Pages

Monday, October 1, 2012

ఫరాంజలి..




మణిరత్నం కి గీతాంజలి ఎలానో నువ్వంటే నాకంత..అంత కంటే చాలా చాలా ఎక్కువ

నిస్వార్ధ కార్యదీక్ష తో విశ్రాంతి లేకుండా అహర్నిశలు ధారబోసిన నిన్ను ఎలా మరచిపోగలను నిన్ను విడిచి ఉండాలంటే నాకు నరకమే

ఈ ఆరేళ్లలో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడ్డవు. మొదటి రెండేళ్ళు నీవు లేనిదే నేను లేను..
ఆ  తర్వాత కాల క్రమేనా ఆరేడు గంటలకు మించి నీతో గడపలేకపోయాను

నాకోసం నువ్వు శ్రమిస్తూనే ఉన్నావు.. నిరంతర శ్రమైక జీవితానికి నీదే ఒక ఉదాహరణ

ఇన్ని సంవత్సరాల నీ సావాసం లో నీ గురించి నేను రెండే మాటల్లో చెప్పగలను క్రియేటివ్, ఇన్స్పైర్
వీడుకోలే వేదికైనా
వీడలేనీ స్నేహమైనా
ఆనందమా..
.. ..వసంతమా.. .. ..
హ్యాపీ డేస్ హ్యాపీ డేస్..

అని పాడదామన్నా
నీ పలుకు లేక నాకు సౌండ్ తీసేసావ్.

ఇన్ని మధుర స్వరాలను పలికించిన నువ్వు

day and night నాకోసం పని చేసిన నువ్వు finally call it a day చెప్పడం 

నేను తట్టుకోలేకపోతున్నాను.

నేను గేమ్స్
ఆడుతున్నానే కానీ నువ్వు లేకపోతే రూమంతా ఆ  ambiance ఉండదు

ఈ ఆరు సంవత్సరాలలో నీకు ఆరు సార్లు పరిశుభ్రత అంటే ఏంటో నేర్పించాను అయినా ఎందుకిలా చేసావ్! ఇదంతా అబద్ధమని చెప్పు

అరడజను సంవత్సరాలు గా తన సేవలందించి గత నెల ముప్పైవ తేదీన పని చేయడం మానేసిన నీకు ఇదే నా ఫరాంజలి, ఊఫరాంజలి! 

                          



  

 

16 comments:

  1. హా. హా.. ఊఫర్ గురించా నీ బాధంతా? :D
    బాగుంది..

    ReplyDelete
  2. ఇంకా నయం.. ఈ పోస్టులో రాసిందంతా ఆ ఫోటోలో ఉన్నావిడ గురించేమో అని భయపడి చచ్చాను.. చివర్లో నా డౌట్ క్లియర్ చేసి బతికించావ్ నాయనా.. :D

    ReplyDelete
  3. మరే నేను కూడా మధురలాగే భయపడ్డా.. ఏమైంది హరేకి అని ;) ఊఫరాంజలి గురించా రెస్ట్ ఇన్ పీస్ :)

    ReplyDelete
  4. ఎవరు రాసారు ఈ టపా.. నీ styleలో లేదే... :P

    ReplyDelete
  5. జహాపనా......... తుసీ గ్రేట్ హో...
    దండాలయ్యా.. ;)

    ReplyDelete
  6. ఏంటో ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ఇలా జీవం లేని వస్తువుల మీద రాసేస్తున్నరే ... జీవమున్న మనుషుల మీద రాయాల్సొస్తే ఇంకేమీ మిగలవేమో! అలోచించండి.
    :))

    ReplyDelete
  7. ఆరు సంవత్సరాలలో నీకు ఆరు సార్లు పరిశుభ్రత అంటే ఏంటో నేర్పించాను.

    :)))

    ReplyDelete
  8. డెడికేషన్ తోనే కామెంట్ రాశాను అని గమనించగలరు. :)

    ReplyDelete
  9. అరాచకం. ఓహ్హోహ్హోహ్హో. (ఘట్టిగా నవ్వాను. నా ట్రేడ్ మార్క్ వదిలి)

    ReplyDelete
  10. నరేష్
    ఐ.ఐ.టీ లో స్పీకర్లు కదా కొంచెం స్పెషలే :))
    థాంక్స్ :)

    మధుర, ఈ పోస్ట్ రాయదానికంటే ఈ ఫరా ఖాన్ ఫోటో వెతకడానికే టైం ఎక్కువ పట్టింది :))
    థాంక్యూ :)

    ReplyDelete
  11. హర్ష :))

    రాజేంద్ర :D ఎమోషనల్ సౌండ్స్ అప్పుడప్పుడూ బయటకోస్తున్నాయ్ :P
    థాంక్యూ :)

    ReplyDelete

  12. వేణు గారు హ హ్హ :))
    థాంక్స్ :)

    రాజ్ థాంక్యూ :))

    ReplyDelete

  13. శిశిర గారు మరీ తక్కువ చెబితే బావుండదు కదా ఆరుసార్లు అని రాయబడింది :))
    మీ డెడికేషన్ కి రెండు రోజులు తర్వాత బ్రేక్ ఇస్తున్నాం :)
    థాంక్స్!






    ReplyDelete
  14. వెన్నెల గారు హ హ్హ :))
    ఈ ఊఫార్ కొంచెం స్పెషల్ అంతే
    థాంక్యూ

    ReplyDelete
  15. గురూజీ థాంక్యూ వెరీ మచ్ :))

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.