Pages

Thursday, March 29, 2012

జీవీ ఆర్.జీవీ జీ టీవీ..



 అవి నేను పాల బుగ్గల నుండి హార్లిక్స్ బుగ్గలకు మారుతున్న రోజులు…….

ఊహతో పాటు శ్రీకాంత్, EVV సత్యన్నారాయణ అంటే ఎవరో తెలియని అమాయకత్వంలో  సైతం
ఒక సినిమాను జీవితం లో మొదటి సారిగా థియేటర్లో  గర్ల్ ఫ్రెండ్ లేకుండానే  రెండు సార్లు చూడాల్సి వచ్చింది..

  చిత్ర రాజము ఏదంటే --- హీరో  నాగార్జున  తన దృష్టినంతా హీరోయిన్ వెంటబడి గాలిపాటలు పాడటం మీద కాకుండా, గ్రీజు వేళ్ళకి అంటకుండా చాకచక్యం గా సైకిల్ చైన్ బర్రున లాగి రౌడీలను చితకబాదే --- శివ.


  తర్వాత క్షణ క్షణం, గాయం, గోవిందా గోవిందా లాంటి సినిమాలు  థియేటర్లోనూ…  మిగతా చిన్నా చితకా RGV సినిమాలు  కూడా మా టీవీ అయిన ETV పుణ్యమా అని  ఇంట్లోనే చూసేసాక… ఎందుకో డైరెక్టర్ పనితనంలో ఏదో ప్రత్యేకత అగుపడింది.. సినిమా లు  విసుగులేకుండా ఉండటం ఒకటైతే… విసన కర్ర కాకపోయినా విభూషణ నాగభూషణ్ లాంటి విలనిజం చూపించకపోవడం ఇంకోటి నాకు బాగా నచ్చిన విషయాలు!

ఇలా ఆర్‌జీవీ సినిమాలను నా యధాశక్తి పోషిస్తూ ఉండగానే నా బాల్యం  కాస్తా ‘cow’ మారాం చేయడమేమిటి లాంటి అనే అనుమానసందేహాలకి ఆస్కారమివ్వకుండా కౌమారం లోనికి ప్రవేశించింది!

బ్రేకింగ్ న్యూస్ లేని కాలం లో సైతం వర్మ తెలుగులో సినిమాలు తీయడం ఆపేసాడు!!

  గడ్డుకాలం లో చిరంజీవికి హిట్లు,  నా చదువుకి తిట్లు లేకపోవడంతో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఇంటర్ పరీక్షలు రాసేసాను

  తర్వాత యమ సెట్ కోసం పొట్టి పదం శిక్షణా తరగతులకు (short term ) హాజరవడం జరిగాక,
‘నాలుగు రాళ్ళు సంపాదించుకో’ అని ఆకాశవాణి పిలిచి, నాలుగంకెల రాంక్ ను తెచ్చుకోనేలా చేసి, ఇంజనీరింగ్ లో అడుగుపెట్టేలా చేసింది.

చేరిన మొదటి రోజే హాస్టల్లో యధావిధిగా ఒక సీనియర్ రాగింగ్………..

సెల్ఫ్ డబ్బా చెప్పుకున్నాకనేనెవరినో తెలుసా!” అన్నాడు!

‘నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నికైన మన దేశ ఉపరాష్ట్రపతి పేరే తెలియదు… రోజు చేరిన నాకు మీ పేరేం తెలుస్తుంది?’ అని చెప్పాక  టైడ్ వాడకుండా మాసిన  నా చొక్కా చూసి   సీనియర్  అవాక్కయ్యాడు.


దానికి మా సీనియర్అసలేం  మాట్లాడుతున్నావ్ నువ్వు!!!  రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని ఫిలిం ఇండస్ట్రీ,   
ధర్మ అంటే తెలియని మన కాలేజీ స్టూడెంట్స్  ఉన్నట్టు చరిత్ర లో లేదు!” అని ఒక డైలాగ్ వేసి,రేపు ఇదే టైం కి నా రూమ్ లో  కనిపించు.” అని చెప్పాడు
బ్రతుకు జీవుడా అని నేను మా జూనియర్స్ బ్లాక్ కి వచ్చేసాను….

ఆ సదరు సీనియరాగింగ్ధర్మ’ రాజు చదువుతున్నది ఇంజనీరింగ్ రెండో సంవత్సరం!

  మరుసటి రోజు తను ఉంటున్న రూమ్ కి వెళ్ళాకసీనియర్ “నీది కూడా సేమ్ బ్రాంచ్... నీకు నాతో చాలా అవసరం ఉంటుంది.”  అని ఇంకొన్ని బేసిక్ భ్రష్టు పట్టించాక…. తన రూమ్ చరిత్ర చెప్పడం మొదలెట్టాడు..
 అందులో ముఖ్యాతిముఖ్యమైన విషయం --- రూమ్ లో ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ నాలుగేళ్ళు ఉన్నాడు” అన్నది!

అప్పటికే ఒక గొప్ప డైరెక్టర్ గా ఫీల్ అయ్యాడేమో ఒక ప్రోడక్ట్ కి డెమో ఇచ్చినట్టు భలే నేరేట్ చేసి పడేసాడు….నేను   చెప్పే విధానానికి ముగ్ధుడిని అయిపోయి, రామ్ గోపాల్ వర్మకి శ్రీదేవి దొరకకపోయినా నేనస్సలు పట్టించుకోను కానీ
ఆరు నూరైనా సరే  ‘నేను నా సెకండ్ ఇయర్ లో ఇదే రూమ్ కి షిఫ్ట్ అయిపోవాలి’ అని  డిసైడ్ అయిపోయా!

  బ్లాక్ లో రూమ్ దొరకాలంటే నేను కనీసం ఒక సంవత్సరం ఆగాలి......  కాలం అప్పుడే ఫుల్లుగా లాగించి మత్తుగా పడుకున్న పైథాన్లా అస్సలు కదలనంటోంది! టూ మచ్ వెయిటింగ్!!

కొన్నాళ్ళకి రామ్ గోపాల్ వర్మ రూమ్ యొక్క చరిత్ర మొత్తం ధర్మ  రాగింగ్ వలన, రగులుతోంది పాటలో హీరోయిన్ మాధవి మీద చిరంజీవి పాకినట్టు…. హాస్టల్ అంతా ప్రాకిపోయి మా స్టూడెంట్స్ కి తెలిసిపోయింది.

ఇక ఎక్కడ చూసినా ఇదే మాటర్ ….. ‘వచ్చే సంవత్సరం  వర్మ రూమ్ లో నేనుంటాను అంటే నేను’ అని  పెద్ద డిస్కషన్ అయి కూర్చుంది!!

అంతలో ఈ ధర్మ అరాచకాలు పెరిగిపోవడంతో, ఒకరోజు నేను మినియేచర్ శివలా ఫీలై వార్డెన్ కి కంప్లైంట్ చేసి పడేసాను... వేంఠనే వార్డెన్ తన యధాశక్తి ఇంకాస్త ఎక్కువ ఫీలై అతన్ని అందరి ముందు వాయించేసాడు..

అలా రెండు నెలలు గడిచాయి.. మేము ధర్మని తిట్టిన తిట్లన్నీ తధాస్తు దేవతులు విన్నారో లేక, మేము పెట్టే పునుగులు తిని ఏనుగులా తయారయ్యి చదువుని  తొండం ఎక్కించేసాడో కానీ, తను detain అయిపోయాడు..

  రూమ్ కి ఉన్న క్రేజ్ మహత్యానికి ఒక మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధి   రూమ్ కి షిఫ్ట్ అయిపోయాడు.

మా హాస్టల్ వార్డెన్ ఆకా మా డిపార్ట్ మెంట్  ప్రొఫెసర్ కావడంతో ఎప్పుడు వచ్చినా నా  దగ్గరకు వచ్చి,ఇప్పుడు అంతా ఓకే కదా.. రాగింగ్ ఇంకా ఎవరైనా చేస్తున్నారా?” అని అడిగేవాడు.

“ఇప్పుడేమీ లేదు సార్… ఎలా చదవాలో మీ guidance కావాలి సార్” అని అమాయకత్వానికి అసహాయతని  జోడించి అడిగేసరికి… వార్డెన్ టీ లో బౌర్బాన్ బిస్కట్లు ముంచుకు తింటూ తింటూ, ఉపదేశాలు చేస్తూ, ఒక పది కిలోలు పెరిగాడు!

అలా ఒక సంవత్సరం బండి లాక్కోచ్చేసాక……………

బీ.టెక్ రెండో సంవత్సరం లోనికి అడుగు పెడుతుండగా….. ఒక రోజు సాయంత్రం…. వార్డెన్ సాయంత్రం టీ తాగడానికి హాస్టల్ కి వచ్చాక, నాతో… “హరే, మీరు బ్లాక్ షిఫ్ట్ ఇవ్వాలి కదా! నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాం.” అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు...

దాని సారాంశం ఏమిటంటే

ముందు చలాన్ ఎవరు కడితే వాళ్ళకే మొదటి మరియు preference రూమ్ అని ఇప్పుడు నోటీస్ బోర్డ్ లో circular పెట్టాలి….

అంతే! ఆయన్ని అమాంతం “సార్.. సార్.. మీరు శిఖరం సార్!”  అని పొగిడేసి, రామ్ గోపాల్ వర్మ రూమ్ ని నేను ప్రీ బుక్ చేసేసాక, హాస్టల్ అందరికీ దండోరా వేయకుండా చెప్పేసాను….

విషయం తెలుసుకున్న ధర్మ రిటర్న్స్!!!!

వార్డెన్ తో మరుసటి రోజు గొడవ పెట్టేసుకున్నాడు,తనకి రూమ్ ఇవ్వడం ఏమిటి!! ఇండస్ట్రీ ఇక్కడ!!’ అని భారీ డైలాగులు పేల్చినా, బోర్బాన్ బంధంకి విలువిచ్చి మా వార్డెన్ ధర్మ కి అధర్మం చేసేసాక ….. “ఎందరో మహానుభావులు… అందరీ..ఈ..ఈ..కీ నో ఆర్జీవీ రూమ్ కీస్” అని పాడుకుంటూ నేను   రూమ్ కి షిఫ్ట్ అయిపోయాను.

రూమ్ చరిత్రలో మొదటిసారిగా ఒక వ్యక్తిగా కాలేజీ టాపర్ గా నిలిచాక….
టాపర్ బ్రాండ్ పడ్డాక….
మా వార్డెన్ తో చెప్పి percentage బట్టి రూమ్స్ ప్రిఫరెన్స్ ఉండాలి అనే రూల్ మార్పించేసాక

నేను విజయవంతంగా ఆర్జీవీ రూమ్ లో  మరో సంవత్సరం స్థిర పడడడానికి లైన్ క్లియర్ అయింది!!!

టాపర్ బ్రాండ్ వల్ల థర్డ్ ఇయర్ లో ధర్మకి నేను ట్యూషన్ చెప్పాల్సి వచ్చేది ఎగ్జామ్స్ ముందు.. అలా మూడో సంవత్సరంకి వచ్చేసరికి క్లాస్ టాపర్ మచ్చ చెరపకుండా ధర్మ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు ఒకే సంవత్సరంలో!

అప్పుడే రామ్ గోపాల్ వర్మ  జేమ్స్ అనే సినిమాకి మా కాలేజ్ లో ఆడియో  ఫంక్షన్ ఏర్పాటు చేసాడు

రేపు ఫంక్షన్ అనగా ముందు రోజు మా డిపార్ట్ మెంట్ కి వెళ్ళి అందరి ప్రొఫ్ లను కలిసి మాట్లాడుతున్నాడు వర్మమా వార్డెన్ హాస్టల్ కి ఫోన్ చేసి నిద్రపోతున్న నన్ను డిపార్ట్మెంట్ కి రమ్మన్నాడు.. అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద కెవ్వ్ పెట్టి, వర్మ దగ్గరకు వెళ్ళి ‘గ్లాడ్ టు మీట్ యుఅని చెప్పిసార్, నేను కూడా డిపార్ట్మెంట్ స్టూడెంట్ నే’ అని పరిచయం చేసుకుని, ‘ప్రస్తుతం మీరు ఉన్న రూమ్ లో ఉంటున్నాను’ అని చెప్పాను..
వెంటనే,నీ పెర్సెంటేజ్ ఎంత?” అని నవ్వుతూ వర్మ తిరిగి అడిగాడు.
దానికి మా వార్డెన్ “క్లాస్ టాపర్ అండీ!” అనగానే..
“గుడ్! నాలా బాడ్ స్టూడెంట్ కాదన్నమాట!” అని చెప్పేసాక , నేను రూమ్ కి వచ్చేశాను…

రూమ్కి వచ్చాక చూస్తేనలుగురు జూనియర్స్ ని ధర్మ మా రూమ్ లో రాగింగ్ చేస్తున్నాడు.. “సరే, నే టీ తాగి వస్తాను వీళ్ళను కాసేపు చూడు!” అని మహత్కార్యాన్నినాకు అప్పగించాడు.

వాళ్ళకో చిన్న ట్రైనింగ్ ఇచ్చి, మా ధర్మ వచ్చేసరికి, వాళ్ళ  నలుగురు  పెదరాయుడు సినిమా లో రజనీ కాంత్ శాలువా తీసినట్టు నా బెడ్ మీద నుండి రెండు టవల్స్ తీసిచెరో ఇద్దరి జూనియర్స్ మీద ఒక్కో టవల్ ని తల మీద వేయించి….

“హేమ రేఖ జయ సుష్మ.. అందరూ మెచ్చిన ధర్మా…. detained drum ధర్మ….  detained drum ధర్మ”
అని కోరస్ పాడించాక, ధర్మ తర్వాత నా రూమ్ లో ఇలాంటి ప్రోగ్రాం లు పెట్టలేదు.

కాకపొతే అప్పుడప్పుడూ తనలో ఉన్న గాన భైరవుని బయటకు తీయడానికి ట్రై చేసినప్పుడలా నేనిలాంటి ఎక్ప్రేషన్ ఇవ్వక తప్పేది కాదు   
 

  మరుసటి రోజు ఆడియో ఫంక్షన్ మొదలయింది స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరి  introduction  అయిపోయింది...
నిషా కొఠారి రాలేదు అని తెలిసిన వెంటనే స్టూడెంట్స్ సగం మంది వెళ్ళిపోయారు!!

ఇక్కడ మా HOD గురించి ఒక విషయం చెప్పాలి తనకి ఇండియా అంటే విపరీతం అయిన గౌరవం!   ముందు రోజు వర్మ మా డిపార్ట్మెంట్ ఎదురుగా ప్రొఫెసర్స్ తో తన experiences షేర్ చేసుకున్నాక, మా HOD తో RGV   తర్వాత రోజు ఫోటో పేపర్ లో పడింది….

మా బెంచ్ లో   పేపర్ కటింగ్ చూస్తూ….

నేను, మేడ్ ఇన్ ఇండియా మీట్స్ మేడ్ ఇన్ చైనా”  అని కేప్షన్ ఇచ్చాను..

సహవిద్యార్ధులు:  మేడ్ ఇన్ చైనా అంటే ????

నేను: నో గ్యారంటీ!
******************************************************************************************************

Wednesday, February 29, 2012

మేరా బ్రేవరీ on 29th February..













చిన్నప్పుడు లెక్కల డొక్కలు చించి చీల్చి ఛెండాడేస్తున్న రోజుల్లో 
exam ముందు రోజు నా ప్రిపరేషన్ కి ఆపరేషన్ జరిగి అది కూడా విఫలమవడం తో టెక్స్ట్ బుక్ నుండి నోట్స్ కి షిఫ్ట్ చేసి ICU లో అడ్మిట్ చేసాక..వన్ నైట్ స్టాండ్ చేసి మరుసటి రోజు కాస్త పౌడర్ మొహం మీద ఎక్కువ వేసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లాను.


నిద్ర మత్తులో బ్లాగులు రాయడం అనే కాన్సెప్ట్ తెలియని రోజులు కావడంతో 

పేపర్ చూసి
హే..బాగా వచ్చింది
exam paper
చిటికలో సాల్వ్ చేసేయొచ్చు..
కమాన్... గంటంటే గంటలో రాసేసి ఇంటికి వెళ్లిపోవాలి సరిగా నిద్ర కూడా లేదాయే నిన్న రాత్రి అని
 
ఆన్సర్ షీట్ మీద పెన్ పెట్టాను..మళ్ళీ రెండింటికల్లా యో యో అని స్కూల్ కి వచ్చేయెచ్చు అనుకొని 
చక చకా చకా నాలుగు స్టెప్స్ వేసాను.. పెన్ కదలడం లేదు
రీఫిల్ తీశాను
పైకి కిందకి షేక్ చేసి మళ్ళీ పెన్ లో పెట్టి పరీక్ష రాయడం మొదలు పెట్టాను..
LHS వైపు ఉన్న పై స్టెప్ రాసాను...అయి
పోయింది రీఫిల్ లో ఇంకు కాదు బ్రెయిన్ సెల్ల్స్ లో పెరిగిపోయిన జంకు అని నిర్ధారించుకున్నాక,



గంట సేపు ఇలా అదే ప్రశ్నలో సతమతమవుతూ పెన్ ను రీఫిల్ ను ఎత్తి దించి
మరో గంటలో మిగిలిన ప్రశ్నలను శోధించి సాధించి ఒక analysis కి వచ్చి
ఓహో...
ఇప్పుడు యాభై కి నలభై అయిదు మార్కులు వస్తాయి అన్నమాట అనుకొని వెంటనే
ఆదిత్య 369 ఎక్కేసాను  .

రెండు రోజులు తర్వాత
మా వీధిలో
మా ఇంటి లోపల హాల్ లో
హేంగర్ కి వేలాడుతున్న
లెదర్ బెల్ట్
క్లాస్ టాపర్ అదీ ఫేవరేట్ సబ్జక్ట్ మాథ్స్ లో

అయిదు మార్కులు తగ్గినందుకు మా ఇంటి ప్రాంగణం లో పది రౌండ్ల దెబ్బలు ఇరవై చీవాట్లు
ఆ తర్వాత రోజు స్కూల్లో నలభై మంది ముందు పోయే పరువు.


(ఆదిత్య 369 లో బాటరీ+మా పరీక్ష ముగించడానికి సమయం) low లోనికి వచ్చేసాక లెక్క లు చూసుకొని లేచి మిగిలిన టైం లో 
ఆలోచించి.. ఆలోచించి.. పరీక్ష హాల్ నుండి బయటకి వచ్చేసాను.


వెంటనే లంచ్ చేసేసి 
మధ్యాహ్నం క్లాస్ లకు అటెండ్ అయ్యాను 


సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది
హెడ్ మాస్టర్ రూం లో
నేను,మా క్లాస్ టీచర్ ఇద్దరం హెడ్ మాస్టర్ ముందు నిల్చున్నాం


మా హెడ్ మాస్టర్ ఐన్ స్టీన్ పుస్తకం చదివిన మానవుని వలె ,రక్షకుడు సినిమాలో నాగార్జున లా
రోమాలు నిక్కబొడుచుకొని మమ్మల్నే కోపం గా చూస్తున్నాడు.
హెడ్ మాస్టర్ మా సార్ తో: ఏమిటి మీరు చెప్పే విధానం... ఒక్కరు కూడా exam సరిగ్గా రాయడం లేదు కనీసం ఎవరేం చేస్తున్నారో కూడా చూడడం లేదు
హరే నువ్వు బాగానే ఉన్నావ్ కదా నీకేం అయింది
నేను:ఏమీ లేదు సార్
హెడ్:నిజం చెప్పు ప్రొద్దున్నరాసిన నీ answer పేపర్ ఎక్కడ ఉంది,అసలు వెళ్ళేటప్పుడు ఇచ్చావా లేదా?
నేను:ఇచ్చాను సార్.. అలా అన్నానే కాని దాచేసిన పేపర్ వీళ్ళకు దొరికి పోయిందా అని టెన్షన్ తో నాకు చెమటలు పట్టేస్తున్నాయ్..

వెంటనే హెడ్ మాస్టర్ CID సీరియల్ లో ACP ప్రద్యుమన్ లా ఒక చూపు మా సార్ వైపు చూసాక చెమటలు పట్టడం తన వంతైంది ఈ సారికి.


అసలే పిల్లల అరాచకాలపై నరకాసురుడైన మా సార్ వెంటనే... సరే స్పాట్ ఫిక్సింగ్  చేయడానికి మొహమ్మద్ అమీర్ ఎలానో లేడు ఇప్పుడే స్పాట్ evaluation చేస్తాను అని 
మా హెడ్ మాస్టర్ సాక్షిగా క్లాస్ లో అందరి ముందు నన్ను క్లాస్ బోర్డ్ పై సాల్వ్ చెయ్యమన్నారు.
మా సార్
నాతో: అసలు.. నీ పేపర్ మిస్ అవడం ఏంటి? అని మళ్ళీ అదే ప్రశ్న

బాబోయ్ ఇప్పుడు నా బాగ్ వీళ్ళు వెతికారంటే.. నా బ్రతుకు
బాలయ్య తో సినిమా చేసి నిర్మా సబ్బు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేని  నిస్సహాయతా స్థితి లో ఉన్న నిర్మాత పరిస్థితి అని ముందే ఊహించి
ఇప్పుడు మొదలు పెట్టేయమంటారా సార్ అని వెంటనే అడిగేసాను.

మొత్తం బోర్డ్ మీదే చెయ్యమంటారా మళ్ళీ పేపర్ ఇవ్వరా అని ఒక సారి దీనం గా చూసేసరికి
 

మా సార్: ఏం చేస్తావో తెలియదు.. ఎలా చేస్తావో తెలియదు.. 
నీ ఇష్టం వెనుక నుండి ముందుకు అయినా ముందు నుండి వెనుకకు అయినా నువ్వు ప్రాబ్లం సాల్వ్ చెయ్యొచ్చు నీకు రెండు ఆప్షన్లు ఇస్తున్నా నీ నెక్స్ట్ బర్త్డే కి పెద్ద కేక్ నాకే ఇవ్వాలి  అని ఒక సినిమా డైలాగ్ వేసాక 


నేను చివరి నుండి సాల్వ్ చేస్తూ చేస్తూ
ఆ తొమ్మిది లెక్కలను చావగొట్టి సాధించాక 45 మార్కులు మా సార్ వేసేసారు తన బుక్ లో
మిగిలినది పేపర్ లో మిగిలిన ఒకే ఒక్క మొదటి లెక్క 
చాక్ పీస్ తీసుకొని బర బరా పరుగులు తీయిస్తూ 


నాలుగు స్టెప్స్ వేసాక
ముందు లెక్కలను సాల్వ్ చేసిన కాన్ఫిడెన్స్ వల్లనేమో
వెంటనే నేను 


మామా ట్యూన్ వచ్చేసింది అన్నట్టు షార్ప్ గా కేచ్ చేసినట్టు ఎక్కడ నుండి వచ్చిందో ఠపీ ఠపీ మని మిగతా స్టెప్స్ వచ్చేసాయి... 
నా బుర్ర లో ఆ అకస్మాతుగా జరిగిన ఆ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంటుందా అని నేనే అచ్చెరువునొందాను.   

నే డస్టర్ తో బోర్డ్ చెరిపేసి మా సార్ కి ఇచ్చాక దుమ్ము దులుపుదామని చేత్తో మా మాస్టర్ ఆ డస్టర్ ని కొడుతుంటే, మిగతా స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొట్టేసారు.. మా హెడ్ మాస్టర్ తో సహా..





వందకి రెండొందలు అంటే ఏంటో తెలియని వయసులో కూడా
యాభై కి యాభై మార్కులు తెచ్చుకొని  అందరి మన్ననలు అందుకున్న ఆ సంఘటన తో


ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అనే రోజు నాకు The Shawshank Redemption సినిమాలా చాలా బాగా గుర్తుండిపోయింది.






Monday, February 13, 2012

విన్నపాలు పెరుగు మజ్జిగ తినవలె రాఘవేంద్రా..!

ఒక వేగు రాయుటకు సమయం ఆసన్నమయినది అని ఆకాష టాబ్లెటన్న ఘోష కు నాలో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉలిక్కిపడి లేచాడు.      

రంభ ఊర్వశి మేనక లకు బ్రేక్ ఇచ్చిన 
కే.ఏ.పాల్ రాఘవేంద్ర రావు
ని పకడ్నా ముష్కిల్ నహీ హై.. బికనీర్ నమ్కీన్ హై!




రాఘవేంద్ర రావు 
ఈ పేరు వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

మీరు ఎన్నో కళా ఖండాలు సృష్టించారు.
పక్షవాతం వచ్చి కదలలేని రాజ్ శేఖర్ చేతికో నెమలీక ఇచ్చి నృత్యం నేర్పించారు.
Attention,Stand at ease పొజిషన్ లో ఉండటం తప్ప  ఇంకేం చెయ్యలేని జగపతిబాబు కి సైతం చామంతులు బంతులు ఇచ్చి గెంతులేయించావ్.
మూడు తరాల హీరోలతో పని చేసిన ఘనతను సొంతం చేసుకుంటే మాత్రం అని ఎన్ని బిడియాలు పోతున్నావు..
దొంగ మొహం గా నీ వల్ల మూడు తరాల, ఆ ఫాబ్ ఫోర్ హీరోలు రెండు తరాల హీరోయిన్లను మూకుమ్మడిగా ఆడుకుంటున్నారు కదరా..

ఆ పాట ఏంటి ఆ శృతి ఏమిటి..
ఎం చేస్తావో తెలియదు కానీ పాటల్లో
 శృతి ని పండు ని మాత్రం కలిపేస్తావ్ అందుకే పోకిరి అంత పెద్ద హిట్ అయ్యింది
ససలు గగలు
దదలు నినులు
ససలు  పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు
చాలు చాలు చాలు చాలురరేయ్..
                                             

తొంభై బిందెలు  కొని   ఐదేసి బిందులు ఒక దానిపై ఇంకోటి పెట్టి పద్దెనిమిది వరుసలను రెండు పార్ట్స్ గా చేసి
ఎల్లువోచ్చి గోదారమ్మా  
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో...
ఆగడాల పిల్లోడమ్మా సోగ్గాడా

ఆహా నీ బిందె ల క్రియేటివిటీని బూందీ మిక్సర్ లో కప్పెట్ట.

                                         

రవళి కి ఎవడో ప్రొడ్యూసర్  పెరడు లో ఉన్న జామపళ్ళు.. శ్రియకి నేరేడు పళ్ళు 
రంభ కి బత్తాయి పళ్ళు
రమ్య కృష్ణ కి రోజా సెల్వమణి పువ్వులు
అరేయ్ రాఘవేంద్రా..బయటకు వెళ్లి కిలో ఆపిల్ పళ్ళు కొందామంటే వంద రూపాయిలు  పైనే ఉన్నాయ్ రా
 వాలంటైన్స్ డే కి పూల బోకే లు కూడా కాస్ట్లీ అయిపోయాయంటే అదంతా నీ చలవే
దీనంతటికీ కారణం నువ్వే నువ్వే నువ్వే..

పేదలు పండించిన పళ్లన్నీ నీ షూటింగ్ లకు ఎత్తుకేల్లిపోతే మేము ఏం తిని బతకాలి ?
గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ కనిపెట్టిన గెడ్డం గండరా
గిట్టుబాటు ధర కల్పించు రైతులకు ఇక నైనా ముందర.

                                                   

తెలుగు సినిమా ని కామర్షలైజ్ద్ చేసి  ఐన్ స్టీన్  expression ఒకటి ఇచ్చి  దర్శక  ఇంద్రు డి మొహం వేసుకొని  ఐరావతం స్టీమ్ తో వంట వండినట్టు సినిమా ని వండేస్తే సెగలు వచ్చేది ఎవరికీ..


కలర్ ఫుల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ అని గారాలు పోయి కలరాను నిరోధించినంత రేంజ్ లో క్రెడిట్ కొట్టేస్తున్న నీకు

ఇందు మూలంగా చివరగా నేను అభ్యర్ధించేది ఏమిటంటే
నేరేడు,బంగినపల్లి,జామ,నారింజ,చెర్రీస్,క్రాన్బెర్రీస్,బత్తాయి,బొప్పాయి పండించే రైతులు అందరికీ న్యాయం చేసావు
పనస కాయలు ఏం పాపం చేసాయి అని ప్రశ్నిస్తున్నా అద్యక్షా!!!

Wednesday, February 8, 2012

రెండాట్స్..


 


జోరుగా కుండ పోతగా భోరున విలపిస్తున్నాడు వినోద్ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర.

పక్కనే ఉన్న నేను నా ఫ్రెండ్స్ ఎంత ఓదారుస్తున్నా జగన్ వస్తే కానీ మంకుపట్టడం మానని చిన్న పిల్లాడిలా గాల్లో ఎగురుతూ  కెవ్వులు పెడుతున్నాడు
కొద్దిసేపటికి బోరు కొట్టేసి స్విచ్ ఆఫ్ చేసిన బోర్ లా స్లో మోషన్ లో  విలపించడం తగ్గించుకుంటూ వస్తున్నాడు.
ఎదురుగా చూస్తే మా క్లాస్మేట్స్ ఇద్దరు అమ్మాయిలు అటునుండి వస్తున్నారు


వారి దొంగ మొహమా అని వాడి వైపు తిరిగేసరికి
వాళ్ళిద్దరూ వెళ్ళగానే సెరెలాక్ టైం కి అందని బిడ్డలా బావురుమంటూ మమ్మల్ని బెంబేలిస్తున్నాడు 
ఏదో కోల్పోయినట్టు ఏమైంది రా అంటే చెప్పడూ..


                                              
           
                                                                
15 గంటల ముందు
----------------------------


అదే కాలేజ్ గేట్ ముందు సాయింత్రం క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్ళకుండా 
తోలి ప్రేమ రిలీజ్ ఇచ్చాడని ఫస్ట్ షో కి వెళ్తే టికెట్స్ దొరకక చివరి ఆటకు ఎలా అయితేనేం బ్లాక్ లో దొరికేసాయి.

ఇంట్లో parents అంతా కాలేజీలకు వచ్చి చూస్తారని తెలిసి టికెట్స్ దొరికిన వెంటనే ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లి తినేసి మళ్ళీ కాలేజ్ కి నైట్ చదువుకోడానికి అని చెప్పి బాగ్ లు వేసుకొని థియేటర్ కి వచ్చేసాం.

వినోద్ మాత్రం మా ఇంట్లో తినేసి నాతోపాటు కాలేజ్ కి వస్తున్నట్టు వచ్చి సినిమా అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు.



 10 గంటల ముందు
------------------------------------------------


రాత్రి ఇంటికి వెళ్ళిన వినోద్ గాడి ఇంట్లో కళ్ళల్లో కొవ్వొత్తులు కర్పూరాలు వేసుకొని చూస్తున్నారు
వాళ్ళ నాన్న చుట్ట వెలిగించి ఇంకో చేత్తో బెల్ట్ పట్టుకొని
ఎక్కడికి వెళ్ళావురా నిజం చెప్పు ? ఇంత లేట్ ఏమిటి
ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తినేసి అక్కడే చదువుకొని వస్తున్నా నాన్నా

వినోద్ వాళ్ళ నాన్న మా ఇంటికి అర్ధ రాత్రి కాల్ చేస్తే నేను ముందే రిసీవర్ పక్కన పెట్టేయడం తో పలకలేదు.  
ఇంతకీ ఎవరింటికి వెళ్ళావ్ చెప్పు ?
హరే వాళ్ళ ఇంటినుండి అలా రమేష్ వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చున్నాం
రమేష్ వాళ్ళింటి కి ఫోన్ కలిపితే
హలో,రమేష్ ఉన్నాడా
లేదండీ కాలేజ్ కి వెళ్ళాడు.





తర్వాత కాలేజ్ రిసెప్షన్ కి ఫోన్ చేస్తే
నైట్ టైం లో వచ్చే చదువుకోవడానికి వచ్చే అది కొద్ది మంది స్టూడెంట్స్ లో ఎవరో ఒకరు పిక్అప్ చేయడం మాకు అలవాటు కావడంతో
నేను వినోద్ వాళ్ళ ఫాదర్ ని మాట్లాడుతున్నా
మా అబ్బాయి..... అనే లోపు
సతి లేని  సహాయ హుటా హుటి హతిహేతువైన హరీష్ రిసీవర్ లాక్కొని
డాడీ చెప్పండి,ప్రస్తుతం చదువుకుంటున్నా..
కాస్త నిద్రవస్తోంది గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్! 


అలా ఆ రెండాట్స్ రాత్రి కాస్తా రెండు పెర్మనెంట్ మార్కర్ తో రాసిన డాట్స్ అయిన ధారల్లా లా ఆ నెలంతా అతుక్కుపోయాయి.

ఈ మధ్య ఎవరో ఒక జోక్ షేర్ చేస్తే నేను కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈ సంఘటన గుర్తు చేసుకోవడం జరిగింది.

Thursday, January 26, 2012

బూచి బల్ల...

డేట్:డిసెంబర్ 31
టైం:రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిముషాలు
ప్లేస్:బందరు స్మశాన వాటిక


సెమిస్టర్ సెలవులు కావడం తో ఇంజనీరింగ్ కాలేజీ లో బ్యాక్ లాగ్ లు రాసుకొంటూ
పబ్ కి వెళ్ళడానికి తమ స్నేహితురాళ్ళని వెతుక్కొంటూ గులకరాళ్ళను విసురుకొంటూ లేడీస్ హాస్టల్ వెళ్ళాక అక్కడ ఎవరూ లేకపోవడం తో...


తన సోల్ మేట్ కోసం ఆత్మలను అన్వేషిస్తూ 
హాస్టల్ పక్కనే ఉన్న స్మశానం లో మాస్ టైటిల్ సాంగ్ ప్లే చేస్తూ మన్నూ మసానాన్ని లేపుతున్నాడు రాద్రా.

కాసేపటికి బోంబే dying బెడ్ షీట్ కప్పుకొని 

బొండాలు తింటూ చెండాలంగా స్మశానం లోనికి అదే సమయం లో అడుగిడినాడు కాద్రా.            
                        
పిచ్చి కుక్కలా అరుస్తున్న కాద్రా అరుపులని చూసి పెద్ద పిడుగు పడింది రాద్రా గుండెలో..



                                                               
నిస్సహాయుడై The Naked Truth సినిమా చూస్తున్నరాద్రా కి ఏం చెయ్యాలో తెలియక

వెంటనే జై పోసాని జై ఓంకార్ జై శివ శంకర్ మాస్టర్ అని దండం పెట్టుకొని చాలెంజ్ చాలెంజ్ అని అరుపులు మొదలెట్టాడు  కాద్రా..
 

వెనుక ఫ్లిర్ట్ పిశాచినులు మరో వైపు నుండి గోకేయడం తో వీపు విమానం మోత అయిపోతోంది కాద్రా కి
లైట్ గా చెమటలు టమోటా ఫ్లేవర్ లో పడుతున్నాయి.

పక్కనే ఉన్న కాటికాపరి ఖద్దరు శాలువా ని తీసి కప్పుకున్నాడు కాద్రా.

                                                  

రాద్రా: అబే! చెమటలు పడుతుంటే నువ్వు ఫేన్ వేసుకోవాలి కాని ఇంకా కప్పుకుంటున్నావేంటిరా కబోది కాద్రా..
 

అని రాద్రా గట్టిగా అరిచాక కాద్రా పైన ఉన్న Neon లైట్ వెలిగి.. కపాలం పగిలి ఒక అందమైన దెయ్యపు కన్య గా మారిపోయాడు కాద్రా. 

దెయ్యపు కన్య(దె.క) : నా ఆత్మను బంధించి వీడు పైశాచిక పిశాచ ఆనందాన్ని పొందేవాడు,నీ రాక తో నాకు మోక్షం కలిగింది..నీకేం ఏం కావాలో కోరుకో.  
రాద్రా:నాతో పబ్ కి రావాలి...ఆడాలి పాడాలి..


                           


వెంటనే ఆ  వాతావరణం అంతా పబ్ లా మారిపోయింది
దెయ్యాల DJ మొదలయ్యాక..బాక్ గ్రౌండ్ లో ప్రారంభ గీతం నిను వీడనులే నను నేనే అని మొదలయ్యింది
అంతా చప్పట్లు కొట్టారు.
వెంటనే రాద్రా తన సోల్ మేట్ కోసం ఒక సాంగ్ ప్లే చేసాడు

బ్లాగాలీ ఇన్ తెలుగు లాలీ
బ్లాగాలీ బ్లాగి బొంగు బొషానమవ్వాలి
చేతబడికి కావాలొక డాలీ
చూసినోడి కపాలం పగలాలీ నా బొమ్మాలీ..
అన్నాక మన ఆడ దెయ్యం తన్మయత్వం తో రాద్రా ని ఆలింగనం చేసుకుంటుంది అనగా

అబవ్ bow అని శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి
దెయ్యపు కన్య, రాద్రా అటువైపు తిరిగారు

రెండు శునకాలు స్మశానపు సిమెంట్ బల్ల మీద
గాఢంగా ప్రేమించుకుంటున్నాయి..
అదే
టైం లో ఆ శునకాల మీద ఈ టైటిల్ పడడం తో సినిమా అయిపోయింది.

                          
   

Monday, January 9, 2012

18th floor..



Sadda Haq పోస్ట్ చదవని బ్లాగర్లకు నా వందనాలు
చదివి కామెంట్ పెట్టని వారికి నా బ్లాగాభివందన నాభి డాన్సులు..


లోభీ లోభీ ఎక్కడ కెళ్తున్నావ్ అంటే
ఫ్రీ షో కోసం లోధీ గార్డెన్ కి వెళ్తున్నా నడుచుకుంటూ అని అన్నాడంట ఒక సురేష్ గోభీ


రెండు మొక్క జొన్న
పొత్తులున్నయ్ తిందువా  
నా బ్లాగ్ వదిలేసి అడ్డమయిన బ్లాగులున్నీ చూస్తవా లాంటి పాటలు పాడకుండా,

బ్లాగులు లేకుండా అవి నేను నబ్లాగి నై నయనానందకరంగా పండగ చేసుకుంటున్న రోజులు.

డిసెంబర్ వచ్చేసింది బయట చలి చిత్ర శైలజ మనో వధ చేసి చావగొడుతోంది.
ఒకరోజు మా హాస్టల్ ఆదివారం నాడు ఫుడ్ అంతగా బాగుండదని తెలిసి మా తెల్సినవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్దామని అంత చలిలో కూడా పెందలాడే స్నానం చేసి తల దువ్వకుండా వెళ్ళాను.
రెండు గంటల్లో బస్సులు ఆటోలు ఎక్కి ఎలా
గోలా వాళ్ళింటికి చేరుకున్నాను..


ఇల్లు చాలా బావుంది.
ముప్పై ఫ్లోర్ల భవంతి మా వాళ్ళు ఉండేది పద్దినిమిదో అంతస్తు లో 
హాయిగా తినేసి మధ్యాహ్నం నాకు నిద్రపట్టేవరకు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ చాలా సేపు జాలీ గా గడిపేసి
నేనింక మధ్యాహ్నం బాగా నిద్రపోయి రాత్రి ఎనిమిదింటికి లేచి డైరెక్ట్ గా డిన్నర్ చేసేసి మళ్ళీ హాల్ లో మా సోది మొదలెట్టేసాం.




రాత్రి పదకొండు కావస్తోంది మిగతావాళ్ళు నిద్రపోతున్నారు మొత్తం మర్చిపోయి ఎవరి రూముల్లో వాళ్ళు
నాకు ఇంకా నిద్ర రావడం లేదు కంప్యూటర్ తీసుకొని గేమ్ లు ఆడుకున్నాక
ఒక హారర్  సినిమా చూసి తిన్నది కాస్త అరిగినట్టు అనిపించాక పొద్దున్న అయిదింటికి నిద్రపోయాను..దుప్పట్లు,రజాయ్ లు కప్పుకొని


ప్రొద్దున్న మెలుకవ వచ్చేసరికి ఏమీ కనిపించడం లేదు.
సినిమా
లు చూస్తే కళ్ళు పోతాయ్ అని అని చిన్నప్పుడు ఎవడో చెప్పాడు అది నిజమేనా అని జీవితం లో మొదటి సారి అనిపించింది
కాసేపటకి దీర్ఘం గా తలకట్టు ఎత్తి చూస్తే మొత్తం పొగ మంచు తో పగలే సెగలు... 
టైం కోసం కంప్యూటర్ ఆన్ చేస్తే మధ్యాహ్నం రెండయిపోయింది.
మా relatives ఇంట్లో అందరూ మొత్తం జాబ్ చేసేవాళ్ళు
కావడంతో..
వాళ్ళు వెళ్లేముందు పొద్దున్న నాకు ఏదో చెప్పారని గుర్తు...కానీ నాకింకా నిద్ర మత్తు వదలలేదు...వాళ్ళంతా ఆఫీస్ లకి జంప్అయిపోవడం తో..

నిద్ర లేచాక బ్రష్ చేసుకొని మొహం కడుక్కుందాం అని టాయ్ లెట్ కి వెళ్దామంటే దొంగ మొహాలు అతిధి ని అని కూడా చూడకుండా రూమ్లతో సహా లాకేసుకేల్లిపోయారు
తాళం చెవి కోసం వెతుకుతుంటే దొరకడం లేదు నా మొబైల్ ఇంకో రూమ్ లో పెట్టేసాను

ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ కూడా కనిపించలేనంత  బయట దట్టమైన పొగమంచు..

పద్దెనిమిదో అంతస్తు కనీసం కిందకు కూడా వెళ్దామంటే ఎవరైనా వచ్చి హాల్ లో ఉన్న టీవీ చాలా ఫర్నిచర్ దోచుకుపోతే ?
కనీసం ఫోన్ కూడా లేదు...ఇంకో వైపు హారర్ సినిమా టెన్షన్ ఎక్కువైపోయి ముందు రోజు రాత్రి విపరీతం గా నీళ్ళు తాగేయడం తో ధార ధ్రువతార లా తన్నుకొస్తోంది. 




తల్లా పెళ్ళామా సినిమా చూడలేదు కానీ ధారా లేక డోరా సినిమా కాసేపు లైవ్ ని అటూ ఇటూ చూసి 


హాల్ బాల్కనీ లో ఉన్న transparent Saintgobain గ్లాసులు తీసి బయట చెయ్యి పెట్టాను
హాశ్చర్యం...బోలెడు హాశ్చర్యం  నా చెయ్యి కనిపించడం లేదు..దెయ్యాల సినిమా చూసిన ఫీలింగ్ రెండు డిగ్రీలు ఉంటుంది అనుకుంటా సుమారుగా.. 


ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది లా
నాలో ఉన్న
ధారాలమైన ధారను బయటకు పంపించేసి ఒక కెవ్వ్ పెట్టి ..ఆ స్టేట్ మెంట్ ని, 
ఒక ఐడియా గ్రౌండ్ ఫ్లోర్ లో నడిచే మహానుభావులకు పావనం చేస్తుంది గా మార్చేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ
నేను హాల్ లో టీవీ చూస్తుంటే టీవీ పక్కనే కీస్ కనిపించాక నా మనసు తేలిక అయింది. 

ఆరోజు రాత్రి భోజనం చేసి అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోతూ
భారమైన తిండితో   
అతిధినై వచ్చాను భవనానికి
ధారలై పోసాను దండకారణ్యానికి   

అని అనుకుంటూ మా కాంపస్ కు పయనమయ్యాను.


Tuesday, January 3, 2012

Sadda haq


అనగనగా ఆకివీడు సామ్రాజ్యానికి విజయ బాపినీడు చక్రవర్తిగా తన బంగారు కిరీటం చుట్టూ చిన్న చిన్న నిప్పు రవ్వ లైట్లు వేసుకొని ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో...

ఒక రోజు ఏమయ్యిందంటే 

రాజు కి బ్లాగులు అంటే ఏమిటో తెలియక పోవడం వల్ల శత్రువులు లేక,టైం పాస్ కాక విలాసాలకు అలవాటుపడి నాసా లో అంతరిక్ష కధలంటూ నస తో పక్క రాజ్యానికి అతిధి లా వెళ్ళి వాళ్ళకు పట్టపగలే  కుక్కలా అరిచేసి చుక్కలు చూపించేవాడు.

తమ మిత్ర రాజ్యాల్లో ఉన్న మరో రాజు నామధేయం కోడి రాజు .. ఒకానొక ఖర్మ కాలే ఆకలేసిన సమయం లో మన బాపినీడు పాలిట బంపర్ఆఫర్ లా ఓ మారు కోడి రాజు యొక్క ఆతిధ్యం స్వీకరించవలసి వచ్చింది.


కోడి కి పెట్టే తిండి తప్ప వేరే తినని రాజ్యం లో నూకల అంబలి, తౌడు ముద్దల గారెలు తో ఆరోజు రాత్రి భోజనం చేసి ప్రొద్దున్న లేచిన బాపినీడు తనకి బాగా అలవాటైన కోడి తిండి ప్రావీణ్యత ను విచ్చలవిడిగా చూపించాక..


మరుసటి రోజు ప్రొద్దున్న రాత్రి తిన్నది పందెం కోడి తిండి కదా అని అనుమానం వచ్చి వెంటనే తన రాజ్యానికి పయనమయ్యాడు.

వెళ్లేముందు కోడి రాజు ఒక టిఫిన్ బాక్స్ లాంటి దీర్ఘచతురస్రాకార డబ్బాని గిఫ్ట్ పేక్ లో బాపినీడుకిచ్చి సాగనంపాడు.  

చక్రవర్తుల వారు తమ రాజ్యం లో ఆ  డబ్బా తెరిస్తే
 శ్రీ లక్ష్మీ గణపతీ ఫిల్మ్స్ పాతాళం లో మాదాకాలం సినిమా పార్ట్ 1,2,3...27 తమ ప్రత్యేక టీ వీ రూమ్ లో చూసి  రచ్చ రచ్చ గా రక్కేసుకున్నాక!

కొన్నాళ్ళకు తమ ఆస్థాన వైద్యుని కి కబురందించారు..రోజూ జిమ్ కెళ్ళి బొబ్బిలి సింహం లా ఉండే రాజు జబ్బు లేక ఇటు కదలలేక నిద్ర ఎక్కువైపోవడంతో  బొజ్జ పెరిగిన బొబ్బట్టు లా తయారయ్యాడు.

   
బ్లాగులు రాసుకొనే వాడి దగ్గర కామెంట్లు అరువడిగినట్టు ఆ  ఆస్థాన వైద్యుడు ఆ  సినిమా DVD లను రాజును అభ్యర్ధించి తనకివ్వమన్నాడు.

DVD లు భద్రపరుచుకొని వైద్యుడు తన వనమూలికల వైద్యాన్ని తయారుచేసి రాజుకి అందించాక

రాజు వైద్యముందనే ధైర్యం తో పరిచారికలందరినీ తన ఆస్థాన సభలో తన చుట్టూ వృత్తాకారం లో నిల్చోబెట్టి.. 
మన చక్ర వర్తి ఒక చేత్తో మైక్ పట్టుకొని,మరో చేత్తో కొబ్బరి కొమ్మ పైన అతికించిన చీపురు పుల్లలతో చేసిన గూట్లే గిటార్ ని వాయిస్తూ
నృత్య ప్రదర్శన ఇలా మొదలెట్టాడు..

ఇంతలో ఆస్థాన జాకీ మ్యూజిక్ ఆన్ చేసాడు
 

O Eco friendly
Nature ke rakshak
Main bhi hoon nature
Rewazon se..Samajon se..Kyun…….oye..

Sadda హక్ అయితే రక్
Sadda హక్ అయితే రక్

అని వాళ్ళంతా కోరస్ పాడుతుంటే మన  చక్రవర్తి, బాపిన్ మండేలా లా ఒక తేజస్సు తో చుట్టూ  ఉన్న అందర్నీ రక్కేయడం మొదలెట్టాడు..
డాన్స్ అయిపోయాక రక్కించుకున్న అందరికీ ఒక రాగి నాణెం తో పాటు రక్కోమాస్ repellent క్రీమ్ రెండొందల గ్రాముల ట్యూబు లు ఇచ్చేసి రాజు అందరినీ ఇంటికి పంపించేస్తుండగా..

ఆస్థాన జాకీ
రాజు దగ్గర కమీషన్ కొట్టేద్దామని.. What a performance! అహో ఓహో అని చెప్పి రాజుని స్టేజ్ మీద కు తీసుకెళ్ళి ఘాట్టిగా తనతో మళ్ళీ పాడమని మొహమాట పెడితే...

రాజు: Sadda హక్ అయితే రక్
పరిచారికలందరూ: చేతిలో పెట్టిన రాగి నాణాన్ని చూస్తూ  బుధవారం గురువారం శుక్రవారం (WTF)   అని మూకుమ్మడిగా అరవడం తో సభ ముగిసింది.