ప్రశాంతమైన ప్రకృతి,సన్నటి చినుకులు శరీరాన్ని తాకుతున్న భావనకు తోడు, చల్లని గాలి.. అలాంటి అందమైన వాతావరణం లో లైబ్రరీ మెట్లపై కూర్చున్న మేఘ, తమ సుతిమెత్తని పాదాల పై నడక సాగిస్తున్న ఈగలు దోమలను తరుముతూ హేమంత్ కోసం ఎదురుచూస్తోంది.

***సమయం సాయంత్రం ఏడు దాటాక***
హేమంత్ కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కాసేపయ్యాక హేమంత్ ఫ్రెండ్ నుండి ఫోన్ "లబ్బీ పేట్ లో ఉన్న కేర్ హాస్పిటల్ దగ్గరకు తొందరగా రా" అని.
అసలేం జరిగిందో అర్థం కాక హేమంత్ మీద బెంగతో, అరకిలోమీటర్ కు ఒక స్టాప్, కిలోమీటర్ కు మరో సిగ్నల్ చొప్పున గంట సేపు జర్నీ చేసాక కంగారుగా హాస్పిటల్ కు చేరుకుంది. తీరా చూస్తే క్లాస్‌మేట్స్ అందరితో సర్ప్రైజ్ డిన్నర్. ఫ్రెండ్స్ అందరితో సంతోషంగా ఆ హాస్పిటల్ పైన ఉన్న రెస్టారంట్ లో డిన్నర్ ముగించింది. తిరిగి వచ్చేటప్పుడు మేఘ ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి, ఒక ముసి మౌస్ నవ్వు నవ్వి తన చేతిలో ఒక కవర్ పెట్టాడు హేమంత్..

.
.
.
.
.
.
.
.
.
.
.
లెటర్ లో
"నువ్వు నవ్వితే చాలా బావుంటావ్.. నోరు కాస్త మూసి మూయనట్టు మూస్తే, మూసీ నది లా ఇంకా ఇంకా బావుంటావ్ ఇంద ఇది తీసుకో" అని గిఫ్ట్ పాక్ లో ఉన్న ఫెవి క్విక్ ని చూసి నిద్ర లో మూర్చబోయింది.
--------------------------------------------------------------------------------------------------------------------
అస్వస్థత తో బాధపడుతున్న మేఘ ను చూడడానికి వాళ్ళ నాన్న ఊరి నుండి హాస్టల్ కి వచ్చారు. హేమంత్ మాత్రం తన మూలంగా జరిగిన ఈ "ఆపరేషన్ అస్వస్థత" ని తగ్గించడానికి రాత్రనక పగలనక మేఘ యోగక్షేమాలకోసం అక్కడే ఉంటున్నాడు.. కంట్లో నలుసుని కాపాడుకున్నట్లు కాపాడుకుంటున్నాడు
మేఘ తండ్రి:ఏమమ్మా ఎప్పుడూ ఇలానే ఉంటారా మీ ఇద్దరూ..
మేఘ:ఇతను మా ఫ్రెండ్ డాడీ..ఎలా ఉన్నాడు?
తండ్రి: రెప్ప ఆర్పే లోపే కన్ను ఎత్తుకేలిపోయేలా ఉన్నాడు.
మేఘ చెల్లి:దొంగ మొహం గాడు నిద్రపోతున్న కోడిపెట్టలని ఎత్తుకెళ్ళిపోయే లా వాడి మొహం చూడు.
మేఘ:తన చూపే అంత లే..లైట్ తీసుకో.
మేఘ చెల్లి:తన వక్ర దృష్టినంతా ఉపయోగించి నీ బతుకు ని జున్నుతో కక్రాలు చేసిపాడేసాడు అని నువ్వు ఒప్పుకున్తున్నట్టే కదా.
మేఘ:మాటలు జాగ్రత్తగా రానీ ! నేను చదివేది ఇంజనీరింగ్.. నువ్వు ఇంకా ఇంటర్ లోనే ఉన్నావ్ ఇవేం నీకు అర్ధం కావు.. బెంజ్ సర్కిల్ లో ఉన్న మీ కాలేజ్ కి ఫో.
------------------------------------------------------------------------------------------------------------------
మేఘ తన చెల్లి అయేషా ని కాలేజ్ కి పంపించిన తర్వాత ఆ రోజంతా నిద్రపోలేదు. వాళ్ల నాన్నతో జరిగిన హేమంత్ గురించిన సంభాషణ తనకి నిద్ర పట్టనివ్వలేదు.అసలు హేమంత్ విషయం ఎత్తక ముందే నాన్న అడిగేసారు. వాళ్ల అనుమానం నిజమైతే తనని కడిగేసినా కడిగేస్తారని భయం పట్టుకుంది మేఘకి. తర్వాత రోజు క్లాస్ లో కూర్చొని లెక్చర్ వినకుండా ఒక్కో పేపర్ ని చించి పడేస్తూ, ఈ ఆలోచనలలో నుండి వచ్చిన వత్తిడి ని తట్టుకోలేక ప్రతి అవర్ కి మధ్యలో కాంటీన్ కి వెళ్ళి టీ తో పాటు చిరుతిళ్ళ చిట్టి తల్లి పేరు ని సుస్థిర పరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ పక్కన కూర్చున్న హేమంత్ కి పిచ్చెక్కిస్తోంది.
మేఘ అతని బుర్రతో పాటు వాలెట్ లోని మనీని కూడా తినడం మొదలు పెట్టడంతో ఈ బాధ తట్టుకోలేక 23 బస్ ఎక్కి అయేషా ను కలవడానికి హాస్టల్ దగ్గరకు వెళ్లాడు హేమంత్.
హేమంత్: హలో ,మీతో కొంచెం మాట్లాడాలి.
అయేషా :(అసహనమైన నవ్వుతో) హాయ్ మీరేం చేప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. మా అక్క చాలా అమాయకురాలు తన జీవితం తో ఆడుకోవద్దు ప్లీజ్.. మా ఇంట్లో ఇట్లాంటివి నామోంకిన్ హై
హేమంత్: Well,Then tell me about your family.
అయేషా: Get the hell out of here.
_______________________________________________________________________
ఆరోజు నుండి మేఘ తో పాటు హేమంత్ కి కూడా నిద్ర పట్టడం మానేసింది. హేమంత్ పరీక్ష ధ్యాస లో మునిగిపోయి బ్యాక్ లాగ్ లను ఒక్కొక్కటి రాసుకుంటూ ఈ బాధను కొంచెం మరచిపో సాగాడు.
***సరిగ్గా సంవత్సరం గడిచింది***
ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి.. అక్క కాలేజ్ చెల్లికి ముద్దు కాబట్టి హేమంత్ మేఘాల మధ్య అతివృష్టి అయేషా వచ్చి పడడం తో, వర్షం లేని పంటభూమి లా హృదయం చిగురించక వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ పలచబడి వాడిపోయిన బ్రెడ్ పెరుగు వడ అయిపోయింది. అలా ఓ ఆరునెలలు గడిచాక ఒక రోజు బ్యాక్ లాగ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే రిజల్ట్స్ చూసిన హేమంత్ అయేషా,మేఘ లు ఉంటున్న రూమ్ కి వెళ్లాడు అదోలాంటి హావభావాలతో.

"సంవత్సరం పాటు పుస్తకాలే లోకం గా బతికాను. పరీక్ష లేని నెల ఏంటో తెలియకుండా కష్టపడ్డాను. అయినా కూడా అయిదు పేపర్లు ఫెయిల్.. ఇదంతా మీ వల్లే మీ వల్లే" అని నొక్కి వక్కాణించి రూమ్ లో ఉన్న గ్లాస్ పెయింటింగ్‌లు బద్దలు కొట్టాడు. చేతికి చిన్న గాయమైతే, వాష్ రూమ్ లో నికి వెళ్ళి క్లీన్ చేసుకొని ఖాళీగా ఉన్న నోటితో తిడుతూ కట్టు కట్టుకొని బయటకొచ్చాడు.
****ఆ మరుసటి రోజు****
హేమంత్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.
కాసేపయ్యాక సెల్ ఎదురుగా మేఘ, అయేషా తో పాటు వాళ్ళ పేరెంట్స్. అయేషా మొహం నిండా గాయాలు ఉన్నాయి. మేఘ మొహం కూడా చిన్న చిన్న గాట్లు పడి ఉన్నాయి. అభావంగా కూర్చుని దిక్కులు చూస్తూ ఈ సెల్ సినిమా చూస్తున్న కానిస్టేబుల్ తో,
సబ్ ఇన్స్పెక్టర్ :చట్టాన్ని అతిక్రమించాడు ఇతన్నేం చేద్దాం.
హెడ్ కానిస్టేబుల్:వెయ్యి రూపాయిలు ఫైన్ కట్టించి వదిలేద్దాం.
సబ్ ఇన్స్పెక్టర్ "సరే ! వీళ్లనేం చేద్దాం ? అసలు ప్రాబ్లెం ఏంటి?" అని అడగడం తో మేఘ వాళ్ళ పేరెంట్స్ హేమంత్ ఫోటో ని సబ్ ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టారు.
హెడ్ కానిస్టేబుల్ : ఈ హేమంత్ మూలం గానే వీళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి మరో అయిదు వేలు కట్టించి బయటకు పంపిద్దాం.
***********************************************************************************************************
బ్లాంక్ expression తో చూస్తున్న హేమంత్ మరో అయిదు వేలు కట్టి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక మేఘ, అయేషా ల తో "అసలేం జరిగింది ?" అని అడగడం తో
.
.
.
.
.
.

***ఆ ముందు రోజు రాత్రి***
పడుకునే ముందు బెడ్ షీట్ ని సర్దుతున్నారు మేఘ, అయేషా. సడెన్ గా ఆ రోజు మద్యాహ్నం తమ రూమ్ కి వచ్చిన హేమంత్ వాలెట్ లో నుండి క్రింద పడిన ఫోటో కనిపించింది. ఇది నాదంటే నాది అని జుట్టు చించుకొని ఒకర్ని ఒకరు గాయపర్చుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లారు. కానీ అక్కడ హేమంత్ ని చూసి కంప్లైంట్ ని withdraw చేసీ చేసుకోలేక ఇంక ఫైన్ తో సరిపెట్టుకొని వచ్చేసారు.
అయేషా: సరే కాని నువ్వు పోలీస్ స్టేషన్ కి ఎందుకొచ్చావ్.

హేమంత్ : నిన్న బస్ పాస్ లో ఉన్న నా ఫోటో ని ఎవడో కొట్టేసాడు. ఈరోజు చెకింగ్ లో ఫోటో కనిపించకపోవడం తో ఫైన్ కాకుండా స్టేషన్ కి పట్టుకోచ్చేసారు..అని చెప్పి ముగించాడు.

*****************************************************************************************************************

ఆ మరుసటి రోజు హేమంత్ ని మేఘ నిలదీయడం మొదలు పెట్టింది. "నిజం చెప్పు నువ్వు అయేషా కలసి నిన్న సినిమాకి వెళ్ళారా లేదా ?" హేమంత్ మేఘ చెంప చెళ్లుమనిపించాడు. "దొంగ మొహంది ఆ తర్వాత పార్క్ కి కూడా వెళ్ళాం అని చెప్పలేదా".
మేఘ:ఛీ..దరిద్రుడా..ఒక్క కారణం చెప్పు నేనంటే నీకెందుకు ఇష్టం లేదో..
హేమంత్:చెబితే ?
మేఘ:ముందు చెప్పు..చెబితే నీ మొహం కూడా చూడను ఈ జన్మ లో.
హేమంత్: పుట్టుమచ్చలకి నోమార్క్స్ క్రీమ్ రాసుకొనే నీలాంటి అమ్మాయిలను నేను ప్రేమించను కాక ప్రేమించను అని చెప్పి తనకి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసి ఆ అయేషా ..హా అవును అలంకార్ లో ఏడింటి షో కి బుక్ చేసా.. అని చెప్పి ఫోన్ కట్ చేసి మేఘ కి కట్ చెప్పేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు.