స్కూల్ అయ్యాక ట్యూషన్ కి వెళ్ళి టీచర్ ఇచ్చిన వర్క్ లో లీనమయిన నాకు
సలాం చేస్తే గులాము నేనై ఉంటా
ఖలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంటా
రెచ్చ గొట్టితే రచ్చ కీడ్చి కవ్విస్తా!
హోరబ్బా, హోల్ సేలుగా గోలుమాలు చేయిస్తా
దేఖో మెహబూబా
పోటీ తగదికా
కాలు కదిపితే కాటు తప్పదికా సోజా
మెరుపులా లా..లా.. బ్లాగుతా తా.. తా..
అని ఘాట్టిగా చిరంజీవి పాట ని బాల కృష్ణ రాగం లో ఖూనీ చేస్తూ ఆ పరిసరాలను నాగార్జున సినిమా లో హీరోయిన్ పరిస్థితిలా అపవిత్రం చేస్తున్న ఓ జీవి కంట పడింది.
ట్యూషన్ లో ప్రతిరోజూ ఇదే తంతు,వాడేదో వాగాడని,
ఒక వైపు టీచర్ పర్మిషన్ తో సంబంధం లేకుండా తన పాలిట పెదరాయుడు అయిపోయి పళ్ళు రాలగోట్టేయడం తో
ఇంకోవైపు వాళ్ళింట్లో వాడి వీపు విమానం మోత మోగేది..దబ దబా బాదేసి వాడు ఏడుపు మొదలెట్టాక నా దగ్గర ఉన్న చాక్లెట్లు ఇచ్చి బుజ్జి గాడిని బుజ్జగిస్తూ బండి లాగించేస్తున్న రోజుల్లో...
ఎప్పటిలానే ఆరోజు కూడా షారుక్ దరహాసం తో ట్యూషన్ కి వెళ్ళాను.
టీచర్ ఇచ్చిన రెండు లెక్కలు చేసి మూడో లెక్కలోకి అడుగుపెడుతున్నాను.తన ప్లేస్ నుండి మేడం కాస్త కదిలిందో లేదో నా చేతులకు దురద మొదలయ్యింది. ట్యూషన్ మొదలయ్యి అరగంట దాటింది బుజ్జి గాడు ఇంకా రాలేదు..వేరే వాళ్లతో తగవులాడితే నా దగ్గరున్న చాక్లెట్లతో పాటు నన్ను కూడా పీస్ పీస్ లు గా కొరికేసి నాకు peace లేకుండా చేసేస్తారు అని వెనుకంజ వేసి ఆ ఆలోచన విరమించుకున్నాను.
ఆ మరుసటి రోజు కూడా మహా మహులు సైతం మామిడి తాండ్ర దాసులయా అనే ఆకలి సత్యం ని నోరారా జీర్ణించుకున్న నేను, తాండ్ర పట్టుకొని వెళితే వాడు మాత్రం ట్యూషన్ కి రాలేదు.
ఇదే తంతు ఆ వారమంతా సా..గాక
ఆ ఆదివారం వాళ్ళింటికి వెళ్తే,
వాడి పళ్ళు పాడైపోవడానికి కారణం నేనే అని తెలిసి ఆ బ్రాండ్ చాక్లెట్లకు అలవాటు పడిపోయిన బుజ్జి తన లో ఉన్న చోరకళను చేరదీసి ఎరుపు చేతులతో పట్టుబడడం తో (రెడ్-హేండడ్) ట్యూషన్ మానిపించేశారు అనే కాడ్బరీ నిజం తెలుసుకున్న కొద్ది రోజులకి..
బుజ్జి వాళ్ళు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు
వేరే దారిలేక నేను 'ఒక తన్ను కి రెండు చాక్లెట్లు ఫ్రీ.. త్వరపడండి' ఆఫర్ తో అలా అలా స్కూలింగ్ లాగించేసా!
పన్నెండేళ్ళ తర్వాత
ఇంజనీరింగ్ లో చేరిన మొదటి రోజు ఫర్స్ట్ అవర్లో క్లాస్ మొదలయిన పది నిముషాల తర్వాత వెళ్ళాక ప్రొఫ్ లేట్ కమర్స్ ని క్లాస్ బయట నిల్చోమన్నారు.
మేమంతా బయట మా పరిచయ కార్యక్రమం చేసుకుంటూ ఉండగా మధ్యలో ఎవరో జోకాక ఒకడు గట్టిగా నవ్వాడు.
ఆ సుకుమారమైన దంతాకృతి చూసాక
నేను కెవ్వ్ అని అరిచాను..అటునుండి కూడా కేవ్వ్వ్ అని రిప్లై వచ్చింది.
డవుటే లేదు వీడు మా బుజ్జి గాడే..అడ్డ గాడిద లా పెరిగిపోయాడు
అన్నేళ్ల తర్వాత కలిసాక కాదేదీ సోదికి అనర్హం అనే సూత్రాన్ని విచ్చల విడిగా ఫాలో అయిపోయి ఒకే హాస్టల్ వింగ్ లో రూమ్స్ తీసుకున్నాం.
ఎనిమిదింటికి క్లాస్ ఉంటే ప్రతి రోజూ హాస్టల్ లో 7 .50 కి లేచి క్లాస్ కి భాగ్ భాగ్ అని బావురుమని సమీప పరిసరలాను భయబ్రాంతులకు గురిచేసేలా పాడుకుంటూ,
అవే లేట్ మార్కులను గ్రేట్ స్పార్క్ లతో నాలుగేళ్ళు ఇందోళంలో కొన సా..గించి
కాలేజ్ లైఫ్ ని
సారిగమా పాదనిసా... సానిదపా మాగరిసా ..శృతి లో అలా అలా ఆహ్లాదంగా ప్రతి సంవత్సరం క్షణాల్లా గడచి అనంతమైన అనుభూతులు మిగిలిపోయాయి.
నా నోటికి తోచిన ఒక నోట్ ఈ మధ్యనే రాసుకున్నా
స్నేహానికి నిజమైన ఆస్తి నిష్కపటము
నిజాన్నినిలబెట్టుకోవడం లోనే ఉంది మన సహృదయము
అటువంటి స్నేహమే నిలిచి ఉంటుంది జీవితాంతం.
తోడ బుట్టిన వారితో చెప్పలేని విషయాలను కూడా చెప్పుకోవడం మిత్రత్వము యొక్క గొప్పదనం
కష్ట కాలంలో కలత చెందిన మనసుకి శాంతిని కలిగించే దివ్యౌషదం స్నేహం .
ప్రియమిత్రులందరికీ మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు.
Friendship is a little more trust,
A little less try,
A little more laugh,
And a little less cry,
A little more WE and a little less I.
Happy Friendship Day!!!









