Pages

Thursday, July 7, 2011

లార్డ్ ఆఫ్ ది లాస్ట్ బెంచ్..

ఈ మధ్య ఏదో ఇష్యూ వచ్చి దాన్ని resolve చేస్తుంటే,
మరో  క్లైంట్ నుండి మరో ఇష్యూ వచ్చింది.

మా కొలీగ్ సంధ్య కి స్వీట్ పెట్టకుండా టాస్క్ ఇచ్చి ఇది సాయంత్రం లోపు  ఫినిష్ చెయ్యు  అని చెబితే..
you are an escapist,a typical back bench attitude అనింది.


ఇంకా నాలో నర నరాల్లో జీర్ణించుకుపోయిన backbencher తన్నుకు వచ్చి  తనకేం చెప్పానంటే.....

 చెవిలోఉన్న హెడ్ ఫోన్స్ తీసేసి కొరుక్కుంటున్న గోళ్ళని గాయపరచకుండా సీరియస్ గా వినండి
**************************************************************************
నీకేం తెలుసు బాక్ బెంచర్స్ గురించి ?
మా myths గురించి తెలిస్తే ఇలా మాట్లాడవు.

సంధ్య:ఏంటి మీ మల్టీ  టాస్కింగ్ మొహాలకి myths కూడానా  ?
నీ మాటలు వల్ల ఒక  బాక్ బెంచర్ గా నా మనసు ఎంత గాయపడి ఉంటుందో నువ్వు అర్ధం చేసుకోగలవా?
సంధ్య:నీకు బుర్ర మాత్రమే లేదనుకున్నా ఇన్నాళ్ళు ఇప్పుడు కిడ్నీ కూడా లేదని తెలుసుకున్నా.

సరే సంధ్యా... నువ్వు ఏ బెంచ్ లో కూర్చొనే దానివి ?
సంధ్య:రస్నాతాగేటప్పటినుండీ నేను మిడిల్ బెంచే తెలుసా.
 

విదారకరమైన క్లైమాక్స్ సీన్ లో కూడా శ్రియలా మెలికలు తిరుగుతూ మరమరాలు ఏరుకొనే మిడిల్ బెంచా!!  
సంధ్య:అది చిన్నప్పుడు,ఇంజనీరింగ్ కి వచ్చాక  మొదటి బెంచ్ కి వెళ్ళిపోయాను
నేను :ఎందుక్యో ?
అది కాదు మహేష్ బాబు కి మొదటి బెంచ్ లో కూర్చొనే అమ్మాయిలు అంటేనే ఇష్టం అని ఒక ఇంటర్వ్యూ లో చదివాను అనేసరికి 
(హమ్మయ్యా సమస్య లేదు తెలుగు బ్లాగర్లు ఒక్కరు కూడా ముందు బెంచ్ లో కూర్చోరు మహా అయితే ఈ పోస్ట్ కి కామెంట్లలో మేము మొదటి బెంచ్ లోనే పుట్టి పెరిగాం  అని కేకలేస్తారు..అంతే కదా! పిచ్చ లైట్ అనుకుని కానిచ్చేసా ) 



ఓకే అయితే ఏంటి,ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ 
ఎనీథింగ్ అబౌట్ టూ రిలీజ్ ?
ఇప్పుడు లాస్ట్ బెంచ్ లొల్లిని మీ ముందు ప్రవేశ పెడుతున్నాం

******************************************************************************************************************
అవి ప్రతీక్,నేహా  ఇంజనీరింగ్ లో మొదట బెంచ్ లో కూర్చొని విసిగి  స్వేచ్చని కోల్పోయి ప్రేమపావురాలు కాస్తా రాళ్ళేసిన ఆవుపాలు లా తయారవుతున్న టైం లో 

ఇద్దరు లాస్ట్ బెంచ్ కి షిఫ్ట్ అయ్యాక ఒక భయం కర  కుర్ర నిజాన్ని తెలుసుకున్నారు.


క్లాస్ మొత్తం కనిపించేది కేవలం టీచర్ కి  లాస్ట్ బెంచ్ లో కూర్చున్న స్టూడెంట్ కి మాత్రమే...
టీచర్  బోర్డ్ వైపు తిరిగితే మనం ఇక్కడ బోర్డ్ మీటింగ్ పెట్టేసుకోవచ్చు ఎంచక్కా 


అని మిగతా మూడేళ్ళు ఎటువంటి మూఢం లేకుండా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ మొహబ్బతే కొనసాగించారు.


ఇంకోవైపు మన హీరో కి  సైడ్ బిజినెస్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఈ extracurricular activities లో భాగంగా  ప్రతీక్ కి ప్రాక్సీ చెప్పడం అంటే చాలా ఇష్టం.
ఎంత ఇష్టం అంటే తన గర్ల్ ఫ్రెండ్ నేహా కి కూడా గొంతు మార్చి చెప్పేటంత. రోజు రోజుకీ ప్రతీక్ పెరుగుతున్న పాపులారిటీ ని చూసి ఓర్వలేని ఫాథర్ ఫెమినిస్ట్ బిపిన్ కూడా ప్రాక్సీ లు చెప్పడం మొదలు పెట్టాడు


అయితే ఒక రోజు ప్రతీక్ కి ఫీవర్ వచ్చి హాస్టల్ లో రెస్ట్ తీసుకుంటుండగా క్లాస్ లో బిపిన్ కి భయంకరమైన పాపులారిటీ పెరిగి పోయింది

అయితే బిపిన్ కి అమ్మాయిలకు ప్రాక్సీ చెప్పే industry experience లేకపోవడం తో దీనికితోడు నేహా నోరు తెరిచి అడిగేసరికి నోటమాటలేకుండా నో అని చెప్పలేక సిగ్గుతో సైగ చేసాడు

నేహా:i know you are బిపిన్, ఫెమినిస్ట్ కా బాప్ మరి నేను? 
బిపిన్:తూ బిపిన్ కా బిపాసా
నేహా:థూ!

క్లాస్ లో ప్రొఫ్ attendance మొదలెట్టేసాడు
నేహా నెంబర్ వచ్చేసరికి హాజరు చెప్పేసి గట్టిగా ఊపిరి పీల్చుకొని nestle కిట్ కాట్ ని పిల్లిలా బెంచ్ కింద తింటూ తాజాదనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు.
 

కాసేపయ్యాక క్లాస్ మొత్తం బిపిన్ వైపు చూడడం మొదలుపెట్టింది అప్పుడు లైట్ గా లైట్ వెలిగింది ఏంటంటే

ఫెమినిజం పరాకాష్ట తో ఉన్న బిపిన్ తను ప్రెజెంట్ కి బదులు ప్రెలేడీ అని చెప్పేసాను కదా అని మొదటిసారిగా nestle కి బదులు నాలుక కరుచుకున్నాడు
ఆ క్షణం వరకు బిపిన్:ఫెమినిస్ట్ కా బాప్ కాప్షన్ తో  ఓ వెలుగు వెలిగిన వాడు  కాస్తా అంతులేని అమాయకత్వపు ఆప్ గా తయారయ్యాడు.

ఆ  సాయంత్రం ప్రతీక్ హాస్టల్ కి వెళ్ళిన నేహా తో క్లాస్ లో ఆరోజు జరిగిన విషయం చెప్పింది
ప్రతీక్: దీనికి కారణం ఏంటో నీకు తెలుసా
నేహ:వాడు ఫెమినిస్ట్

ప్రతీక్:అదే బిపిన్ చివరి బెంచ్ లో కూర్చుంటే హాయిగా వెనుక ఎవ్వరు ఉన్నారనే pressure ఉండదు. ముమ్మాటికీ లాస్ట్ బెంచ్ వాడి కంట్రోల్డ్ ఎమోషన్స్ మనకు క్లియర్ గా అర్దమవుతున్నాయి
that credit should go to last బెంచ్ అని సంతోషం తో పరవశించి పోతూ స్వచ్చమైన
అముల్ పాలు తాగాడు. 

నేహ:అయితే ఇప్పుడు ఏమంటావ్ ?
ప్రతీక్:పోకిరి బాష లో చెప్పాలంటే
ఏ బెంచ్ లో కూర్చున్నాం కాదన్నయ్యా క్లాస్ టాపర్ అయ్యామా లేదా

నేహ:మరి ప్రేమ సంగతి ?
ప్రతీక్:లాస్ట్ బెంచ్ లవ్ అనేది లావా అంత స్వచ్చంగా ప్రవహిస్తుందే కాని మొదటి బెంచ్ ప్రేమ వలే  ఉప్పు లేని ఉపద్రవంలా  చప్పగా ఉంటుందా చెప్పు ? ఇన్నేళ్ళ మన సహవాసం లో ఇదేనా నువ్వు తెలుసుకున్నది. హతవిధీ!!
 నేహ:చిన్నప్పుడు ఏ పుస్తకాలలో చదవలేదు ప్రతీక్
 ప్రతీక్:ఏం మాట్లాడుతున్నావ్ నువ్...వు భారతం లో అర్జునుడు ఎక్కడ కూర్చొనే వాడో నీకు తెలుసా
నేహ:లాస్ట్ బెంచ్ ఆ ?
ప్రతీక్:అప్పటికి  బెంచీలు నీల్ కమల్ లు లేవు..

ప్రతీక్: అంతెందుకు లారీ  డ్రైవర్  లో బాలయ్య ఏం చెప్పాడు నిప్పురవ్వ లో విజయశాంతి ఏం చెప్పింది U can become an engineer if u study in engineering college. U cannot become a president if u studies in Presidency College
నేహ:మరి విజయశాంతి ?
లాస్ట్ బెంచ్ లో కూర్చొన్న మాత్రాన విజయశాంతి హీరో శ్రీహరి భార్య డిస్కో శాంతి  అవ్వదు
నేహ:శాంతి శాంతి.
వీళ్ళకు మనసు ఉంటుందా ?
మనసు ఉన్నా లేకపోయినా క్లాస్ లో కూర్చున్న వాళ్లకు మనస్తత్వం ఉంటుంది
 
నేహ: అబ్బో..
వినేవాడు ఉంటే ఉతికి ఆరేసేస్తావ్ కదా..అందుకేరా నువ్వంటే నాకిష్టం
మనస్తత్వాలా?..ఏం తత్వాలో ఏమిటో చెప్పు 

బెంచ్ మనస్తత్వాలను విశదీకరిస్తే

మొరపెట్టుకొనే వాళ్ళు మొదటి బెంచ్ లో
మొహమాటస్తులు మిడిల్ బెంచ్ లో
మహానుభావులు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు

నేహా::సోర్స్ ప్లీజ్!
కలామ్  గారే చెప్పారు:
The best brains of the nation may be found on the last benches of the classroom and I'm one of them!

మొదటి లైన్ దగ్గరకు వచ్చేస్తే
సంధ్య:అయితే ఇప్పుడేం అంటావ్
పిచ్చి సంధ్యా !
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది
బ్లాగు పుట్టగానే బావురుమంటుంది
లాస్ట్ బెంచ్ కి వెళ్ళగానే లక్కు ని నక్క తొక్కుతుంది

సంధ్య:ఓరి దుర్మార్గుడా inception సినిమా ఎక్ష్ప్లైన్ చేసినప్పుడే అనుకున్నా నీ interpretations కి ఏదో లాజిక్ ఉంటుందని..అది సరే కానీ 
మన ఆఫీస్ లో  ఈ సంవత్సరం బెస్ట్ బ్యూటీ క్వీన్ గా నాకెందుకు ఇవ్వలేదంటావ్
నేను:రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్నాడని జానీ వాకర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటారా చెప్పు

ఓకే టీవీ 9 తెగ చూస్తావ్ కదా క్యూబికల్ లో కూర్చొని  ఏంటి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్
సంధ్య:మలయాళం నేర్చుకుంటున్న జగన్ అని స్క్రోలింగ్  వేస్తున్నాడు
నేను:ఏం పద్మనాభ మందిరం  election
లో ట్రస్టీ గా ఏమైనా పోటీ చేస్తున్నాడా
సంధ్య:జంప్ టూ  కామెంట్స్ :)

ఈ పోస్ట్ రాయడానికి inspire చేసిన మా ఫ్రెండ్ శ్రావణ్ కి మరియు బ్లాగ్ లో చేరబోయే కొత్త ఫాలోవేర్ కి ఈ పోస్ట్ అంకితం  :)

19 comments:

తృష్ణ said...

:)) good fun.

కొన్నాళ్ళు మొదటి బెంచి, కొన్నాళ్ళు లాస్ట్ బెంచుల్లో కూచున్నవాళ్ళు ఏ కేటగిరీ?

SJ said...

gud...

Sravan said...

హాయ్ హరే బాగుంది నీ పోస్ట్ ..
"చదివిందే మళ్ళీ చదవ బుద్ది వేసింది " ప్రెజెంట్ బదులు ప్రేలేడి..హ హ సూపర్ ..

బ్యాక్ బెంచ్ మనస్తత్వాలు అదుర్సు ..థాంక్యూ ..నా పేరు ప్రస్తావించినందుకు ...

హరే కృష్ణ said...

తృష్ణ గారు :)))
ఏదో టైటిల్ లో అత్యుత్సాహం తో లార్డ్ అని రాసేసుకున్నాను కానీ ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి నేనెవరిని చెప్పండి :)
కొన్నాళ్ళు లాస్ట్ బెంచుల్లో కూచున్నవాళ్ళు కారణ జన్ములు అని నా ఘాట్టి అభిప్రాయం :)
Thankyou verymuch!:)

హరే కృష్ణ said...

సాయి గారు థాంక్యూ :)

శ్రావణ్, హమ్మయ్య ఎన్ని పోస్ట్లు చదివినా బ్లాగులో మొదటి సారి కామెంట్ పెట్టావ్ :)) Thanks a lot:)

చదివిందే మళ్ళీ చదవ బుద్ది వేసింది,thanks again buddy :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>బ్లాగు పుట్టగానే బావురుమంటుంది
>>>రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్నాడని జానీ వాకర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటారా చెప్పు

ఆహా! జీవిత సత్యాలు ఎంత చక్కగా చెప్పారు.

ఎప్పటిలాగానే టపా బాగుంది. అ.హా

Sravya V said...

నాకిప్పుడు కొన్ని doubts ఉన్నాయి ,
సంధ్య మీకు రిపోర్ట్ చేస్తుందా ?
ఇఫ్ ఎస్ - అంత ధైర్యం గా typical బ్యాక్ బెంచ్ attitude అని ఎలా అన్నది ?
ఇఫ్ నో - మీరు టాస్క్ ఎలా assign చేసారు ?

ఫుల్ బిజీ అయ్యి ఇద్దరు కలిసి ఈ బ్యాక్ బెంచ్ attitude గురించి ఎలా discuss చేయగలిగారు ??
ఒకవేళ పని వదిలేసి మీటింగ్ పెడితే మీ బాస్ ఎలా ఊర్కున్నాడు ?

నాకు ఇప్పుడు అర్జెంట్ గా వీటికి సమాధానం కావాలి ?

ఇది చదివి కామెంట్ రాయమంటే question పేపర్ రాస్తారా అని అడిగితె సమాధానం ఎస్ రాస్తాం మీరు అలా రాయద్దు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి :))))

karthik said...

కేకోకేకస్య కేకహ
నువ్వు ఇలా లాస్ట్ బెంచ్ వాళ్ళ గురించి రాశావ్ బాగుంది మరి సెకండ్ బెంచ్ మీద జీవితమంతా పేటెంట్ తీసుకున్న నాలాంటి వాళ్ళ గురించి రాయకపోవటం ఘోరం మరియూ దారుణం, ఫస్ట్ బెంచ్ వాళ్ళ గురించి రాస్తారు, లాస్ట్ బెంచ్ వాళ్ళ గురించి రాస్తారు.. మధ్యలో అందరినీ మిడిల్ బెంచ్ అని గొర్రెల్లాగా మాట్లాడటం ఏమీ బాలేదని నేను ఈ సందర్భంగా నొక్కీ వక్కాణిస్తున్నాను అధ్యక్షా!
కాబట్టి మధ్యలో కూర్చునే వాళ్ళను కూడా సెకండ్ బెంచ్ వాళ్ళు అని, తర్డ్ బెంచ్ వాళ్ళు అని ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మరోసారి చెబుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను :P

వేణూశ్రీకాంత్ said...

హ హ హ పోస్ట్ అదరహో హరే :-))
సాటి లాస్ట్ బెంచర్ గా నాకు మరింత నచ్చేసింది :)
LBA జిందాబాద్..
లాస్ట్ బెంచ్ అనగానే అలా నొసలు ముడేయకండి నాపేరు ప్రతీక్ కాదు పక్కన నేహా కూడా లేదు :D

హరే కృష్ణ said...

గురువు గారు బోలెడు థాంక్స్ :)
శిష్యుడు కి పేరు వచ్చినప్పుడే గురువు కి నిజమైన ఆనందం అని మరోసారి రుజువు చేసారు

ఆ .హా కి అర్ధం తెలియలేదు..
http://www.youtube.com/watch?v=iEe_eraFWWs
ఈ పాట తెగ వినేస్తున్నా :))) మహా మహా అంటూ :)
థాంక్యూ :)

హరే కృష్ణ said...

శ్రావ్య :))))))

>>>సంధ్య మీకు రిపోర్ట్ చేస్తుందా ?
అవును చేస్తుంది.బహుచక్కగా సపోర్ట్ కూడా చేస్తుంది :)

ఇఫ్ ఎస్ - ట్రూ
>>అంత ధైర్యం గా typical బ్యాక్ బెంచ్ attitude అని ఎలా అన్నది ?
ఇప్పుడు టైం మషీన్ ఎక్కండి నాతో పాటు
రెండేళ్ళ క్రితం ఒకే రోజు ఫ్రెషర్ గా ఒకే పొజిషన్ లో సంధ్య నేను కంపనీ లో ఒకేరోజు జాయిన్ అయ్యాం
తెలుగు సినిమా రాజకీయాలు మీద బొత్తిగా అవగాహన లేని సంధ్య ని తొక్కి పడేసి నేను సీనియర్ అయ్యాను ఇప్పుడు సంధ్య నాకు రిపోర్ట్ చేస్తుంది అన్నమాట :))

తనకి ఆ ఫ్రీడం ఉంది :)


>>ఫుల్ బిజీ అయ్యి ఇద్దరు కలిసి ఈ బ్యాక్ బెంచ్ attitude గురించి ఎలా discuss చేయగలిగారు ?? ఒకవేళ పని వదిలేసి మీటింగ్ పెడితే మీ బాస్ ఎలా ఊర్కున్నాడు ?
నేను టాస్క్ ఇచ్చిన సమయం సుమ్మారు మధ్యాహ్నం ఒంటిగంట కావస్తోంది... లంచ్ బ్రేక్ అప్పుడే మొదలయ్యింది ఆ టైం లో కస బిసా డిస్కస్ చేసేసుకున్నాం :))


>>ఇది చదివి కామెంట్ రాయమంటే question పేపర్ రాస్తారా అని అడిగితె సమాధానం ఎస్ రాస్తాం మీరు అలా రాయద్దు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి :))))
పెట్టేస్తా disclaimer పెట్టేస్తా :)))

బ్లాగులో పోస్ట్ చదవడానికే ఆసక్తి కనపరచని ఈ రోజుల్లో మీరు చదివి ప్రశ్నలు వేయడం ముదావహం ఆవకాయ పెరుగన్నం
బోలెడు థాంకులు :)

హరే కృష్ణ said...

కార్తీక్ హ హ్హ థాంక్స్!
నా లాజిక్ ఏంటంటే మొదటి బెంచ్ ని x అనుకుందాం
చివరి బెంచ్ ని y అనుకుందాం
(x+1)to(y-1) మిడిల్ బెంచ్ కేటగరీ లోకి వస్తారని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను

మొదటి బెంచ్ చివరి బెంచ్ వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే ధైర్యవంతులు మిగతా వాళ్ళంతా బెంచ్ వెనుక దాక్కున్న కాట్స్ :)
ఇందులో ఏ మార్పు లేదు
బాబోయ్ మిగతావాళ్ళు కుక్కలా అని నీకు డవుట్ వచ్చేసింది కదా :P
కాదు ముమ్మాటికీ కాదు :))
Thankyou :)

హరే కృష్ణ said...

వేణు గారు థాంక్ యూ థాంక్యూ :)
లాస్ట్ బెంచ్ తో అనుబంధం రాజశేఖర్ కి జీవితా కి ఉన్నటువంటి అన్యోన్యమైన బంధం లాంటిది
జిందాబాద్ జిందాబాద్ :))


>>లాస్ట్ బెంచ్ అనగానే అలా నొసలు ముడేయకండి నాపేరు ప్రతీక్ కాదు పక్కన నేహా కూడా లేదు
హహ ఇది సూపర్ :)))
thankyou verymuch :)

Sravya V said...

అదీ అదీ ఇప్పుడు విషయం బయటికి వచ్చింది , ఐతే ముందు పోస్టులో ప్రతీక్ మీరే ఇప్పుడు కాదని బుకాయించకండి, పాపం సీనియర్ ని అలా హింస పెట్టి ప్రమోషన్ కొట్టేస్టారా :)))))

మేము ముందు పోస్టులో కామెంట్ పెడితే వెనకపోస్లో నిజం ప్రూవ్ అవుతుంది :))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

అహా = అట్టహాసం, రెండు చుక్కలు ఒక పది బ్రాకెట్లు లాగా అన్నమాట.

ఆ.సౌమ్య గారి బజ్ చూడండి. మిగతా హాసాల కోసము. లింక్ అంటారా, కొంచెం వెతకండి. దహా

హరే కృష్ణ said...

హ హ్హ శ్రావ్య గారు :)
టైం మషీన్ లోకి ఎక్కకుండానే దూర దృష్టి లేకుండానే బ్లాగు archive దృష్టి తో అస్త్రాలు ప్రయోగిస్తారా :))

మేము ముందు పోస్టులో కామెంట్ పెడితే వెనకపోస్లో నిజం ప్రూవ్ అవుతుంది :))))
అంటా ప్రతీక్ మాయ మన అనుగ్రహం అని ఫాలో అయిపోవాల్సిందిగా ప్రార్ధన :)
థాంక్స్ :)



గురువు గారు ఆ ముక్కలో అంత అర్ధం ఉందా :)
వివరించినందుకు ధన్యవాదాలు
ఈ గుర్తులేంటో ఈ గొడవేంటో :)))
ఒకటా రెండా ఒక ముప్పయ్ వరకు ఉన్నాయి
షార్ట్ అండ్ స్వీట్ కంటే implications imperfections complications interpretations :))
ఆంగ్లములో రెండే పదాలు చక్కగా వాడుకుంటా :)
Thankyou :)

నేస్తం said...

అదీ అదీ ఇప్పుడు విషయం బయటికి వచ్చింది , ఐతే ముందు పోస్టులో ప్రతీక్ మీరే ఇప్పుడు కాదని బుకాయించకండి, పాపం సీనియర్ ని అలా హింస పెట్టి ప్రమోషన్ కొట్టేస్టారా :)))))

naadi same sravya doubt :)

హరే కృష్ణ said...

అక్కా,ఒకే దేశం లో ఉన్నవాళ్ళంతా ఒకేలా ఆలోచిస్తారు అది మానవ సహజం :))
థాంక్యూ :)

రాజ్ కుమార్ said...

ఏమోనబ్బా.. నాది మాత్రం చిన్నప్పటీ నుండీ ఫస్ట్ బెంచే.. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోవటం నాకలవాటు.
కానీ బ్యాక్ బెంచ్ లో కూడా ఖర్మ కాలి కొన్నిరోజులు కూర్చున్నా.. కూర్చున్నన్ని రోజులూ లవ్ బర్డ్స్ మధ్య చీటీలు అందించడానికే సరిపోయేది.జీవితం. ఇది చాలదన్నట్టూ ప్రతీ లెక్చరర్ నన్నే లేపి అడిగేవారు..;( ;(
కానీ ఒకే ఒక్క మంచి జరిగిందీ. అదేమిటంటే నాకు సైట్ భారీగా ఉందనీ, దూరంగా ఉన్న బ్లాక్ బోర్డ్ తప్ప దానిమీదున్న అక్షరాలు కనిపించవనీ తెలిసొచ్చిందీ.. అప్పటినుండీ నాలుగు కళ్లతో నెట్టుకొస్తున్నా. (నెట్ కి కూడా) ;) ;)


ఇహ పోతే.. "ప్రెజెంట్ బదులు ప్రేలేడి" సూపరు ఈ ఇన్సెప్షన్ టైపు ఆలోచనలు నీకు తప్ప ఇంకెవరికీ రావనుకుంటా... ;) ;)