Pages

Monday, February 13, 2012

విన్నపాలు పెరుగు మజ్జిగ తినవలె రాఘవేంద్రా..!

ఒక వేగు రాయుటకు సమయం ఆసన్నమయినది అని ఆకాష టాబ్లెటన్న ఘోష కు నాలో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉలిక్కిపడి లేచాడు.      

రంభ ఊర్వశి మేనక లకు బ్రేక్ ఇచ్చిన 
కే.ఏ.పాల్ రాఘవేంద్ర రావు
ని పకడ్నా ముష్కిల్ నహీ హై.. బికనీర్ నమ్కీన్ హై!




రాఘవేంద్ర రావు 
ఈ పేరు వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.

మీరు ఎన్నో కళా ఖండాలు సృష్టించారు.
పక్షవాతం వచ్చి కదలలేని రాజ్ శేఖర్ చేతికో నెమలీక ఇచ్చి నృత్యం నేర్పించారు.
Attention,Stand at ease పొజిషన్ లో ఉండటం తప్ప  ఇంకేం చెయ్యలేని జగపతిబాబు కి సైతం చామంతులు బంతులు ఇచ్చి గెంతులేయించావ్.
మూడు తరాల హీరోలతో పని చేసిన ఘనతను సొంతం చేసుకుంటే మాత్రం అని ఎన్ని బిడియాలు పోతున్నావు..
దొంగ మొహం గా నీ వల్ల మూడు తరాల, ఆ ఫాబ్ ఫోర్ హీరోలు రెండు తరాల హీరోయిన్లను మూకుమ్మడిగా ఆడుకుంటున్నారు కదరా..

ఆ పాట ఏంటి ఆ శృతి ఏమిటి..
ఎం చేస్తావో తెలియదు కానీ పాటల్లో
 శృతి ని పండు ని మాత్రం కలిపేస్తావ్ అందుకే పోకిరి అంత పెద్ద హిట్ అయ్యింది
ససలు గగలు
దదలు నినులు
ససలు  పెసలు
గగలు మినుములు
కందులు, పెసలు జొన్న రాగులు
చాలు చాలు చాలు చాలురరేయ్..
                                             

తొంభై బిందెలు  కొని   ఐదేసి బిందులు ఒక దానిపై ఇంకోటి పెట్టి పద్దెనిమిది వరుసలను రెండు పార్ట్స్ గా చేసి
ఎల్లువోచ్చి గోదారమ్మా  
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో... రావయ్యో...
ఆగడాల పిల్లోడమ్మా సోగ్గాడా

ఆహా నీ బిందె ల క్రియేటివిటీని బూందీ మిక్సర్ లో కప్పెట్ట.

                                         

రవళి కి ఎవడో ప్రొడ్యూసర్  పెరడు లో ఉన్న జామపళ్ళు.. శ్రియకి నేరేడు పళ్ళు 
రంభ కి బత్తాయి పళ్ళు
రమ్య కృష్ణ కి రోజా సెల్వమణి పువ్వులు
అరేయ్ రాఘవేంద్రా..బయటకు వెళ్లి కిలో ఆపిల్ పళ్ళు కొందామంటే వంద రూపాయిలు  పైనే ఉన్నాయ్ రా
 వాలంటైన్స్ డే కి పూల బోకే లు కూడా కాస్ట్లీ అయిపోయాయంటే అదంతా నీ చలవే
దీనంతటికీ కారణం నువ్వే నువ్వే నువ్వే..

పేదలు పండించిన పళ్లన్నీ నీ షూటింగ్ లకు ఎత్తుకేల్లిపోతే మేము ఏం తిని బతకాలి ?
గెస్ట్ హౌస్ కాన్సెప్ట్ కనిపెట్టిన గెడ్డం గండరా
గిట్టుబాటు ధర కల్పించు రైతులకు ఇక నైనా ముందర.

                                                   

తెలుగు సినిమా ని కామర్షలైజ్ద్ చేసి  ఐన్ స్టీన్  expression ఒకటి ఇచ్చి  దర్శక  ఇంద్రు డి మొహం వేసుకొని  ఐరావతం స్టీమ్ తో వంట వండినట్టు సినిమా ని వండేస్తే సెగలు వచ్చేది ఎవరికీ..


కలర్ ఫుల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్స్ అని గారాలు పోయి కలరాను నిరోధించినంత రేంజ్ లో క్రెడిట్ కొట్టేస్తున్న నీకు

ఇందు మూలంగా చివరగా నేను అభ్యర్ధించేది ఏమిటంటే
నేరేడు,బంగినపల్లి,జామ,నారింజ,చెర్రీస్,క్రాన్బెర్రీస్,బత్తాయి,బొప్పాయి పండించే రైతులు అందరికీ న్యాయం చేసావు
పనస కాయలు ఏం పాపం చేసాయి అని ప్రశ్నిస్తున్నా అద్యక్షా!!!

40 comments:

  1. hope you know what my next question is :P :)

    ReplyDelete
  2. vinnapaalu perugu majjiga taagavele ante baavuntademo...

    ReplyDelete
  3. హ్హహ్హహా!! 'మా పనసకాయ కధలండీ' అని ఒక సీరియల్ తీయమని చెప్పు ఆండీ :)))))

    ReplyDelete
  4. రాఘవేంద్రా,

    పాలు, పెరుగు మజ్జిగ కలగలిపి
    బట్టర్ చీస్ లాంటి మరో సరికొత్త
    ముంగారు కుచ్చిళ్ల ముద్దు గారే మరో
    ముద్దబంతి మూవీ మాకు ప్రసాదించ వయ్యా

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. >>>Attention,Stand at ease పొజిషన్ లో ఉండటం తప్ప ఇంకేం చెయ్యలేని జగపతిబాబు కి సైతం చామంతులు బంతులు ఇచ్చి గెంతులేయించావ్.

    అహా.

    ఏదో ఒక యాపిల్, బత్తాయి అయితే వీరొ విసరగలడు కానీ పనస పండు, కొబ్బరి బొండం అంటే వారి వల్ల అవుతుందా?

    టపా kevvuuuuuuuuu.

    ReplyDelete
  6. టపా కేకంతే, గడ్డం గాలివానకి కొట్టుకుపోయిందంతే

    ReplyDelete
  7. పోస్ట్ కన్నా...కామెంట్ బాక్స్ అధరింది ;)

    ReplyDelete
  8. హహహ కెవ్వుమనిపించావ్ :))

    ReplyDelete
  9. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. అరిపించావ్ పోస్ట్... ;)

    ససలు గగలు
    దదలు నినులు
    ససలు పెసలు
    గగలు మినుములు
    కందులు, పెసలు జొన్న రాగులు
    చాలు చాలు చాలు చాలురరేయ్.. హహహ్హాహ ;)

    పనసకాయలు, పుచ్చకాయలూ హీరోయిన్ల మీద ఎత్తిపడేస్తే... కేసవ్వుద్దేమో అని భయం హరే..

    ReplyDelete
  10. హ హ ఈ పోస్ట్ చూసాకా ఐడియా వచ్చిందంట , ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు మిమ్మల్నే హీరో గా తీసుకుందామని ఆలోచన అట All the best :P

    ReplyDelete
  11. బిట్టు :))
    ఇంకేముంది, కొన్ని రోజులు ఆగాల్సిందే :)

    అనానిమస్ గారు చాలా తొందరగా స్పందించి కరెక్ట్ చేసినందుకు థాంక్యూ :))
    నిజంగానే టైటిల్ అదిరింది మీ సజెషన్ వల్ల :)

    ReplyDelete
  12. కొత్తపాళీ గారు థాంక్యూ :))

    ఇందు హహ్హ :))
    రాసేయోచ్చు కాకపోతే అక్కడ ట్రైన్ ఫెసిలిటీ లేదు :))
    స్టేషన్ మాస్టర్ కి మనకి పడదు :)

    ReplyDelete
  13. జిలేబి గారు ఏమిటో అండీ షిరిడీ సాయి అంటున్నారు ప్రస్తుతం
    అదయ్యాక మళ్ళీ తన పాల షాప్ తెరుస్తాడు అనుకుంటా అండీ!
    స్పందనకి థాంక్యూ :)

    గురూజీ గ్రాఫిక్స్ వాడొచ్చు కదా అని నా చిన్ని అనుమానం అంతే :)
    వరుడు బద్రీ నాథ్ అని అంతేసి ఖర్చు పెట్టిన చోటలో పదో వంతు ఇలాంటి వి ఇలాంటి కిచక దృశ్యాలపై కాన్సన్ట్రేట్ చేస్తే చూద్దామనే చిన్న కోరిక నెరవేరే లా లేదు
    కేకలకి బోలెడు ధన్యవాదాలు :)

    ReplyDelete
  14. శ్రీనివాస్ పప్పు గారు :)))
    అంతే అంటారా :))
    గీసి పడేస్తే చూడాలని అనుకుంటున్నా,ఇలా ఆయినే అయితే ఇంకా సంతోషం :)

    మురళి :))
    థాంక్స్!

    ReplyDelete
  15. శేఖర్ గారు ముందుగా నా బ్లాగ్ కి స్వాగతం :)
    రెండూ నచ్చినందుకు థాంక్స్ :))

    వేణు గారు :)))))
    థాంక్యూ థాంక్యూ :)

    ReplyDelete
  16. సాయి గారు థాంక్సండీ మీ బ్లాగ్ చూడలేకపోతున్నా ఈ మధ్య :)
    తప్పకుండా నా స్పందన తెలియ చేస్తాను

    మధుర :P :P
    P ఫర్ పనస

    ReplyDelete
  17. రెహ్మాన్ :)))
    Thanks a Lot !

    రాజ్ :))
    కరెక్ట్ గా చెప్పావ్,ఈ లాజిక్ కూడా సూపర్ :))
    థాంక్యూ :)

    ReplyDelete
  18. శశి గారు :))
    థాంక్స్!

    శ్రావ్య,
    నిజంగానా, చాలా సంతోషం గా ఉంది
    హీరో రోల్ కదండీ..ఇంకా సూపర్ గద ఎత్తినట్టు పనస కాయని భుజం మీద ఎత్తుకొని
    బొడ్డు ని ధబా ధబా అని బాదేస్తే ఆ వీరోయిను నడ్డి విరుగుతుంది..రాజ్ చెప్పినట్టు ముందే కేసులు లేకుండా ఒక న్యాయవాదిని పెట్టేసుకోవాలి

    ReplyDelete
  19. హరే కృష్ణ గారు,

    రాఘవేంద్ర గారు షిరిడి సాయి అన్నా , అందులో షి, రెడీ గా సాయం పట్టును వారికి !

    అన్నమయ్య కే తప్పలేదు రాఘవేంద్రుని మాయా జాల ఇంద్ర భోగం ఇక షిరిడి వారు ఎ పాటి !!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  20. May be it's time to post the sequel :P

    ReplyDelete
  21. >>>>ససలు పెసలు
    గగలు మినుములు
    కందులు, పెసలు జొన్న రాగులు<<<<

    బాబు... కుమ్మేస్తున్నావ్.... :))

    ReplyDelete
  22. >>>షి, రెడీ గా సాయం పట్టును వారికి
    LOL జిలేబీ గారు..కేకంతే!

    నిజమేనండీ మీరు చెబుతుంటే నాకు ఒక క్లారిటీ వస్తోంది..
    పాపాలను పరిహారం అని చెప్పి మన రాఘ్స్ ఫస్ట్ ఆఫ్ లో ఈ పళ్ళ కాన్సెప్ట్ ల మీద పడితే
    ఇంక తెలుగు ప్రేక్షకులు అదే తోటలు చూసుకుంటూ వృద్ధులై పోతారు :)
    మళ్ళీ థాంక్స్ ! :)

    బిట్టు :)
    సీక్వెల్ ఆ టైం ఎక్కడిదీ :))

    హర్షా,
    ఈ పాట చూడలేక నాకు చిరాకు వచ్చేసింది
    ఏమిటో ఒక దాని తర్వాత ఇంకోటి వేస్తూనే ఉంటాడు కంటిన్యూస్ ప్రాసెస్ లా
    థాంక్యూ!

    ReplyDelete
  23. ;) >> ఇంద్రు డి మొహం వేసుకొని ఐరావతం స్టీమ్ తో వంట వండినట్టు<< నారదుల వారంత అక్కసు వెళ్ళగక్కారే, హమ్మా! మొదట్లో - "ఈ పాటల షూటింగా అయ్యాక ఆ పళ్ళు/పూలు ఎవరికిస్తారు?" అని చంపేదాన్ని (నాన్నగారిని/నా పక్కవారినీను). తర్వాత పాట కన్నా స్పీడ్ గా దొర్లిన కాయలెన్ని/ పేర్చిన బిందెలెన్ని/హీరోయిన్ ఎన్ని ద్రాక్షలు తిన్నది? ఇలాంటి ఇస్న్టంట్ లెక్కల క్విజ్జుల్లో నేనే దిద్దుకుని నెగ్గెసేదాన్ని పాటవక ముందే. మొన్ననే అనుకున్నాను - నా బుర్ర పదును తగ్గుతుంది, ఈయన్దో పాట చూస్తే పోలా అని.

    గుడ్ వన్ హరేకృష్ణ. :)

    ReplyDelete
  24. వాడగల పండ్లన్నీ అయిపోయాయి బ్రదర్... లేటెస్ట్ సినిమా లో కొబ్బరి చిప్పలతో వినూత్న ప్రయోగం చేశాడు.. ఆ దృశ్య కావ్యమును నీవు తిలకించవలసిందే కాని వర్ణించ నా శక్యము గాదు... :D

    ReplyDelete
  25. గురువు గారు, టపా కేక...కొంప దీసి ఆ రోజు దర్సకేంద్రుడి బర్త్డేనా ఏమితి..మీరిలా మీ అభిమానాన్ని చాటుకున్నారు :)

    ReplyDelete
  26. aa yugam mugisindi..ika siggu padakunda family tho cinema chooduchu.... peeda kala ga marchipodaam vaaadi cinema la ni

    ReplyDelete
  27. >>>నారదుల వారంత అక్కసు వెళ్ళగక్కారే, హమ్మా!
    :)))
    ఉష గారు :))
    లేకపోతే పౌరాణికం పాశ్చాత్యం అని తేడా తెలియకుండా పళ్ళు తక్కువ ఖరీదు కి వస్తున్నాయి కదా అని ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు అని అక్కసు
    నిజం అండీ మొన్న ఒక రెండు ఆపిల్ తిందామని మార్కెట్ కి వెళ్తే ఈ ఇంఫ్లేషన్ వెనుక ఉన్నవాళ్ళలో ఇతను కూడా ఒకరని నిర్ధారించుకున్నాక నే ఈ టపా వేయడం జరిగింది :)
    చాలా కాలం తర్వాత విచ్చేసినందుకు వెల్కం బాక్ అండ్ నచ్చినందుకు థాంక్యూ :)


    నరేష్ ఏంటి నిజమా,
    కొబ్బరి చిప్పలతోనా... కెవ్వ్..:D
    ప్లీజ్ ప్లీజ్ నాకు మెయిల్ చెయ్యు ఆ దృశ్య కావ్యము యొక్క లింక్ :)
    థాంక్స్ :)))

    ReplyDelete
  28. స్నిగ్ధ గారు ఆలస్యానికి క్షమించాలి
    ఎలా ఉన్నారు ?
    కేకలకు థాంక్స్ :)))
    మొన్న ఏదో ఒక చిత్ర రాజమును చూసాను
    అందులో రవితేజా బ్రహ్మానందం తో ఒక డవిలాగ్ చెబ్తాడు
    బ్రహ్మానందాన్ని కొట్టాలంటే కారణం కావాలా అని ఇది కూడా ఇంచుమించు అలాంటిదే
    ఏమిటో ఆపిల్ పండు తినడం కూడా ఒక కలగా మిగిలిపోకూడదని నా చిన్ని ప్రయత్నం
    థాంక్స్ :)

    అవును విక్కీ
    ఆరిపోయే దీపనికే వెలుగెక్కువ
    ఈ రాఘవేంద్రుని సినిమా కి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎక్కువ అంటే మన ఖర్మ :(
    థాంక్స్!

    ReplyDelete
  29. :)) ఈ పోస్టు ఎవరైనా రాఘవేంద్రరావుకి చూపిస్తే ఎంత బాగుండు!అదరగొట్టారు!

    ReplyDelete
  30. << మధుర :P :P
    P ఫర్ పనస

    Oh my god...... ROFL :)))))))))))))))

    ReplyDelete
  31. సిరి సిరి మువ్వ గారు :)))
    అంతవరకు చేరవేస్తే కేస్ అవుతుందేమో :)
    షిరిడి సాయి షూటింగ్ లో ఏదో అడవుల్లో ఉంది ఉంటారు డిస్టర్బ్ చేయమంటారా :)
    స్పందన కి చాలా థాంక్స్ :)

    మధుర :)))
    థాంక్యూ :)

    ReplyDelete
  32. హ హ..హ...మీకు మీ గురువు గారంటే ఇంత అభిమానమని ఇప్పుడే తెలిసింది బాబూ !!:P

    ReplyDelete
  33. నాగిని గారు థాంక్యూ :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.