ఢిల్లీ లో అప్పుడే అడుగుపెట్టిన ఆంధ్రులకి తెలిసి తెలియని హిందీ లో అయ్యా ** tea అని తెలుగు లో అనువదించితున్న కొత్తలో కాంపస్ ను చూసి కేకో కేక అనుకునే లోపే మా టైం టేబుల్ ని మేమే రిజిస్టర్ చేసుకోవాలి అనేసరికి ఒక మూడు రోజులు చించి చించి సరే ఓపెన్ electives మాత్రం ఒకే కోర్స్ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాం ఆ కోర్స్ పేరు rural india planning and devolopment (RDL)
చారియర్ ఒక మంచి ప్రొఫెసర్.. ఫ్రమ్ కేరళ, గ్రేడు 7 కంటే తగ్గితే మాకొచ్చే మంత్లీ stipend కట్ సేనియర్లు కూడా గ్రేడ్స్ పరం గా మంచి కోర్స్ అని చెప్పడం తో ఆవేశం గా రిజిస్టర్ చేసేసాం, రిజిస్టర్ చేసాక తెలిసింది ఎంత మంచి కోర్సో అది బిటెక్ ఎంటెక్ msc ఎవరెవరో అంతా రిజిస్టర్ చేసేసరికి క్లాసు చాలా కలర్ ఫుల్ గా వుండేది ..విదేశీయులు అంటే ఒక పరదేశి కంత్రి ఫ్రం ఫెదెరర్ కంట్రీ నుండి వచ్చేది..ఈవెనింగ్ స్లాట్ కావడం తో అంతా కనీసం మొహాలు కడుక్కొని వచ్చేవారు..మేము కూడా ఏ కలర్ చూడాలో తెలియక చివరికి విదేశి వేసుకొనే డ్రెస్ లని చూస్తూ కుషీ గా కాలం గడిపేస్తున్నాం..ప్రొఫెసర్ కూడా మా concentration క్యాచ్ చేసి లెస్సన్ కుడా పరదేశిని చూస్తూ చెప్పేవాడు ఒక్కరికి చెప్తే అందరికి చెప్పినట్టే క్లాసు అనే డైలాగ్ మొదటి సారిగా తెలుసుకున్నారు మా చారి గారు
అప్పుడే సమ్మర్ ప్రభావం తగ్గింది అనుకుంటా పరదేశి perfume ఘాడత పెరిగింది మేము కూడా కొంచెం దూరంగా కూర్చొనే వాళ్ళం ఇలా కొన్ని రోజులు గడిచాక అప్పుడే దానికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది..ఎవరు తన ప్రక్క కూర్చోవడం లేదు అని క్లాసు కి లేట్ గా రావడం చేసేది మా చారి గారు కూడా "ఎవరో రావాలి.. " అని పాట పాడుకుంటూ తను వచ్చేదాకా క్లాసు చెప్పకుండా వెయిట్ చేసేవాడు ,తను వచ్చిన వెంటనే మా మధ్య కూర్చొనేది ఇదీ తంతు ఒక perfume మా concentration ని దారుణంగా దెబ్బతీసి క్లాసు కి రాకుండా కంప్యూటర్ సెంటర్ లో కూర్చొనేటట్టు చేసింది..ఇంతలో మొదలయ్యాయి మొదటి మైనర్..ఏమి చెప్పారో తెలీదు ఎందుకు ఎవరికి చెప్పారో తెలీదు సరిగ్గా exam కి 3 రోజుల ముందు 200 pages ppt ఇచ్చి ఇదే సిలబస్ అంటూ మాకు షాక్ ఇచ్చాడు ..మిగతా సబ్జక్ట్స్ కి ప్రయారిటీ ఇవ్వడం తో నాకు 3 hrs మిగిలింది నా ప్రిపరేషన్ కి చదువుతున్న సేపు చాలా ఊహిన్చుకున్నా రాసేద్దాం లే ఏదో ఒకటి అని మిగతా ఎగ్జామ్స్ బాగానే రాసా కదా అనే కాన్ఫిడెన్స్ తో ..
exam మొదలియ్యింది ఇంతలో మా అజయ్ యాదవ్ గాడు తెగ రాసేస్తున్నాడు 4 పేజీలు రాసేసాడు చాలా ఫాస్ట్ గా చారి గారు వాడికి మరో పేపర్ ఇచ్చారు..సర్ బుక్ లో ఇంకా 2 పేజీలు మిగిలి వున్నాయి తర్వాత తీసుకుంటా అడిషనల్ అన్నాడు..చారి గారు వెంటనే నేను నీకు ఇప్పుడు ఇస్తున్నది ప్రశ్నా పత్రం నాయనా అన్నారు ..
తరువాయి భాగం తొందర్లోనే..
అప్పటిదాకా http://www.youtube.com/watch?v=_S0xgzfPLK8