గురువారం రాత్రి
అటునుండి అటే మా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక వెంటనే జిందగీ నా మిలేగీ దుబారా కి జంప్ ...(మార్నింగ్ ఎనిమిదింటికి ఏం సినిమా అనుకుంటున్నారేమో..అదే లెండి మార్నింగ్ షో..ఫ్లో లో అలా కానిచ్చాం. అయిన మార్నింగ్ షో ఏంటి బొత్తిగా taste లేదు అనుకుంటున్నారేమో ..మరి evening మళ్ళీ ఫ్లైట్ కి వాడు వెల్లిపోవాలంటే,అసలే మొదటి సారి ముంబై కి వచ్చిన జీవి మరిన్ డ్రైవ్ ,గేట్ వే కి గట్రా వెళ్ళాలంటే అని అలా ఫిక్స్ అయ్యాం..ఆ మాత్రం ప్లానింగ్ మాకూ ఉంది లెండి)
సినిమా అంతా చిన్న చిన్న సంబాషణలతో, ప్రతి పది నిముషాలకు జావేద్ అక్తర్ చదివే చిన్న చిన్న పద్యాలతో ఆర్ట్ ఫిలిం కి entertainment సినిమాకి మధ్యలో ఊగిసలాడుతూ ఉంది.
సమయం 12.45AM:
ఈ ఒక్కరోజే మేలుకుంటే ఏమైపోయింది..వారం రోజులకి సరిపడా వారాంతం లో నిద్రపోవచ్చుఅనుకుంటూ ఏదో ఆఫీసు లో పని చేసుకుంటూ ఉండిపోయా.తెల్లారిపోయింది.
శుక్రవారం సాయంత్రం
శుక్రవారం సాయంత్రం
సమయం 4.15 PM:
అసలే నిద్రలేక అలమటిస్తూ ఈ వారాంతం లో పూర్తిగా నిద్రపోదామనుకున్న నాకు message వచ్చింది
coming to mumbai tomorrow అని.నా M.Tech బెస్ట్ ఫ్రెండ్ దగ్గర్నుంచి.
coming to mumbai tomorrow అని.నా M.Tech బెస్ట్ ఫ్రెండ్ దగ్గర్నుంచి.
శనివారం ఉదయం
సమయం 05.00 AM
రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయం లో వేచి చూస్తున్నా..
రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయం లో వేచి చూస్తున్నా..
వెనుక నుండి #%#%#^&#^ అని తెలుగు లో సౌండ్ వచ్చింది..తిరిగి చూసే సరికి వాడే మా వాడు.. మూడేళ్ళ క్రితం కన్వోకేషన్ లో చివరి సారిగా కలిసిన వాడిని ఇన్నేళ్ళ తర్వాత కలవడం exciting గా అనిపించింది...
అటునుండి అటే మా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక వెంటనే జిందగీ నా మిలేగీ దుబారా కి జంప్ ...(మార్నింగ్ ఎనిమిదింటికి ఏం సినిమా అనుకుంటున్నారేమో..అదే లెండి మార్నింగ్ షో..ఫ్లో లో అలా కానిచ్చాం. అయిన మార్నింగ్ షో ఏంటి బొత్తిగా taste లేదు అనుకుంటున్నారేమో ..మరి evening మళ్ళీ ఫ్లైట్ కి వాడు వెల్లిపోవాలంటే,అసలే మొదటి సారి ముంబై కి వచ్చిన జీవి మరిన్ డ్రైవ్ ,గేట్ వే కి గట్రా వెళ్ళాలంటే అని అలా ఫిక్స్ అయ్యాం..ఆ మాత్రం ప్లానింగ్ మాకూ ఉంది లెండి)
ఈ సినిమా ఎలా ఉంది అంటే .....
సినిమా టైటిల్ చూసి Farhan Akhtar ,Hritik ,Katrina ,Abhay Deol వీళ్ళంతా ఉన్నారు సినిమాకి తిరుగులేదు అనుకోని వెళ్ళే... వాళ్ళ పాలిట జోయా అక్తర్, పాకిస్తాన్ కి షోయబ్ అక్తర్ లా ఎలా తయారయ్యాడో ఇంచుమించు అలానే తయారయింది. సినిమా అంతా చిన్న చిన్న సంబాషణలతో, ప్రతి పది నిముషాలకు జావేద్ అక్తర్ చదివే చిన్న చిన్న పద్యాలతో ఆర్ట్ ఫిలిం కి entertainment సినిమాకి మధ్యలో ఊగిసలాడుతూ ఉంది.
Dil Chahta Hai లో అమీర్ ఖాన్ కారెక్టర్ కి ఉన్నంత importance ఉన్న హ్రితిక్ ని డాన్ సినిమాలో నాగార్జున ని లారెన్స్ సెకండ్ హీరో ని చేసేసినట్టు తొక్కేసి సినిమాలో చాలా వరకు ఫర్హాన్ అక్తర్ నే కనిపిస్తాడు.
హ్రితిక్ కే సినిమాలో చోటు లేదు ఇంక అభయ్ డియోల్,కల్కీ కొచ్చిన్ సూరత్ కల్ వీళ్ళిద్దరినీ ప్రమోషన్స్ కోసం దిష్టి బొమ్మల్లా పెట్టినట్టుగా పెట్టారు.
సినిమా ని ఎలా పంచుకున్నారంటే
ఆరు పాటలు అరగంట
ఫర్హాన్ పద్యాలు 45 నిముషాలు
డిస్కవరీ AXN చానెళ్ళు లో పాపులర్ సీన్స్ అరగంట

హ్రితిక్ కత్రినా ఇద్దరూ మరో ముప్పై నిమిషాలు
డిస్కవరీ AXN చానెళ్ళు లో పాపులర్ సీన్స్ అరగంట
ఇంటర్వల్ పదినిముషాలు
పాటలు పిక్చరైజేషన్ చాలా బావున్నాయి
సినిమాటోగ్రఫీ extraordinary అనిపించింది
Finally ఫీల్ గుడ్ మూవీ
సినిమాటోగ్రఫీ extraordinary అనిపించింది
Finally ఫీల్ గుడ్ మూవీ
దిల్ చాహతా హై సినిమా లో గోవా ట్రిప్ అంతా చాలా బావుంటుంది కదా..
రివ్యూ ని రెండుముక్కల్లో చెప్పాలంటే DCH in Spain,A pretty film with no soul leaves you in pain.అదీ సినిమా .
టైటిల్ కి జస్టిఫికేషన్:
వీకెండ్ పొద్దున్న మన డబ్బులును అంతకంటే బంగారం లాంటి నిద్ర మానుకొని దుబారా చేసుకోవాలనుకోడానికి అంత సీన్ లేకపోయినా ఏదో నేట్టుకోచ్చేసినట్టు అనిపిస్తోంది అనగా ఈ లైన్స్ మరో సారి గుర్తుకొచ్చాయి
ఆ తర్వాత మా వాడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక గంటలో వెనుకకి వచ్చేసాం
అక్కడనుండి అలా గేట్ వే దగ్గర get together లాంటిది ఏర్పాటు చేసుకొని తనివితీరా తిరిగి తిరిగి వర్షం లో గిర గిరా తిరుగుతూ బోలెడన్ని కబుర్లు చెప్పేసుకున్నాక కార్పోరేట్ లైఫ్ లో పడి జీవితాన్ని ఎంత మిస్ అవుతున్నామో అదీ జిందగీ నా మిలేగీ దుబారా అని అప్పుడు అనిపించింది.
ఏమైంది దిగాలుగా ఉన్నావ్ అని ఫ్రెండ్ రోజంతా అడిగింగ్స్ అదేం లేదు అని చెబుతూనే ఉన్నాను
తను రిటర్న్ ఫ్లైట్ కేచ్ చేసాక నేను రూమ్ కి వచ్చి లాపీ లో ఒక వంద వరకు ఫొటోస్ చూస్తే మన మొహం లో స్మైలీ లేదు ఒక్క ఫోటో లో కూడా ..అప్పుడే నేను బోంబే కి మొదట్లో వచ్చిన ఫొటోస్ ని పక్కన పెట్టి చూస్తే అంతా మాయ.. మనసారా నవ్వడం మర్చిపోయి మూడేళ్ళు పైనే అయ్యింది .
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ని పైరేటెడ్ గా చూసే రేంజ్ లో కల్మషంగా నా మనసు బ్రష్టు పట్టిపోయిందా అని పట్టిన బూజు దులిపేసుకొని
ఫేస్ బుక్ ఓపెన్ చేసి ,ఫొటోస్ అప్లోడ్ చేసి ప్రొఫైల్ లో languages known దగ్గర English,Hindi.Telugu,Marathi లతో పాటు Sarcasm(Fluent) అని update చేసాక మనసు తేలిక అయింది .

అప్పటి వరకు మనసు తేలిక అయితే అయ్యింది కానీ వాడు వెళ్ళాక ఎన్నెనో ఆలోచనలు ..ఎలా గడిపాం ఆ ఒక్క రోజు ..అస్సలు టైం ఏం తెలియనట్టుగా అయిపోయింది
వాడితో ఉన్నంత సేపు ౩ సంవత్సరాల తర్వాత కలిసాం అన్న ఫీల్ ఏ లేకుండా పోయింది..ఆ పాత IIT రోజులు గుర్తొచ్చాయి ..బోర్ అనేది తెలియకుండా ,ఎంత హ్యాపీ గా గడిపే వాళ్ళమో.ఈ ఉద్యోగ జీవితం లోకి వచ్చాక అంతా corporate లైఫ్ వల్ల లైఫ్ లెస్ అయి ఆనందం మాత్రం కార్పెట్ కిందకి జారిపోయింది అనుకుంటూ ..
వాడు వచ్చినందుకు మనసులో చాలా సంతోషపడిపోతూ,చెవిలో లింకిన్ పార్క్ పాటలు వింటూ,సెల్ లో angrybirds ఆడుకుంటూ,laptop లో మా నోలన్ వీడియోలు చూస్తూ నిద్రలోకి జారుకున్నా.(అసలే 3 రోజులు నిద్ర లేదాయే మరి) ..ఆ తర్వాత ఏం జరిగిందో తెల్సుకోవాలంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టి ఆ అదృష్టాన్ని పొందగలరు :P
స్మార్ట్ జీవి సంతోష్ కి ఈ పోస్ట్ అంకితం :)

25 comments:
రంగ్ దే బసంతి ఫోటో ఎందుకు పెట్టారు?
చాలా బాగా రాశావ్ హరే..
సినిమా రివ్యూ మూడు ముక్కల్ల్లో పిచ్చెక్కించావ్ గా..;)
ఆ విషయం పక్కన పెడితే.. నిజమే.. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత స్నేహితుల్ని కలుసుకోవటం అంటే నిజంగా ఆ ఆనందం మాటల్లో చెప్పేది కాదు. గంటలు నిమిషాల్లాగా గడీచిపోతాయ్.
స్టూడెంట్ లైఫ్ రోజులు మళ్ళీరావుగా ఈ ఉద్యోగ జీవితం లో? నెలాఖరుకు సాలరీ, సరిపోయేట్టూ బిల్లులూ, బట్టతలా, బొజ్జా తప్పా?
>>
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ ని పైరేటెడ్ గా చూసే రేంజ్ లో కల్మషంగా నా మనసు బ్రష్టు పట్టిపోయిందా అని పట్టిన బూజు దులిపేసుకొని
ఫేస్ బుక్ ఓపెన్ చేసి ,ఫొటోస్ అప్లోడ్ చేసి ప్రొఫైల్ లో languages known దగ్గర English,Hindi.Telugu,Marathi లతో పాటు Sarcasm(Fluent) అని update చేసాక మనసు తేలిక అయింది
>>
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. హహహహహ్
క్లాస్ మెట్స్ ని , పాత ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు టైం ఎలా గడుస్తుందో తెలిదు. గంటలు నిమిషాల్లా గడిచిపొతాయి.
బాగా రాసారు హరేకృష్ణ ! రెండు , మూడేళ్ళ క్రితం ఫ్రెండ్స్ కూడా పాత ఫ్రెండ్స్ అయ్యిపోతారా అబ్బాయి ?:))))))
లతో పాటు Sarcasm(Fluent) అని update చేసాక
-----------------------------------------
హ హ :))))
>>టైటిల్ కి జస్టిఫికేషన్:
వీకెండ్ పొద్దున్న మన డబ్బులును అంతకంటే బంగారం లాంటి నిద్ర మానుకొని "దుబారా" చేసుకోవాలనుకోడానికి....
నీ క్రియేటివిటి కి జోహార్లు మిత్రమా..
వడాపావ్ బాగా వంటబట్టినట్టుంది?
>>> అంతా మాయ.. మనసారా నవ్వడం మర్చిపోయి మూడేళ్ళు పైనే అయ్యింది .
అక్షర సత్యాలు. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం గెల్చిన దానికన్నా కోలుపోయిందే ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ పాస్సింగ్ మూమెంట్స్. మళ్ళీ మన యుద్ధాలు మొదలు మనతోనే, మన అవసరాలు అనుకొనే వాటికోసం.
అయ్యబాబోయ్ ఇంత సీరియస్సుగా కామెంటా? నేనేనా. అందులోనూ ఆత్మానందం బ్లాగులోనా. హిహిహిహిహిహి.
బ్యాక్గ్రౌండ్లో Amelie థీమ్ సాంగ్ వింటూ పోస్ట్ చదివా, చివరి పేరా దగ్గరికి వచ్చేసరికి కొంచెం బరువుగా భయంగా అనిపించింది.
Have a happy time ahead buddy :)
బాగా రాసారు గురువు గారు..నిజమే కార్పొరేట్ లైఫ్ లో పడి ఆనందాన్ని కార్పెట్ కిందకి తోసేశాము..సినిమా పై మీ విశ్లేషణ బాగుంది...అదీ మూడు ముక్కల్లో...
Sarcasm(Fluent) అని update చేసాక మనసు తేలిక అయింది .--:D
:)
సూపరు పోస్ట్ హరే.. పాత స్నేహితుల్ని కలిసినప్పుడు ఆనందం చెప్పనలవి కాదు.
"Dil Chahta Hai లో అమీర్ ఖాన్ కారెక్టర్ కి ఉన్నంత importance ఉన్న హ్రితిక్ ని డాన్ సినిమాలో నాగార్జున ని లారెన్స్ సెకండ్ హీరో ని చేసేసినట్టు తొక్కేసి" హిహ్హిహ్హీ..
"అంతా మాయ.. మనసారా నవ్వడం మర్చిపోయి మూడేళ్ళు పైనే అయ్యింది ." ఇది దారుణం నిజంగా:(((
బావుంది
ఒక రివ్యూ లో చదివా స్పైన్ టూరిజం ప్రమోషన్ లా ఉంది సినిమా అని. రాజీవ్ మసందు (cnn ibn) మరి ఎందుకు పొగిడాడో అర్థం కాలే.
సినిమా ఏమో కానీ ఒక ట్రైలర్ (దూరదర్శన్ గురించి) చూసి మాత్రం ఒక రోజంతా ఎనభైలలో దూరదర్శన్ యాడ్స్, ప్రోగ్రామ్స్ చూస్తూ ..... ఉండిపోయా
శ్రీ గారు,దేశభక్తి లా కాంపస్ భక్తి తో కాలేజ్ రోజుల్లో లో ఏదైనా బొమ్మ పెడదామని గూగుల్ లో వెతికితే చివరికి దొరికింది ఈ ఫోటో :)
స్పందన కి ధన్యవాదాలు :)
రాజ్,చాలా బాగా చెప్పావ్ ఏమిటో వత్తిడి బాధ్యతలు ఇవన్నీ స్వేచ్చను హరించి మంచి స్నేహితులు కూడా దొరకడం గగనం అయిపోతోంది ఈ రోజుల్లో
గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ని మిస్ అవడం కూడా కష్టం :(
థాంక్యూ! :)
బంతి గారు
>> పాత ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు టైం ఎలా గడుస్తుందో తెలిదు. గంటలు నిమిషాల్లా గడిచిపొతాయి
Well said,ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది
స్పందనకు థాంక్స్ :)))
శ్రావ్య :)
>>రెండు , మూడేళ్ళ క్రితం ఫ్రెండ్స్ కూడా పాత ఫ్రెండ్స్ అయ్యిపోతారా
హ హ్హ..:))
ఇక్కడ పాత అంటే నోలన్ హృదయం తో ఆలోచిస్తే limbo స్టేజ్ లో ఉన్నంత ఘాడం గా జ్ఞాపకాలు పదిలపరుచుకున్నాము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఉద్దేశ్యం తో రాసేసా :)
Thank you :)))
నరేష్ :)))))))))
అంతా నీ అభిమానం, నేను, నా బ్లాగు చేసుకున్న అదృష్టం :))
థాంక్ యూ very much buddy :)
సుబ్రహ్మణ్యం గారు :)
>>ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం గెల్చిన దానికన్నా కోలుపోయిందే ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ పాస్సింగ్ మూమెంట్స్. మళ్ళీ మన యుద్ధాలు మొదలు మనతోనే, మన అవసరాలు అనుకొనే వాటికోసం.
గురూజీ బోల్డ్ లెటర్స్ లో పెట్టుకొని సేవ్ చేసుకుంటున్న ఈ స్టేట్మెంట్,So true!
సీరియస్ గా కామెంట్ :)))
ఒక నిండు యువతరానికి ప్లాటినం బాట వేసిన వారయ్యారు :)
Thank you so much :)
నాగార్జున,థాంక్ యూ :)
ఇప్పుడే అమిలీ డౌన్లోడ్ చేసి వింటూ కామెంట్ పెడుతున్న హరే:)
ఆహా.. భలే ఉంది మ్యూజిక్..థాంక్స్ అగైన్ ఫర్ షేరింగ్ :))
స్నిగ్ధ గారు థాంక్స్ :)
>>సినిమా పై మీ విశ్లేషణ బాగుంది...అదీ మూడు ముక్కల్లో
హ హ్హ..థాంక్స్ :)
ముగ్గురు హీరో లు కాబట్టి మూడు ముక్కల్లో అలా అలా చెప్పేయాల్సి వచ్చింది..టీ వీ లో చూడడానికి చాలా బావుంటుంది సినిమా :)
థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు హ్రితిక్ కి ఫ్యాన్ అయితే :)
అపర్ణ
థాంక్ యూ :)
పాత స్నేహితుల్ని కలిసినప్పుడు ఆనందం..ఇన్నాళ్ళ తర్వాత కలవడం చాలా హ్యాపీ అనిపించింది :)
ఋణం తీరాలంటే దారుణం భరించక తప్పదు :)
థాంక్స్ :)
>>ఒక రివ్యూ లో చదివా స్పైన్ టూరిజం ప్రమోషన్ లా ఉంది సినిమా అని
వాసు గారు,కరెక్ట్ గా చెప్పారు
Bachelor పార్టీ అని మొదట స్పైన్ లో ఒక సీన్ చూపిస్తాడు,ఇద్దరు పిల్లలు స్పైన్ సాకర్ స్టార్స్ అయిన xavi ఇంకా torres వేసుకున్న షర్ట్స్ వేసుకుంటారు అది బాగా నచ్చింది
గత సంవత్సరం జరిగిన స్పైన్ వరల్డ్ కప్ గెలిచాక షూటింగ్ టైం లో ఇంకా తిరిగేసి ఉంటారు యూనిట్ అంతా.
సినిమాకి స్క్రిప్ట్ సరిగ్గా లేదు.
మిగతా సైట్స్ ఫ్రాంక్ గా చెప్పాక కూడా రాజీవ్ మసంద్ 3.5/5 ఇచ్చినప్పుడే కాస్త అనుమానం వచ్చింది హ్మ్..రెండురోజులు ఆగైనా సినిమాకి వెళ్దామంటే వీకెండ్స్ లో టికెట్స్ దొరకవు దగ్గరలో బుక్ మై షో :)
స్పందన కి థాంక్స్ :)
హరే భలే టైంలో వేసావులే పోస్ట్ :) నా బజ్ చూసావ్గా ...బాగా రాసావ్
బాగా రాశావు హరే.. నిజమే కాలేజ్ స్నేహితులను కలుసుకోవడం అంత ఆనందమైన విషయం మరొకటి ఉండదు.
అక్కా..అదే అనుకున్నాను సడెన్గా నాకూ ఇటువంటి ఫీలింగ్ ఎదురయ్యింది అని..థాంక్ యూ :)
వేణూ గారు థాంక్యూ :) అవును మీరు చెప్పింది నూరుపాళ్ళు నిజం
poddunna ikkadedo post choosaanu.. paamu post.. ekkaDaa??? nenu inkaa chadavaledu... ;(
Raj :)))
http://harekrishna1.blogspot.com/2009/06/blog-post_08.html
hare gaaru aa smart jeevi Ganesh aa? ZNMD movie choosinaka e post chadiva.. asalu movie ni pogidinatta ? titti natta..? Friends miss avutunna anna baadha tho koodina noppivalana rasina review la anipinchindi..anyways chala baga rassaru..
హుమ్మ్.. ఏం చెప్పాలో తెలీట్లేదు.. కార్పెట్ కిందకి వెళ్ళిపోయిన మీ చిరునవ్వుని బయటికి లాగి మొహం మీదకి తీసుకు రండి.. అదంతా వీజీ కాదనుకోండి.. ప్రయత్నించండి.. ఇదిగో ఇలాగన్నమాట.. :) :) :) :)
శ్రావణ్ :))
పిక్స్ ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసాను :))
తిట్టడానికి ఏం లేదూ పొగడడానికి కూడా మరీ అంత చెప్పుకునేంత లేదు :)) DVD చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు :) థాంక్స్ :)
Keep visiting!
మధుర :))
కార్పెట్ అంటే తోక్కేస్తున్నారు అని :)
మనం బాస్ అయ్యేవరకే ఈ కష్టాలన్నీ తప్పవు :) అప్పటివరకు చిరునవ్వుని చెదరనీయకుండా చితక్కోట్టేయాలి :)
Thanks a lot for your positive feedback :)
Post a Comment