ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు
పుట్టింది ఈ మట్టిలో సీత,రూపు కట్టింది దివ్య భగవత్గీత
వేదాలు వెలసిన ధరణిరా
వేదాలు వెలసిన ధరణిరా
ఓంకార నాదాలు పలికిన అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవనినాడు వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతమురా,కోకిలది ఏ కులమురా
గాలికి ఏ భాష ఉందిరా,నీటికి ఏ ప్రాంతముందిరా
గాలికి,నీటికి లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు,కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు,గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు,గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు,స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు
ఇకమత్యమే జాతికి శ్రీరామరక్ష,అందుకే నిరంతరం సాగాలి దీక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష
కానీ ఇక్కడ ఏం జరుగుతోంది
A Nation where PIZZA reaches home faster than AMBULANCE & POLICE...
Where u get CAR LOAN @8% but EDUCATION LOAN @12%.
Where 1 kg ONION is Rs.24 but SIM CARD for Free.
Olympic shooter wins GOLD ,govt gives 3 Crore. another shooter dies fighting with TERRORIST. GOVT pays 1 lakh
భయంకరమైన నిజాలను సైతం అలా అలా అలవాటు చేసుకుపోయేలా చేసాయి. మన దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు పడ్డ కష్టాలను గుర్తుచేసుకొంటూ
నిన్న సినిమా కి వెళ్తే ఒక్కోసారి తలనొప్పి తో పాటు కాస్త రిలీఫ్ దొరుకుతుంది అని తెలిసింది మంచి మెసేజ్ రూపం లో
స్వాతంత్ర శుభాకాంక్షలు అని నోరు తెరిచి చెబుదామన్నా
15 comments:
పొగడరా నీ తల్లి భూమి భారతిని??
పొగడరానా? లేక అమ్మరానా?
భాస్కర్ అన్నయ్యా, ఇప్పటి జరుగుతున్న ఘోరాలని చూడకపోవడం ఆ రచయతలు చేసుకున్న అదృష్టం.
A nation where PIZZA reaches home faster than AMBULANCE & POLICE...
Where u get CAR LOAN @8% but EDUCATION LOAN @12%.
Where 1 kg ONION is Rs.24 but SIM CARD free.
Olympic shooter wins GOLD ,govt gives 3 crore. another shooter dies fighting with TERRORIST. GOVT pays 1 lakh
//
:((
Nice Post Andy...
http://www.youtube.com/watch?v=jRArMRPZzt8
--
HarshaM
Hm ! Happy Independence Day !
Good post.
Just observed the text above. Awesome. Looks like you are a big fan of comedy in King Movie
బద్రి,హర్ష,శ్రావ్య మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
వాసు గారు ధన్యవాదాలు,
keep visiting!
చాలా బాగా రాశారు హరే.. ఇంగ్లీష్ లో రాసిన యథార్ధాలు చదివితే ఎంత నిజమో కదా అనిపిస్తుంది..
వేణూ గారు థాంక్యూ!
హ్మ్మ్.. నిజాలు ఎంత భయంకరం గా ఉన్నా కంచే చేను మేస్తే ఇంక మామూలు ప్రజలు కూడా ఏం చెయ్యలేకపోతున్నామనే బాధ.
Thank you and wish you the same. Will do my best to uplift honor (ఆత్మగౌరవం) of Telugus/Indians.
కొంచెం ఆలస్యం గా చూశాను. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అనడం కూడా ఒక అలవాటు గా మారింది, ప్రధాన మంత్రి గారి ఉపన్యాసాలు లాగా. సామాన్యుడి జీవితం భారం అవుతూనే ఉంది.
అల్ సెడ్ అండ్ డన్, యెస్ మేరా భారత్ మహాన్.
చాతకం గారు
నా బ్లాగ్ కి స్వాగతం
స్పందన కి థాంక్స్!
గురూజీ,
ఏమిటో ప్రధానమంత్రి అంటే చాలా గౌరవం ఉండేది
నిన్నటి వరకు
ఎంత రిమోట్ అయినా ఈరోజు అన్నా హజారే కి జరిగిన దారుణం చూసి ఆ పేరు పిలవడానికి కూడా చిరాకు వేస్తోంది హ్మ్మ్!
మన దేశ ప్రజల అసహాయత అనాలో లేక మంత్రుల దాష్టీకం అనాలో తెలియడం లేదు
సరైన సమయంలో సరైన పోస్ట్!! ఆలోచించాల్సిన విషయాలే అన్నీ..
అన్నట్టు కొత్త టెంప్లేట్ బాగుందండీ..
మురళీ గారు థాంక్స్!
బజ్జులకి అలవాటు పడి అగ్రీగేటర్ కి వీడ్కోలు చెప్పెయాల్సి వచ్చేసింది
డాష్ బోర్డ్ లో ఇప్పుడే జతచేరుస్తున్నా మీ బ్లాగు
nice post...
Post a Comment