Adapted from Best Seller"3 Mistakes of my life"
చేతన్ భగత్ -తన రాతలతోనే కాకుండా చాలా విషయాల్లో వీడంటేనే చాలా చిరాకు
రాక్ ఆన్- సినిమా బావుంది కాకపొతే ఏదో వెలితి
కధ ముందే తెలిస్తే సినిమా చూసి ఇంకెందుకు
అందరూ కొత్తవాళ్ళే అభిషేక్ కపూర్ తన మీద ఏమీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే
తెలిసిన కధను మళ్ళీ మళ్ళీ స్క్రీన్ మీద చూడడం అవసరమా అసలు
హిట్ కొట్టిన డైరెక్టర్ రెండో సినిమా అంటే కాపీ కి మరో పేరు అని వినిపిస్తున్న ఈ రోజుల్లో
ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో థియేటర్లో ఎంటర్ అయ్యాక
మొదటి షాట్ నుండి టైటిల్స్ వచ్చేవరకు సినిమాటోగ్రఫీ ఇదంతా గుజరాత్ లేక స్పెయిన్ లో ఏమైనా చేసారా అనే విధంగా ఉంది .
The film has its moments through out
చిన్న చిన్న ఎమోషన్స్ ని అద్భుతంగా capture చేయగలిగాడు దర్శకుడు. దిల్ చాహ్తా హై,రంగ్ దే బసంతి లో చూసినప్పుడు ఉండే freshness ఈ సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ చాలా చోట్ల ఉంది.
మధ్యలో పవర్ కట్ అయ్యాక ఒక పది హేను నిమిషాలు రివైండ్ చేసి వేసాడు.అంత గా లేదు. ఒకసారి చూడడమే బెటర్ అనిపించింది
సినిమా లో అందరూ బాగానే చేసారు అందరిలో సుశాంగ్ సింగ్ బాగా చేసాడు.
హీరోయిన్ ని ఇంకొంచెం సేపు చూపిస్తే బావుండేది.
communal riots మొదలయినప్పటి నుండి సినిమా లో ఫీల్ మిస్ అయ్యి కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది.
ఇంట సెన్సిటివ్ విషయాలపై అంత డ్రాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదనిపించింది.కాకపొతే దర్శకుడు మరో బాన్ అవ్వకుండా తెలివిగా జాగ్రత్త పడ్డాడు
మధ్యలో గుజరాతీ లో వచ్చే డైలాగులు పంటి కింద రాయిలా అనిపించినా
ఇన్ని కధలు/సినిమాల నుండి ఇన్స్పైర్ అయినప్పటికీ సబ్జెక్ట్ ని హాండిల్ చేయడం లో దర్శకుడు చాలా వరకు సఫలీకృతం అయ్యాడనే చెప్పాలి
కాయ్ పోచే : మస్ట్ వాచే!