ఏప్రిల్ 2, 2012 ---- సరిగ్గా ఇండియా ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం తర్వాత…..
రిలయన్స్ ఉద్యోగుల మీద రిలై అయ్యి నెల ముందు టికెట్స్ బుక్ చేసుకుంటే మరో వారం రోజుల్లో టికెట్స్ వచ్చేసిన వెంటనే….
“సచిన్ కి చేతి గాయం.. నెల రోజుల విశ్రాంతి” అని ప్రాస హెడ్ లైన్ వాడిన ఈనాడు పేపర్ చూసి నా మైండ్ బ్లాక్ అయింది!
ఏమైతేనేం అలా పది రోజులు గడిచిపోయాయి.. సచిన్ జాడ మాత్రం తెలియలేదు!!
ఏప్రిల్ 22, 2012 -----
అష్టా చెమ్మా.. అచ్చా బొమ్మా.. ఆటకి వేళయింది, అని ఇద్దరు కేప్టన్స్ పిచ్ మధ్యకు చేరుకొని సిల్వర్ కపోతాన్ని ఎగరు వేసారు.
దేభ్యపు గొంతుతో రవి శాస్త్రి!!!
Mumbai Indians Won the toss and elected to bat first, అని చెప్పేసరికి ‘అబ్బ రామేశ్వరం వెళ్ళినా రవి శాస్త్రి వదలడా’ అని నిట్టూరుస్తూ తల మీద ఉన్న టోపీ తీసి బుర్ర గోక్కుంటూ ఉండగా… ఆ క్షణం లో వెంటనే, “So Harbhajan, any changes today?” అని అడగగానే
స్టేడియం అంతా సంవత్సరాలుగా చెవుల్లో పేరుకుపోయిన దుమ్ముని లేపారు!!!
నేనూ మార్గదర్శి లో చేరాను… క్లారిటీ తో ఒక పెద్ద ప్లాస్టిక్ క్లారినెట్ కొనుకున్నాను.. అని బయటకు తీసి నా వంతు గా జనాల మీదకు ఒక రమణ గోగుల మరియు చక్రిని మిళితము చేసి, మైండ్ ను మైమరిపితం చేసేసి, ఇంక బుగ్గలు అలసిపోయేలా ఊదుతూనే ఉన్నా!!
ఆ వెంటనే…
“సచిన్.. న్.. న్.. న్.. న్.. న్.. న్.. న్…………..ఆలారే ఆలా ఆలారే ఆలా” అనేసరికి...
దునియా హిలాదేంగే హమ్!”
అని కోరస్ అందుకున్నాడు!!
యో యో..
‘బతుకు జీవుడా!’ అనుకుంటూ క్లారినెట్ పట్టుకొని నేను జంప్ అయిపోయాను!!
ఈ గోల పదిహేను నిముషాలు కంటిన్యూ అయ్యాక…..
మరో పది నిముషాల్లో మ్యాచ్ మొదలవుతుంది!
బయట సెక్యూరిటీ గార్డ్స్ దయ వల్ల సైబర్ షాట్ కి ఎంట్రీ లేకపోవడం తో నా దగ్గర ఉన్న గ్రీన్ హార్ట్ తీసి పిక్స్ తీస్తూ బిజీ గా ఉండగా….
డ్రెస్సింగ్ రూమ్ లో నుండి ఆరున్నర ప్లస్ అయిదున్నర అడుగులు వడివడిగా వేసుకుంటూ ఇద్దరు మెట్లు దిగుతుండగా మేమంతా చైర్స్ నుండి లేచాము!
ఒక వ్యక్తి జేమ్స్ ఫ్రాంక్లిన్.. ముందు వచ్చేస్తున్నాడు!
వెనుక ఇంకో శక్తి, రెండు చేతులతో తన బ్యాట్ ని పట్టుకొని తన కాళ్ళను ముందుకు వెనుకకు గాల్లో లేపి బౌండరీ లైన్ నుండి గ్రౌండ్ లోనికి కుడి కాలితో అడుగుపెట్టి… తన శిరస్సును ఆకాశం వైపు చూస్తూ నాలుగు అడుగులు వేసి పరిగెడుతూ పిచ్ వరకు చేరుకున్నాడు...
ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన క్షణం నుండి ప్రేక్షకులు ప్రపంచాన్ని మర్చిపోయి అవధులు లేని కేరింతలు కొడుతూ అదొక తన్మయత్వంతో, ఈలలతో ఆనంద హేళలు చేస్తూ, అరుస్తూనే ఉన్నారు!
మేడిన్ ఓవర్ అయిపోయింది!!
1995 నుండి సచిన్ మరియు క్రికెట్ అంటే అభిమానం ఏర్పరచుకున్న నాకు సచిన్ లైవ్ గా తను ఆడబోయే బంతి ని చూసే అద్భుత అవకాశం రానే వచ్చింది!
ఎనిమిది ఓవర్లు ఆడి వెళ్ళిపోయాక, స్టేడియం అంతా భయంకరమైన నిశ్శబ్దంలో ఉండిపోయింది!!
class.. perfection.. timing.. ఎన్ని ట్రై చేసినా సచిన్ ఆట చూశాక, యాంత్రిక క్రీడ అన్నట్టు అనిపించి
గాడ్ ఫాదర్ చూశాక సర్కార్ ని థియేటర్లో చూసిన ఫీలింగ్ ఆవహించి,
నామ్ కే వాస్తే అన్నట్టు ఫోటో సెషన్ కోసం మిగతా మ్యాచ్ చూసి ఇంటికి వచ్చి….. నిద్రపోదామంటే… ‘కెవ్వ్… సచిన్ బాటింగ్ ఏ బాల్ కి ఎలా ఆడాడో!’ అన్నీ గుర్తొచ్చి.. సచిన్ ఉన్నంత వరకు మాచ్ ని మళ్ళీ రెండు సార్లు చూశాక, అప్పుడు నిద్రకు ఉపక్రమించాను!
అబ్బ.. ..how lucky you are !! మీకు నిద్ర పట్టి వుండదు నిన్న...btw comment box notes kathi keka :)
ReplyDeleteSuuuuper post! You are blessed to watch him playing. Thanks for sharing your precious memory.
ReplyDeleteHappy Birthday to our god.. SACHIN! :)
Last pic is super cute. :)
happy b'day sachin.. :)))
ReplyDeleteసచిన్ మీద నీకున్న ప్రేమంతా కళ్లకు కట్టినట్టు చూపించావు హరే :) టపా చాలా బాగుంది.
ReplyDeleteసచిన్‌కి జన్మదిన శుభాకంక్షలు.. అందజేస్తావు కదూ ;)
సూపర్ యాండీ ..!!
ReplyDeleteలక్కీ ఫెలో వి.
యాండీ ని, సచిన్ ని ఇంత వరకు ఫొటోస్ లో చూడటమే.
ఆ మ్యాచ్ కి వెళ్తున్నట్టు చెప్పింటే నేను లైవ్ మ్యాచ్ చూసే వాడిని కదా, సచిన్, యాండీ ఇద్దరినీ ఒకే చోట చూసే వాడిని :))
సచిన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !!
వినీల గారు exactly :))
ReplyDeleteకళ్ళు తెరిస్తే కవర్ డ్రైవ్,లెగ్ గ్లాన్స్ లు
కళ్ళు మూస్తే paddle స్వీప్,అప్పర్ కట్ లు
పోస్ట్ మరియు కామెంట్ బాక్స్ నచ్చినందుకు బోలెడు థాంక్స్ :)
Well Said Madhura,
ReplyDeleteWe are Lucky and privileged to have lived in an era when of witnessing sachin's game :)
It's a surprise and dream come true moment for me :)
and
Happy Birthday to God of Cricket :)
రాజ్,అప్పు
ReplyDeleteమనందరి తరపున సచిన్ కి జన్మదిన శుభాకాంక్షలు :))
జయహో సచిన్ :)))
హర్షా, థాంక్స్ :)
ReplyDeleteసచిన్ ఆడటం లేదు ఎలానో కనీసం గిల్ క్రిస్ట్ అయినా వస్తాడేమో అనే ఫీలింగ్ తో వెళ్ళాను..
సచిన్ ఆడడం పెద్ద సర్ప్రైజ్
కెవ్వ్ కేక ఇంకా గొంతు నొప్పి తగ్గలేదు అరిచిన ఆ అరుపులకి!
సచిన్ కి జన్మదిన శుభాకాంక్షలు :)
దేవుడిని చూసాను అంటే ...సచిన్ cricket ఆడటం చూసారా? OK!
ReplyDeleteHAPPY HAPPY BIRTHDAY our DEAREST GOD SACHIN :))
ReplyDeleteనాకు జెలసీగా ఉంది మీ మీద ...అంతే కాదు మీ ప్రొఫైల్ లో పిల్లాడు నేను సచిన్ ని చూసానోచ్ నువ్వు చూడలేదు వ్వెవ్వెవ్వెవ్వె అని వెక్కిరిస్తున్నట్టు ఉంది
క్లారినెట్ తో పక్క అతని చెవిలో ఊదారా ..హన్నా!!!!!!
పోస్ట్ మాత్రం సూఊఊఊఊఊఊఊఊఊఊఒపర్
జలతారు వెన్నెల గారు అవును.. సచిన్ ని చాలా దగ్గర నుండి తను ఆడుతుండగా ఎనిమిది ఓవర్లు స్టేడియం లో చూసాను :))
ReplyDeleteథాంక్స్ :)
రంజని గారు :))))
ReplyDeleteహహః
ఆ ముక్కు పచ్చ షర్ట్ వేసుకున్న పిల్లాడు వెక్కిరిస్తాడా చెప్పండి :)
సరదాగా ఆటపట్టిస్తాడు కానీ :P
తన సంతోషం చూసి నాకు కాస్త జెలసీ గా అనిపించి రెండో ఆలోచనలేకుండా ఊదేసా :)
అక్కడ కూడా సచినే ఆదుకున్నాడు :))
థాంక్యూ వెరీ మచ్ :)
అష్టా చెమ్మా.. అచ్చా బొమ్మా.. ఆటకి వేళయింది, అని ఇద్దరు కేప్టన్స్ పిచ్ మధ్యకు చేరుకొని సిల్వర్ కపోతాన్ని ఎగరు వేసారు......ఏమి వ్రాస్తావు...హ..హ...
ReplyDeleteనిజమే ఇరవయ్ ఏళ్లుగా చూస్తూ ఉన్నా ఇంకా చూడాలి ...అనిపిస్తుంది...we love sachin...he for india ...we for him