Pages

Saturday, August 22, 2009

ఆంధ్రా టు బాంద్రా






లాస్ట్ వీక్ షారుక్ ఇల్లు MANNAT కి వెళ్ళా ..ఫాన్స్ ఒక రేంజ్ లో వున్నారు ఫ్రిస్కింగ్ incident వల్ల అని తర్వాత తెలిసింది ..చల్ ఫట్ అని పక్కనే ఉన్న బీచ్ కి వెళ్ళాం wow heaven is here ఎస్ ఇట్ ఈజ్. ,.ముంబై విసిట్ చేస్తే bandstand మిస్ అవ్వొద్దు.. bandra-worli sealink న్యూయార్క్ బ్రిడ్జి ని గుర్తుకు తెప్పించింది ..cables ప్రక్కనుండి వెళ్ళేటప్పుడు రైడ్ ను మర్చిపోలేం..లార్డ్ అఫ్ ది రింగ్స్ లో ఎంటర్ అవుతున్నట్టు భలే భలే !!



సరే ప్రక్కనే తాజ్ హోటల్ వుంది బావుంది కదా అని ఫొటోస్ తెస్తే.. సెక్యూరిటీ గార్డ్ చూసేసి దగ్గరవుండి అన్ని ఫొటోస్ డిలీట్ చేసాడు శ్రద్ధగా ..కత్తుల రత్తయ్యని తిట్టాలి(రతన్ టాటా ) ముందు బీచ్ కనిపిస్తే చాలు హోటల్ కట్టేస్తాడు ..బెటర్ లక్ నెక్స్ట్ టైం..బాంద్రా అందాలను చూడడానికి సండే కూడా జంప్.. గాడ్ ఇట్స్ ఏ మిరాకిల్..


సండేరోజున పండగ.. నాకు మండే :(
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు ...ఈ సారి లాల్ బాగ్ రాజా ని దర్శించుకోవాలి

Wednesday, August 5, 2009

మండిన గోడ

బ్లాగులు రాస్తూ బాలయ్య లా బతికేస్తున్నా అని అనుకుంటే మంటగోడ (firewall)తో
మండటం కాదు ..నాకు కాలింది..
ఛీ ఏం జీవితం ఇది!!..ఒక ఆర్కుట్ ,క్రిక్ ఇన్ఫో ,ఒక కూడలి,జల్లెడ ఓపెన్ కాకపోవడం తో 13th floor సినిమా ప్రత్యక్షంగా కనిపిస్తోంది ...
మొబైల్ లో బ్రౌస్ చేస్తే తెలుగు ఫాంట్ డిస్ప్లే అవ్వదు..ఎవరికీ చెప్పాలి నా కష్టాలు..
ప్రతి రోజు ఆఫీసు కి వెళ్లి జిమెయిల్ ఓపెన్ చేసి... రా రా ..ఆన్ లైన్ కి రా రా..అని పాడుకొంటూ వాళ్ళకు లింక్స్ ఇచి వర్డ్ డాకుమేంట్ లో attach చేసి చదువుతున్నాను ..బ్లాగ్ చదవకుండా బ్లాక్ చేసిన మా కంపెనీ వాడి మీద కోపం తో ఈ పోస్ట్..

అందరికి రాఖీసావంత్ సాక్షిగా రక్షాబంధన్ శుభాకాంక్షలు