Pages

Wednesday, February 2, 2011

డ్రాకులా.. C.Tech


ఎన్నో సంవత్సరాలు చీకట్లో  లో గడుపుతున్న నక్కలు ఒక్కసారిగా ఊల పెట్టే ముందు ఉండే  ప్రశాంతత ఆవహించి ఉంది ఆ  చోటంతా..   కొన్ని నిమిషాలు అయింది ఆ  నక్కలకు చాలా సమీపం లోఅప్పుడే టైడ్ డిటర్జెంట్ ఫిలిప్స్ ట్యూబ్ లైట్ వాళ్ళు ప్రవేశ పెట్టిన ధగ ధగలతో  తెల్ల బట్టలతో ఒక వ్యక్తి నడుస్తుండడం కనిపించింది  స్మశాన సరిహద్దులంతా వ్యాపించేలా ఆ  వెలుతురు ప్రకాశిస్తోంది..వీటన్నిటిని ఒకపక్క గమనిస్తున్న కాద్రా..నిద్ర లే నిద్ర లే అని రెచ్చగొడుతూ మంట లో  జీలకర్ర ఎలకలు సారీ ఏలకులు వేసి ఆ  సువాసన ని అఘ్ర్రానిస్తూ అఘోరిస్తున్నాడు. అకస్మాత్తుగా గమ్మత్తైన మత్తులో ఆ  వాతావరణం లో ఉన్న కాద్రా జపిస్తున్న మంత్రాలన్నీ  చేధిస్తూ  ఆ వ్యక్తి తన వైపు గా మరింత ముందుకు రావడం తో..కాద్రా గుండె గబా గబా గుబేల్ మంటూ గోలేడుతుంది.

ఎన్నో ఏళ్లుగా నువ్వు సాధించాలనుకున్న సమయం ఆసన్నమయింది అని రీ సౌండ్ ఆ  చుట్టూ పక్కల ప్రతిధ్వనిస్తోంది. నీ మంత్రోపాసనం తో ఈ స్మసానాన్ని మన్ను మసానం తో నింపేసే అనిఈ సారి  ఒక వ్యక్తి అరుపు మరింత గట్టిగా వినిపించింది.  ఈ చిరు చినుకులకు తోడు గాలి కూడా మరొకసారి గిలిగింతలు పెట్టింది ..చాలా హాయిగా ప్రశాంత మైన వాతావరణం కమ్ముకుంటుంది అనగా ఎక్కడ నుండో  ఒక నక్క ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా! ఇలా నా కళ్లు నిన్నే చూస్తుండాలా ..చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మదే స్మశానం లోన సర్ఫింగ్ చేస్తుందిలా.. అని ఊల పెడుతోంది. ఈ గాలి జోరుకి తోడు నక్క ఊల కాద్రా ను మరింత అసహనానికి గురయ్యేలా చేయడం తో కోపోద్రేకుడు అయిన కాద్రా..  నా మంత్రాలను చేధిస్తూ నువ్వు తట్టుకోవడం సాధ్యం కాదు అని ఇంకా గట్టిగా అరుస్తూ తన పిడికిలి బిగించి మంటలో మరింత గడ్డిని వేయసాగాడు..

చినుకులు పెరిగి కాస్త పెద్ద వానగా మారేటట్టుగా అనిపించడం తో ఆ శబ్దాల హోరు నెమ్మదించింది.అయినా కూడా పరుచూరి బ్రదర్స్ ని వదలని బాలకృష్ణ లా కాద్రా తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారిగా ధూమ్ కెన్నడీ బుష్ అని గట్టిగా అరిచి తన సంచి లోనుండి బయటకు తీసి  వేసాడు గన్ పౌడర్ ..గాలి ఉధృత పెరిగిపోవడం తో తన మొహం పై మరింత మంట పైకి వస్తోంది.ఇవన్నీ చాలదన్నట్టు చెమట ఇంకోవైపు చంపేస్తోంది ఇటువంటి విపత్కర పరిస్తితి ని ఎదుర్కుంటున్న కాద్రాని మిగతా దెయ్యాలు సూటిపోటు అరుపులతో నక్కలు కెవ్వు కేక లతో పిచ్చేక్కిస్తున్నాయ్..

ఈ హేళన ని సహించలేని కాద్రా  ఈసారి తన సంచిలోనుంచి ఒక ఎముక తీసాడు.చెమట వల్ల వచ్చిన itching sensation ప్రాలదోలడానికి ఉపయోగించాక తిండి వస్తువులతో పాటు ఆ  ఎముక ని కూడా పెట్టేయడం వల్ల వాలిన దోమలను చూసుకోకుండా  దద్దుర్లు వచ్చి వికటించడం తో ఇకలాభం లేదని Boroplus  పౌడర్ తీసుకొని జల్లడం మొదలెట్టాక  టాల్కం లో ఉన్న hydrated magnesium silicate బోన్  లో ఉన్న కాల్చియం తో మిక్స్ అయ్యి కాల్షియం ఎమినో బొందాక్సైడ్ ఏర్పడి వర్షపు నీటిలో వరదలా పారి స్మశానాన్ని అల్ల కల్లోలం చేసి నగర కాలుష్యం ని తట్టుకోలేక తన బట్టలను నల్లగా తయారు చేసుకున్న దయ్యాన్ని సైతం నురుగ లో ముంచి పడేసింది.ఇంతలో ఒక వాన్ వచ్చి కాద్రా ముందు ఆగింది
 
ఎదురుగా ప్రాజెక్ట్ కన్సల్టెంట్ కాద్రాతో  ఈ నురుగేంటి ఈ బుడగలేంటి.. నువ్వు ఎంచుకున్న ప్లేస్ ఏంటి ,వర్క్ allot చేసే ముందు  ఏమైంది ఈ శ్రద్ధ నీ వర్క్ షెడ్యూల్ బార్ చార్ట్ లు హిస్టో గ్రామ్ లు వేసి నానా హంగామా చేసి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నావ్ కదా  ..ఇప్పుడు డెడ్ లైన్ అయిపోయింది

కాద్రా:i did everything i can but you know due to natural calamities..

కన్సల్టెంట్:సోది ఆపి,అయిదు ముక్కల్లో చెప్పు ఫైనల్ output ఏంటో
కాద్రా:నిండు చందురుడు ఒకవైపు నక్కలు ఒకవైపు
కన్సల్టెంట్:oh,that's great..thank you and you are out!

నక్కల ఆరెంజ్ కి.. కాద్రా రివెంజ్ ఇంకా ఉంది :)


40 comments:

రాజ్ కుమార్ said...

first comment naade...

మనసు పలికే said...

2nd nadi.. :(

మనసు పలికే said...

hahhahaha Kevvvv
>>ఎదురుగా ప్రాజెక్ట్ కన్సల్టెంట్ కాద్రాతో ఈ నురుగేంటి ఈ బుడగలేంటి.. నువ్వు ఎంచుకున్న ప్లేస్ ఏంటి ,వర్క్ allot చేసే ముందు ఏమైంది ఈ శ్రద్ధ నీ వర్క్ షెడ్యూల్ బార్ చార్ట్ లు హిస్టో గ్రామ్ లు వేసి నానా హంగామా చేసి ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నావ్ కదా ..ఇప్పుడు డెడ్ లైన్ అయిపోయింది

మనసు పలికే said...

>>కాద్రా:i did everything i can but you know due to natural calamities
కన్సల్టెంట్:సోది ఆపి,అయిదు ముక్కల్లో చెప్పు ఫైనల్ output ఏంటో
కాద్రా:నిండు చందురుడు ఒకవైపు నక్కలు ఒకవైపు
కన్సల్టెంట్:oh,that's great..thank you and you are out!
hhahahhahahahha

kiran said...

హే అప్పు,వేణురాం గారు...నా comments కొట్టేసారు..:(

హరే కృష్ణ - hahha ...talcum powder ..బాగా నవ్వుకున్న..
నక్క తో కూడా orange పాట పాడించేసిన ఘనత మీకే దక్కుతుంది.. :)

ఇన్ని కష్టాలు పడ్డ కాద్ర పెద్ద revenge ప్లాన్ తోనే వెనక్కి వస్తాడు అనుకుంటున్నా.. :)

రాజ్ కుమార్ said...

జీలకర్ర ఎలకలు సారీ ఏలకులు వేసి ఆ సువాసన ని అఘ్ర్రానిస్తూ అఘోరిస్తున్నాడు'

అనగా ఎక్కడ నుండో ఒక నక్క ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చూస్తుండాలా చాలా లవ్లీగా ఇలా రేపావు గోల అని ఊల పెడుతోంది.

kevvvvvvvvv ekkadanundi ekkadiki link boss.

హరే కృష్ణ said...

వేణూరాం ఫస్ట్ కామెంట్ నీదే :)
థాంక్ యూ థాంక్ యూ :)
>>ekkadanundi ekkadiki link boss.
:D :D

హరే కృష్ణ said...

అపర్ణ థాంక్స్ :)
మరీ అంత నచ్చిందా thankyou :)

హరే కృష్ణ said...

కిరణ్ :) :)
రాస్తాను..కాద్రా రివెంజ్ కోసం హిమాలయాలకు పంపిస్తున్నా ట్రైన్ లో.. కాస్త టైం పట్టొచ్చు but తొందర్లోనే రాసేస్తాను
నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు :)

Naresh said...

మధ్యలో C.Tech ఏంటి?
anything interesting? :)

Ennela said...

నిండు చందురుడు ఒకవైపు నక్కలు ఒకవైపు
hahahaha,,,,

Unknown said...

నా ఫేవరేట్ .. పాటని అవమానిస్తార .. హు .. నేను కామెంట్ రాయను అంతే

Sravya V said...

that's great..thank you and you are out! :P

కృష్ణప్రియ said...

బాబోయ్.. భయమేస్తోంది.. కార్ లో కూర్చుని చదువుతుంటే.. వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది.. ఇటు పక్క కార్ exhaust వదిలిన Carbon Monoxide నిండిన గాలి రివ్వున మొహం మీద కొట్టి దగ్గుతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సరే అని ఇటు తిరిగితే మోటార్ సైకిల్ మీద నుండి కూర్చున్న ఒక మఱ్ఱి ఊడ ల్లా జుట్టు మొహం మీద పడుతోంటే.. వాటి చాటున రెండు కళ్ళు చింత నిప్పుల్లా మెరుస్తూ అదొక రకమైన జలదరిమ్పుకి గురిచేస్తున్నాయి.(రాత్రంతా వర్క్ చేసి ఉన్న ఒక software engineer అనుకుంటా )
గబ గబా కామెంట్ రాసేసి లాప్టాప్ మూసేస్తున్నా..

శివరంజని said...

హహహ హరే కృష్ణగారు పోస్ట్ సూపర్ గా ఉంది ... నాకయితే మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ సునీల్ కి దెయ్యం కధ చెప్పినట్టు చెప్పారు ..... అబ్బ ఎంత హర్రర్ స్టోరీ రాసారు ........ మీ పోస్ట్ చదువుతుంటే నాకు మాత్రం భయం వేయలేదు ..బాగా నవ్వొచ్చింది ..ఇంకా నవ్వు వస్తూనే ఉంది....

మహేష్ బాబు పాట కి పేరడీ రాస్తారా........ హుమ్మ్ కావ్య ఊరుకోవద్దు అంతే మనం

ఆ.సౌమ్య said...

"మంట లో జీలకర్ర ఎలకలు సారీ ఏలకులు"
"నీ మంత్రోపాసనం తో ఈ శ్మసానాన్ని మన్ను మసానం తో నింపేసే"...కేకంతే :D

సూపరు డూపరు కామెడీ మాత్రం ఆరెజ్ పాట
"ఊల ఊలల్లా అలా చూస్తేనే చాలా! ఇలా నా కళ్లు నిన్నే చూస్తుండాలా ..చాలా లవ్లీగా ఇలా రేపావు గోల మదే స్మశానం లోన సర్ఫింగ్ చేస్తుందిలా"....హహహహహహ :D

కామెడీ బావుందిగానీ ఎందుకు రాసారో, దీని అర్థమేమిటో తెలియట్లేదు.

మధురవాణి said...

కాల్షియం ఎమినో బొందాక్సైడ్....
:) :)
సౌమ్య గారన్నట్టు.. కామెడీ బాగుంది.. కానీ, విషయం ఏంటీ అని నాక్కూడా అర్థం కాలేదు. :(

Unknown said...

హరే కృష్ణ గారు స్మశానం లో .. అలంటి పూజలు అవి చేస్తారు అవి మనకి తెలియడానికే .. ప్రొసీజర్ తో సహా రాసారు .. ఇంతకి మీకేవరికి అర్ధం కాలేదు ఆ కాద్ర = హరే కృష్ణ :) నా సి ఐ డి బ్రెయిన్ తో కనిపెట్టేసా ..

హరే కృష్ణ said...

నరేష్..అదేం లేదు! రెండో పార్ట్ లో ఎక్ష్ప్లైన్ చేస్తాను అంతా :)..thankyou :)
rights గురించి పింగ్ చేసి మాట్లాడుకుందాం :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>hydrated magnesium silicate బోన్ లో ఉన్న కాల్చియం తో మిక్స్ అయ్యి కాల్షియం ఎమినో బొందాక్సైడ్ ఏర్పడి
బాబ్బాబు ఆ బోందాక్సైడ్ గురించి కొంచెం వివరిస్తే ఓ నోబులు బహుమతికి ప్రయత్నిస్తాను. ఈ C.Tech మర్మమేమి?
నిండు చందురుడు, నక్కలు సూపర్ కాంబినేషన్
కత్తి, గునపం అంతే.

హరే కృష్ణ said...

ఎన్నెల గారు,
నా బ్లాగులో మీ వ్యాఖ్య చూసాక చాలా సంతోషం కలిగించింది..ఆత్మానందం బ్లాగులోనికి స్వాగతం!
స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు :)


కావ్య గారు
Shahil hada,Chinmayi మీద ఒట్టేసి చెప్పండి అది orange లో మీ ఫేవరైట్ పాట అని :) ఒక్కటే చెప్పాలి రెండూ ఇష్టమే అంటే కామెంట్ చెల్లదు!

హరే కృష్ణ said...

శ్రావ్య గారు థాంక్ యూ :)

కృష్ణ ప్రియ గారు కెవ్వ్ కెవ్వ్..నా పోస్ట్ కంటే మీ కామెంటే ఇంకా బావుంది :)
మీ నుండి ఒక ఉత్కంఠభరితమైన హర్రర్ సీరియల్ కోసం కళ్ళు మర్రిచెట్టు ఊడల్లా వేసుకొని ఎదురుచూస్తాం..

హరే కృష్ణ said...

శివ రంజని గారు మీరొక్కరే నా పోస్ట్ సూపర్ అని అన్నారు.. బోలెడు థాంక్స్ :)
>>వెంకటేష్ సునీల్ కి దెయ్యం కధ చెప్పినట్టు చెప్పారు .....
హ హ్హ ఆ సీన్ భలే ఉంటుంది
>>హుమ్మ్ కావ్య ఊరుకోవద్దు అంతే మనం
మీరు అలాంటి భయంకరమైన decisions తీసుకోకండి..అయిన కావ్య గారు మాట్లాడుతుంది ఆరంజ్ పాటకేమో అని నా ఘాట్టి అభిప్రాయం..
thankyou :)

హరే కృష్ణ said...

సౌమ్య గారు..అంతా మీ అభిమానం
రెండో పార్ట్ లో మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా వివరిస్తాను తప్పకుండా :)
thank you so much


మధురవాణి గారు,
హ్మ్మ్..ఇంట్రో కావాలనే avoid చేసాను :(
ఇలా అవుతుందని అనుకోలేదు
కాద్రా vs (నక్కలు +అపరిచితుడు) తో ఎందుకు ఇలా చేస్తున్నాడో అని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి రెండో పార్ట్
రెండో పార్ట్ లో మొత్తం వివరం గా రాయడానికి ప్రయత్నిస్తాను :) థాంక్ యూ :)

హరే కృష్ణ said...

సుబ్రహ్మణ్యం గారు
హ హ్హా..చెప్పేయ్ మంటారా!
నోబెల్ వచ్చాక మరి నాకు పార్టీ ఇవ్వాలి (వచ్చినా/ రాకపోయినా కూడా :)
సరే చెప్పేస్తున్నా
ఇసుక రేణువులు లో సామాన్యం గా సిలికా ఉంటుంది(Sio2)
అది మట్టి లో కలిసిపోతుంది..మిగిలినది గాలిలో ఉన్న ఆక్సిజన్ తో కలిసి magnesium group of organic compounds of nitrogen derived from అమ్మోనియా
లతో కలిసి oxygen bond ఫార్మ్ అవుతుంది
oxygen-bond, bond oxide ని తెనుగీకరిస్తే బొందాక్సైడ్ అయ్యింది..
బాగా చెప్పాను కదా!
క్షమించాలి..ఈ ఫార్ములా మీకు నాకు నోబెల్ వాళ్లకి మాత్రమే తెలియాలి top secret! :)
మీ స్పందనకి బోలెడు ధన్యవాదాలు ఇంకా ఒక నోబెల్ ప్రైజ్ :)

హరే కృష్ణ said...

>>C.Tech మర్మమేమి?
మర్మము ఏమీ లేదండీ..తొందర్లోనే రెండో పార్ట్ రాసేస్తాను వివరంగా ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ చెప్పడానికి ఏమి ఉండదు :)
కత్తి గునపం నన్నేనా థాంక్ యూ థాంక్ యూ :)

కావ్య గారు నేను కాద్రా మీరు CID నా ?
:( :(

Ennela said...

ఇంకా మీకు నొబెల్ డిస్కస్షన్లు ఏంటీ?...నేనెప్పుడో బొందాక్సయిడు మర్మం నొబెల్ వాళ్ళకి సబ్మిట్ చేసేసా..(మీ ఎక్సప్లెనేషన్ కాపీ కొట్టే లెండి....) ఇంక నొబెల్ మీద ఆశ వదులుకోండి బాబూ....

పరిమళం said...

హరేకృష్ణ....భయపెట్టేద్దామనే :) :)
తర్వాత దార్కా ...విషాచి వస్తారా :) :)

Ravi Gadepalli said...

పోస్ట్ కేక మాష్టారు.... 'టైడ్ డిటర్జెంట్ ఫిలిప్స్ ట్యూబ్ లైట్ వాళ్ళు ప్రవేశ పెట్టిన ధగ ధగల'...
'ఎమినో బొందాక్సైడ్'...ఇవి సూపర్..
'నిండు చందురుడు ఒకవైపు నక్కలు ఒకవైప'....మొత్తం summary 5 పదాల్లో చెప్పావు కదా..ha ha ...:)

హరే కృష్ణ said...

ఎన్నెల గారు.. :))
వదిలేసుకున్నాం..వదిలేసుకున్నాం :)

పరిమళం గారు..హ హ్హ..మీరు భయపడలేదా అయితే :) :)
రెండో పార్ట్ లో ఏం రాయాలా అని ఆలోచిస్తున్నాను..సూపర్ ఐడియా ఇచ్చారు థాంక్యూ థాంక్యూ :)

హరే కృష్ణ said...

రవి :))
eleventh అవర్ కాన్సెప్ట్ వదలం కదా :)
Thanks a lot :)

Unknown said...

www.telugupustakalu.com

Unknown said...

ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్ .. ఆరెంజ్ సినిమాలో పాటని ఖూని చేసినందుకు గాను హరే కృష్ణ అనబడే ఈ ముద్దాయిని ...
ఢిల్లీ మహా నగరం లో మెట్రో రైలు రోజుని రెండు సార్లు ఒక నెల రోజులు ఎక్కవలసిన్డిగా శిక్ష జారి చెయ్యడం అయినది ...

vikky2vikram said...

idi edo hollywood movie spoof laaga undi....nenu aa cinema chooda ledu...so sarigga ardham kaledu..last line baagundi..." nindu chandrudu okavaipu nakkalu oka vaipu.."

బులుసు సుబ్రహ్మణ్యం said...

బోందాక్సైడు గురించి నోబులు కమిటీ లో ఉపన్యాసం ఇచ్చాను. కిందపడిపోయారు. లేచి మళ్ళీ పడిపోయారు, ఈ మాటు నా కాళ్ల మీద.నోబులు కన్నా పెద్ద బహుమానం ఇస్తామన్నారు. వరల్డ్ రైట్స్ కావాలంటున్నారు. చర్చలు అయిన తరువాత మళ్ళీ చెపుతాను.

ఎన్నెల గార్కి సారీ చెప్పండి. ఆవిడకు ఇవ్వరు
హహహ

Ennela said...

ఇక్కడ ఏం జరుగుతోందసలు!నాకు నో'బిల్లు' రాదన్నవారెవరు! వారికెన్ని 'గుండీలు'?

..nagarjuna.. said...

బాబయ్యా...ఇక్కడ ఏటో ఐనాది. ఆ బొందాక్సైడ్ తగిలి ఏటైనాదో తెలీట్నేదు...యెవురన్నా సెప్పేసి పుణ్ణం కట్టుకోరాదురు...

బులుసుగారు మీకు నోబులు, ఎన్నెల గారికి నోబిల్లు, హరేకు 'బొందాక్సైడ్ ఫాదర్' వత్తాదిగాని మీలోమీరు హైరానా పడిపోబాకండి

Ennela said...

నేను గందబ్బయ్యా...ముందుగాల ఫారం పెట్టుకున్నదీ...ఇట్టా అందురికీ సర్దుతుండావెట్టా!అబ్బయ్యా..నాగార్జునా...ఇదేందబ్బా..నాయంగుండాదా...!!

బులుసు సుబ్రహ్మణ్యం said...

@నాగార్జున
బోందాక్సైడు ఫాదర్--కేకోకేక
@ఎన్నెల
మా బిల్లులన్నీ మీకే

హరే కృష్ణ said...

nagarjuna
బోందాక్సైడు ఫాదర్
ROFL :)



సుబ్రహ్మణ్యం గారు
మా బిల్లులన్నీ మీకే
కెవ్ కెవ్వ్ :)తప్పకుండా :)
ఇదేదో బావుంది :D