బ్లాగుల్లో కవితలకు ఈ మధ్య డిమాండ్ బాగా తగ్గిపోయిందని బజ్ లో అనుకుంటుంటే
అయ్యారే,ఎంత ఘోరం జరిగిపోయింది. మనవంతుగా ఒక స్నేహ హస్తంతో చిన్న హాండ్ ఇద్దాం అని సముద్రం లోనికి దిగితే ఇసుక వలే ఈ కచ్చల విచ్చల కవిత came అవుట్.
నీ స్వప్నం లో ఒక ఇందోళం అవుతా
నీ కవితల్లో నే కలువితరణ అవుతా
నీ పక్కన కాస్త చోటివ్వవూ ..
క్యోన్?
INR 25000 per Square feet.Property in South Mumbai is hot :)
ఓ సఖీ నీ పైరగాలి పిలుపు విని నేనోచ్చేసా ఊరకుక్కలా ఉరికి ఉరికి..
నువ్వు పొమ్మంటే నే పోతా బర బరా బార్ కి
సై అంటే నిన్ను తీసుకెళ్తా బీచ్ లో బ్లీచింగ్ కి
నువ్వే లోకంగా బతుకుతూ అయిపోతా బైరాగిని బ్లాగులోకానికి
నీ భావనల్లో ఒక భాగమవుతా
ఇష్టంగా తలూపితే నీ తలపునవుతా
లేదంతే తలుపు కింద గుమ్మం అవుతా
చంద్రుడు కురిపించే వెన్నెల కళ్ళల్లో కలకనవుతా
పాదాలను తాకే అలల వలే నిరంతరం తరుముతున్న నీ తలపులు
కేరట్ తురుమువలె నన్ను ఎర్రగా మార్చేస్తున్న ఆ జ్ఞాపకకెరటాలు
ఒంట్లో వేడి పెరిగిపోయి తినడం ఆపేసా పరాఠాలు
తొండ లాంటి తొండి ని తట్టుకోలేక తేరే కో చెప్పేస్తున్నా బై బై టాటాలు