Pages

Wednesday, August 3, 2011

కొత్తావకాయ తో కోకోకోలా


ప్రదేశం
IIT ఢిల్లీ

హరే కాంపస్ లో చేరిన రెండు నెలల్లో నాలుగు కిలోలు తగ్గ్గిపోయి తిండి కి అడ్జస్ట్ కాలేక,
చేరక ముందు చేరిన తర్వాత అని ఫేస్ బుక్ లో కంపారిజన్ ఫోటో పెట్టిన వెంటనే వాళ్ళ అక్క నుండి unlike అనే కామెంట్ చూసి

ఔరా ఏమి ఈ వైపరీత్యము..పక్కోడి ఫుడ్ తో పాటు వాడి కుక్కు ఫుడ్ కూడా తిని పంది కొక్కులా ఉండాల్సిన నువ్వు ఇలా తయారయ్యావేంటి అని ఆశ్చర్యార్ధకం పెట్టాక!

ఏమి సేత్తుము సోదరీ,  నీకు అక్కడ  జావా అర్ధం కావడం లేదు నాకిక్కడ మా మెస్ లో పెట్టే జావ ఎక్కడం లేదు
సరే ఖాళీ ఉన్నపుడు మాట్లాడుకుందాం, అని ఫేస్ బుక్ లో ఫేస్ ఆఫ్ సినిమా ముగించేసాక

మిచిగాన్ లో ఉన్న వాళ్ళ అక్కకు మిస్సేడ్ కాల్  ఇచ్చి, ఫోన్ కట్ చేసిన హరే
చదివేది మాస్టర్స్ అయినా మిస్సేడ్ కాల్స్ విషయం లో  తన బట్టలను రూమ్ మేట్ వాడే డిటర్జంట్ల తో ఉతికేసి పీ.హెచ్ డీ చేసిన హరే కి తిరిగి ఫోన్ రానే వచ్చింది

సోదరీ ఏమిటీ ఈ సభ్రమాశ్చర్యముల ఫోను కాల్
నీ ఫేస్ బుక్ లో చిత్ర దృశ్యం చూసి నా అవుట్ గోయింగ్ పరి పరి విధములుగా పారి పోవుటకు ప్రయత్నించుచున్నది  (మనసు లో మిస్సేడ్ కాల్ ఇచ్చి ఎందుకు  కాల్ చేసావ్ అంటావ్ ఏంట్రా కన్నీటి బండా)
అక్క:బాగా చిక్కిపోయావ్ రా ఏం గడ్డి తింటున్నావేంటో
హరే:సోది వల్ల బాలెన్స్ పెరుగును,సొల్యూషన్ చెప్పుము 

హోదరి:ఒక ఎలెక్ట్రిక్ కుక్కర్ కొనుక్కో.. చక్కగా అన్నం పెట్టుకొని పెరుగు తో హాయిగా తినెయ్
హరే:జీ టీ వీ లో జీబ్రా ని చూసినట్టు టేస్ట్ అఘోరించదూ.. కర్రీ లేకపోతే!

హోదరి:నీకోసం ఇంత ఆలోచించి నీ పెళ్లి కి గిఫ్ట్ ఇచ్చేంత ఖరీదైన అవుట్ గోయింగ్ చేస్తున్నా నేను ఆ  మాత్రం సాయం చేయలేనా కొత్తావకాయ సీజన్ మొదలయ్యింది  భయం వలదు నేను రుచికరమైన పచ్చడి ప్రిపేర్ చేసి  నీకు attach చేసి ఫార్వార్డ్ చేస్తాను
హరే:ఏంటి మైల్ లోనా ?

అలా నిముషాలు కాస్తా సెకన్లు గా మారిపోయి దగ్గరలో ఉన్న మార్కెట్ కి వెళ్ళి ఒక మాంచి  ఎలెక్ట్రిక్ కుక్కర్ కొనుక్కున్నాడు హరే
హరే Fedex ట్రాకింగ్ నెంబర్ ని నోట్ చేసుకొని fedup అయిపోతూ రోజులు నెలలు సంవత్సరాలు డేలివేరీ పేకెట్ కోసం డెవిల్ లా కళ్ళల్లో కొబ్బరన్నం కారేలా వేచి వేచి వాచీ చూడ సాగాడు..బాటరీ అయిపోయిందే కానీ లాటరీ పేలనట్టు డెలివరీ మాత్రం ఇల్లే.


అప్పటికే కేస్ట్ అవే సినిమా ని చూసేసిన హరే కి ఎవడో టామ్ హాంక్స్  జీవితం ని  టామ్ అండ్  జెర్రీ లా అయిపోయి ఉంటుంది.అని అనుకొని తన కాంపస్ జీవితం  ఫినిష్ చేసుకొని ఇంటికి పొద్దున్న Airport కి బయలు దేరుతుండగా రిసెప్షన్ లో సెక్యూరిటీ గార్డ్ తనకేదో పెద్ద డబ్బా ఇచ్చాక హరే కి అర్ధం అయిపోయింది అందులో ఏముందో..

సరే రూమ్ లో పెట్టేద్దాం పక్కన ఉన్నవాళ్ళకు కనీసం రెండు రోజులైనా నిద్రపట్టదు. చివరిసారిగా గా ఈ హాస్టల్ కి తనవంతుగా నాశనం చేయడానికి చివరి అడుగు వేద్దాం అని తన రూమ్ వరకు వెళ్ళాడు.

సమయం అయిదు కావస్తోంది..తన పక్కరూం లో ఉన్న అన్వేష్ నిద్రలేచాడు వెళ్ళిపోతున్నావా హరే, అంటూ హాలా హలపు హగ్  చేసుకొని సాగనంపుతుండగా...

హరే :ఈ టైం లో నువ్వేంటి? నిద్ర పోలేదా ఇంకా ? అంత సౌండ్ పెట్టుకున్నావేంటి హాస్టల్ అంతా నిద్రలేచేలా .
అన్వేష్:మరీ అంత ఫీలవ్వకు హరే , హాస్టల్ లో చాలా వరకు జూనియర్స్ ఇంటికి వెళ్ళిపోయారు
ఆల్మోస్ట్  మనం కూడా కాలేజ్ ని విడిచి  వెళ్ళిపోతున్నాం కదా  ఒక చిన్న గెట్ together లాంటిది రూమ్ లో చేసుకుంటున్నాం చాలా మంది ఫ్రెండ్స్ మా రూమ్ లోనే ఉన్నారు ..అదే ఆ సౌండ్

అంతా బావుంది కానీ  పార్టీ లో కాస్త కారం అంతా ఖాళీ చేసేసారు కోకాకోలా లో కిక్ పోయింది.. అసలే  పాత డ్రింక్స్ బావుంటాయని ఎక్స్పైర్ అయిపోయిన కోక్ ని చాలా డబ్బులు పెట్టి తెచ్చాను తెలుసా... వా ఆఆ ...అని ఆహాకారాలు చేస్తుండడం తో


హరే :నీ దగ్గర ఉన్న ఓల్డ్ డ్రింక్ కి దీటుగా ఈ గోల్డ్ పచ్చడి తీసుకో మళ్ళీ జీవితం లో మరచిపోవు అని చెప్పి అప్పగింతలు పూర్తిచేసి డ్రింకింగ్ వాటర్ బాటిల్ లో రెండు బిస్లరీ బొట్లను స్వహస్తాలతో కార్చేసి చివరిసారిగా తమ హాస్టల్ నుండి నిష్క్రమించి

Flying మెషిన్ డ్రెస్ వేసుకున్నహరే  తమ హాస్టల్ ఎదురుగా ఉన్నలేడీస్ హాస్టల్ కి ఒక flying కిస్ ఇచ్చేసి అక్కడనుండి దగ్గరలో ఉన్న కాంపస్ హాస్పటల్ ని చూస్తూ రేపు ఎంతమంది అడ్మిట్ అవుతారో అని సంతోషంగా తెలుగు అంత స్వచ్చం గా గెంతులేసి ఇంగ్లీష్ బాషలో జంప్ అవుతూ సెలవులకు బెంగళూర్ లో ఉన్న Fedex అక్క నెంబర్ కి డైల్ చేసి

అక్కోయ్, మిషన్ పాతావకాయ టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ కంటే అద్భుతమైన రిజల్ట్స్ ని ఇచ్చేయడానికి రడీ గా ఉంది.. 

నేను వచ్చే వారం బోంబే  లో జాబ్ లో  జాయినింగ్..మా కంపనీ అడ్రెస్స్ కి మాగాయ పంపించు,ఎంచక్కా యో యా అనుకుంటూ మాగాయ తో మిరిండా షో మొదలుపెడతాను


హోదరి:అది సరే.. ఇన్ని చేస్తున్న నా ఋణం ఎలా తీర్చుకుంటావు చిట్టీ
ఇక్కడ మా టీచర్ల కోసం నాటిన మునగ చెట్లు నీకు ఫార్వార్డ్ చేస్తాను. ఆఫీస్ అవర్స్ అయ్యాక మంచి గా రోజూ నీ బ్లాగ్ లో బజ్ లో పొగుడుతూ బోల్డు కామెంట్లు పెడతాను.. సరే మరి ఆమ్రికా వెళ్ళాక మిచిగాన్ లో మునగచెట్టు ఆట ఆడుకో. 
హోదరి:అంతేనా ?
అందుకే కదా వీటితో పాటు మా లాన్ లో నీకు ప్రాణమైన  టామ్ అండ్ జెర్రీ 25 జీ బీ తెస్తున్నా..మొత్తం నీకే!
హోదరి:డెట్రాయిట్ లో డేటాల్ లేక నేనేడుస్తుంటే ముంబై లో మాగాయ దొరకలేదని నువ్వేడుస్తున్నావా.. కేవ్వ్వ్ !

 

10 comments:

ఇందు said...

పెట్టేశారా? ఇంతకీ ఆ మిషిగన్ అక్క ఎవరూఉ? తెలిస్తే చెప్పండీ వెళ్ళి కలిసొస్తా! ;)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>> అసలే పాత డ్రింక్స్ బావుంటాయని ఎక్స్పైర్ అయిపోయిన కోక్ ని చాలా డబ్బులు పెట్టి తెచ్చాను తెలుసా...

హహహ. మీ ట్రేడు మార్కులు పంచుల తోటి టపా పండింది.

రాజ్ కుమార్ said...

బులుసుగారూ పూనారా హరే ??? హహా..;)
ఎక్స్పైర్ అయిన కూల్డ్రింక్స్ తో ఇదో లాభముందా??

"కళ్ళల్లో కొబ్బరన్నం కారిందా???" ఆర్తనాదాలు నేనూ.. ;) ;)
డెట్రాయిట్ లో డేటాల్ లేక నేనేడుస్తుంటే ముంబై లో మాగాయ దొరకలేదని>>>> కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;)

హరే కృష్ణ said...

ఇందు :)))
>>ఇంతకీ ఆ మిషిగన్ అక్క ఎవరూఉ?
మిచిగాన్ లో అపర కృష్ణ భగవానుని భక్తురాలిని పట్టుకోండి తనే మా అక్క :))
కెవ్వ్ అని నోరారా అరిస్తే చాలు కేవ్వ్వ్ అని తిరిగి రేఫ్లేక్షన్ వస్తుంది :)
బోలెడు ధన్యవాదాలు :))

హరే కృష్ణ said...

గురువు గారు ధన్యవాదాలు :)
ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియక మార్పు కోసం ఏదో నాకు నచ్చ్సినది రాసుకుంటూ వస్తున్నాను
థాంక్ యూ verymuch for the feedback :)

హరే కృష్ణ said...

రాజ్ :))))))))))))
>>గురువు గారు పూనారా కెవ్వ్ కెవ్వ్ :))
కోక్ ఒకటి తాగి ఈ పోస్ట్ రాయడం మొదలెట్టాను యాదృచ్చికంగా :)
Thanks a lot :)

ఫోటాన్ said...

>>>>>>>>డెట్రాయిట్ లో డేటాల్ లేక నేనేడుస్తుంటే ముంబై లో మాగాయ దొరకలేదని<<<<<<<<<<
కేక హరే... :)

--HarshaM

..nagarjuna.. said...

total post full ROFLing :)))))))))))))))))))))))))))

హరే కృష్ణ said...

హర్ష :))
బోలెడు థాంకులు :)


నాగార్జున, కంటెంట్ తో పాటు కాన్సెప్ట్ ని పెర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేసుకొని నా బాధ ని అర్ధం చేసుకున్నావ్
థాంక్ యూ :)))))

kiran said...

హహహహా...బాగుంది హరే..
:డెట్రాయిట్ లో డేటాల్ లేక నేనేడుస్తుంటే ముంబై లో మాగాయ దొరకలేదని నువ్వేడుస్తున్నావా.. కేవ్వ్వ్ !
కేవ్వ్వ్వవ్వ్వ్వ్ :D