Pages

Wednesday, November 23, 2011

హెంతో.. హింసో... హ హ్హ హ్హ..



రాత్రి తిన్న పిజ్జా అరగక అడ్డమైన బ్లాగులు చదివి మీడియా ప్లేయర్ ఆన్ చేసుకొని ఖర హర ప్రియ రాగం లో హమ్ చేసి చిన్నగా కునుకు తీస్తూ. limit as గురక tends to 120 dB తో ప్రపంచాన్ని  మర్చిపోయి పవళించాక

జామురాతిరి జాబిలమ్మ పాట తో జడుసుకుంటూ ఉలిక్కిపడి లేవడం, వెంటనే అలారం ఆపేసి మరో గంట ఆదమరిచి నిద్ర పోయి బ్రెడ్ అండ్ జామ్ తో బ్రేక్ ఫాస్ట్.. ఇంతకంటే కావాల్సింది ఇంకేంటి..yes

సరిగ్గా అప్పుడే గుణశేఖర్ కి అశ్వనీదత్.. తెలుగు ఇండస్ట్రీ కి చిన్ని కృష్ణ దొరికినట్టు మా సో కాల్డ్ సొసైటీ వాళ్ళకి తాగిన టీ అరగక పెందలాడే హైబ్రిడ్ పందుల్లా  హా హ్హా హహ్హా హహ్హా అని ఆహాకారాలు మొదలు పెట్టడం

అసలే రెండింటి వరకు డెడికేషన్ చూపించి నిద్రపోయే బుజ్జి బ్రహ్మీలకు పాచి మొహం తో పులిహోర దద్దోజనం కలిపి పెట్టేసేవారు..పొద్దున్న ఆరున్నర కే ఈ అంబానీ ఫేమిలీస్ అంతా అంబా అంబా అని ఓండ్ర పెట్టడం తో మాకు మిగిలింది చివరికి మామిడి తాండ్రే...

నేను చెప్పేది ఏమిటంటే
తెల్లవారు జామునే కిసాన్ జామ్ లా  తియ్యగా కొక్కొరోకో అని వినాల్సిన సుకుమారమైన చెవులతో..కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ అని ఆర్తనాదాలు మొదలు పెట్టి పరుగు తీస్తుంటే ఆ  బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా ?


    
డర్టీ పిక్చర్ సినిమా వల్ల ఇమ్రాన్ హష్మీ కి విద్యాబాలన్ నుండి సీరియస్ కాంపిటీషన్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెట్టి ఇదే విషయాన్ని తనని అడిగితే
form is temporary .... class is permanent.అని అన్నాడంట


నర నరాల్లో జీర్ణించుకుపోయిన ఈ ధనావేశ వైఖరి ని నా నోట్లో సెరెలాక్ కుక్కేస్తూ నెట్టుకోస్తుంటే..నెట్ కనెక్షన్ వాడు మా అజాగ్రత్తతో, పొగరు తో బిల్ కట్టలేదని కనెక్షన్ పీకి పారేసాడు..

అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట వీళ్ళ గోలతో వేగలేకపోతుంటే పక్క అపార్ట్మెంట్ లో ఉన్న చిన్న పిల్లల ఏడుపులు ఆటలు కింద ఫ్లాట్ లో సుప్రభాతాలు వెరసి మాకు పట్టపగలే భూతాల దీవి సినిమా కనిపించేది.

సినిమా ఫ్లాప్ అయితే  ప్రొడ్యూసర్లు దూకడానికి హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ అయినా ఉంది.. ముంబై లో మాకేంటి దిక్కు ఇక లాభం లేదు అనుకొని

తియ్యరా Android వెయ్యరా కర్చీఫ్ అని operation Android స్టార్ట్ చేసి వాళ్ళకి పోటీ గా మేమొక క్లబ్ inaugurate  చేసి ఇలా ప్రోమోస్ సొసైటీ క్లబ్ నోటీస్ బోర్డ్ లో అతికించి పడేసాం


దనపు అదృశ్య శక్తుల ఆరోగ్య వ్యాయామ్య Sala అని బయట బోర్డ్ కూడా పెట్టేశాం..



ఎలానో పొదున్న అయిదింటికే భరించలేని గోలకు మన వంతుగా రాత్రి రెండు గంటలకు నిద్రపోయే ముందు ఇలా మా హాల్ లో పిచ్చగా క్రికెట్ ఆడేసి వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం.




16 comments:

  1. :)))

    **గుణశేఖర్ కి అశ్వనీదత్.. తెలుగు ఇండస్ట్రీ కి చిన్ని కృష్ణ దొరికినట్టు
    **అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట
    **వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం-- IIT life lo idhi matram baga nerchukuntam..kada!!

    ReplyDelete
  2. పొద్దున్న ఆరున్నర కే ఈ అంబానీ ఫేమిలీస్ అంతా అంబా అంబా అని ఓండ్ర పెట్టడం తో మాకు మిగిలింది చివరికి మామిడి తాండ్రే
    అన్నమయ్య సినిమా రికార్డులను శ్రీ రామ రాజ్యం సినిమా క్రాస్ చేస్తుంటే..జగన్ నాగార్జున ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేసాడంట
    వ్యాయామానికి వ్యాయామం కింద ఫ్లోర్ వాళ్ళ నిద్రాభంగానికి ఈ క్రీడారంగం.
    హహహ చాలా బాగుందండీ! ఇంతకీ మీ వ్యాయామ శాలలో మాకు ఏమేమి నేర్పిస్తారు? ఫీజులో బ్లాగర్లకి రాయితీ ఎంత?

    ReplyDelete
  3. :))
    టెంప్లేట్ బావుంది...ఈ మధ్యనే మార్చావా?

    ReplyDelete
  4. limit as గురక tends to 120 dB >>>>

    kekaa.. :)waiting for next part

    ReplyDelete
  5. first video arupulu.. rendodi choosi cheptaa... ;)

    anil kumblEEE.. suneel jOshEEEEEE.. hhahahaah

    ReplyDelete
  6. అరెరే... math studentని ఇదెలా మర్చిపొయా
    ***limit as గురక tends to 120 dB..
    super అంతే!!
    eagerly waiting for the next part!! :P

    -bittu

    ReplyDelete
  7. >>>>>> limit as గురక tends to 120 dB తో ప్రపంచాన్ని మర్చిపోయి పవళించాక <<<<<
    కేవ్వ్వ్వవ్వ్వ్వ్.... సూపర్..........

    ఫస్ట్ వీడియో అరుపులు.... పిచ్చ పిచ్చగా నవ్వుకుంటున్నా..... :))

    ReplyDelete
  8. సెకమ్డ్ వీడియో ఇప్పుడే చూశా... రోజూ ఇలాగే ఆడతావా బాబూ? ఈ సారి కార్క్ బాల్ తో ట్రై చెయ్యి.;) ;)

    అనీల్ కుంబ్లేఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ.... సునీల్ జోషేఏఏఏఏఏఏఏ...

    జాఆఆఆఆఐ.... బాలయ్యాఆఆఆఅ ;) హహహహ

    ReplyDelete
  9. బిట్టు అంటే కదా IIT లో చేరకపోతే ఈ బుర్ర బూజు పట్టి ఉండిపోయేది
    మా కాంపస్ కి సదా రుణపడిపోయి ఉంటాను :)
    మీ కాంపస్ కి కూడా :)
    Thankyou :)

    ReplyDelete
  10. రసజ్ఞ గారు మీ రెగ్యులర్ కామెంట్స్ కి ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలు :)
    Thankyou very much :)

    ReplyDelete
  11. తృష్ణ గారు :)) థాంక్యూ :)
    ఈ మధ్యనే మార్చాను
    http://en.wikipedia.org/wiki/Old_Trafford

    EPL ఫుట్ బాల్ కి అడిక్ట్ అవ్వడం వల్లనేమో ఈ టెంప్లేట్ బాగా నచ్చింది

    ReplyDelete
  12. రాజ్,థాంక్యూ థాంక్యూ :)
    కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం :))
    Thankyou so much :)

    ReplyDelete
  13. బిట్టు :)))

    హర్ష థాంక్యూ థాంక్యూ :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.