డిసెంబరు 31,2009
ప్రదేశం: నాంపల్లి రైల్వే స్టేషన్
ప్రవీణ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. మొదటి సెమిస్టర్ పరీక్షలు నెలరోజులు ఆలస్యం గా జరగడంతో సెమిస్టర్ సెలవుల్లో ముంబయి వెళ్ళడానికి ప్రయాణమైంది. ట్రైన్ రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోవడం కాకపోవడంతో కాస్త దిగులుగా ఉంది తనకి.
S9 కోచ్ కాస్త ఖాళీగా ఉండటంతో అది ఎక్కేసి 39 విండో సీట్ లో కూర్చొని డిసెప్షన్ పాయింట్ చదువుతోంది. ట్రైన్ స్టార్ట్ అవుతోంది.
ఇంతలో ఒక పెద్దావిడ వచ్చి తన ముందు కూర్చుంది. ప్రవీణ ప్రక్కనే ఉన్న 3 టైర్ సీట్ ఖాళీగా ఉండటంతో అక్కడికి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఒక ఫ్యామిలీ కూర్చున్నారు. ఎదురుగా ఒక అబ్బాయి ఐఫోన్ తో బిజీ గా ఉన్నాడు. పిల్లల గొడవ ఎక్కువ అవడంతో ప్రవీణ ఆ అబ్బాయి పక్కన కూర్చోడానికి రిక్వెస్ట్ అడగక తప్పలేదు.
హాయ్! అయాం అశోక్.. యు కెన్ సిట్ హియర్.
ప్రవీణ: థాంక్స్.. మీరు ఎక్కడికి వెళ్తున్నారు.
అశోక్: సారీ.. ఐ డోంట్ నో తెలుగు... అయాం ఫ్రమ్ బెంగళూర్.
ప్రవీణ: ఓ ఐసీ..
అశోక్: ఒకతను హైదరాబాద్లో ఎక్కాల్సి ఉంది. తను ఇంకా రాలేదు. బహుశా బేగంపేట్లో బోర్డ్ అవుతాడనుకుంటా!
ట్రైన్ బేగంపేటకి చేరుకుంది.
తమ కంపార్ట్మెంట్లో ఎవరూ ఎక్కలేదు. ఇంకా ఎవరూ రాలేదేమిటీ అనుకొని ప్రవీణ బయటకు దిగి లిస్ట్ లో ఎవరు ఎక్కాలా అని చూస్తోంది.. S9, 42 కళ్యాణ్ అని ఉంది. ట్రైన్ నెమ్మదిగా కదులుతోంది. ప్రవీణ హమ్మయ్యా అనుకుని కాస్త ఊపిరి పీల్చుకుంది.
ఇంతలో ఒక కుర్రాడు పరిగెడుతూ వచ్చి S9 లో ఎక్కేసాడు లగేజ్ తో సహా. ఎక్కి వెంటనే ప్రవీణ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని పళ్ళు కొరుకుతోంది ప్రవీణ. హాయ్.. మీ సీట్ నెంబర్ 42 నా అని అడిగింది. దానికి సమాధానంగా అతను అవును అన్నాడు. ఈ లోపు TTE వచ్చాడు. ఇద్దరూ టికెట్స్ చూపించారు..
TTE: మీరిద్దరూ ఫ్రెండ్సా!
అశోక్: లేదండీ.. ఎందుకలా అడిగారు?
ఎందుకంటే వెనుక కోచ్ లో 42 అయితే ముందు డబ్బాలో కూర్చున్నారు కదా అందుకని.
ప్రవీణ: అంటే ఇతని పేరు కళ్యాణ్ కాదా.. అని ఆనందంతో కొంచెం గట్టిగా అరిచినట్టు అనేసరికి అతను అదొక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోయాడు.
మరో రెండు గంటల వరకు స్టేషన్ లేదు. బేగంపేట్ లో ఎక్కలేదంటే అతను ట్రైన్ మిస్ అయ్యి ఉంటాడు అని నిర్ధారించుకున్నాక TTE ని రిక్వెస్ట్ చేయడంతో ప్రవీణకి ఆ బెర్త్ ని ఎలాట్ చేసాక తను పూర్తిగా ఊపిరి పీల్చుకుంది.
అయాం సో హ్యాపీ నౌ.. అంటూ అశోక్ తో మాటల్లో పడింది ప్రవీణ. అశోక్, ప్రవీణ చాలా సరదాగా కలిసిపోయారు అతి తక్కువ సమయంలోనే.
అలా బేగంపేట్ నుండి....బోంబే దాకానా!?
రెండు గంటలు గడిచాక ట్రైన్ ఏదో చిన్న స్టేషన్ లో ఆగింది. బేగం పేట్ లో ఎక్కినట్టే మరొకతను వికారాబాద్ లో ట్రైన్ ఎక్కి వీరి పక్కన కూర్చోబోయాడు.
అశోక్ 'సారీ, ఇక్కడ ఫుల్ అయ్యింది. మీరు అడ్జస్ట్ అయి వేరే సీట్ లో కూర్చోండి..' అని చెప్పడం తో అతను మీ టికెట్స్ చూపించండి అని ఇద్దరినీ అడిగాడు. ఇద్దరూ తమ టికెట్స్ తీసి చూపించాక 'సారీ ఇది నా సీట్' అన్నాడు.
ప్రవీణ: సో, ఆర్యూ కళ్యాణ్?
కళ్యాణ్: అవునండీ! నా పేరు మీకెలా తెలుసు? మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడనేలేదే!
ప్రవీణ: లేదండీ.. లిస్ట్ లో మీ పేరు చూసాను.
కళ్యాణ్: అలాగా! నో ప్రాబ్లం, మీరు ఇక్కడ కూర్చోండి. పడుకునేటప్పుడు ముందు సీట్లో ఉన్న చిన్నపిల్లలతో మీరు అడ్జస్ట్ అయ్యేలా చూద్దాం అని కన్విన్స్ చేసాక ప్రవీణ కూర్చుంది..
అలా ముగ్గురూ మాట్లాడుకుంటూ ఒకే ఏజ్ గ్రూప్ కావడంతో బాగా దగ్గరయ్యారు. రాత్రి తొమ్మిది అయ్యింది. డిన్నర్ చేస్తున్నారు ముగ్గురూ. తెల్లారితే న్యూ ఇయర్.. తన మెయిల్ ఐడి లేదా కాంటాక్ట్ నెంబర్ అడుగుదామనీ, కానీ అలా అడిగితే బాగుంటుందో బాగుండదో అని అశోక్, కళ్యాణ్ ఇద్దరూ చాలా ఆలోచిస్తున్నారు.
తొమ్మిదిన్నరకు ట్రైన్ షోలాపూర్ చేరుకుంది. ఇరవై నిముషాలు హాల్ట్ ఉంటుందని ఎవరో చెప్పడంతో చాలా ఇంప్రెస్స్ అయిన ఇద్దరూ ఆ స్టేషన్లో దిగి పూల బొకేలు ఒకరికి తెలియకుండా ఒకరు కొని కాలేజ్ బాగ్ లో వేసుకొచ్చి దాచిపెట్టారు. కళ్యాణ్ తన మెయిల్ ఐడీ ని పేపర్ తో రాసి బొకే లోని ఒక ఆకు మీద అటాచ్ చేసాడు. అశోక్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.. ఇదే కాన్సెప్ట్ తో..
పదిన్నరకల్లా లైట్స్ ఆఫ్ చేసి అంతా నిద్ర లోనికి జారుకున్నారు.
టైం 11:50 అయ్యింది. ట్రైన్ ఆగింది. మరో మూడు నిమిషాల్లో ఫాన్స్ కూడా ఆగాయి. ట్రైన్ లో పవర్ పోయిందా ఏమిటీ.. అని అందరూ అనుకుంటుంటే ఈ లోపు ఇదే మంచి అవకాశం అనుకొని అశోక్, కళ్యాణ్ ఇద్దరూ తమ తమ బొకేలు తీసి ప్రవీణ బేగ్ పక్కన పెట్టారు. మరో నిమిషానికి ఫాన్స్ తిరగడం మొదలయ్యేసరికి అందరూ సర్దుకుని పడుకున్నారు. న్యూ ఇయర్ విష్ చేసుకున్నాక సంతోషంగా నిద్రలోనికి జారుకున్నారు అశోక్, కళ్యాణ్ ఇద్దరూ కూడా.
టైం 05:00, జనవరి 1, 2010. మరో ఇరవై నిమిషాల్లో ట్రైన్ ముంబై చేరుకుంటుందనగా కంపార్ట్మెంట్లో లైట్స్ వెలిగాయి. అందరూ లేచారు. అశోక్, కళ్యాణ్ ఇద్దరూ లేచి ప్రవీణ బెర్త్ వైపు చూసారు. పూల బొకేలు బెర్త్ మీద లేవు. ఇద్దరూ ప్రవీణ వైపు చూసి నవ్వారు. తను కూడా నవ్వింది.
ట్రైన్ ఇంకో నిమిషంలో స్టేషన్ చేరుకుంటుందనగా ప్రవీణ తన లగేజ్ ని తీసుకొని ముందు డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చొంది. అశోక్, కళ్యాణ్ ఇద్దరూ ప్రవీణ వెనకే వెళ్లారు. కంపార్ట్మెంట్లోని మిగతా వాళ్ళు కూడా లగేజ్ తీసుకొని డోర్ దగ్గరకే వస్తుండటంతో తమ తమ లగేజ్ ని తెచ్చుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్లారు. ఈ లోపు జనం హడావుడి బాగా పెరిగిపోవడంతో లగేజ్ పట్టుకొని అశోక్ ఒక ఎంట్రీ వైపు, కళ్యాణ్ ఇంకో ఎంట్రీ వైపు వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్ ప్లాట్ఫారం మీదకు వచ్చేసింది.. ప్రవీణ గబగబా దిగేసి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
పది నిముషాలయ్యాక...
స్టేషన్ కి రెండు చివరలా రెండు ఓవర్ బ్రిడ్జి లు ఉన్నాయి. అసలే చలికాలం కావడం, ప్లాట్ఫారం మీద లైట్స్ సరిగ్గా లేకపోవడంతో అంతా మసకమసకగా ఉంది.
ప్లాట్ఫారానికి ఒక చివరన ఉన్న కళ్యాణ్ కి దూరంగా షాల్ కప్పుకుని ఉన్న ప్రవీణ ఒకతన్ని హగ్ చేస్తూ కనిపించింది.. అది చూసిన కళ్యాణ్ తన మనసులో 'అశోక్ కంటే నేనే బాగా మాట్లాడానే.. తను విప్రోలో జాబ్ అని చెప్పాడు కదా! అది కూడా ఒక కారణం కావచ్చు' అనుకుంటూ నిరాశగా వెనుతిరిగాడు.
.
.
.
.
.
.
.
అదే ప్లాట్ఫారానికి మరో చివరన ఉన్న అశోక్ తన మనసులో 'ఓహ్! వాళ్ళిద్దరూ ఒకే స్టేట్ వాళ్ళు కావడం వల్ల ఫ్రెండ్షిప్ బాగా కలిసిందనుకుంటా! ఏమైతేనేం.. కళ్యాణ్ మొత్తానికి సాధించాడు. లక్కీ ఫెలో! అని అనుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇక స్టేషన్ మధ్యలో.. ప్రవీణ ఎదురుగా నించున్న కిరణ్ తన రెండు చేతుల్నీ అందుకుని.. 'వెల్కం డియర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్.. ఐ మిస్డ్ యు ఎలాట్!' అంటున్నాడు.
స్టేషన్ బయట: ట్రైన్ లో వీళ్ళతో కలిసి ప్రయాణించిన ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ అమ్మతో 'అమ్మా..ఈ పువ్వులు చూడు.. ఎంత బాగున్నాయో కదా!' అంటూ కేరింతలు కొడుతున్నారు.
***************************************************************************************
దొంగలు పడ్డ ఆరు నెలలకి పోలీసులు వచ్చినట్టుగా పబ్లిష్ అయిన పది రోజులకి కాని ఖాళీ దొరకలేదు..
ఒక magazine లో నా ఆర్టికల్ పబ్లిష్ అవడం ఇదే మొదటిసారి..
ఇలా పంచుకొనే అవకాశం కల్పించిన సుజ్జి మరియు మధుర వాణి గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
ఈ రెండేళ్ళ ప్రయాణం లో అర్ధ శతకం అనే మైలురాయిని చేరుకున్నందుకు సంతోషం తో కూడిన ఆనందం తో ఇలా కేక పెట్టాలనిపించింది..
Thank you so much for your support and encouragement..which is invaluable
25 comments:
హరే సూపర్ పోస్ట్ ...చాలా బాగుంది...
అర్ధశతక పోస్ట్ కు బోలెడు అభినందనలు ...నాదేనా మొదటి కామెంట్ ???
అమ్మ దొంగమొహం కామెంట్ మోడరేషన్ పెట్టేసావా..అయితే నాది కాదన్నమాట :(
కృష్ణ.. చాలా చాలా బాగుంది మీ కథ. కథనే అనుకుంటున్నాను, లేక నిజమా;)
కానీ కొత్త స్టైల్లో రాసారు. చాలా నచ్చింది నాకైతే:)
అర్థ శతక టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు:)
చ.... హరే పదిరోజుల క్రితం ఈ కథ చదివి కామెంటాననుకొని కామెంటలేదు. ఇప్పుడు నాలుగో నెంబరుకామెంటు దొరికిందా వా,.....:(.
పోస్టుబాగుంది పోస్టుల్ని సగం శతగ్గొట్టినందుకు అభినందనలు.
congrats హరే కృష్ణ :)
నాకు నచ్చింది.. :)
హరే కృష్ణ గారు ఏ శైలి లో అయినా సరే చక్కగా రాయగలిగే టాలెంట్ ఉంది మీకు ......ఇంత టాలెంట్ ఉండి ఎందుకండి లేట్ గా రాస్తారు పోస్ట్ లు ...చాలా చాలా బాగుంది మీ కథ...... లేట్ గా రాసే విషయం లో నన్ను ఆదర్శం గా తీసుకోకండి ....
కథ అందరికీ నచ్చుతుందని నేను చెప్పానా లేదా! :) keep writing.. waiting to see more from you! :)
హరే గారు, కథ బాగుంది...50 పోస్ట్ లు పూర్తిచేసిన మీకు అభినందనలు...
congrats...."We will be what we wil to be " anna IIT D slogan sari ainadi ani niroopinchaavu :) Hearty Congratulations
intha romantic ga raasavante khachitanga edo real inspiraton unde undaali :P
edo oka roju nuvvu oka book raasthavani aasisthu.... chetan bhagat ki tollywood version avuthaavu ani korukuntu.... Wish U All The Best :)
హరే గారు...చాలా బాగుంది మీ కథ.మీరు ఇలాగే బోల్డు పోస్ట్లు రాసి..బోలెడు మాగజైన్లలో పడాలి.
అర్ధశతటపోత్సవం జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు
నేస్తం అక్కా.ఫస్ట్ కామెంట్ మీదే :)
బోలెడన్ని ధన్యవాదాలు
:) :)
అపర్ణ థాంక్ యూ :)
ఈ కధ నా కధ కాదు లెండి :)
3g Thank you so much buddy!
థాంక్ యూ కిరణ్..:)
మధురవాణి మీరన్నట్టుగానే మంచి రెస్పాన్స్ వచ్చింది..thank you very much!
శివరంజని :) :)
కధ నచ్చినందుకు ధన్యవాదాలు!
తప్పకుండా మరిన్ని పోస్ట్ లు తొందరగా రాయడానికి ప్రయత్నిస్తాను.
స్నిగ్ధ గారు చాలా థాంక్స్ :)
విక్కీ :D :D
నువ్వింకా మర్చిపోలేదా ఆ స్లోగన్ :)
thanks a lot buddy!
ఇందు గారు
ఏదో ఒక రోజు కలక్టర్ అవుతానంటారా..
థాంక్ యూ, థాంక్ యూ :)
అర్ధ శతకం టపాలు పూర్తి చేసినందుకు హార్దిక శుభాభినందనలు.
మీరు కాదన్నా అనుమానం గానే ఉంది. మీరు అశోకా లేక కళ్యాణా? :)
సుబ్రహ్మణ్యం గారు బోలెడు ధన్యవాదాలు :)
అదేం లేదండీ..మరీ అంత గట్టిగా అడిగితే ఏం చెప్పమంటారు కశోక్ అనుకోండి :)
చాలా బాగుంది హరే :)
లేటుగా చూసా :(
చైతన్య చాలా థాంక్స్ :)
congratulations bud
http://ten.wikipedia.org/wiki/Hyderabad
వికీ సదస్సుకు తప్పక రండి
మీ స్నేహితులను ప్రోత్సహించండి
:)) Kiran GF ki Ashok, Kalyan line vestunnara? :D
Post a Comment