఫిషేర్ ఎక్కిస్తానమ్మో..
ఏయ్ సంజీవయ్యా పార్కమ్మో ..రాయుడు బాబాయ్ MMTS
పార్కర్ పెన్ లా షార్పమ్మో..రాయుడు బాబాయ్ MMTS
ఏయ్ సంజీవయ్యా పార్కమ్మో..నే పార్కర్ పెన్ లా షార్పమ్మో
సర్పం గాని సర్పంచ్ గాని చర్చ కొస్తే చాలు రచ్చ రచ్చమ్మో.. (కోరలు&కోరస్):నీపేరేందబ్బాయా
రా...రా...రా...రా...రాయుడు బాబాయ్..రాయుడు బాబాయ్
రాయుడు బాబాయ్..రాయుడు బాబాయ్ MMTS ...రాయుడు బాబాయ్ MMTS ||3||
శిశువు పుట్టగానే అమ్మా అని పిలుస్తుంది.రాయుడు పుట్టగానే ఆనా..ఆనా.. అని అరిచాడు తీర్పు చెప్పే లక్షణాలువాడికి పుట్టుకతోనే వచ్చింది అని నిర్ధారించుకున్నాక ఆ గ్రామం రాయుడి తీర్పులతో మూడు చర్చలతో ఆరు రచ్చ లతో సుభిక్షంగా వర్ధిల్లింది.
Mal & Cobb కధలలో రాయుడు బాబాయ్ MMTS అనే అంకము సమాప్తం.
Monday, October 25, 2010
Wednesday, October 6, 2010
ఆపద్భాందవుడు
1999 వ సంవత్సరం:సచిన్ నడుం నొప్పితో పాక్ తో చెన్నై లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో గెలుపు చివరి అంచులు వరకు తీసుకెళ్ళి ఓడిపోయిన దృశ్యం నిన్నటి వరకు మర్చిపోలేదు.
2001&2010:Two historic triumphs for Team India..on both the occasions VVS was the architect :)
అంతకంటే భయంకరమైన నొప్పి ని భరిస్తూ విజయ తీరాలకు చేర్చిన లక్ష్మణ్ కృషి ని అభినందించకుండా ఉండలేం
kudos to Laxman..
ఇక మీదట లక్ష్మణ్ జండూబామ్,మూవ్,pain relief లకు endorse చెయ్యాల్సిన పని ఉండదు ఎందుకంటే he is too good when he play with back pain( 3rd test against SL in colombo103* in 2010)
Best tweets after the historic win
-------------------------------------
Australia should voluntarily declare some area in their country as Laxman Janmastan.
The day VVS retires..it will be a National holiday in Australia
Gandhi's last words were 'hey ram', Ricky ponting's would be 'hey laxman' ;)
Subscribe to:
Posts (Atom)