Pages

Monday, September 10, 2012

పల్లె వెలుగులో దిమ్మ చీకటి..!


నగరమంతా తిరిగి తిరిగి సుమారు నాలుగు మైళ్ళు  నడిచాక ముందు నీరసం వచ్చింది


దగ్గరలో ఉన్న హోటల్ లో రెండు వడ ఒక ప్లేట్ పూరీ అని తిన్నాక ఆకలి తగ్గలేదు ఇంక చేసేది లేక ప్లేట్ మీల్స్ తినేసి బస్సెక్కాను
ఓ గంట ప్రయానించాక కడుపు లో వికారం మొదలయ్యింది
ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరో అరగంట పాటలు విన్నా.. వికారం పెరిగిందే కానీ తరగలేదు
పక్కన విండో ఉన్నా విపరీతమైనా గాలి వస్తున్నా కారం లో కుంకుడుకాయలా వెగటు వదలలేదు
అప్పుడే నా ముందు సీటు వెనుకభాగం చాలా ఆకర్షించింది
కండక్టర్ బస్సులో లైట్లు ఆపేసాడు 
బయట చిన్నగా వర్షం పడుతోంది గాలి గోల పెరిగింది

అర్జునా నాగార్జునా అని బస్సు కేచర్ లో పైంట్ ని బర బరా గీకాక ఔట్పుట్ వచ్చిన ఆనందం లో గట్టిగా తొడగొట్టాను
(
ఎవరక్కడ బస్సు గీకుడు ని అభినందించకుండా పోస్ట్ చదువుతున్నది !! ) 


ఈలోపు చిన్న సైజ్ ముళ్ళపంది లా 
నా భుజం మీద ఒకడు తలపెట్టి  నిద్రపోతున్నాడు వాడిని  తట్టి లేపాను.   

ఇదే కునకు వాడు తర్వాత కంటిన్యూ చేయడం మరో మూడు సార్లు నా భుజం మీద పడడం తో నాకు అసహనం T.రాజేందర్ లా పెరిగింది. 

ఉన్న నరకానికి తోడు ఇప్పుడు ఈ బాలయ్య బాబు సినిమా ఏంటి సామీ అని అనుకొని

వెంటనే నా galaxy కి పనికల్పించి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మార్క్ ఆంథోనీ కి బాబు లాంటి ఆర్టిస్ట్ పాడిన విండురైనులో ప్లే చేసాను 

ముందొక రెండు వెనుక్కొక రెండు సీట్లలో ఉన్న ఇరవై మంది నా పక్కన ఉన్న మరో నలుగులు ఉల్లిక్కిపడి బెంబేలెత్తారు
అలా వికారానికి ఉపకారం సహ ప్రయాణీకులకు హాహాకారం తో నా ప్రయాణమును ముగించితిని

నీతి : ఒక RTC బస్సు ప్రయాణం మీతో పాటు మీ పక్క,వెనుక వాళ్ళ 
ఓహో హో ఓహో.. ఓహో ఓహో ఒహ్హో హో అని వినపడేలా చేస్తుంది  

22 comments:

  1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్. ఇదేంటి ఇంత చిన్న పోస్ట్ రాశావ్??

    ReplyDelete
  2. రాజ్ థాంక్యూ :))
    పెద్ద పోస్టంటే మొన్న పెద్దగా రాస్తే టైమార్పితం బాగా ఎక్కువగా జరిగింది అంతే :P

    ReplyDelete
  3. హహ్హహ్హా.. నువ్వెక్కిన బస్సు ఈ ఫోటోలోదేనా.. బాగుంది.. అయితే నువ్వేక్కింది ఎర్రబస్సు కాదన్నమాట.. బులుగు బస్సు.. :D

    ReplyDelete
  4. kevvvvvvvvvvvvvvv

    "ohhoho hho hho hho" arupulaku bus geekudu ki linkaaa...

    vaaa :(

    ReplyDelete
  5. చిన్న పోస్ట్,
    అయినా ఆ క్రియేటివిటీ, ఆ పంచ్ లు సూపర్.. :)
    బస్సు కేచార్ సూపర్, ఇంతకూ నువ్వే గీసావ లేక ఫోటో మాత్రం తీసుకున్నావా?
    నువ్వే గీసింటే పల్లె వెలుగు కి ఫైన్ కట్టాలి :)

    ReplyDelete
  6. ఏంటోనబ్బాయ్ కొంచెం చిన్నపోస్టేస్తే టూషార్ట్ అనాలనీ కొంచెం పెద్ద పోస్టేస్తే టూలెంగ్తీపోస్ట్ అని అనాలనీ అనిపిస్తుంది ఎందుకంటావ్ :-)

    బైదవే బొమ్మలో ఉంది పల్లెవెలుగు బస్ కాదుకదా :) బస్సుకేచర్ సూపర్ గీశావ్ :)

    ఇపుడు ఎర్రబసులు లేవు మధురా అన్నీ పచ్చబస్సులు బులుగు బస్సులే :)

    ReplyDelete
  7. రెండు వడ, ఒక ప్లేట్ పూరి, ఇంకా ప్లేట్ మీల్స్ ఇన్ని తిన్నాక , మరి కడుపులో వికారం కాక ఏటొస్తుందబ్బాయా?

    ఇంకా దానికి తోడు....ఈ రోజుల్లో వచ్చే పాటలు విన్నావు,వికారం పెరగదా మరి?

    ఇంకా నిండు రైన్ లో పాట వినిపించావా? హాహా హహా..
    "వికారానికి ఉపకారం సహ ప్రయాణీకులకు హాహాకారం" hilarious....ఇది మాత్రం!
    బాగుంది పోస్ట్..చిన్న పోస్ట్ అయిన్నా భలే నవ్వించారు.

    ReplyDelete
  8. హా హా హా :):) తొడగొట్టినా కూడా బస్సు,బస్సులో జనాలూ అలాగే ఉన్నారంటే పర్వాలేదు..మీరు బాలకృష్ణ కాదు అని అర్ధమైపోతోంది..

    ReplyDelete
  9. మధుర :D
    ఈ పోస్ట్ సూర్యోదయాన తేజస్సు లేకుండా బులుగు లో వెలుగుని చూసిన చేతులతో రాయడమైనది తెలియ చేసుకుంటున్నా అద్యక్షా!!

    ReplyDelete
  10. నాగార్జున :)))
    అంతా ఆ హ హ్హా హాహాకరానికి పొంతన లేని కామెంట్ లా లింక్ పెట్టడమే సారి అనిపించినది
    థాంక్యూ :)

    ReplyDelete
  11. పద్మార్పిత గారు థాంక్యూ :)

    ReplyDelete
  12. హర్షా :)))))
    నా గోళ్ళు అరిగేలా కేచర్ ని గీసాను బర బరా
    ఇది సత్యము :)
    చివర్లో కండక్టర్ చిల్లర ఇవ్వలేదు అదే ఫైన్ RTC యాజమాన్యానికి :)

    ReplyDelete
  13. వేణు గారు అంటే సామంత సినిమాలు చూసి చాలా రోజులు అవుతోంది వేణు గారు మరో నెల వరకు సినిమా లేదంత
    బహుసా ఆ ఎఫెక్టేమో అని స్ట్రాంగ్ గా అనిపిస్తోంది :)
    కేచర్ నచ్చినందుకు థాంక్యూ వెరీ మచ్ :))

    ReplyDelete
  14. వెన్నెల గారు థాంక్యూ :)
    మీ కామెంట్లే ఈ బ్లాగుకి కాల్గేట్ టూత్ పేస్ట్ లాంటివి లేట్ గా కామెంట్లు పెట్టినా చాలా ఫ్రెష్నెస్స్ అందిస్తుంది :P

    ReplyDelete
  15. సుభ గారు బ్లాగుకి స్వాగతం :)
    కార్నర్ సీట్ అయ్యేసరికి నా చెయ్యి సరిగ్గా అందలేదని అనుకుంటున్నాను
    అదే సమయం లో ఒక ట్రైన్ ముందు వైపుకి కాస్త దూరం లో వెళ్తోంది
    బాలయ్య ముందు సామాన్య బ్లాగర్లం మనమెంత
    మీ స్పందనకు చాలా థాంక్స్ :)
    కామెంటుతూనే ఉండండి!

    ReplyDelete
  16. How come 20 folks fit in 2 seats? One of them is sleeping on your shoulder too?No wonder you don't feel well. LOL. BTW you should have opted for north Indian thali in the first place, they usually come with puri. ;).

    ReplyDelete
  17. కారం లో కుంకుడుకాయలా ఏంటి స్వామి??

    బాబోయ్... కేవ్వ్వ్వ్ కేకంతే.. as usual..

    అందరూ post చిన్నది అయ్యింది అనుకుంటున్నారు కానీ.. ఇది T20 world cup time అని గ్రహించలేదు అనుకుంటా... :P

    పాపం నాగార్జునగారికి satire అర్ధం కాలేదు అనుకుంటా.. :D

    ReplyDelete
  18. Andy babuuuuu karam lo kunkudukaya kalupukuni eppudu taagaavammaa???? :P

    @madhu..... adi bulugu koodaa kadu.... tellanchu bulugu chokka vesukunna busssuuuuu :D

    ReplyDelete
  19. చాతకం గారు ఆలస్యానికి క్షమించాలి
    ఒక వరుసలో అయిదు సీట్లు చెప్పున ముందు రెండు వెనుక రెండు మొత్తం నాలుగు వరుసలలో ఇరవై మందికి వినిపించాను :))
    కాస్త తిందామని టిఫిన్ తెచ్చుకున్నా ఆకలి ఇంత ఉందని తెలియలేదు
    హ హ్హ మీరు చెప్పినట్టే నార్త్ ఇండియన్ తాలీ ట్రై చెయ్యాల్సింది
    Thankyou :)

    ReplyDelete
  20. రాజేంద్ర :)))
    హ హ్హ కేవ్వ్వ్ T20 టైం కరెక్ట్ గా గుర్తు చేసావ్ :))
    థాంక్యూ :)

    ReplyDelete
  21. ఇందు :D
    అదే అదే మా ఇంట్లో కుంకుడుకయలో ఘాటు లేదాని కారం పోసేస్తున్నారని డౌట్ గా ఉంది :))

    thankyou :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.