Pages

Sunday, June 5, 2011

బ్లాగోకేసుకుందాం రా..





ప్రదేశం: ఉప్పల్ గ్రౌండ్ హబ్, హైదరాబాద్
హర్ష ధ్వానాలు, చప్పట్లతో మారుమోగుపోతున్న సభా ప్రదేశం
తన పోస్ట్ రెండు వందల వ రోజు పురస్కరించుకొని హీరో తన రెండో బ్లాగ్ ని అందరి ముందు లాంచ్ చేసి ప్రముఖ దర్శకుడి తో మొదట కామెంట్ ను రాయించుకున్నాక
లౌడ్ స్పీకర్ ఆన్ చేసి


బ్లాగీ వుడ్ ప్రేక్షకులకు నమస్కారం
ఈ విజయం అందరిది కాదు.. దీనికి ముందు జరిగిన సంఘటన మీ అందరి ముందు తో పంచుకోవాలి అని చెప్పి




నేను ముందు మా నిర్మాత గారికి ఫోన్ చేసి ఈ టైటిల్ చెప్పి
సార్ ఒక కధ అనుకుంటున్నాం..చేస్తే మీతోనే చెయ్యాలి అని చెప్పాక
ప్రొడ్యూసర్ : ఏం, వేరే ఎవరూ దొరకలేదా..
రైటర్ : (నవ్వుతూ)..ఐ లైక్ యూ

ప్రొ :టైటిల్ ఇంటరెస్టింగ్ గా ఉంది
సరే ఈ కధ ఏంటి.. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా దీనికి ?
హా ఎందుకు లేదు..

1 .దురద పుట్టిన చోటే గోక్కోవాలి
2 .దురద పుట్టినపుడే గోక్కోవాలి
3 .గోక్కున్న చోట మళ్ళీ దురద పుడుతుంది అని అన్నాడో మహా బ్లాకవి

అని చెప్పి ముగించి.. సరే దర్శకుడు ఎవరు,హీరో ని ఎవర్ని పెట్టుకుందాం అని అడిగాక

ఇంకెవరు సార్..

స్వేద సౌధం తో అరగ్రేటం చేసి
స్క్రబ్బరిల్లు తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై
మండే చుండ్రుడు తో మాస్ ఎనర్జీ ని ట్రాన్స్ ఫారం ని కోళ్ళ ఫారం చేసేసి
బోరో ప్లస్ శ్రీను దర్శకత్వం లో యంగ్ ఫిరంగీ ఘొళ్ళు దుర్జన్ నటించ బోవు ఈ సినిమా న బ్లాగో న భవిషత్ అన్న రీతిలో ఉంటుంది మన బ్లాగోకేసుకుందాం రా.. దీన్నే
హిందీ లో
rub నే బనాదీ దురద...గా విడుదల చేసేద్దాం అని చెప్పాక

ఓహో..బావుంది బావుంది

హీరో ఎలా ఉంటాడు మన కధ లో..ఆల్ రౌండర్ ఆ ?

వినండి అని చెప్పి మొదటి సీన్ వైజాగ్ బీచ్ లో


వర్క్ ని అటకే ఎక్కిస్తే..ఓ పనైపోతుంది బాబు
బ్లాగులో సెగలే సృష్టిస్తే... ఓ పనైపోతుంది బాబు
కామెంట్లకు కౌంటర్ పడుతుంటే ...ఓ పనైపోతుంది బాబు
ఆ కౌంటర్ ని ఎన్ కౌంటర్ చేస్తుంటే .. ఓ పనైపోతుంది బాబు
ఆ దెబ్బకు చుండ్రే వచ్చేస్తే ..నీ బూడిద బుర్ర ను గోకేస్తే.. ఓ పనైపోతుంది బాబు..ఓ పనైపోతుంది బాబు (ఓ..పా,,బా)

అని జాలీ జాలీ గా దొరికిన జనాల బుర్రలు తినేసి పనిలో పనిగా గోకేసి హీరొయిన్ కి ఫోన్ చేస్తాడు...అయినా వెనుక కోరస్ వాళ్ళు ఓ.పా.బా అని ఆపకపోవడం తో

హీరొయిన్ :ఓ పాపా బాబు ..బ్లాగుకే బాబు
కామెంటరా... తిన్నగా.. తెలుగులో..

హీరోయిన్ హర్రర్ మాటలతో భయపడిన హీరో ఒక షాంపూ బాటిల్ కొనుక్కొని ఇంటికోస్తాడు
తలకు స్నానం చేసి హీరొయిన్ ఇంటికి వెళ్ళిన హీరో


హీరొయిన్ కుటుంబ సభ్యులను తన చుండ్రు కళ్ళతో స్కాన్ చేసి
వాళ్ళ అన్నయ్య ముందు కుర్చీ లో కూర్చుంటాడు

హీరోయిన్ అన్న : ఏం బాబూ ఇలా వచ్చావ్
హీరో :(బుర్ర గోక్కుంటూ ) ఏం గోకననుకున్నావా..గోకలేననుకున్నావా

నువ్వేనా మా చెల్లి చెప్పిన అబ్బాయివి ఏం చేస్తుంటావ్.. లాంటి వివరాలన్నీ అడిగేసాక చివర్లో

హీరోయిన్ అన్న: తల తెల్లగా ఉంది
హీరో:అది హెడ్ అండ్ షోల్డర్స్ వాడాక వచ్చిన తెలుపు కదా మరి

హీరొయిన్:అన్నాయ్, ఎలా ఉన్నాడు మీకు కాబోయే బావ
అన్నాయ్:ఆపు నీ అఘోరా ప్రేలాపన.
సల్మాన్ ని సర్ఫ్ ఎక్సెల్ తో తోమినట్టు ఎక్సలెంట్ గా ఉన్నాడు చూడ్డానికి , అయినా నేను మీ పెళ్లిని చేసేది లేదు.
ఏమయ్యింది ? ఎందుకు

మనం తర తరాలుగా తారలు వాడే మీరా షాంపూ నే వాడుతున్నాం. వీడు తలకు మాసిన వాడిలా ఆ తల మరియు భుజాల షాంపూ వాడుతున్నాడు... భందించండి రా వీడిని అని చెప్పి, హీరో ని కొట్టి అవుట్ హౌస్ లో పడేసాక

హీరోయిన్ అన్న తనకు పట్టిన బూజులు దులుపుకొని, తన అనుచరులతో ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ..


అసలే మీ అక్క వాడెవడో క్లినిక్ ఆల్ క్లియర్ గాడితో వెళ్ళిపోయి మనతో సంభందాలను క్లియర్ చేసేసి మన ఇంటిని క్లినిక్ ని చేసి పడేసింది.నువ్వు కూడా అలా చెయ్యడం నాకిష్టం లేదు.

హీరొయిన్:అన్నయ్య అంతేనా వా ఆ ఆ ..అని ఏడుచుకుంటూ అందరి హీరోయిన్ల లాగానే ఫాస్ట్ గా మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న తన గది తలుపులు మూసేసుకొని మంచం మీద పడిపోయి తన బెడ్ షీట్ ని రెండు ముక్కలుగా నిలువునా చీరేస్తుంది...

అప్పుడే తెరపై బ్రేక్ అని చిరిగిన బెడ్ షీట్ మధ్యలో పడుతుంది. .

నిర్మాత : ఓహ్ అదేంటి రెండు గంటల తర్వాత బ్రేక్ ఆ... ఇదేం విరామం లేదు నేను ఒప్పుకోవడం లేదు
సరే అని చెప్పి...ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పు


వెంటనే హీరొయిన్ తన రూమ్ లో చిరిగి పోయిన దుప్పటి ని కుట్టుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటుంది..హీరో ని కలవడానికి ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ కొల్లేరు సరస్సు లో కొట్టుకుపోతాయ్..హీరొయిన్ అన్న మాత్రం తమ చెల్లి కోసం matrimony సైట్స్ లో రిజిస్టర్ చేసి తను మాత్రం ఫేస్ బుక్ ఫార్మ్ విల్లే లో కాలం గడుపుతూ ఉంటాడు.


హీరో మాత్రం ఆ గేదెల శాల లో చిన్న చిన్న చైనా ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.




అయితే హీరో,హీరొయిన్ ల ప్రేమ గార్నియేర్ షాంపూ తో వాడిన జుట్టంత దృఢంగా ఉండడంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వాడే మీరా షాంపూ బాటిల్ లో హేడ్ అండ్ షోల్డర్ షాంపూ ని కొద్ది కొద్దిగా రోజూ కలిపేసి విష కన్య లా హేడ్ షోల్డర్ హీరోయిన్ అన్య గా తయారు చేసి పారేసాక ఒక రోజు

ఇక్కడ మీ అమ్మమ్మ కి సీరియస్ గా ఉంది రా అని సడెన్ గా ఫోన్ రావడం తో వేరే గ్రామానికి వెళ్ళిన
హీరొయిన్ వాళ్ళ అన్న..బంధువులను పరామర్శించి ఆ ఊర్లో ఉన్న మీరా షాంపూ వాడాక, ఇదేమిటి మీరా వాడు క్వాలిటీ తగ్గించేసాడా బోరు నీళ్ళ వల్ల వచ్చిన ఎఫెక్టా అని బుర్ర గోక్కొని సగం జుట్టు వచ్చేసాక తర తరాల షాంపూ మీద మమకారాన్ని వదులుకొని

తల మరియు భుజాలు దిద్దిన కాపురం లా హీరొయిన్ అన్న భుజాలు ఎగరేసుకుంటూ ఇద్దరికీ పెళ్లి చేసేయడం తో కధ ముగుస్తుంది.



ఇప్పుడు బ్యాక్ టూ టాప్ కి వచ్చేస్తే
విజయోత్సవ సభలో దీనికి సీక్వెల్ తలంటుకుందాం రా..కి మొదటి క్లాప్ ఇచ్చి ఉప్పల్ గ్రౌండ్ లో షూటింగ్ మొదలుపెట్టడం తో ఈ అంకం సమాప్తం.


ఉపోద్ఘాతం :
ఫ్రెండ్ నుండి ఫోన్ మొన్ననే
హాయ్ హరే ఎలా ఉన్నావ్
నీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ వేసావా..బజ్ లో ఏంటి సంగతులు..ఈ వేసవి లో ఏంటి విశేషాలు,

వేసవి లో చుండ్రు శాతం పెరుగుతుంది..
బ్లాగుల్లో కామెంట్ల శాతం తగ్గింది.
బజ్జు అనేది ఒక స్ట్రాబెర్రీ గుజ్జు లాంటిది ..ఒక్క సారి లోపలి వెళ్ళాక ఇంకా ఇంకా టేస్ట్ చెయ్యాలనిపిస్తుంది..అని చెప్పి ముగించి

ఈ చుండ్రు మీద కాన్సెన్ట్రేట్ చేస్తే వచ్చిన అవుట్ పుట్ నే ఈ టపా



15 comments:

రాజ్ కుమార్ said...

హాహహ.. కెవ్వ్వ్వ్వ్వ్.. .
ఏం బాబూ సడెన్ గా షాంపూల మీదా, జుత్తుల మీదా పడ్డావ్?? పంచ్ లు ఇరగ..
టైటీల్ "తలంటుకుందాం రా.." అని పెడితే సరిగ్గా సరిపోయేదేమో? ;)

kiran said...

>>>అసలే మీ అక్క వాడెవడో క్లినిక్ ఆల్ క్లియర్ గాడితో వెళ్ళిపోయి మనతో సంభందాలను క్లియర్ చేసేసి మన ఇంటిని క్లినిక్ ని చేసి పడేసింది -- :D :D
హహహ...నువ్వే మొదలు పెడ్తున్నావా ఇంకో బ్లాగ్...:P
అన్ని షాంపూ లను బాగా కవర్ చేసేసావ్..:)

Sravya V said...

అసలు ఆ టైటిల్ అర్ధం ఏమిటి ?:(((((((((
ఇంత complicated స్క్రిప్ట్ ఏమిటి ?:(((((((((
btw తలలో చుండ్రు పెరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి షాంపు మార్చటం కాదు చెయ్యల్సింది :))))))

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఆర్ట్ సినిమా లు అసలు అర్ధం కావు నాకు. కానీ చుండ్రు కొద్దిగా పెంచుకుంటూ జుట్టు కొద్దికొద్దిగా తగ్గించుకోవటానికి షాంపులే మహత్తర సాధనం అని అర్ధం అయినది. నేను కూడా ఎందులోనూ చేరకుండా ఒక పావురం షాంపు కొనుక్కుంటాను. అప్పుడు గుండు గీక్కోందాం అనే సీక్వెల్ తీస్తాను.
పంచ్ లు హాహాహహ.

హరే కృష్ణ said...

రాజ్ :)))
థాంక్ యూ థాంక్ యూ :))
మరీ క్షవరాలు సవరాలు మీద పడితే బాగుండదు కదా అనీ, ఇద్దరికీ కామన్ గా ఉన్న పాయింట్ చుండ్రు మీద ప్రతాపాన్ని చూపించేసా :)
నీ మొదటి వ్యాఖ్య వచ్చిన పోస్ట్ లు నాకా బాగా కలిసొచ్చాయి :) థాంక్స్ :)

హరే కృష్ణ said...

కిరణ్ :))
ఉన్న బ్లాగులోనే కామెంట్లు రావడం లేదు..ఇక రెండో బ్లాగు కూడానా..నేనే అయితే ముచ్చటగా మూడో బ్లాగ్ ఓపెన్ చేసేవాడిని కదా :)..సో నేను కాదని ఘాట్టిగా ఫిక్స్ అయిపోండి :)
Thank you :)

హరే కృష్ణ said...

శ్రావ్య గారు
అంత గజిబిజి గా ఉందా కాన్సెప్ట్
ఇన్స్ ప్షన్ చూసి ఇలాంటి కధలు చదివితే కనెక్టివిటీ ఉండదేమో :((((
డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆ పావురం షాంపూ వాడమన్నాడు..డవ్ వాడు వాడికి నెల నేలా డబ్బులిస్తున్నట్టు... డవ్ వాడితేనే ఇలా అయ్యిన్దండీ బాబు అని చెప్పి అక్కడనుండి పావురం లా ఎస్కేప్ అయిపోయా
అదీ సంగతి :) ఏమిటో గత రెండు పోస్టులుగా నాకేదో మిశ్ర శృతి కామెంట్లే కనిపిస్తున్నాయ్ హేమిటో..ఈ బ్లాగీ వుడ్
నేనేమో ఖర హర ప్రియ రాగం అంత బాగా రాద్దాం అనుకుంటాను.. మీరు దాన్ని మిక్సీ లో రీమిక్స్ చేసి వీట్ బిస్క్స్ చేసి పడేస్తారు
ధన్యవాదాలు :)

హరే కృష్ణ said...

గురువు గారు
గుండు గీక్కోందాం haha :D

పావురాలు మంచివి కాదు సిల్కో అని చెప్పి మన జుట్టు ని పోలిస్టర్ చేసి పడేస్తాయి
ఇది ఆర్ట్ సినిమా కాదు ప్యూర్ ఫిక్షన్ :)
thank you :)

నేస్తం said...

వేసవి లో చుండ్రు శాతం పెరుగుతుంది..
బ్లాగుల్లో కామెంట్ల శాతం తగ్గింది.
బజ్జు అనేది ఒక స్ట్రాబెర్రీ గుజ్జు లాంటిది ..ఒక్క సారి లోపలి వెళ్ళాక ఇంకా ఇంకా టేస్ట్ చెయ్యాలనిపిస్తుంది..అని చెప్పి ముగించి
ఏం ఉపమానాలు అసలు :)))

Arun Kumar said...

హాహహ.. కెవ్వ్వ్వ్వ్వ్..

మధురవాణి said...

బాబోయ్!! ఏం క్రియేటివిటీ అసలు.. షాంపూల వాళ్లకి ఇది చూపించి రాయల్టీ అడుగుదాం.. ఇంత బాగా వాళ్లకి ప్రచారం కలిపిస్తున్నందుకు.. అసలు షాంపూలతో కథల్లాలనే నీ అయిదియాకి ఒక వంద ఓహోలు వేస్కోవచ్చు.. :D :D

హరే కృష్ణ said...

అక్కా ,థాంక్ యూ :)
ఈ మధ్య ఉప్మా తెగ తినడం వల్లనేమో
ఈ ఉపమానాలు ఆటోమేటిక్ గా తెగ పుట్టుకోచ్చిన్గ్స్..తగ్గించాలి దిష్టి తగిలి వేడి చేసేస్తోంది అనుకుంటున్నా :)

అరుణ్ గారు ఓపిగ్గా చదివినదుకు థాంక్స్ :)

మధుర
రాయల్టీ కెవ్వ్ :))))
ఈ స్టేట్ మెంట్ చూపించి అప్పుల అప్పారావు లో రాజయోగం లాగా రాయల్టీ వస్తుంది అని చెప్పి ఊర్లో అప్పులు చేసేసుకోవాలి :)) తర్వాత సంగతి తర్వాతే :)
చివరకి ఈ బ్లాగు ని అమ్మేసి ఏదో ఒక ఫీల్డ్ లోనికి వెళ్లిపోవచ్చు :)
థాంక్స్ :)

మనసు పలికే said...

అమ్మో హరే.. ఏంటిదీ..? షాంపూల ఎక్లూజివ్ ఎగ్జిబిషన్ లా ఉంది;) ఎన్ని టపాలు రాసినా గేదెల్ని మాత్రం వదలవు కదా;);)
టపా మాత్రం సూపరు..:)) ఉపమానాలు అదుర్స్..:D

శివరంజని said...

అయ్యయ్యో నేను ఈ పోస్ట్ చదవనే లేదు ......హహ్హహః తెగ నవ్వేసాను ......హహ్హహ నాకు ఫస్ట్ పేరా గ్రాఫ్ అయితే పడీ పడీ నవ్వాను ... మీ పాత పోస్ట్ పోకిరీ పేరడీ ని క్రాస్ చేస్తూ రాసారు చాలా చాలా బాగుంది

హరే కృష్ణ said...

అపర్ణ, ఏం చేస్తాం విధి బలీయమైనది
జనాల జుట్టు బలహీనమైనది.. బాధలు అరిగిపోయిన జుత్తులు కాస్త పంచుకుంటే పోతాయ్ అని ఎవరో చెబితేనూ
బలహీనం లో బలం కాన్సెప్ట్ కోసం బూస్ట్ తాగి ఈ దృఢమైన కాన్సెప్ట్ ని ఎంచుకోవాల్సి వచ్చింది :)))
ధన్యవాదాలు :)

శివరంజని గారు లేట్ గా చదివినా
మీ వ్యాఖ్య ని చూసాక సంతోషం అనిపించింది :)
పోకిరి పోస్ట్ నా అల్ టైం ఫేవరైట్ :) దానితో పోల్చినదుకు చాలా హాప్పీస్ :)
థాంక్ యూ :)