Pages

Saturday, March 27, 2010

గూచాపర..

ల్యాబ్ నుండి హాస్టల్ కి వస్తున్నాడు  నరేందర్, ఇంతలో సడెన్ గా వర్షం కురుస్తోంది ఉరుములు పిడుగులు కూడా మొదలయ్యాయి  

నరేందర్ ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు
అప్పుడే ఒక పిడుగు పడింది  


నరేందర్ భయం తో
అర్జునా,ఈశ్వరా ,చైతన్యా  అని అరిచాడు, ఈడెవడు అని అనుకుంటున్నారా 
నరేందర్ వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు ఫ్యాన్ మరి ఫల్గుణా అంటే పగిలిపోద్ది చిన్నపటినుండి అలానే అలవాటుచేసారు మరి 

కాసేపట్లో వర్షం తగ్గాక రూం లోనికి వచ్చాడు నరేందర్. రూమ్మేట్ ఉదయ్ లాన్ లో మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి Age of empires ఆడుతున్నాడు.

సిస్టం ఆన్ చేసాడు నరేందర్ కాని ఆన్ అవ్వడం లేదు,చూస్తే ups ఇంకా  monitor wire లేవు ఉదయ్ ని నిలదీశాడు ఏమయ్యాయి అని

నరేన్:నా మానిటర్ వైర్
ఇంకా ups ని నువ్వు తీసావా
 ఉదయ్: ఉరేయ్ &*(&%, నాది లాప్టాప్ బే
నరేన్: నేను లేనప్పుడు ఎవరైనా తీసుకున్నారా

 ఉదయ్:నేను గేమ్ ఆడుతున్నా నాకు తెలియదు, సరే కాని నీ దగ్గర fifa 2010 ఉందట కదా,నాకివ్వవా?
నరేన్:పోస్టేసి కామెంట్లు లేక నేను ఏడుస్తుంటే మార్తాండ వచ్చి తన కధ మీద రివ్యూ రాయమని మెయిల్ ఇచ్చాడట  
ఉదయ్: సారీ 


హాస్టల్ గార్డ్  దగ్గర అన్నౌన్సుమేంట్ ఇచ్చి రూం కి  వచ్చాడు నరేన్
కాసేపట్లో సతీష్ వచ్చి మానిటర్ వైర్ ups ఇచ్చాక ఊపిరి పీల్చుకున్నాడు
connect చేసి గూగుల్ టాక్ ఓపెన్ చేసాడు

ఇంతలో ఫోన్ మోగింది నరేన్ వాళ్ళ నాన్న కాలింగ్


నరేన్: హలో
ననా:ఏరా ఏం చేస్తున్నావ్
వేళకు సరిగా తింటున్నావా,మన నాగ చైతన్య ఏ మాయ చేసావో చూసావా 
నరేన్:అదో చెత్త సినిమా అంటున్నారు నాన్నా,సినిమా ఫ్లాప్ అంట కదా
ననా:పోస్ట్ చదివి కామెంట్ రాయనంత పాపం తెలుసా ,అభిమానులు తమ హీరో  సినిమాగురించి  చెడ్డగా చెప్పుకోవడం  
ననా:అయినా నాగేశ్వరరావు వంశాన్నే అవమానిస్తావా రా ,అందుకే మనం బాలయ్య  దేవుడు సినిమాని బెంచ్ మార్క్ గా పెట్టుకొని చూడాలి అప్పుడు అన్నీ మంచిగా కనపడతాయ్ 
నరేన్:నానా, మీరు నాకు చెప్పక్కర్లేదు ఇప్పుడు నేను పెద్దవాడిని
ననా:ఏంటిరా పెద్దవాడివి  మాంగూస్ బాట్ అంత పొడుగు లేవు నువ్వు పెద్దవాడివా?
నరేన్:సరే అలాగే అనుకోండి అని పెట్టేసాడు

ఇంతలో ముగ్గురు పింగి పిసికింగ్ గూగుల్ టాక్ లో

గూగుల్ టాక్ విండో 1:
శిల్ప: హే నరేన్ nescafe కి వెళ్తున్నాం వస్తున్నావా ?
నరేన్:హాయ్, ఏంటి డబ్బులు లేవా నీ దగ్గర
శిల్ప:ఉంటే నీకు ఎందుకు పింగ్ చేస్తా చెప్పు
నరేన్:నీ ______,నాకు మీ హాస్టల్ లో వున్న కాంటినెంటల్ ఫుడ్ తీస్కొస్తే నేను వస్తా
శిల్ప:సరే తెస్తాలే ,నీకు అసలు సిగ్గు లేదేం
నరేన్:ఎగ్గు చికెను కూడా లేదు


విండో 2 :
రాజేష్:రేయ్ చాలా చిరాకుగా ఉందిరా
నరేన్:అవునా,సరే ఏదైనా ఖతర్నాక్ లాంటి  సినిమా చూడు
రాజేష్:అదో భయంకరమైన సినిమా అంటకదా, సరే నీ దగ్గర ఉందా 
నరేన్:కంప్యూటర్ ల్యాబ్  సర్వర్ డేటా లో పెట్టేసారా విత్ సబ్ టైటిల్స్,నీకు కావాలంటే నీ రూం నుండే access చెయ్యొచ్చు
రాజేష్:
ఇంత  కక్ష ఏంటిరా మన ల్యాబ్ మీద 
నరేన్:ఫ్రీ పబ్లిసిటీ బాసు,ఆ పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చూసి మన తెలుగోల్లని  చూసి నవ్వనోడు లేడు,ఈ సినిమా చూసాక కాస్త జీవితం మీద విరక్తి అయినా వచ్చుద్ది కదా వీళ్ళకి


విండో 3 :
అజయ్:ఈ రోజు C++ లెక్చర్ కి 
వెళ్ళావా
నరేన్:లేదురా కోర్సు డ్రాప్ చేశా
అజయ్:ఎందుకు ఏమయ్యింది
నరేన్: ఫస్ట్ మైనర్ లో మొదటి సున్నా వచ్చింది
అజయ్:అబ్బ ఛా ఆ ప్రతిమా జైన్ రావడంలేదు అనే కదా డ్రాప్ చేసావ్
నరేన్:నువ్వేంటి రా బాబు ఐ.పి అడ్రెస్స్ లు ఇస్తే ఇంటి అడ్రేస్సులు పట్టుకోచేలాంటి
వాడిలా వున్నావ్     
అజయ్:


Thursday, March 25, 2010

బేకో ..

కర్ణుని చావుకి లక్షకారణాలు లాగా నా బ్లాగింగ్ ఆపడానికి కూడా ఒక వంద కారణాలు దొరుకుతాయ్
కూడలి లో ట్రాఫిక్ బాగా పెరిగింది మధ్య
ఒకే రోజు తొమ్మిది పోస్ట్ లు వేసే మహానుభావులు తగ్గుముఖం పట్టినా లాభం లేకపోయింది ఒకపోస్ట్ వేస్తే గంట లో ఎక్కడోకిందకు వెల్లిపొతున్నాదే ?
ఇకనుంచైనా కాస్త తరచుగా రాయాలని కోరుకుంటున్నా..