Pages

Wednesday, November 23, 2011

హెంతో.. హింసో... హ హ్హ హ్హ..



రాత్రి తిన్న పిజ్జా అరగక అడ్డమైన బ్లాగులు చదివి మీడియా ప్లేయర్ ఆన్ చేసుకొని ఖర హర ప్రియ రాగం లో హమ్ చేసి చిన్నగా కునుకు తీస్తూ. limit as గురక tends to 120 dB తో ప్రపంచాన్ని  మర్చిపోయి పవళించాక

జామురాతిరి జాబిలమ్మ పాట తో జడుసుకుంటూ ఉలిక్కిపడి లేవడం, వెంటనే అలారం ఆపేసి మరో గంట ఆదమరిచి నిద్ర పోయి బ్రెడ్ అండ్ జామ్ తో బ్రేక్ ఫాస్ట్.. ఇంతకంటే కావాల్సింది ఇంకేంటి..yes

సరిగ్గా అప్పుడే గుణశేఖర్ కి అశ్వనీదత్.. తెలుగు ఇండస్ట్రీ కి చిన్ని కృష్ణ దొరికినట్టు మా సో కాల్డ్ సొసైటీ వాళ్ళకి తాగిన టీ అరగక పెందలాడే హైబ్రిడ్ పందుల్లా  హా హ్హా హహ్హా హహ్హా అని ఆహాకారాలు మొదలు పెట్టడం

అసలే రెండింటి వరకు డెడికేషన్ చూపించి నిద్రపోయే బుజ్జి బ్రహ్మీలకు పాచి మొహం తో పులిహోర దద్దోజనం కలిపి పెట్టేసేవారు..పొద్దున్న ఆరున్నర కే ఈ అంబానీ ఫేమిలీస్ అంతా అంబా అంబా అని ఓండ్ర పెట్టడం తో మాకు మిగిలింది చివరికి మామిడి తాండ్రే...

నేను చెప్పేది ఏమిటంటే
తెల్లవారు జామునే కిసాన్ జామ్ లా  తియ్యగా కొక్కొరోకో అని వినాల్సిన సుకుమారమైన చెవులతో..కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ అని ఆర్తనాదాలు మొదలు పెట్టి పరుగు తీస్తుంటే ఆ  బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా ?


    
డర్టీ పిక్చర్ సినిమా వల్ల ఇమ్రాన్ హష్మీ కి విద్యాబాలన్ నుండి సీరియస్ కాంపిటీషన్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెట్టి ఇదే విషయాన్ని తనని అడిగితే
form is temporary .... class is permanent.అని అన్నాడంట


నర నరాల్లో జీర్ణించుకుపోయిన ఈ ధనావేశ వైఖరి ని నా నోట్లో సెరెలాక్ కుక్కేస్తూ నెట్టుకోస్తుంటే..నెట్ కనెక్షన్ వాడు మా అజాగ్రత్తతో, పొగరు తో బిల్ కట్టలేదని కనెక్షన్ పీకి పారేసాడు..

అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట వీళ్ళ గోలతో వేగలేకపోతుంటే పక్క అపార్ట్మెంట్ లో ఉన్న చిన్న పిల్లల ఏడుపులు ఆటలు కింద ఫ్లాట్ లో సుప్రభాతాలు వెరసి మాకు పట్టపగలే భూతాల దీవి సినిమా కనిపించేది.

సినిమా ఫ్లాప్ అయితే  ప్రొడ్యూసర్లు దూకడానికి హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ అయినా ఉంది.. ముంబై లో మాకేంటి దిక్కు ఇక లాభం లేదు అనుకొని

తియ్యరా Android వెయ్యరా కర్చీఫ్ అని operation Android స్టార్ట్ చేసి వాళ్ళకి పోటీ గా మేమొక క్లబ్ inaugurate  చేసి ఇలా ప్రోమోస్ సొసైటీ క్లబ్ నోటీస్ బోర్డ్ లో అతికించి పడేసాం


దనపు అదృశ్య శక్తుల ఆరోగ్య వ్యాయామ్య Sala అని బయట బోర్డ్ కూడా పెట్టేశాం..



ఎలానో పొదున్న అయిదింటికే భరించలేని గోలకు మన వంతుగా రాత్రి రెండు గంటలకు నిద్రపోయే ముందు ఇలా మా హాల్ లో పిచ్చగా క్రికెట్ ఆడేసి వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం.




16 comments:

Anonymous said...

1st??

Anonymous said...

:)))

**గుణశేఖర్ కి అశ్వనీదత్.. తెలుగు ఇండస్ట్రీ కి చిన్ని కృష్ణ దొరికినట్టు
**అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట
**వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం-- IIT life lo idhi matram baga nerchukuntam..kada!!

రసజ్ఞ said...

పొద్దున్న ఆరున్నర కే ఈ అంబానీ ఫేమిలీస్ అంతా అంబా అంబా అని ఓండ్ర పెట్టడం తో మాకు మిగిలింది చివరికి మామిడి తాండ్రే
అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట
వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం.
హహహ చాలా బాగుందండీ! ఇంతకీ మీ వ్యాయామ శాలలో మాకు ఏమేమి నేర్పిస్తారు? ఫీజులో బ్లాగర్లకి రాయితీ ఎంత?

తృష్ణ said...

:))
టెంప్లేట్ బావుంది...ఈ మధ్యనే మార్చావా?

రాజ్ కుమార్ said...

limit as గురక tends to 120 dB >>>>

kekaa.. :)waiting for next part

రాజ్ కుమార్ said...

first video arupulu.. rendodi choosi cheptaa... ;)

anil kumblEEE.. suneel jOshEEEEEE.. hhahahaah

Anonymous said...

అరెరే... math studentని ఇదెలా మర్చిపొయా
***limit as గురక tends to 120 dB..
super అంతే!!
eagerly waiting for the next part!! :P

-bittu

ఫోటాన్ said...

>>>>>> limit as గురక tends to 120 dB తో ప్రపంచాన్ని మర్చిపోయి పవళించాక <<<<<
కేవ్వ్వ్వవ్వ్వ్వ్.... సూపర్..........

ఫస్ట్ వీడియో అరుపులు.... పిచ్చ పిచ్చగా నవ్వుకుంటున్నా..... :))

రాజ్ కుమార్ said...

సెకమ్డ్ వీడియో ఇప్పుడే చూశా... రోజూ ఇలాగే ఆడతావా బాబూ? ఈ సారి కార్క్ బాల్ తో ట్రై చెయ్యి.;) ;)

అనీల్ కుంబ్లేఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ.... సునీల్ జోషేఏఏఏఏఏఏఏ...

జాఆఆఆఆఐ.... బాలయ్యాఆఆఆఅ ;) హహహహ

హరే కృష్ణ said...

బిట్టు అంటే కదా IIT లో చేరకపోతే ఈ బుర్ర బూజు పట్టి ఉండిపోయేది
మా కాంపస్ కి సదా రుణపడిపోయి ఉంటాను :)
మీ కాంపస్ కి కూడా :)
Thankyou :)

హరే కృష్ణ said...

రసజ్ఞ గారు మీ రెగ్యులర్ కామెంట్స్ కి ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలు :)
Thankyou very much :)

హరే కృష్ణ said...

తృష్ణ గారు :)) థాంక్యూ :)
ఈ మధ్యనే మార్చాను
http://en.wikipedia.org/wiki/Old_Trafford

EPL ఫుట్ బాల్ కి అడిక్ట్ అవ్వడం వల్లనేమో ఈ టెంప్లేట్ బాగా నచ్చింది

హరే కృష్ణ said...

రాజ్,థాంక్యూ థాంక్యూ :)
కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం :))
Thankyou so much :)

హరే కృష్ణ said...

బిట్టు :)))

హర్ష థాంక్యూ థాంక్యూ :)

శశి కళ said...

ha..ha....nice post....

హరే కృష్ణ said...

Sasi garu Thankyou :)