Pages

Monday, August 15, 2011

ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు
పుట్టింది ఈ మట్టిలో సీత,రూపు కట్టింది దివ్య భగవత్గీత
వేదాలు వెలసిన ధరణిరా
వేదాలు వెలసిన ధరణిరా
ఓంకార నాదాలు పలికిన అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవనినాడు వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతమురా,కోకిలది ఏ కులమురా
గాలికి ఏ భాష ఉందిరా,నీటికి ఏ ప్రాంతముందిరా
గాలికి,నీటికి లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు,కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

గౌతమబుద్ధుని భోదలు మరవద్దు,గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు,గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు,స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు
ఇకమత్యమే జాతికి శ్రీరామరక్ష,అందుకే నిరంతరం సాగాలి దీక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష 
కానీ ఇక్కడ ఏం జరుగుతోంది
A Nation where PIZZA reaches home faster than AMBULANCE & POLICE...
Where u get CAR LOAN @8% but EDUCATION LOAN @12%.
Where 1 kg ONION is Rs.24 but SIM CARD for Free.
Olympic shooter wins GOLD ,govt gives 3 Crore. another shooter dies fighting with TERRORIST. GOVT pays 1 lakh
భయంకరమైన నిజాలను సైతం అలా అలా అలవాటు చేసుకుపోయేలా చేసాయి.  
మన దేశ స్వాతంత్రం  కోసం ఎందరో  మహానుభావులు పడ్డ కష్టాలను గుర్తుచేసుకొంటూ
నిన్న సినిమా కి వెళ్తే  ఒక్కోసారి తలనొప్పి తో పాటు కాస్త రిలీఫ్ దొరుకుతుంది అని తెలిసింది మంచి మెసేజ్ రూపం లో



స్వాతంత్ర శుభాకాంక్షలు అని నోరు తెరిచి చెబుదామన్నా


Today is one day to forget and forgive ourselves of all the inbuilt curses.Be with it..Corruption,Terrorism,Sca​ms and many more and be proud of ourselves.... Mera Bharat Mahan. Happy Birth Day India!






15 comments:

  1. పొగడరా నీ తల్లి భూమి భారతిని??
    పొగడరానా? లేక అమ్మరానా?

    ReplyDelete
  2. భాస్కర్ అన్నయ్యా, ఇప్పటి జరుగుతున్న ఘోరాలని చూడకపోవడం ఆ రచయతలు చేసుకున్న అదృష్టం.

    ReplyDelete
  3. A nation where PIZZA reaches home faster than AMBULANCE & POLICE...
    Where u get CAR LOAN @8% but EDUCATION LOAN @12%.
    Where 1 kg ONION is Rs.24 but SIM CARD free.
    Olympic shooter wins GOLD ,govt gives 3 crore. another shooter dies fighting with TERRORIST. GOVT pays 1 lakh
    //

    :((

    ReplyDelete
  4. Nice Post Andy...

    http://www.youtube.com/watch?v=jRArMRPZzt8


    --
    HarshaM

    ReplyDelete
  5. Good post.

    Just observed the text above. Awesome. Looks like you are a big fan of comedy in King Movie

    ReplyDelete
  6. బద్రి,హర్ష,శ్రావ్య మిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    వాసు గారు ధన్యవాదాలు,
    keep visiting!

    ReplyDelete
  7. చాలా బాగా రాశారు హరే.. ఇంగ్లీష్ లో రాసిన యథార్ధాలు చదివితే ఎంత నిజమో కదా అనిపిస్తుంది..

    ReplyDelete
  8. వేణూ గారు థాంక్యూ!
    హ్మ్మ్.. నిజాలు ఎంత భయంకరం గా ఉన్నా కంచే చేను మేస్తే ఇంక మామూలు ప్రజలు కూడా ఏం చెయ్యలేకపోతున్నామనే బాధ.

    ReplyDelete
  9. Thank you and wish you the same. Will do my best to uplift honor (ఆత్మగౌరవం) of Telugus/Indians.

    ReplyDelete
  10. కొంచెం ఆలస్యం గా చూశాను. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అనడం కూడా ఒక అలవాటు గా మారింది, ప్రధాన మంత్రి గారి ఉపన్యాసాలు లాగా. సామాన్యుడి జీవితం భారం అవుతూనే ఉంది.

    అల్ సెడ్ అండ్ డన్, యెస్ మేరా భారత్ మహాన్.

    ReplyDelete
  11. చాతకం గారు
    నా బ్లాగ్ కి స్వాగతం
    స్పందన కి థాంక్స్!

    గురూజీ,
    ఏమిటో ప్రధానమంత్రి అంటే చాలా గౌరవం ఉండేది

    నిన్నటి వరకు


    ఎంత రిమోట్ అయినా ఈరోజు అన్నా హజారే కి జరిగిన దారుణం చూసి ఆ పేరు పిలవడానికి కూడా చిరాకు వేస్తోంది హ్మ్మ్!
    మన దేశ ప్రజల అసహాయత అనాలో లేక మంత్రుల దాష్టీకం అనాలో తెలియడం లేదు

    ReplyDelete
  12. సరైన సమయంలో సరైన పోస్ట్!! ఆలోచించాల్సిన విషయాలే అన్నీ..
    అన్నట్టు కొత్త టెంప్లేట్ బాగుందండీ..

    ReplyDelete
  13. మురళీ గారు థాంక్స్!
    బజ్జులకి అలవాటు పడి అగ్రీగేటర్ కి వీడ్కోలు చెప్పెయాల్సి వచ్చేసింది
    డాష్ బోర్డ్ లో ఇప్పుడే జతచేరుస్తున్నా మీ బ్లాగు

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.