Pages

Thursday, March 29, 2012

జీవీ ఆర్.జీవీ జీ టీవీ..



 అవి నేను పాల బుగ్గల నుండి హార్లిక్స్ బుగ్గలకు మారుతున్న రోజులు…….

ఊహతో పాటు శ్రీకాంత్, EVV సత్యన్నారాయణ అంటే ఎవరో తెలియని అమాయకత్వంలో  సైతం
ఒక సినిమాను జీవితం లో మొదటి సారిగా థియేటర్లో  గర్ల్ ఫ్రెండ్ లేకుండానే  రెండు సార్లు చూడాల్సి వచ్చింది..

  చిత్ర రాజము ఏదంటే --- హీరో  నాగార్జున  తన దృష్టినంతా హీరోయిన్ వెంటబడి గాలిపాటలు పాడటం మీద కాకుండా, గ్రీజు వేళ్ళకి అంటకుండా చాకచక్యం గా సైకిల్ చైన్ బర్రున లాగి రౌడీలను చితకబాదే --- శివ.


  తర్వాత క్షణ క్షణం, గాయం, గోవిందా గోవిందా లాంటి సినిమాలు  థియేటర్లోనూ…  మిగతా చిన్నా చితకా RGV సినిమాలు  కూడా మా టీవీ అయిన ETV పుణ్యమా అని  ఇంట్లోనే చూసేసాక… ఎందుకో డైరెక్టర్ పనితనంలో ఏదో ప్రత్యేకత అగుపడింది.. సినిమా లు  విసుగులేకుండా ఉండటం ఒకటైతే… విసన కర్ర కాకపోయినా విభూషణ నాగభూషణ్ లాంటి విలనిజం చూపించకపోవడం ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయాలు!

ఇలా ఆర్‌జీవీ సినిమాలను నా యధాశక్తి పోషిస్తూ ఉండగానే నా బాల్యం  కాస్తా ‘cow’ మారాం చేయడమేమిటి లాంటి అనే అనుమానసందేహాలకి ఆస్కారమివ్వకుండా కౌమారం లోనికి ప్రవేశించింది!

బ్రేకింగ్ న్యూస్ లేని కాలం లో సైతం వర్మ తెలుగులో సినిమాలు తీయడం ఆపేసాడు!!

  గడ్డుకాలం లో చిరంజీవికి హిట్లు,  నా చదువుకి తిట్లు లేకపోవడంతో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఇంటర్ పరీక్షలు రాసేసాను

  తర్వాత యమ సెట్ కోసం పొట్టి పదం శిక్షణా తరగతులకు (short term ) హాజరవడం జరిగాక,
‘నాలుగు రాళ్ళు సంపాదించుకో’ అని ఆకాశవాణి పిలిచి, నాలుగంకెల రాంక్ ను తెచ్చుకోనేలా చేసి, ఇంజనీరింగ్ లో అడుగుపెట్టేలా చేసింది.

చేరిన మొదటి రోజే హాస్టల్లో యధావిధిగా ఒక సీనియర్ రాగింగ్………..

సెల్ఫ్ డబ్బా చెప్పుకున్నాకనేనెవరినో తెలుసా!” అన్నాడు!

‘నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నికైన మన దేశ ఉపరాష్ట్రపతి పేరే తెలియదు… రోజు చేరిన నాకు మీ పేరేం తెలుస్తుంది?’ అని చెప్పాక  టైడ్ వాడకుండా మాసిన  నా చొక్కా చూసి   సీనియర్  అవాక్కయ్యాడు.


దానికి మా సీనియర్అసలేం  మాట్లాడుతున్నావ్ నువ్వు!!!  రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని ఫిలిం ఇండస్ట్రీ,   
ధర్మ అంటే తెలియని మన కాలేజీ స్టూడెంట్స్  ఉన్నట్టు చరిత్ర లో లేదు!” అని ఒక డైలాగ్ వేసి,రేపు ఇదే టైం కి నా రూమ్ లో  కనిపించు.” అని చెప్పాడు
బ్రతుకు జీవుడా అని నేను మా జూనియర్స్ బ్లాక్ కి వచ్చేసాను….

ఆ సదరు సీనియరాగింగ్ధర్మ’ రాజు చదువుతున్నది ఇంజనీరింగ్ రెండో సంవత్సరం!

  మరుసటి రోజు తను ఉంటున్న రూమ్ కి వెళ్ళాకసీనియర్ “నీది కూడా సేమ్ బ్రాంచ్... నీకు నాతో చాలా అవసరం ఉంటుంది.”  అని ఇంకొన్ని బేసిక్ భ్రష్టు పట్టించాక…. తన రూమ్ చరిత్ర చెప్పడం మొదలెట్టాడు..
 అందులో ముఖ్యాతిముఖ్యమైన విషయం --- రూమ్ లో ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ నాలుగేళ్ళు ఉన్నాడు” అన్నది!

అప్పటికే ఒక గొప్ప డైరెక్టర్ గా ఫీల్ అయ్యాడేమో ఒక ప్రోడక్ట్ కి డెమో ఇచ్చినట్టు భలే నేరేట్ చేసి పడేసాడు….నేను   చెప్పే విధానానికి ముగ్ధుడిని అయిపోయి, రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి దొరకకపోయినా నేనస్సలు పట్టించుకోను కానీ
ఆరు నూరైనా సరే  ‘నేను నా సెకండ్ ఇయర్ లో ఇదే రూమ్ కి షిఫ్ట్ అయిపోవాలి’ అని  డిసైడ్ అయిపోయా!

  బ్లాక్ లో రూమ్ దొరకాలంటే నేను కనీసం ఒక సంవత్సరం ఆగాలి......  కాలం అప్పుడే ఫుల్లుగా లాగించి మత్తుగా పడుకున్న పైథాన్లా అస్సలు కదలనంటోంది! టూ మచ్ వెయిటింగ్!!

కొన్నాళ్ళకి రామ్ గోపాల్ వర్మ రూమ్ యొక్క చరిత్ర మొత్తం ధర్మ  రాగింగ్ వలన, రగులుతోంది పాటలో హీరోయిన్ మాధవి మీద చిరంజీవి పాకినట్టు…. హాస్టల్ అంతా ప్రాకిపోయి మా స్టూడెంట్స్ కి తెలిసిపోయింది.

ఇక ఎక్కడ చూసినా ఇదే మాటర్ ….. ‘వచ్చే సంవత్సరం  వర్మ రూమ్ లో నేనుంటాను అంటే నేను’ అని  పెద్ద డిస్కషన్ అయి కూర్చుంది!!

అంతలో ఈ ధర్మ అరాచకాలు పెరిగిపోవడంతో, ఒకరోజు నేను మినియేచర్ శివలా ఫీలై వార్డెన్ కి కంప్లైంట్ చేసి పడేసాను... వేంఠనే వార్డెన్ తన యధాశక్తి ఇంకాస్త ఎక్కువ ఫీలై అతన్ని అందరి ముందు వాయించేసాడు..

అలా రెండు నెలలు గడిచాయి.. మేము ధర్మని తిట్టిన తిట్లన్నీ తధాస్తు దేవతులు విన్నారో లేక, మేము పెట్టే పునుగులు తిని ఏనుగులా తయారయ్యి చదువుని  తొండం ఎక్కించేసాడో కానీ, తను detain అయిపోయాడు..

  రూమ్ కి ఉన్న క్రేజ్ మహత్యానికి ఒక మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధి   రూమ్ కి షిఫ్ట్ అయిపోయాడు.

మా హాస్టల్ వార్డెన్ ఆకా మా డిపార్ట్ మెంట్  ప్రొఫెసర్ కావడంతో ఎప్పుడు వచ్చినా నా  దగ్గరకు వచ్చి,ఇప్పుడు అంతా ఓకే కదా.. రాగింగ్ ఇంకా ఎవరైనా చేస్తున్నారా?” అని అడిగేవాడు.

“ఇప్పుడేమీ లేదు సార్… ఎలా చదవాలో మీ guidance కావాలి సార్” అని అమాయకత్వానికి అసహాయతని  జోడించి అడిగేసరికి… వార్డెన్ టీ లో బౌర్బాన్ బిస్కట్లు ముంచుకు తింటూ తింటూ, ఉపదేశాలు చేస్తూ, ఒక పది కిలోలు పెరిగాడు!

అలా ఒక సంవత్సరం బండి లాక్కోచ్చేసాక……………

బీ.టెక్ రెండో సంవత్సరం లోనికి అడుగు పెడుతుండగా….. ఒక రోజు సాయంత్రం…. వార్డెన్ సాయంత్రం టీ తాగడానికి హాస్టల్ కి వచ్చాక, నాతో… “హరే, మీరు బ్లాక్ షిఫ్ట్ ఇవ్వాలి కదా! నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాం.” అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు...

దాని సారాంశం ఏమిటంటే

ముందు చలాన్ ఎవరు కడితే వాళ్ళకే మొదటి మరియు preference రూమ్ అని ఇప్పుడు నోటీస్ బోర్డ్ లో circular పెట్టాలి….

అంతే! ఆయన్ని అమాంతం “సార్.. సార్.. మీరు శిఖరం సార్!”  అని పొగిడేసి, రామ్ గోపాల్ వర్మ రూమ్ ని నేను ప్రీ బుక్ చేసేసాక, హాస్టల్ అందరికీ దండోరా వేయకుండా చెప్పేసాను….

విషయం తెలుసుకున్న ధర్మ రిటర్న్స్!!!!

వార్డెన్ తో మరుసటి రోజు గొడవ పెట్టేసుకున్నాడు,తనకి రూమ్ ఇవ్వడం ఏమిటి!! ఇండస్ట్రీ ఇక్కడ!!’ అని భారీ డైలాగులు పేల్చినా, బోర్బాన్ బంధంకి విలువిచ్చి మా వార్డెన్ ధర్మ కి అధర్మం చేసేసాక ….. “ఎందరో మహానుభావులు… అందరీ..ఈ..ఈ..కీ నో ఆర్జీవీ రూమ్ కీస్” అని పాడుకుంటూ నేను   రూమ్ కి షిఫ్ట్ అయిపోయాను.

రూమ్ చరిత్రలో మొదటిసారిగా ఒక వ్యక్తిగా కాలేజీ టాపర్ గా నిలిచాక….
టాపర్ బ్రాండ్ పడ్డాక….
మా వార్డెన్ తో చెప్పి percentage బట్టి రూమ్స్ ప్రిఫరెన్స్ ఉండాలి అనే రూల్ మార్పించేసాక

నేను విజయవంతంగా ఆర్జీవీ రూమ్ లో  మరో సంవత్సరం స్థిర పడడడానికి లైన్ క్లియర్ అయింది!!!

టాపర్ బ్రాండ్ వల్ల థర్డ్ ఇయర్ లో ధర్మకి నేను ట్యూషన్ చెప్పాల్సి వచ్చేది ఎగ్జామ్స్ ముందు.. అలా మూడో సంవత్సరంకి వచ్చేసరికి క్లాస్ టాపర్ మచ్చ చెరపకుండా ధర్మ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఒకే సంవత్సరంలో!

అప్పుడే రామ్ గోపాల్ వర్మ  జేమ్స్ అనే సినిమాకి మా కాలేజ్ లో ఆడియో  ఫంక్షన్ ఏర్పాటు చేసాడు

రేపు ఫంక్షన్ అనగా ముందు రోజు మా డిపార్ట్ మెంట్ కి వెళ్ళి అందరి ప్రొఫ్ లను కలిసి మాట్లాడుతున్నాడు వర్మమా వార్డెన్ హాస్టల్ కి ఫోన్ చేసి నిద్రపోతున్న నన్ను డిపార్ట్మెంట్ కి రమ్మన్నాడు.. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద కెవ్వ్ పెట్టి, వర్మ దగ్గరకు వెళ్ళి ‘గ్లాడ్ టు మీట్ యుఅని చెప్పిసార్, నేను కూడా డిపార్ట్మెంట్ స్టూడెంట్ నే’ అని పరిచయం చేసుకుని, ‘ప్రస్తుతం మీరు ఉన్న రూమ్ లో ఉంటున్నాను’ అని చెప్పాను..
వెంటనే,నీ పెర్సెంటేజ్ ఎంత?” అని నవ్వుతూ వర్మ తిరిగి అడిగాడు.
దానికి మా వార్డెన్ “క్లాస్ టాపర్ అండీ!” అనగానే..
“గుడ్! నాలా బాడ్ స్టూడెంట్ కాదన్నమాట!” అని చెప్పేసాక , నేను రూమ్ కి వచ్చేశాను…

రూమ్కి వచ్చాక చూస్తేనలుగురు జూనియర్స్ ని ధర్మ మా రూమ్ లో రాగింగ్ చేస్తున్నాడు.. “సరే, నే టీ తాగి వస్తాను వీళ్ళను కాసేపు చూడు!” అని మహత్కార్యాన్నినాకు అప్పగించాడు.

వాళ్ళకో చిన్న ట్రైనింగ్ ఇచ్చి, మా ధర్మ వచ్చేసరికి, వాళ్ళ  నలుగురు  పెదరాయుడు సినిమా లో రజనీ కాంత్ శాలువా తీసినట్టు నా బెడ్ మీద నుండి రెండు టవల్స్ తీసిచెరో ఇద్దరి జూనియర్స్ మీద ఒక్కో టవల్ ని తల మీద వేయించి….

“హేమ రేఖ జయ సుష్మ.. అందరూ మెచ్చిన ధర్మా…. detained drum ధర్మ….  detained drum ధర్మ”
అని కోరస్ పాడించాక, ధర్మ తర్వాత నా రూమ్ లో ఇలాంటి ప్రోగ్రాం లు పెట్టలేదు.

కాకపొతే అప్పుడప్పుడూ తనలో ఉన్న గాన భైరవుని బయటకు తీయడానికి ట్రై చేసినప్పుడలా నేనిలాంటి ఎక్ప్రేషన్ ఇవ్వక తప్పేది కాదు   
 

  మరుసటి రోజు ఆడియో ఫంక్షన్ మొదలయింది స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరి  introduction  అయిపోయింది...
నిషా కొఠారి రాలేదు అని తెలిసిన వెంటనే స్టూడెంట్స్ సగం మంది వెళ్ళిపోయారు!!

ఇక్కడ మా HOD గురించి ఒక విషయం చెప్పాలి తనకి ఇండియా అంటే విపరీతం అయిన గౌరవం!   ముందు రోజు వర్మ మా డిపార్ట్మెంట్ ఎదురుగా ప్రొఫెసర్స్ తో తన experiences షేర్ చేసుకున్నాక, మా HOD తో RGV   తర్వాత రోజు ఫోటో పేపర్ లో పడింది….

మా బెంచ్ లో   పేపర్ కటింగ్ చూస్తూ….

నేను, మేడ్ ఇన్ ఇండియా మీట్స్ మేడ్ ఇన్ చైనా”  అని కేప్షన్ ఇచ్చాను..

సహవిద్యార్ధులు:  మేడ్ ఇన్ చైనా అంటే ????

నేను: నో గ్యారంటీ!
******************************************************************************************************